నా నోట్లో నీ వేలు పెట్టు..
నా నోట్లో నీ వేలు పెట్టు, నీ కంటిలో నా వేలు పెడతా!
ఇదే కొన్ని గొప్ప దేశాల మాట.
దీపం నలుమూలల వెలుగు వెదజల్లుతుంది, కానీ దానిక్రిందన చీకటి ఉంటుంది.
అలాగే
మానవుని విజ్ఞానమనే వెలుగు పెరిగిన కొద్దీ చీకటి అనే అహం పెరుగుతోంది.
చక్కనమ్మ చిక్కినా అందమే.
సాటి అమ్మ 'సరి' పెట్టుకుంటే తోటి అమ్మ 'ఉరి' కట్టు కుంటుందా?
కలిగినమ్మ కొప్పైనా పెట్టగలదు సిగ అయిన పెట్టగలదు.
పెద్దకోడలూ అద్దగోడకీ పనెక్కువ.
మనుషులపై ఇష్టాయిష్టాలు ఎందుకు ఏర్పడతాయి? మాయ
మనసు చిక్కితే చిక్కబడుతుంది.
చిక్కబడితే మరిన్ని చిక్కుల బడుతుంది.
అష్టమచంద్రుడు నైథనతార.
దంతంబుల్పడనప్పుడే తనువునన్ దార్ఢ్యంబు నున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్‌వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
తాతగారండీ
ReplyDeleteఈ వ్యాసం చదవండి సౌమ్య గారిది.
https://sanchika.com/krutrima-medha-sahitya-srujana-vbs/
Zilebi6 September 2025 at 15:16
ReplyDeleteఅదంతా పెద్దోళ్ళ యవ్వారం,నాకేం తెలుస్తది?🤣