Saturday, 30 August 2025

చికిలింత చిగురు...

 చిత్రం: చిరంజీవులు (1956)

సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల

పల్లవి:

హాయ్...
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ

మనసైన చినదానికి అందానికి...
మనసైన చినదానికి అందానికి...
కనుసైగ మీద మనసు

ఆ..ఆ..ఆ..ఆ..

చరణం 1:

అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది
చిన్నదాని సిగలో రేకలెన్నో
గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో

ఎన్నుకో ...
ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో
వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా

ఆ..
ఆ..

పైర గాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమ రిమలో
ఆ..ఆ..ఆ..

చరణం 2:

అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు
చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు
మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు

మనసే ..
ఆహా..

మనసే మరుమల్లె దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..

2 comments:

  1. పాటలోంచి పడుచు జంటల వాసన గుప్పున కొడుతోంది. ముదిమిలో కాలుతున్న నైరాశ్యపు కమురు వాసన కూడా. :)

    తాతగారూ

    గవ్వకన్నుల రైక ని అరవంలో జన్నల్ పోట్ట జాక్కెట్టని ఓ అరవ కవి కాపీ కొట్టేసాడో సాంగులో :)


    ReplyDelete
    Replies
    1. Zilebi1 September 2025 at 04:09
      పడుచు జంటల వాసన గుబాళిస్తోంది. మత్తెక్కించే బొండు మల్లె,దొంతరమల్లె,వాసనలతో సన్నజాజి,విరజాజి వాసనలతో మత్తుతో పిచ్చెక్కిస్తోంటే, ముదిమిలో నైరాశ్యపు కమురు వాసన సూచనెక్కడా? కనపడలేదే,వినపడలేదే... ఎక్కడో చెబితే బావోదూ.....
      గవ్వకన్ను రైక ఉందనమాట,నాకు తెలియదు, ఐతే గవ్వకన్నుల్ని లెక్కెట్టుకోమందా? గవ్వకన్నెలా ఉంటదబ్బా!🤣🤣🤣

      సరే తమిళ కవి కాపీ కొట్టేడంటారా? తమదంతా కాపీ,పేస్టు సరుకుకదా! అందరూ అలాగే అనుకుంటే ఎలా?🤣

      Delete