ఎర్రడబ్బ మళ్ళీ నెల 1 నుంచి కనుమరుగవుతోందని వాట్స్ అప్ మిత్రులంతా బాధపడుతున్నారు. ఉపయోగంలో లేనిది ఏదైనా నశిస్తుందని అందరికీ తెలిసిందే. మనమే పేపర్ లెస్,పేపర్ లెస్ అని వాడడం మానేశాం,ఎర్రడబ్బ చరిత్రలో కలిసిపోతుంది.
వార్తలు తరచయ్యాయి మనసులు దూరమయ్యాయి,మనుషులు దూరమైపోయారు.మన చరిత్ర మనం రాసుకోం,అదే మనలవాటు.ఎర్రడబ్బ తో అనుబంధం తల్లి పేగులాటిది.అది తెగింది,మిగిలింది చరిత్ర.
ఇంకా అమెరికాలో కనుమరుగవలేదు ఎందుకో ! దానివల్ల ఇంకా ఏదో ఉపయోగం ఉందల్లే ఉంది !
ReplyDeleteRao S Lakkaraju19 August 2025 at 18:37
Deleteభారతీయులు మార్పును ఆహ్వానిస్తారు,తొందరగా తమలో కలిపేసుకుంటారు,చరిత్ర మరచిపోతారు. అవశేషాలను మిగుల్చుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ. స్ట్రౌజెర్ అనే ఏలక్ట్రో మెకానికల్ ఎక్ష్చేంజిలు అన్నిటిని భారత్ లో డిజిటల్ చేసేసేరు. ఎక్కడా స్ట్రోవ్జర్ ఎక్స్చేంజిలను అన్నిటిని బ్రిటన్ కూడా డిజిటల్ చేసుకుంది,కాని బకింగ్ హాం పేలస్ లో ఉన్న పదివేల లైన్ల స్ట్రౌజర్ ఎక్స్చేంజిని మార్చలేదు, నాకు తెలిసిన కాలంలో.చిత్రం బ్రిటన్ రాజుగారి ఫోన్ కూడా ఇందులో ఉంది. మరి భారత్ లో ఎక్కడా ఇప్పుడు చూదామంటే పనిచేస్తున్న ఆ ఎక్స్చేంజ్ లేదు.
ఇలా చాలాచాలా మార్పులు నేను పని చేసినవి ఇన్స్టాల్ చేసినవి నా చేత్తో నేనే మూసేసేను, అంత మార్పు చాలా తొందరగా వచ్చేసింది.
ఆ ట్రింగు ట్రిగు అని డయలు త్రిప్పడాలు పోయేయి
ReplyDelete( ఆ బీయెస్సెన్లో మీ రంతా యెంత బడాయి పోయేరో ఓ మారు గుర్తు చేసుకోండి :)) మో బయళ్లు వచ్చేక అలాగే ఇప్పుడు ఎర్ర డబ్బా ఆ పై మో బయిళ్లు కూడా హుష్ కాకీ అయిపోతాయేమో :)
Zilebi20 August 2025 at 08:55
Deleteతిప్పడాలు కి ముందు నంబర్ ప్లీస్ ఉండేది,నువ్వెరిగుండవు,అప్పటికి నీకు ఫోన్ పట్టుకునే అర్హత లేదు🤣. ఇది పోయి తిప్పుకునేదొచ్చింది. ఎలా ఒక చిన్న కత,జరిగిందేలే! నీలాటి వాడే ఒక స్టాక్ బ్రోకర్ న్యూయార్క్ లో, లేడి ఆపరేటర్లని తిట్టేవాడు,నోటికొచ్చిన బూతులతో. అతణ్ణి ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు,బూతులు మితిమీరిపోయాయి,సహించలేకపోయారు. ఆపరేటర్లంతా కలిసి ఒక్కమాటగా ఇతనికి సమయానికి లైన్లు కలనివ్వకుండా చేసేరు,దాంతో కుదేలైపోయి,దివాలా తీసేడు, అతని పేరు స్ట్రోవ్ జర్. ఆపరేటర్లు మీద ప్రతీకారం కోసం ఎలక్ట్రో మేగ్నటిక్ సెలక్టర్ కనిపెట్టేడు. అతని పేరుమీదనే ఆ ఆ సిస్టం ని పిలిచేవారు. అదే రింగ్,రింగ్ తిప్పుకునేది. దాని తరవాతొచ్చినదే డిజిటల్,ఆపైది సెల్ ఫోన్. దీని తరవాత ఏమొస్తుందో చెప్పలేను.
బి.ఎస్.ఎన్.ఎల్ లో బడాయిపోడానికేం లేదు,అదంతా డాట్ అనాటి మాట. వైభవం వెళ్ళబోసింది అప్పుడూ.
తాతగార్ని గీరితే ఇల్లాంటి ముత్యాల్ రాల్తాయి :)
Deleteమంచి కాలం గ్రాహంబెల్ కాలానికెళ్లి అవి నీకు తెలుసా అన్లే :)
ఆ మీ బాసానాలా డాబుసరి కొట్టొచ్చినట్టు
కని పిస్తోంది మీ కా మంటలో :)
Zilebi21 August 2025 at 12:13
Deleteబెల్ కాలం చెప్పమన్నావా? విను
బెల్ మొదటి ఫోన్ ని మేగ్నటో అంటారు. ఈ ఫోన్ ల తో పని చేసిన ఎక్స్ఛేంజి ని కొంత కాలం సూపర్వైస్ చేసాను. ఇది గోదావరి హెడ్ వర్క్స్ ఈస్ట్రన్ డివిషన్ హెడ్ క్వార్టర్స్ ధవళేశ్వరంలో ఉండేది. ఈ ఫోన్ పెద్దదిగా ఉండి రింగ్ రింగ్ కి హేండిల్ ఉండేది బయటికి. 1996 తుఫాన్ లో లైన్ లన్నీ పడిపోయాయి,వాటిని సరిజేసేందుకయ్యే ఖర్చు ఎక్కువగా కనపడి వారు సెల్ ఫోన్ లకు మారిపోయారు. మామూలుగా అందరూ చూసినఫోనే నువ్వు పట్టుకుని వాడి ఉండవు 1960 ల్లో 🤣 మేగ్నటోఫోన్ ఎక్కడ చూసుంటావు. ఆ సిస్టం మీద కూడా పని చేసా! అదీ చెప్పవచ్చేది. ఇలా లైన్లన్నీ పడిపోయిన కాలంలో 1896 సంవత్సరంలో బ్రిటన్లో తయారైన ఒక ఫోన్ స్థంభం దొడ్డిపట్లలో ఆ లైన్లో దొరికింది. దాన్ని జాగ్రత్తగా పై ఆఫీస్ కి చరిత్రకోసం తరలించా!
బడాయంతా డాట్ కాలం నాటిదే. కారణం కూడా చెబుతా! ఆ రోజుల్లో ఫోన్ ఉన్నవారంతా పెద్దోళ్ళే మరి వాళ్ళతోనే పరిచయాలున్నూ,వాళ్ళకే మా అవసరమున్నూ, మరి అలవాట్లు కూడా అలాగే ఐ ఉండవూ. సిరి అబ్బలేదు,చీడ మాత్రం అబ్బిందంటే ఇదే కదూ!