మాలిక ఇక కనపడనట్టే...నా?
ఒకప్పుడు బ్లాగులు కొల్లలు. ఆగ్రిగేటర్లు కూడా చెప్పుకోదగిన లెక్కలోనే ఉండేవి. ఆగ్రిగేటర్లు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయాయి, కారణాలనేకం. నేను బ్లాగుల్లోకొచ్చేనాటికి ఉచ్చ దశలో ఉంది,బ్లాగ్ ప్రపంచం. గొప్ప గొప్ప అగ్రిగేటర్లన్నీ కనుమరుగైపోయాయి, కాలంలో. నిన్న మొన్నటి దాకా ఉన్న మాలిక కూడా నెమ్మదిగా కనపడకుండా పోయింది, మరి కనపడుతుందా?
ఇక మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ శోధిని. శ్రీ శ్రీనివాస్ గారి దయ మా ప్రాప్తి.
నమస్తే శర్మ గారూ!
ReplyDeleteప్రస్తుతం బ్లాగుల్లో వ్రాసేవరూ లేరు .. రాసినది చూసేవారూ లేరు.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.. ఇప్పటి తరం వారిలో తెలుగు బాషకు ఆదరణ కరువవ్వడం, బిజీ బిజీ జీవన విధానం, సోషల్ మీడియా వ్యాప్తి లాంటివి కొన్ని!
విజిటర్లు లేనందువల్ల ఆగ్రిగేటర్లు మూతపడడం ఏమి ఆశ్చర్యం కలిగించదు..
ఆగ్రిగేటర్ నడపాలంటే సొమ్ము వెచ్చించడమే కాక.. మనలో ఆసక్తి ఉండాలి కూడా.. ఆ ఆసక్తి నిలిచి ఉండాలంటే వీక్షకుల నుండి ఆదరణ రావాలి. వీక్షకుల ఆదరణ కరువైన వేళ "ఆ సినిమా" ధియేటర్ నుండి ఎత్తేయడమే మంచిది కదా!!
శోధిని విషయానికి వస్తే "తెలుగు సంకలిని, వ్యాఖ్యల విభాగాలు" కలిపి రోజుకి 100 మందికన్నా ఎక్కువ వీక్షకులు రావడం లేదు.. శోధినిలో అనేక ఇతర విభాగాలు ఉండడం వల్ల.. ప్రపంచ వ్యాప్తంగా వాటి వీక్షణలు తోడవ్వడంతో పాటూ.. గూగుల్ యొక్క యాడ్స్ ఉంచడం వల్ల శోధిని ముందుకు సాగ గలుగుతున్నది.
"శోధిని" ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ వీక్షకుల ఆలోచనలు, వారి అభిరుచుల ఆధారంగా నడుస్తున్నది.. అవసరం అనుకుంటే ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులకు, చేర్పులకు సిద్దం అవుతూ ముందుకు సాగుతోంది..
ఒక తెలుగులోనే కాదు కన్నడ, మలయాళం లాంటి బాషల బ్లాగులకు ఉన్న ఒకే ఒక ఆగ్రిగేటర్ "శోధిని" అని చెప్పవచ్చు.
క్రొత్తగా ఎన్ని మార్పులు వచ్చినా సంకలిని, వ్యాఖ్యల విభాగాలు మూతపడవు అని హామీ ఇస్తున్నాను..
This comment has been removed by the author.
ReplyDeleteఅవునండీ. కూడలి, జల్లెడ, హా.రం మాయమైపోయాయి. మాలిక కూడా దుకాణం ఎత్తేసినట్లే. శోధిని ఇంకా ఉంది.
ReplyDeleteబ్లాగు ఆగ్రిగేటర్లు ఎంతో ఉపయోగకరం. కాని వాటి వ్యాఖ్యల పేజీలు ఎంతో హానికరం.
రణోన్మాదులూ పనీపాటా లేని మరికొందరూ చెత్తను నింపడం వలన బ్లాగులు కళతప్పాయి. నేనొక ఆగ్రిగేటర్ చేస్తే కామెంట్స్ చూపను. అనవసరం కాబట్టి.
ఆగ్రిగేటర్లు తయారు చేయటం బ్రహ్మ విద్య కాదు. కాని వాటిని నడపాలంటే సమయమూ ధనమూ వెచ్చించాలి. (అది ఇబ్బంది కావచ్చు కాబట్టి అవి మూతబడుతూ ఉంటాయి. ) నాదగ్గర సమయమూ లేదు ధనమూ లేదు.
మీరన్నట్లు బ్లాగుల్లో అసభ్య వ్యాఖ్యలు వస్తుండవచ్చు .. బ్లాగులు కళతప్పడానికి వ్యాఖ్యల పేజీ కారణం అంటే నేను ఒప్పుకోను.. యూట్యూబ్ లో వీడియోలకు అనేక చెత్త కామంట్లు వస్తుంటాయి.. అయినంత మాత్రాన చానల్ మూసుకోరు కదా.. అయినా సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి కామెంట్లకు విలువ ఇవ్వడం తగ్గించేశారు అనుకుంటున్నాను..
Deleteఅయితే బ్లాగుల్లోకి చాలామంది వ్యాఖ్యల పేజీ ద్వారానే వెళ్తున్నారు..
శోధినిలో తెలుగు బ్లాగులకు మాత్రమే వ్యాఖ్యల పేజీ ఉంది... దీనికి కారణం ఆదరణ.. అది తొలగించే ఆలోచన లేదు!
ఆగ్రిగేటర్లు నడపాలంటే సమయం అవసరమే లేదు.. అవి వాటంతట అవి పని చేసుకుంటూ పోతాయి.. ఆసక్తి ఉంటే చాలు!!
వ్యాఖ్యలు విలువ లేనివి అని నా ఉద్దేశం కాదండీ. యుధ్ధాల కోసం కొందరూ చెత్త పోయటం కోసం కొందరూ వాడటం శోచనీయం అనే నా బాధ. మీ యూట్యూబ్ ఉపమానం అంత exact కాదనుకుంటాను. వ్యాఖ్యలు చూసి వీడియోని చూడం కాబట్టి. ఇకపోతే ఆగ్రిగేటర్ కోసం అడపాదడపా maintenance కోసం సమయం వెచ్చించాలి అనే నా భావం.
Delete"కాని వాటి వ్యాఖ్యల పేజీలు ఎంతో హానికరం."
Deleteదీన్ని కాస్త విపులీకరిస్తారా .. ఎవరికి హానికరం ? సదరు బ్లాగర్ కా.. ఆ పోస్టు చూసేవారికా..
చక్కని టపాలు వ్రాస్తున్న బ్లాగర్లు మీద వ్యాఖ్యలు యుధ్ధం ప్రకటించి వారిని విరక్తితో బ్లాగులోకం నుండి తప్పుకొనేలా చేసిన సంఘటనలు చూసాను. టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్యలతో గోలగోలగా జరిగిన నిరుపయుక్తచర్చలను చూసాను. ముసుగులో దాగి సుదర్భశుధ్ధి లేకుండా నీచవ్యాఖ్యలతో నిందాలాపాలు చేషేవాళ్ళని చూసాను. ఒక ప్రచారవ్యాఖ్యను వందచోట్ల అతికించి ఆగ్రిగేటర్ పేజీని అక్షరాలా తినే వాళ్ళను చూసాను. భజనసంఘాల వ్యాఖ్యలను చూసాను.
Deleteఇటువంటి వెలపరం కలిగించే వ్యాఖ్యలు దున్నేసే బ్లాగులోకం లోనికి ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది రండి అని ఎవరినైనా ఆహ్వానించే పరిస్థితి ఉందంటారా?
ఇంత రొట్ట వలన చెడ్డపేరు వస్తున్నప్పుడు ఆకలుపుదొడ్డిని ప్రదర్శించటం అవసరం కాదనుకుంటాను.
సీరియస్ బ్లాఖర్లకూ సీరియస్ రీడర్లకూ ఈరొట్ట నిరుత్సాహం కలిగిస్తుంది కదా.
నచ్చిన టపా చదివి అవసరం అనుకుంటే అభిప్రాయం వ్రాయటం మంచిది.
వ్యాఖ్యలు ఏవైనా మంచివే అనుకుంటే చెప్పేందుకు ఏమీలేదు.
మన వాళ్ళకు సినిమాలూ రాజకీయాలూ క్రికెట్టూ తప్ప ఇతర విషయాలపై ఆసక్తి లేదు. అందుకే బ్లాగులు చచ్చిపోతున్నాయి. ఆగ్రిగేటర్లు కూడా అందుకే చచ్చిపోతున్నాయి. శ్రీనివాస్ గారు అన్నమాటలు ముమ్మాటికీ నిజం.
ReplyDeleteశ్రీ శ్రీనివాస్ జీ,శ్రీ శ్యామలీయం గారు.
ReplyDeleteఇప్పటి వరకు మన ముగ్గురు మధ్యనే చర్చ జరుతోంది గనక మీ ఇద్దరి కామెంట్లకు సమాధానంగా:-
ఇప్పుడు బ్లాగుల్లో రాసేవారూ లేరు చూసేవారూ లేరు అన్నది పూర్తిగా నిజమైపోతూ ఉంది. ఇంకా బ్లాగుల్ని పట్టుకు వేలాదుతున్న కొన్ని జీవులు అలానే ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొకటీ జారిపోతాయి,కాలంతో. కొత్తగా వచ్చేవారు మాత్రం ఉండరని కచ్చితంగా చెప్పచ్చు. కొంత కాలానికి బ్లాగులా? అని అడిగే రోజూ వస్తుంది.🤣
బ్లాగుల్లో కామెంట్లు అన్నది, నేను చూసినంత వైవిధ్యం ఈ పదునాల్గు సంవత్సరాలలో, మరొకరు చూసి ఉంటారనుకోను. రకరకాల పీడ ముఖాల్ని చూసాను. నేను చచ్చిపోలేదని ఏడ్చినవారిని చూసాను. నా భార్య చనిపోతే ఆనందపడి చంకలు గుద్దుకున్న నీచుల్ని చూసాను. నా బ్లాగును దాని ద్వారా నన్ను అభిమానించిన ఎంతో మందినీ చూసాను. నన్ను వ్యక్తిగతంగా కలవాలని తహతహలాడిన వారిని చూసాను,కలిసి ఆనందం పంచుకున్నవారినీ చూసాను. ఐతే కామెంట్లు ఉత్సాహాన్నీ ఇస్తాయి,నిరుత్సాహ పరుస్తాయి. కామెంట్లు అక్కర లేదనుకున్నవారు మొదటిలోనే కామెంట్ బాక్స్ తీసేస్తే బెడద లేదు. ఇది పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుందన్న సామెత లాటిది. కామెంట్లు అవసరమే! నన్ను నాబ్లాగును అమితంగా ద్వేషించిన వారిని చూసి తొట్రు పడ్డానేమో తప్పించి బ్లాగులనుంచి పోలేదు. కాలంతో చెల్లిపోతాను, అదెప్పుడూ, అది నాచేతిలో లేదు.
ఇది గతజల సేతు బంధనం. వేధించే, విషం చిమ్మే కామెంటర్లను మిగతా బ్లాగులవారు మెచ్చుకోవడం, కొంతమందైనా ఇది తప్పని చెప్పకపోవడం జరిగిన దురదృష్టం. అప్పుడపుడు ఒకరిద్దరు ఇటువంటివి ఖండించినా ఎక్కువ మంది కాకపోవడంతోను,అటువంటివారు చెలరేగిపోయారు. రేపు మనలనీ ఇలా వేధించవచ్చనే భయంతోనూ, కుల ద్వేషంతోనూ నోరు విప్పలేదు, ఇది సత్యం,సత్యం,సత్యం. కుల ద్వేషం బ్లాగుల్లో పూర్తిగా రాజ్యమేలిందన్నదే నిజం.
ఇక ఆగ్రిగేటర్లు ప్రాంభించిన వారంతా భాషమీద అభిమానంతో చేసిన సేవ తప్పించి మరొకటి కాదు. వీటి నిర్వహణకు సొమ్ములూ అవసరమే, కాలమూ వెచ్చించక తప్పదు,కొద్దిగానో,గొప్పగానో! దానిని కొంతేని పూడ్చుకోడానికి అద్వర్టైస్మెంట్లు అవసరమని చాలా కాలం కితమే నొక్కి చెప్పాను. అది చాలా కాలం తరవాత శ్రీనివాస్ అమలు పరచారు.
చివరగా తెనుగు బ్లాగులకి శోధిని మాత్రమే అగ్రిగేటర్ నిలిచింది. ఒక్కమాట చెప్పి విరమిస్తాను. ఎందుకో ఎక్కువమంది శోధినిని ఉపయోగించరు, ఇందులోనూ రాజకీయం ఉందనుకుంటాను.🤣
పాపం మిగిలిన పనిలేని బ్లాగోద్యులు చర్చించుకుంటున్నారు :)
ReplyDeleteబ్లాగోద్యోగులు ఈ పదం బావుంది :)
Delete