అశుద్ధం మీద
అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన చిందుతుందని ఒక నానుడి. అశుద్ధం అని తెలిసి, రాయి వేస్తే చిందుతుందని తెలిసి, రాయి వెయ్యకూడదు. దూరంగా ఉండాలి.
బురద లో పొర్లిన పంది రోజుకుంటూ ఎదురొస్తే మనమే తప్పుకోవాలి. లేకపోతే ఒంటినిండా బురద విదిలించి పోతుంది, దీనికి జ్ఞానం ఉండదు, జ్ఞానం కల మనమే దూరంగాఉండాలి.
చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు అన్నది పెద్దలమాట. మూర్ఖుడు అని తెలిసి వారితో వాద,సంవాద,ప్రతివాదాలు చేయడమే మూర్ఖత్వం. అందుచేత మూర్ఖునికి దూరంగా ఉండాలి.
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
జీవితంలో నేను ఎన్నిసార్లో గుర్తు చేసుకున్న మాటలు ఒక పోస్టులో చెప్పేశారు . "అశుద్ధం " కాకుండా మురికి నీరు అనేవారు మా నాన్నగారు .
రిప్లయితొలగించండిRao S Lakkaraju31 May 2025 at 18:08
తొలగించండిhttps://kasthephali.blogspot.com/2025/06/blog-post.html
ఉప్పందించారా ?
రిప్లయితొలగించండి
తొలగించండిZilebi31 May 2025 at 20:04
ఎంటో మీమాటలు అర్ధంకావు,పోలీస్ దెబ్బలు కనపడనట్టు
దెబ్బలు బాగా తగిలి నట్టున్నాయే ? :)
తొలగించండిZilebi5 June 2025 at 01:22
తొలగించండిచూడగా 'చదవేస్తే ఉన్నమతి పోయిన' సామెతగా ఉందే మీ వ్యవహారం.