30, మే 2025, శుక్రవారం

పుణ్యానికి పోతే

 పుణ్యానికి పోతే


పుణ్యానికి పోతే పులెత్తుకుపోయిందని సామెత! అలాగా శశి థరూర్,అసదుద్దిన్,కనిమొళి,ఇలా పార్లమెంటు సభ్యులు ఏడు బృందాలుగా ప్రపంచం మీద పర్యటిస్తూ పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ మన దేశపు ఇబ్బందులను, ఎట్టి పరిస్థితులలో లక్ష్మణ రేఖను దాట వలసి వచ్చిందో వివరిస్తున్నారు.


ఈ బృందాల్లో శశిథరూర్,అసదుద్దీన్ ముఖ్యంగా మెరిసారు. శశి థరూర్ కాంగ్రెస్ వాడయి ఉన్నా, పార్లమెంటు లో విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ   అద్యక్షుడు, దేశం ముందు తరవాతే కుటుంబమని విషయాల్ని చెబుతోంటే వారి పార్టీ వారే  తిట్టిపోస్తున్నారు. నిన్ను బి.జె.పి, విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసుకుంటుందనీ వైన వైనాలుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సదుద్దీన్ ఏ పార్టీ వాడైనా మెచ్చుకోవలసిందే.    


జయహో! విదేశాల్లో పర్యటిస్తున్న బృందాలకి, ముఖ్యంగా శశి థరూర్,అసదుద్దిన్ లకు జయ! జయహో!! 


శశి థరూర్,అసదుద్దీన్ లకే నావోటు వారే పార్టీలో ఉన్నా! కారణం దేశద్రోహం చెయ్యలేరు,అదిచాలు.  

4 కామెంట్‌లు:

  1. ఇంకా ప్రపంచం లో మంచిగా ఆలోచించే వారు ఉన్నారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju30 May 2025 at 08:51
      దేశభక్తులు ఉన్నారండి, కాని చరిత్రలో దేశద్రొహులే కనపడతారండి. వారిదే చరిత్ర. మనకి నేర్పిన చరిత్ర అదే!

      తొలగించండి
  2. తాతగారి యూఫోరియా బావుంది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi31 May 2025 at 05:21
      తమరు ఆంగ్లం లో ఆలోచించి తెనుగులో చెబుతుంటారనమాట. అదేదో తెనుగులో చెప్పండి.

      తొలగించండి