27, మే 2023, శనివారం

నృపస్య చిత్తం

  నృపస్య చిత్తం


నృపస్య చిత్తం కృపణస్య విత్తం

మనోరథా దుర్జనమానవానా

స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం 

దేవో న జానాతి కుతో మనుష్య 

రాజు మనసు, లోభివాని సంపద,దుర్జనుని జేవితేఛ్చ,స్త్రీల చరిత్ర, పురుషుల సంపాదన, దేవునికే తెలియదు, మనుషులకా?

( దేవునికి కూడా తెలియనివ్వనంత గుట్టుగా ఉంచుతారు, ఇక మనుషులకెలా తెలుస్తుంది?) 


రాజుమనసెపుడూ గుట్టే! అలాగే ఉండాలట. ఎవరినీ నమ్మడు, పెళ్ళాన్ని కూడా!! నమ్మేడో ఐపోయాడే!!!


లోభివాని సంపదెంత?అతనికే తెలీదు. తెలియనివ్వడు. అంతే!!!ఎక్కడ దాచాడో తెలియదెవరికి, తెలియనివ్వడు కూడా. నేడు రెండు వేల రూపాయల నోట్ల కట్టలు బయట పడుతున్నట్టు. ఏదీ? ఎక్కడా చప్పుడు లేదే!


దుర్జనుని జీవితాశయం ఏమై ఉండచ్చు...దేశం ఏమైపోయినా బాధలేదు, అంతే, జీవితాశయం గుట్టే


స్త్రీల చరిత్ర అంటే పుట్టు పూర్వోత్తరాలు, అంటే వయసు గుట్టు, అదీ సంగతి.


పురుషుని సంపాదన, జీతమో, గీతమో, ఏ సంపాదనా గుట్టే


వీటిని పైవారు దేవునికి కూడా తెలియనివ్వరు, మనుషులకెలా తెలియనిస్తారు???

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అది తెలుగులో ఏడవచ్చుగా. కమల్‌హాసన్‌లాగ అప్పిడియా, చప్పిడియా అని "అరవ"కపోతే.

      తొలగించండి
    2. కాంత్28 May 2023 at 06:15
      కాంత్ జీ!
      కొంతమందికిదలవాటు! ఏం చేయగలం సార్!!

      తొలగించండి
    3. Anonymous27 May 2023 at 16:49
      ఇది అరవంట కదా!! నాకు ’అరవం’ రాదండి,అదేమో తెలియలేదు, అర్ధమూ తెలియలేదు సుమా

      తొలగించండి
    4. తెలుగే రాదు ఇలా తమిళంలో రాస్తే ఎలాగా అంటున్నారాండీ :)


      జిలేబి

      తొలగించండి
    5. Zilebi29 May 2023 at 16:26
      యతో భ్రష్ఠ తతో భ్రష్ఠః, తెనుగూ రాదు, అరవమూ పూర్తిగా రానివారు అరవంలో అరవడమెందుకూ? అప్పిడియా చప్పిడియా అంటే ఎంటో చెప్పచ్చుగా తమరు :)

      తొలగించండి
    6. ఏదో సంస్కృతంలో వున్నదాని బరికేసి మాకు తెనుగొచ్చు అంటూ గొప్పలు చెప్పుకోవడమే ? తెలుగులో చెప్పండి. :)

      తొలగించండి
    7. Zilebi30 May 2023 at 20:35
      తెనుగూరాదు, అరవమూ రాదుగాని అప్పిడియా చప్పిడియా అంటే ఏంటో చెబుదురూ.

      తొలగించండి
    8. అప్పిడి అనగా ఆ పిడి
      చప్పిడి అనగా ఛా! పిడి


      ఇట్లు
      మేతావులకు మేతావి
      జిలేబి

      తొలగించండి
    9. Zilebi31 May 2023 at 11:20
      పిల్లి అంటే బిడాలం అన్నట్టుంది. మేతావులకు మేతావి కాదు బుజ్జమ్మా! నీలాగా :)

      తొలగించండి
    10. -

      పిల్లి యనగా బిడాల
      మ్మల్లె గలదె నీ జవాబు మాకు తెలుపవే
      తల్లీ అప్పిడియాకున్
      మళ్లీ చప్పిడికి అర్థ మసలుందామ్మీ ?

      జిలేబుల్స్ :)

      స్టాకు మార్కెట్టుని కుదిపేసేరేమిటి ఇవ్వాళ తాతగారూ ?

      తొలగించండి
    11. Zilebi31 May 2023 at 17:18
      అప్పిడియా చప్పిడియా అంటె అర్ధమేటో చెప్పమంటే తికమకపెట్టి చంపుతున్నావు. దేవుణ్ణి కూడా తికమకపెట్టేయగలవు.దేవునికే పంచాంగం చెప్పగలవులా ఉందే!
      ఇంతకి నీకు అర్ధం తెలుసా? తెలీదా?

      పడుతూ లేస్తూ పరుగులు పెట్టేదే స్టాకు మార్కెట్టంటే, అది నీకూ తెలుసుగా!అందులోనూ ఫ్యూచర్లు,ఆప్షన్లు అంటావుగా!
      నేనేమో స్టాకు మార్కెట్ దూకాన్ మూసేసి, బ్లాగు దూకాన్ ఓపెన్ చేసి లవ్వు స్టాకు అమ్మకానికి పెట్టేను, కొనేవారే కనపట్టం లేదు.
      2024 లో రాజ్యం మీదేట, ప్రమీలా రాజ్యమని బాబా చెప్పేడు. ప్రమీలా రాజ్యంలో నువ్వు మంత్రివే నన్ను మర్చిపోకూ....
      గుడ్డు నైటూ

      తొలగించండి
    12. బుజ్జమ్మా!
      ''అల్లుడు అనేటప్పటికి రేవులో వంకర తాడి చెట్టు నిటారుగా లేచినిలబడిందని'' ఒక నానుడిలే! మంత్రి అనేటప్పటికే ఊసూ పలుకు లేకుండా గాయబ్ ఐపోయావుసుమీ!!

      తొలగించండి
    13. -

      అల్లుడనగనే సామెత
      చెళ్ళున రేవందు తాడి చెట్టు నిటారై
      భళ్ళున లేచినిలబడున్
      పుల్లగిలి పరుగిడి నావ బోల్ మంత్రి యనన్

      జిలేబుల్స్ :)

      తొలగించండి
  2. -

    తెలుగోళ్ళకి తెనుగే రా
    దిల మాచన శర్మ గారు దీన్ని తెలిపిరీ
    పలకా బలకము నిమ్మా
    జిలేబులను వేయు తీరు శీఘ్రము నేర్వన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi31 May 2023 at 11:25
      నేననలేదు :) బుజ్జమ్మ అన్నమాటేస్మీ :)

      తొలగించండి