Sunday, 5 March 2023

నడిరేయి ఏ జాములో

 నడిరేయి ఏ జాములో


సామీ!   

నడిరాత్రేల ఎలబారకపోతే, అమ్మనే సందలడే కాడికి కొండమీనకి  బయలెల్లమనచ్చుగా!

తప్పైపోనాది సావీ! అమ్మకేటి ఎడం?  

 ”ఆబ్రహ్మకీట జనని”, నాలాటోల్లెంతమంది కతకనేదో సూడాలిగందా!


తవరేటి బావులూ సందలడ్డంతో బయలెల్లచ్చుగా! అమ్మకాడికి?

ఇదీ ఒల్లకోనిదేనా  సావీ! తమకేటి, ఎన్ని రాసకారేలో!! ఇదేటి కుటుమానం సావీ! అమ్మో కాడ!, అయ్యో కాడా! ఏటో పిచ్చోణ్ణి తవరిగారి కుటుమానంలో నా ఊసేటి సెప్పుమీ!!


అద్సరేగాని సావీ! రాత్రేల పారెలతంటే పురుగో, పుట్రో; పులో మెకవో, ఆటికేటి తెలుస్తది సావీ! తమరెవురో!

ఏటో సావీ! బుఱ్ఱతక్కువోడిని ఊసాడ్డం తెలీనోన్ని, అనేసినాను.

ఓలమ్మ! ఓలమ్మ!!,  ఏటాసిరునవ్వు, ఆ యమ్మ యశోదమ్మ కాడ నవ్వినావంటగందా, నోరు చూయించినావంట! అల్లది నాకు చూయించుమీ!!!


సరేగాని బావులూ సందెపొద్దులూ నిలువు జీతమే! కాల్లు నొవ్వవేటి? నాలాటోనికి కూసేపు కాల్లు నొక్కనీకి ఒల్లకోరాదా?

అది నీవల్లకాదంటావా! అది బ్రహ్మ కడిగినపాదమంటావా! చాలామంది మహామహులకే సాధ్యం కాలేదంతావా! నాకేటి ఎరిక సావీ, నాలాటోడివేననుకుంతా!


సావీ! ఏడేడనించో ఎలబారి పారొస్తాం! సూడాలి, సూడాలనుకుంతాం! సూదామనుకునీ తలికి కల్లేటి మూతలడిపోతాయో సావీ!ఎరికవదు.  కల్లిప్పి నిన్ను సూచీ తలికి,ఇక సూడు, నడు, నడు, అని తరుముతారు సావీ!

అదిచాలురా! అంతకుమించి చూడలేవు, నీవల్లకాదు. నిన్నిక్కడే కూచో ఒకరోజంతా అంటే, కూచోలేవు. నీమనసు, ఇల్లూ వాకిలీ;పెళ్ళామూ,పిల్లలూ; పొలమూ,పుట్రా; గొడ్డు,గోదా అని అక్కడ తిరుగుతుంది. నేనిక్కడే కాదు, అక్కడా ఉన్నాను, ఎక్కడా ఉన్నాను, అంతెందుకు నీ మనసులో ఉన్నా! తొంగిచూడు.  నువ్వెక్కడున్నా, నీ మనసు నా దగ్గరుంటే చాలంతావా సావీ. ఇద్దెలుసుకో లేకపోనా చామీ!


బావూ! నీ కుటుమానంలో ఇసయం, మన్లోమాట, లగ్గానికిజేసిన అప్పేపాటున్నదేటింకా! కుంచాల కుంచాలు, రాసులకొద్దీ సొమ్ములు కొలిసిచ్చి, సోలిపోయిగందా! కుంచం తలకాడెట్టుకు తొంగుండి పోనాడా సావి! ఎప్పటికి తీరుద్ది బావూ అప్పూ! ఏటి వడ్డీ తీరడం లేదంతావా! నెక్కా? డొక్కా తిన్నగున్నట్టు  లేదు సావీ, ఆ సావి అలుకొచ్చి తొంగుండిపోనాడు, మజ్జగాలోల్లు, ఎంత సొమ్ము నొక్కీసినారో ఎరుకేనేదు బావూ!

ఆల్లేతి క్షేత్రపాపు లంతావా!

ఎంత పాపిష్టోల్లన్నా! ఇంత సేటా సావీ, ఓపాలిటూ సూడుమీ 

బావులూ అమ్మతో ఓపాలి అప్పూసనరాదా?

బావూ! లగ్గానికి అమ్మ కట్నమేటి తెచ్చినాది? 

అమ్మే నచ్చిందేవి మరి కట్నమేటంతావా?


అమ్మ! తల్లితల్లి, ఊసాడ్డం తెలీనోన్ని ఏటేటో ఓగీసినాను దొరకాడ! అమ్మవుగందా !దొరసానీ! నాకేటొద్దు దొరకాలు నొక్కుతూ పొద్దుపోవాలని ఊసు తల్లీ! దొరకి చెప్పుమీ!!! 


"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందీ" నీవున్న అనుభూతి,అనుభవం  కొనసాగితే చాలు, నా జీవితానికి మరేం వద్దు తల్లీ!


13 comments:

  1. ఆడకూతుర్నే రమ్మనమంటారా ఎవరైనా? అందులోనూ మసక చీకట్లో?
    కాబట్టి తన పనులన్నీ తెమిలాక “నడిరేయి ఏ జాము అయినా” ఈయన బయలుదేరి వెళ్ళడమే ఉచితం.

    మొత్తానికి బాగా వ్రాసారండి 🙂🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు5 March 2023 at 18:03
      స్వామి దర్శనానికి వరసలో నిలబడ్డ పల్లెటూరి అమాయకునికొచ్చిన ఆలోచనలు ఆపై స్వామివారి సమాధానాలుగా తానే చెప్పుకున్న మాటలండి. పెద్దకోరికలేం లేవు, విశ్వరూప సందర్శనం, స్వామి పాద సేవ. అదే మళ్ళీ అమ్మ దగ్గర చెప్పుకున్నాడండి.అమ్మంటే ”చనువుతో కూడిన భయం”,అయ్య ఐతే ”భయంతో కూడిన చనువు” కదండీ! అదండి సంగతి.
      భాష చిక్కబడి/ చిక్కుబడి పోయిందేమోనని చిన్న అనుమానమండి, మరేంలేదండి.

      Delete
    2. ఉత్తరాంధ్ర భాష బాగానే చిక్కబడింది 👏. అయినా అదో అందం లెండి 👌🙂.

      Delete
  2. ఎప్పటికి తీరుద్ది బావూ అప్పూ...

    ఈ యుగాంతం దాకా బకాయి వడ్డీ కాసులు చెల్లు బడి సాగుతానే వుంటదిరా అబ్బిగా.

    ReplyDelete
    Replies
    1. Anonymous5 March 2023 at 21:54
      అయ్యవారికి అప్పుందని, అది పెళ్ళికే అయిందని నచ్చిందేవికి తెలీదా? అదెప్పటికి తీరుతుందో కూడా అమ్మకి తెలుసు, అప్పు తను తీర్చకూడదు, తను అప్పు తీరిస్తే, అయ్య పరువేంగాను? పామరుడికిది తెలీదుగా!అప్పు తీర్చి అంగటినుండమన్నారనుకున్నాడంతే!
      ధన్యవాదాలు.

      Delete
  3. Fantastic writing - clever combination of humor, humility, spirituality in paamarula yaasa. Enjoyed very much.

    ReplyDelete
    Replies
    1. Anonymous5 March 2023 at 21:57
      పామరుడు కదండీ! అందుకు భావాలన్నీ అన్నీ సమపాళం లో వచ్చేయన్నమాట.
      ధన్యవాదాలు.

      Delete
  4. పిచ్చి మేళం గందరగోళం

    ReplyDelete
    Replies
    1. Anonymous7 March 2023 at 10:16

      పిచ్చి మేళానికే గందరగోళం

      Delete
  5. చాలా బాగుంది గురువు గారు. ఎలా వున్నారండి. 🙏

    ReplyDelete
    Replies
    1. లక్ష్మిగారు,
      అమాయకుని అంతరంగం. ఉత్తరాంధ్ర ఏనలో నడచిపోయింది. ఎక్కువమంది ఇబ్బంది పడతారేమో చిక్కనైన ఏసకి అని భయపడ్డాను. నచ్చినందుకు ధన్యవాదాలు.

      నేనంటారా? బండి ఆగితే కబురేలేదుగా!ఇక నడుస్తోందనీ చెప్పలేను. కుంటుకుంటూ నడుస్తోందన్నది నిజం. జరలో రుజ తప్పనిదే! ఈ శరీరం నేను కాదు అనుకోవడమే సాధ్యం కావటం లేదు. అలా అనుకోగల్గితే బాధలు లేవు. ఇదింతేనమ్మా! తప్పనిది, తప్పించుకోలేనిదీ!!!!!!! షడూర్ములు ఎవరివివారే అనుభవింపక తప్పదు! ఎవరిచావు వాళ్ళే చావాలి. ఇలా అన్నానని ఏమనుకోవద్దూ!!
      బాధలనుంచి కొంతసేపైనా మనసు మరల్చడానికి చేసే ప్రయత్నమే బ్లాగు రాయడం!! మరేంకాదు.

      Delete
    2. బాధలనుంచి కొంతసేపైనా మనసు మరల్చడానికి చేసే ప్రయత్నమే బ్లాగు రాయడం!! మరేంకాదు.

      GuruvugarumeelantipeddalemakumargadarsakuluintakashTamlokudarastunnarantemeeopikakunamassulu

      Delete
    3. Anonymous10 March 2023 at 09:26
      /GuruvugarumeelantipeddalemakumargadarsakuluintakashTamlokudarastunnarantemeeopikakunamassulu/
      /గురువుగారు
      మీలాంటి పెద్దలే మాకుమార్గదర్శకులు
      ఇంతకష్టంలోకూడా రాస్తున్నారంటే మీ ఒపికకు
      నమస్సులు/


      మీ కామెంట్ తర్జుమా చేసుకున్నా!
      మీ అభిమానానికి అవాక్కయ్యాను, కొన్ని క్షణాలు.
      ధన్యవాదాలు.

      Delete