Tuesday, 14 February 2023

Learn telugu through Hindi

Learn telugu through Hindi

This post is intended to those, who wish to learn, read and write telugu script and are well versed in fluent conversation in Telugu.

Any improvements suggested are welcome.

This post is particularly intended to my grand daughter (follower of my blog) (प्रत्यक्ष अभिमानि) who whish to learn telugu script and read for herself. Now she is hearing the posts through somebody who can read telugu script. The languages known (read and write) are Hindi and English hence trying to make her learn Telugu through Hindi.


Telugu alphabet

  (Vowels) అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః=16


(Consonants)

క ఖ గ ఘ జ్ఞ

చ ఛ జ ఝ ఞ 

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ  బ భ  మ

య ర ల వ శ ష స హ క్ష  ళ ఱ=36

(Adding vowels to consonants)

క కా కి కీ కు కూ కృ కౄ క్రు క్రూ కె కే కై కొ కో కౌ కం కః

(Doubling consonants)

క్క క్కా క్కి క్కీ క్కు క్కూ క్కృ క్కౄ క్కె క్కే క్కై క్కొ క్కో క్కౌ క్కం క్కః


Hindi alphabet

अ आ इ ई उ ऊ ऋ ॠ ए ऎ ऐ ओ ऒ औ अं अः=16

क ख ग घ ज्ञ

च छ ज झ ञ 

ट ठ ड ढ ण

त थ द ध न

प फ  ब भ  म

य र ल व श ष स ह क्ष  ऱ=36

(Adding vowvels to consonants)

क का कि की कु कू क्रु क्रू के कॆ कै को कॊ कोऊ कं कः 


(Doubling consonants)

क्क क्का क्कि क्की क्कु क्कू क्कृ क्कॄ क्के क्कॆ क्कै क्को क्कॊ क्कौ क्कं क्कः

Note:

1.Recognise letters in telugu script through the corresponding hindi script letter and pronounciation. Best way to remember is to write many times the same letter by pronouncing it. 

2. recognition of telugu letters is more important.

Wish you all the best in learning Telugu script

15.2.2023

''ळ ''अक्षर कॊ  भूल गया! इस्मॆ जॊडॊ 

Add letter ळ , forgotten  it is ళ in telugu .

IMPORTANT. Start laetters writing from left to right.

It takes one week for you to remember all letters of the Telugu alphabet. Your time starts now. Next lesson follows after your report of recognizing the letters. 

----------------------         

23.2.2023.

No report or reply from you. Really I am a fool, belived your words. 

7 comments:

  1. మంచి ప్రయత్నం 👏.
    శర్మగారి మనవరాలికి తెలుగు లిపి రాదా? ఆశ్చర్యం.

    ReplyDelete
  2. రాబోవు కాలపు "జిలేబీ"కి తయారీ కాబోలు.

    ReplyDelete
  3. విన్నకోట వారూ ఇప్పుడు మీరు తెలుగు పిల్ల(ల)కు తెలుగులిపి రాకపోవటం గురించి ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉన్నదీ మీకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశంలో ఐతే తెలుగుమీడియం అనేది దాదాపుగా నిషేధించినట్లే. ఇంగ్లీషు మీడియంలోనే చదువుకోండి పిల్లలంతా అని ప్రభుత్వమే‌ హెచ్చరిస్తోంది. వచ్చే ముఫ్ఫై యేళ్ళదాకా ఈప్రభుత్వం వారే ఉంటారు కాబట్టి కొన్నాళ్ళ తరువాత, అక్కడి పిల్లలు ఎవరికైనా తెలుగులిపి వచ్చి ఉంటే హాశ్చర్యం హాశ్చర్యం అని మనం ఉబ్బితబ్బిబ్బైపోవాలి!

    ReplyDelete
  4. పాత “మహామంత్రి తిమ్మరుసు” చిత్రంలోని “చరిత్ర యెరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా, ఆంధ్రదేవా వెంకటేశ్వరా” అనే పాట గుర్తొస్తోంది.

    విశేష భాషాపరిజ్ఞానం కలిగిన శర్మ గారి మనవరాలికి తెలుగు లిపి చదవడం / వ్రాయడం రాదనేసరికి ఆశ్చర్యం అనిపించింది, అంతే. ఆ అమ్మాయి నివాసం వేరే ఊరేమో లెండి.

    ReplyDelete
  5. విన్నకోట నరసింహా రావు14 February 2023 at 18:41
    Anonymous14 February 2023 at 19:35
    శ్యామలీయం14 February 2023 at 19:57
    విన్నకోట నరసింహా రావు14 February 2023 at 20:57
    సమాధానం కొంచం పెద్దదిగా ఉన్నందున, ఒకరడిగినదానికి మరొకరడిగినదానికి ఒకటే సమాధానమవడంతో అందరికి కలిపి సమాధానం రాసాను, ఏమనుకోవద్దూ!

    విన్నకోటవారు
    ఆమె నా స్వంత మనవరాలు కాదు, నన్ను
    తాతగారూ అన్న అమ్మాయిలంతా నా మనవరాళ్ళే అనుకోడం నా బలహీనత దురలవాటెమోనండి, ఏమనుకోవద్దూ!

    అనామకంగారు!
    జిలేబిలో మీకు నచ్చినదేదో ఉంది, అందుకే మరచిపోలేకపోతున్నారు కదా! అంతే కాదు నన్ను మరవనివ్వటం లేదు.

    విన్నకోటవారు, శ్యామలీయంవారు.
    కొంచం వివరిస్తా, విసిగిస్తానేమో కూడా!
    సాయంత్రం నడక పూర్తి చేసుకుని ఒక పక్కగా కూచుంటా, ఎవరికి ఇబ్బంది కలగకుండా! ఇది చాలాకాలంగా ఉన్న అలవాటు. అందరూ గూళ్ళకి చేరేందుకు హాడావుడి పడుతుంటారు.కొంత కాలంగా ఇద్దరమ్మాయిలు (Teachers) పరిచయం పెంచుకున్నారు, కావాలని. ఓ రోజు ఇద్దరూ నా దగ్గరకొచ్చి కూచుని మన సంస్కృతి, సంప్రదాయాలు గురించి చెప్పండి తాతగారూ అన్నారు. నన్ను ఎగతాళీ చేస్తున్నారేమో అని సందేహించి, నాకేం తెలియదనేసా!దానికి మరో అమ్మాయి,రామాయణ, భారత,భాగవతాల్లోంచి ఏమైనా చెప్పండి అంది.మరో అమ్మాయి, పెద్దవయసువాళ్ళు ఇలా తప్పించేసుకుంటే మాకు సంగతులు ఎలా తెలుస్తాయి? పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నాం. తెలుసుకోవాలని కుతూహలం అని సన్నాయి నొక్కు నొక్కింది. సరేనని రామాయణంలో సీతాన్వేషణ ఘట్టం చెప్పి అందులో మేనేజిమెంట్ విశేషాలు చెబితే, బాగుంది, బాగుందన్నారు.
    ఇంతతో వదలుతారనుకున్నా! రేపొస్తాం అన్నారు. అటైతే నాదో బ్లాగుంది, చదువుకోండి, మీకు కావలసినవిదొరకచ్చని, చెప్పి యు.ఆర్.ఎల్ ఇచ్చా! ఒకమ్మాయి, బ్లాగులో దూరిపోయింది, అన్నీ మరచి.

    మరో అమ్మాయి దీనంగా నిలబడింది, ఏం అన్నట్టు చూసా! తాతగారు నాకు తెలుగు లిపిరాదు. మీకు హిందీ వచ్చా అంది, రాదన్నా! మీ బ్లాగు చదవాలని ఆశ, నేను మీకు హిందీ నేర్పుతా, మీరునాకు తెలుగు లిపి నేర్పండి అని అడిగింది.నిరాశ పరచలేకపోయా! నీవు తెనుగు లిపి నేర్చుకోవడం కష్టంకాదు, ఇంత స్వఛ్ఛంగా తెనుగు మాటాడుతూ లిపి రాదంటే ఆశ్చర్యమేసిందని, లిపి నేర్పడానికి ఒప్పుకున్నా!పుస్తకం తెచ్చుకోనా? అడిగింది, వద్దు బ్లాగులోరాస్తా చూసుకో! దానిలో చెప్పినట్టు చెయ్యి అని నిన్న టపా రాశానండి. ఇబ్బందులుంటే ఈ రోజుసాయంత్రం చెబుతుంది.
    మరోమాట అప్పుడు చూసానాఅమ్మాయిని పరిశీలనగా! ఆమె ఉత్తరభారత దేశీయురాలు, తెనుగమ్మాయి కాదు, వివరాలు తెలియవు, అడగలేదు.ఆమె చెప్పలేదు.

    నేనా హిందీగాని తెనుగుగాని భాషలలో పండితుణ్ణికాదు, కాని ఆమె ఉత్సాహం మీద నీళ్ళుజల్లలేకపోయా! అందుకే ఈ ప్రయత్నం. నేను ఇందులో విజయం చేకూర్చుకోలేకపోవచ్చు, సిగ్గు పడను, బాధాపడను. నా ప్రయత్నలోపమనుకుంటా.

    ReplyDelete
  6. మీ “మనవరాళ్ళ” చనువు బాగుంది శర్మ గారు 🙂. గారాలు పోయి కావలసినది సాధించుకున్నారు 👌.

    అవునూ, ఏ విజయవాడో వైజాగో అంటే సరేలే అనుకోవచ్చు గానీ ఆంధ్రదేశపు నడిబొడ్జునున్న అనపర్తి లాంటి చిన్న ఊళ్ళో (చిన్న ఊరు అన్నందుకు ఏమనుకోకండి 🙂) హిందీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి?
    ఒక్క నిమిషం …. ITC తాలూకానా ఏమిటి ?

    ReplyDelete
    Replies
    1. తాతా అన్నవాళ్ళంతా మనవాళ్ళే అనుకోడమో బలహీనత :) ఇక వాళ్ళు గారాలే పోయారో, ఎగతాళీయే చేసేరోగానండి, ఒకరికి బ్లాగు యు.ఆర్.ఎల్ ఇచ్చానంతే! ఇక రెండో అమ్మాయి తెనుగు లిపి నేర్పమంటే, ఆయ్యో! ఆడపిల్ల నిత్యం నలభై కిలోమీటర్ల దూరం బస్సుల్లోపడి ప్రయాణం చేసి పొట్టకోసం తిప్పలు పడుతోందే, ఇక్కడ ఉద్యోగం చేస్తూ అని చిన్న అభిమానం, చేయగల సాయం చేయలేనా? అనిపించిందండి. కాదు వాళ్ళు నన్ను హేళన చేయడానికే అలా చేసినా నాకొచ్చిన నష్టం లేదు, నష్టపోయేది వాళ్ళే! నేను తెలివితక్కువవాడిననుకున్నా నాకొచ్చిన నష్టమూ లేదండి :) ఎలాగా తెలివి తక్కువ వాడినే గనక ఇబ్బందీ లేదు :)
      ఎండ దంచుతోందప్పుడే, పగలు 34,36 రాత్రి చిరుచలి వుంటోంది. సాయంత్రం నడక సమయం మార్చుకోక తప్పదు, సమయం మరిస్తే సమస్య గాయబ్ :)

      Delete