ఎప్పటికి తరగని వైభవం
ఉష, ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణుడు
గొల్లలమామిడాడ
కొనసాగుతున్న గతకాలపు వైభవం
ముంగిట ముగ్గు
గతకాలపు వైభవ చిహ్నం
ఇంటిపై టి.వి ఏంటెన్నా
గతకాలపు వైభవ చిహ్నం
Neighour's envy
Owner's pride,.
now
Owners liability--neghbour's burden.
*****
నిన్నటి టీచర్ నేటి రాష్ట్రపతి....
కాలమండి బాబూ కాలం.
*****
నిన్నటి చాయ్ వాలా నేటి ప్రధాని....
కాలమండి బాబూ కాలం.
*****
నిన్నటి ఆటోవాలా నేటి ముఖ్యమంత్రి.
కాలమండి బాబూ కాలం.
*****
నిన్నటి సన్యాసి నేటి ముఖ్యమంత్రి.
కాలమండి బాబూ కాలం.
*****
నిన్నను రాజ్యాన్ని కనుసన్నలలలో పాలించిన దేవత....
నేడు ?????????
కాలమండి బాబూ కాలం.
*****
.నిన్నటి దొంగ-నేటి దొర
కాలమండి బాబూ కాలం.
*****
నిన్నటి దొర-నేటి దొంగ
కాలమండి బాబూ కాలం.
*****
నిన్న కన్ను తిప్పుకోలేని అందం--నేడు కన్ను కనపడని చందం
కాలమండి బాబూ కాలం.
*****
రేపు రాజెవరో రెడ్డెవరో
కాలమండి బాబూ కాలం.
****
నిన్నటి కష్టేఫలి
ReplyDeleteనేటికి యెన్నటికి మునుపెన్నటికి
కష్టేఫలియె
ఆల్ టైమ్ హీరో
అనామకా!
Deleteనిన్నటి తెగడ్తకి నేటి పొగడ్తకీ అతీతం.
అదే కదూ అద్వైతం
కాలమండి బాబూ కాలం
పైన Anonymous గారు సరిగ్గా చెప్పారు. మీరు ఎప్పటికీ బ్లాగులోక హీరేయే 👍.
ReplyDeleteమరి కొన్ని 👇
నిన్నటి నటి - నేటి మంత్రి
విన్నటి సినిమా నటి - నేటి సీరియల్స్ నటి
నిన్నటి వ్యాఖ్యాత - నేటి బ్లాగరు
నిన్నటి “జిలేబి” - నేటి గాయబి 🙂
కాలమండి బాబూ కాలం 😌
=========
ONiDA TV ఆహా, ఏనాటి మాట!
ఇక్కడ now అని వ్రాసిన దాంట్లో neighbour’s burden బదులు neighbour’s delight అనచ్చేమో (ఆ owner గారి TV పాడైనందుకు delight) 😁?
విన్నకోట సారూ!
Deleteఅంత సీన్ లేదేమోనండీ!!
*****
బాగానే అందుకున్నారుగా :)
జిలేబి, గాయబి, పాపం!!! కరోనాతో చచ్చి బతికిందిట. అప్పటినుంచి లేస్తే కూఛోలేక, కూచుంటే లేవలేక తిప్పలు పడుతోందిష,అందుకే ఈ ’గాయబి’ అని ధృవపడని వార్త.
*****
టపాలో ఫోటో లన్నీ ఈ మధ్య తీసినవే,అన్నిటిని అలా కాలంతో ముడేట్టేననమాట :)
మూడు వారాలకితం,ఆదివారం ఉదయమే,భోరున వర్షంలో,కుటుంబ సహితంగా, అనుకోకుండా బిక్కవోలు గణపతి,గొల్లల మామిడాడ ఉషా,ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణుని దర్శన సమయంలో తీసిన ఫోటో, ఎప్పటికి తరగని వైభవం.
మిగతా ఫోటోలు ఉదయం నడకలో దిక్కులు చూస్తూండగా కనపడ్డ విశేషాలు.మొన్న శుక్రవారం ఉదయమే ఒక ఇల్లాలు ఇంటి ముందు ముగ్గేస్తుండగా, నాలాటి బద్ధకస్తుడే ఇంటి మీద ఏంటెన్నా కూడా తీసెయ్యకుండా వదిలేసింది చూసి....ఇక చివరిది, ఒక ఓనర్, తన పాడైన ఓనిడా టి.వి. ని పక్కవారి పాడైన ఇంటి ముందు ఇటకలమీద వదిలేసినది చూసి....
కాలమండి బాబూ కాలం
గాయబి కాదు పోయేరని చెప్పేరు ? కాదా?
Deleteఅనామకా!
Deleteశాంతం!పాపం!!
జిలేబి జిందా హై!!కరోనా మొదటి పొరలో తగిలింది, దయాబెటీస్ యు నో, దాంతో కూచుంటే లేవలేక, లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. ఇదివరలో ఇటుకరాళ్ళు విసిరేది, ఓపిక లేక గులకరాళ్ళు కూడా విసరలేకుండా ఉందంతే!
అలవాటు మాన్చుకోలేక అప్పుడప్పుడు అనామకంగా తిరుగుతోంది. గుర్తించే మనసుండాలి!!!
కష్టకాలం!!!
ReplyDeleteబోనగిరి సారూ!
Deleteకలికాలం కష్టకాలంట కదు సారూ!!
ఈ కాలపు పిల్లలకు తెలియని రాగి ఉడా యాంటెనా. కసిగ్రేనియన్ ఫీడ్ రేడియో యాంటెనా.. ఐనా ఈ తరం వారికి యఫమ్ రేడియో మాత్రమే అడపా దడపా తెలుసును "రెడ్ 93.5, రేడియో సిటి 91.1, మిర్చి 98.3, Big FM 92.7" కానీ.. ఎయిమ్ రేడియోలు తెలియనే తెలియవు. "ఆకాశం వాణి **** కేంద్రం, నిలయం లో సమయం రెండు గంటలు దాటి ఏడు నిమిషాలు. ఇంతటితో తొంభై ముడు మీటర్లపై సాగిన ప్రసారం సమాప్తం. మరి కొద్ది నిమిషాల లో కర్ణాటిక సంగీతం జారీ హెదరాబాదూ కేంద్రం నుండి రిలే.. ఉదయం ప్రసారంలో సూక్తి ముక్తావళి ప్రసారం. సెలవ్.. టిరిటీ టిరుడు.. టిరిడిటిన్ టిరి టిరి.. టిరిటీ..! కాదా శర్మాచార్య
ReplyDeleteశ్రీధరా!
Deleteఅన్నీ పాతకాలపు గుర్తులే! అది యాగి ఏంటెన్నా! చిన్నపుడు చదువుకున్న ఏంటెన్నాల గురించి, మరచాను సుమా!
యాగి ఉడా*
ReplyDelete