ఎవరు చేసిన కర్మ వారనుభవింపక
ఎవరు చేసిన కర్మ వారనుభవింపక
ఏరికైనా తప్ప దన్నా
ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు
అనుభవింపక తప్పదన్నా!
చేసిన కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
ఉత్కృష్టమైన పుణ్య,పాపకర్మల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి.చేసినది వ్యక్తిగాని, సమాజంకాని దేశం కాని ఫలితాలు తప్పవు, అనుభవించాలిసిందే! అందుకే నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తామంటారు.
ధర్మో రక్షతి రక్షితః
అంతే సర్. ఋషి మాండవ్యుడికి కొఱ్ఱు శిక్ష వెయ్యలా రాజు గారు దొంగతనం నెపం మీద? తరువాత ఆ ఋుషి గారు యమధర్మరాజుని ఆ శిక్ష గురించి ప్రశ్నించగా నువ్వు చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటి రెక్కలకు గడ్డి పోచలతో గుచ్చి ఆనందం పొందావు గదా, దానికే ఈ శిక్ష అని యమధర్మరాజు గారి సమాధానం. దానికీ దీనికీ సరిపోయిందని వారి భావం.
ReplyDeleteకాబట్టి ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదు (ఈ జన్మలోనే), అంతే సర్.
విన్నకోటవారు,
Deleteభారతంలో మంచి కత గుర్తుచేశారు.మాండవ్యుడిని అణి మాండవ్యుడని అంటారు. అణి అనగా శూలపు ములుకు. ఆయనని రాజు శూలంతో కొరతవేయించగా, ఆ తరవాత తప్పు తెలుసుకున్నా, శూలం ములుకు బయటకు తీయలేకపోవడంతో, దానితోనే జీవిత కాలం గడిపేరాయన. అందుకు అణి మాండవ్యుడని పేరు.