Wednesday 29 December 2021

చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!!

 చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!! 


పగలు వేడి  ౩౦డి లోపుంటోంది.ఉదయం 17,18డి, మధ్యాహ్నం 30డి లోపు, నాలుక్కే వేడి 24.21డిలకి తగ్గిపోతోంది.పగలు కూడా ఇంట్లో చలేస్తోంది.చలికి ముణగదీసుకు కూచోడం సరిపోతోంది, చేసే పనిలేదు,చేయగలదీ దేదన్నట్టు ఉంది,దీనికి తోడు బద్ధకం, ఏ పనీ చేయ బుద్ధి కావటం లేదు.పగలు కూడా ఏ.సి వేసుకోవల్సి వస్తూంది. మధ్యాహ్నం భోజనం తరవాత కప్పుకు పడుకుంటే కునుకట్టింది. 


పగటి నిద్రలో మా గీరీశం కనపడ్డాడు.చాలా చెప్పేడు, చెప్పాలంటే బద్దహం గా ఉంది.సంవత్సరం చివరి రోజులకొచ్చాం, బుజ్జమ్మ కనపడిందా?


8 comments:

  1. కనపడే వుంటుంది.కానీ, ఈసారి పూటకూళ్ళమ్మి పూని చీపురు తిరగేసి రెండు అంటించి ఉంటుంది!

    ReplyDelete
    Replies
    1. హరిబాబుగారు,
      వాహ్! క్యా సీన్ హై.

      Delete
  2. చలిగా ఉంది అంటున్నారు, పగలు 30 లోపే నంటున్నారు, అయినా  పగలు కూడా ఎ.సి. వేసుకోవల్సి వస్తోంది అనీ అంటున్నారు. ఎందుకలాగ? 

    “జిలేబి” గారి భోగట్టా తెలియకపోవడం ఆందోళనకరంగానే ఉంది, శర్మ గారు. తన యోగక్షేమాలు చెబితే వారే చెప్పాలి - తన వివరాలు మరీ అంత గుట్టుగా కాపాడుకున్నారు కదా. 

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      ఇది బద్ధహం వదిలించుకోడానికి ప్రయత్నం సుమా!

      మనం 16 నుంచి 18N రేఖాంశాల మధ్య ఉంటాం. సాధారణంగా సమశీతలంగా ఉంటుంది. కానీ ఒక్క రెండు నెలలు మార్గశీర్షం,పుష్యమాసాలని హిమవంత రుతువుగా చెప్పుకుంటాం.మార్గశిరమాసం చలి మంటల్లో పడినా తగ్గదని,పుష్య మాసం చలి పులిలా మీద పడుతుందని నానుడుల్లోకి కూడా చేరిపోయింది. 13డి వేడికి తగ్గితే మనకు భరించారాని చలి, హీటర్లు పెట్టుకునే అలవాటు లేదు, ఫైర్ ప్లేసులు కట్టుకోడం అసలే లేదు. .మనకి వేసవిలోనే ఎ.సి వేసుకునే అలవాటు, చల్లదనం కోసం తపించడం మన అలవాటు.
      చలిగాలి బాగా వేస్తోంది. పగలు 27 డి వేడి ఏ కొద్దిగంటలో ఉంటోంది.చెక్క తలుపులు చల్లబడిపోతున్నాయి.అందుకు ఏ.సి వేసుకుని దానిని 27డి లకి సెట్ చేసుకుంటే గది సౌకర్యంగా ఉంది.ఇలా పనిచేసే ఏ.సి. 4,5 గంటలకి ఒక యూనిట్ కరంట్ తీసుకుంటుంది. అందుకు పగలు రాత్రి కూడా ఏ.సి తిరుగుతూనే ఉంది.

      బుజ్జమ్మ తప్పిపోయి ఎనిమిది నెలలై ఉండ్లా!ఏంటో ఎవరూ తలుచుకోరే!

      Delete
    2. జిలేబీ బుజ్దమ్మ గోరు తప్పిపోయా‌రా తప్పించుకొని పోయారా అని చిన్న అనుమానం అండీ.

      Delete
    3. శ్యామలీయంవారు,
      తప్పిపోయినట్టనుకున్నా! తప్పించుకుపోయినట్టా?

      Delete
  3. ఏంటో కాలం గిర్రున తిరగాడుతునట్లుగానే ఉంది సుమి. ఏడేళ్ళ క్రితం "ఇంటి" వాడినయ్యా (ఇల్లు).. మూడేళ్ళ క్రితం ఇంటివాడినయ్య (భార్య).. రెండేళ్ళ క్రితం తొలిసారి నాన్న నయ్య (చూచూలు).. ఈ యేడు (మరి కాసేపట్లో గతేడాదిగా చరిత్ర పూటల్లో) మరో మారు నాన్న నయ్య (హర్ష).. ఇలా సంతోషాలను పెనవేసుకుంటూనే.. ఇదే డిసెంబర్ లో రెండేళ్ళ క్రితం నుండి చాప కింద నీరులా ఈ కోవిడ్ విజృంభణ తో లోకమెల్ల అల్లకల్లోలమై ఆల్ఫా మొదలుకుని ఓమిక్రాన్ దాక మారూతూనే ఉంది.. మరి ఎలా ఉండబోతోందో ౨౦౨౨..
    నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భరితం. నూతన ఆంగ్ల వత్సరాది షుబ్బాకాంక్చెల్ శర్మాచార్య.

    ReplyDelete
    Replies

    1. శ్రీధరా!
      శుభం భూయాత్.నూతన సంవత్సర శుభకామనలు.
      ----------------------------------
      ఈ కింద చెప్పినది అసందర్భం కాదనుకుంటా!

      మీ వయసులో కాలం తెలియకనే పరుగెట్టాలి, అది సహజం కూడా.
      2019 లో ప్రపంచం మీద పడ్డ చైనావైరస్ మానవాళిని వణికించింది.2020
      ల్లో అది వికృతరూపంతో మానవాళిని బలికొంది, నిన్నటి దాకా. 2021 వస్తూనే వాక్శిన్ వచ్చింది, మొదటి ప్లవ(తెప్ప) దొరికింది. ఆ తరవాత 2021 వెళుతూ ఒమిక్రాన్ ని ఇచ్చింది. ఇది సోకనివారు ఉండరు. సోకినట్టే తెలీదు కొందరికి, సోకినట్టు తెలిసినా రెండు రోజుల్లో బాగుంటారు, హాస్పిటల్ కి వెళ్ళక్కర లేదు. ఒకవేళ వెళ్ళవలసినా ప్రమాదం లేనట్టే, అదే కాక ఇది సోకితే ఏంటీబాడిలు విరివిగా తయారవుతున్నాయనీ, టి సెల్ల్స్ తయారవుతున్నాయనీ ఇది మానవాళికి భవంతుడు/ప్రకృతి ప్రసాదించిన వరమనీ పెద్దల మాట. 2021 వెళుతూ మానవాళికిచ్చిన గొప్ప బహుమతి.వస్తున్న 2022 మరిన్ని శుభాలను తెస్తుందని నమ్మిక. రాబోయేది శుభకృతు నామ సంవత్సరం. శుభాలను చేకూర్చుతుంది. జాగర్తలూ తీసుకోవడం అవసరం,సోకకుండా.సోకినా ధైర్యంగా ఎదుర్కోవడం కావలసినది. వేయి శుభములు కలుగు నీకు పోయిరావే 2021 అని పాడుకుంటూ 2022 కొత్త సంవత్సరానికి స్వాగతం.
      ---------------------------------
      2022 శుభాలను కలగ జేయాలని కోరుతూ చిరంజీవ........

      Delete