సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.
సిరి వెన్నెల మరి లేదు, కనుమరుగయింది, కాని సిరివెన్నెల కలం బాలు గొంతులో చిరంజీవిగా ఉండిపోయింది.మిత్రుడు చేంబోలు సీతారామ శాస్త్రి అనే సిరివెన్నెల బహుముఖ ప్రజ్ఞా శాలి, అతని పాటలలోనే కొన్ని మచ్చుకి.
మేటనీ పిక్చరుంది బోటనీ లెక్చరుంది దేనికో ఓటు చెప్పరా?
అనగల చిలిపి చెలికాడు.
ఐయాం సారీ అన్నాగా వందో సారి
అని ప్రేయసి చేత అనిపించి, ఏం వంద సార్లు చెప్పాలా అని సన్నగా ప్రియుణ్ణి సాధింప జేయగల కొంటెవాడు.
మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమైపోనీ
నిగ్గదీసి అడుగు, నిప్పులతో కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం, మారదు కాలం
అంటూ, సమాజాన్ని మార్చేసాం,అని, నిప్పులతో కడిగి నిగ్గదీసిన వారెందరు చరిత్రలో లేరు? ఐనా సమాజం మారిందా? లేదు మారదు అని నొక్కి వక్కాణించి చెప్పిన మేధావి. సమాజం మారదు ఎవరు ఏమైపోయినా కాలం మారదు, మారుతుందనే భ్రమలో బతక్కు, నిజాన్ని చూడు అని చెప్పిన విప్లవవాది.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.
సత్యం.ఈ మానవ సమాజం అంతా ఒక కుటుంబం కాని ఎవరి బతుకు వారిదే, ఎవరిచావు వారిదే అనే నిష్టుర సత్యాన్ని సినీ పాట ద్వారా సామాన్యులకి చేర్చగల తాత్వికుడు.
బిచ్చమడిగేవాని నేమి అడిగేది, బూది నిచ్చేవానినేమి కోరేది?
నిందాస్తుతితో శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకునే మార్గాన్ని బోధించినవాడు. కోరికలతో వేగిపోకు, కర్మఫలం అనుభవింపక తప్పదు, ఈ ఉపాధిలో కొత్తగా కర్మఫలాన్ని పొగేసుకోకు, బూది అంటే వైభమనే మాట చెప్పి తనలో కలుపుకునే వైభవాన్ని ఇచ్చేవాడిని ఇంకా ఏమడుగుతావన్న వేదాంతి.వేదాంతాన్ని చినచిన్న మాటలలో సినీ గేయంలో ప్రజలకి చేరువజేయగల నేర్పరైన మిత్రుడు నిజంగానే బోళా శంకరుడు.కుడుము చేతికిస్తే పండుగనుకునేవాడు.
నిజమే నిజంగానే భోళా శంకరుడు కనుకనే ఏకాదశి మరణం ద్వారా నిరూపితమయింది. ఏకాశి మరణం ద్వాదశి దహనం అన్నవి పుణ్య ఫలశేషాలని పెద్దల మాట.మరో మాట కూడా చెబుతుంది లోకం, ఎమీ తెలియనివానికి ఏకాశి మరణం, అన్నీ తెలిసినవానికి ఆమావాస్య మరణం, అని.మిత్రుడు ఏకాదశి రోజు ఇహలోక యాత్ర ముగించి పరలోకానికి చేరిన వాడు వైకుంఠ ప్రాప్తి చెందినట్టుగానే భావిస్తాను.
ఎంతచెప్పినా మిత్రుడు లేనిలోటు తీర్చరానిదే. మిత్రుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్మృత్యంజలి ఘటిస్తున్నాను.
---------------------------------
మిత్రుని గురించి ఎంత చెప్పినా కొంత మిగిలుంటుంది.మిత్రుని మరణ వార్తను నాకుటుంబ సభ్యులు చేరవేశారు నాకు, ఆ తరవాత మిత్రులు విన్నకోటవారు తెలియజేశారు.కొంతకాలంగా కంటికి విశ్రాంతినివ్వడం కోసం అన్ని మీడియాలనుంచీదూరంగా ఉన్నాను. ఫోను కంప్యూటర్లు వాడటం లేదు, చదవను కూడా మానేశాను. సృత్యంజలి సమర్పించడం ఆలస్యమయింది.
అజరామరమైన పాటల రచయిత, మహానుభావుడు 🙏 .
ReplyDeleteమీ మిత్రుడిని పోగొట్టుకున్నందుకు మీకు నా సానుభూతి. మీకన్నా వయసులో చిన్నవారైనా కూడా ఆ ప్రతిభాశాలి సాంగత్యం దొరికినందుకు మీరు అదృష్టవంతులు.
విన్నకోటవారు,
Deleteనిజమే!’పొగ’ పొట్టనబెట్టుకుని బలి తీసుకుంది.అకాల మరణం హృదయ విదారకం!
ఈ కింది పద్యం వాట్సాప్ లో తిరుగుతోంది
మేఘమాలలతోడ మేలమాడగ రమ్ము
యన కృష్ణ శాస్త్రిగా రడిగిరేమొ?
మా’నవ’లోకాన మనలేము మనమని
ఆత్రేయ ఆహ్వానమంపెనేమొ?
సమవర్తిపై పోరు సలుపగా రమ్మని
శ్రీశ్రీ రహస్యమ్ము చెప్పెనేమొ?
పంచెకట్టుకొన నేర్పించెద రమ్మని
సినారె చెవిలోన చెప్పెనేమొ?
సురభామ సొగసులు చూబింతు రమ్మని
వేవేగ వేటూరి పిలిచెనేమొ?
’పాడుతా తీయగా’ పాట రాయగరార
యని’బాలు’డె కబురంపెనేమొ?
ఏమి పని మీద దివిసీమ కేగినావొ?
అడిగినాగాని ఇపుడేమి నుడువలేవు!
వెడలిపోయెను మన ’సిరివెన్నెల’ంచు
చిన్నబోయెను గద! చిత్ర సీమ!
తరలిపోయె సినీ వసంతం...
ReplyDeleteమనకి కానరాని లోకాల వైపు..
ఆయన మీ మిత్రులు అయితే, మేము మీకు మిత్రులు అవడం మా అదృష్టం.
బోనగిరిగారు,
Deleteమీరన్న మాట మీ సహృదయతకి నిదర్శనం, మీ విశాల భావానికి వందనం.
ఈ కింది పద్యం వాట్సాప్ లో తిరుగుతోంది
మేఘమాలలతోడ మేలమాడగ రమ్ము
యన కృష్ణ శాస్త్రిగా రడిగిరేమొ?
మా’నవ’లోకాన మనలేము మనమని
ఆత్రేయ ఆహ్వానమంపెనేమొ?
సమవర్తిపై పోరు సలుపగా రమ్మని
శ్రీశ్రీ రహస్యమ్ము చెప్పెనేమొ?
పంచెకట్టుకొన నేర్పించెద రమ్మని
సినారె చెవిలోన చెప్పెనేమొ?
సురభామ సొగసులు చూబింతు రమ్మని
వేవేగ వేటూరి పిలిచెనేమొ?
’పాడుతా తీయగా’ పాట రాయగరార
యని’బాలు’డె కబురంపెనేమొ?
ఏమి పని మీద దివిసీమ కేగినావొ?
అడిగినాగాని ఇపుడేమి నుడువలేవు!
వెడలిపోయెను మన ’సిరివెన్నెల’ంచు
చిన్నబోయెను గద! చిత్ర సీమ!
చక్కటి స్మ్రుత్యాంజలి.
ReplyDeleteలక్కరాజు వారు,
Deleteమనసు మూగబోయిందండి. ఇవన్నీ మిత్రుని మాటలే సుమా!
ధన్యవాదాలు.
కీ. శే. చెంబోలు సీత రామ శాస్త్రీ గారు ఒహప్పుడు అనకాపల్లి లో టెలికాం ఆపరేటర్ గా ప్రస్థానం గావించారు. ఆపై సిని గేయాలతో ప్రతి తరం వారిని ఆలోచింపజేశారు, ఉర్రూతలూగించారు, ధైర్యాన్ని నూరి పోశారు, చింతన వైపు అడుగులు వేయించారు, భావి భారతానికి నాంది పలికారు. ఆతని గేయాలన్ని కీ. శే. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం గారి గళంలో ఆలపిస్తే లాలిజో ఊరుకో పాపాయి అంటూ ఆలకించాము. ఆ కలం ఆ గళం ఈ యుగ్మం మరల రాని వసంతం.
ReplyDeleteమీ భావుక స్మృత్యాంజలి బాగుంది, శర్మాచార్య.. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.
శ్రీధరా!
Deleteడాక్టర్ కాబోయి కవి ఐనవాడు.ముందు ఆపరేటర్ ఆ తరవాత గుమాస్తాగా మారేడు.డాక్టర్ కాలేకపోవడానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం. ఆ రోజుల్లో గుమస్తా పని మేలు, ఇద్దరికి ఒకటే జీతమైనా!కారణం రాత్రి పగలు ఉద్యోగం కాదు, మరో వ్యాపకం చేసుకోవచ్చు.ఆపరేటర్ రాత్రి పగలు ఉద్యోగం, మరో వ్యాపకం కుదరదు. ఎప్పుడు ఉంటుందో డ్యూటీ చెప్పలేము.కోడలి కొడుకే అత్త కొడుకు కాదు.ధైర్యం నూరిపొయడం ఉగ్గు పాలతో వచ్చిన విద్య. ౮౦ ల్లో ఇద్దరం విడిపోయాం, అతను చినిమా జైత్ర యాత్ర మొదలెడితే నేను పదోన్నతి ట్రైనింగ్ యాత్ర మొదలెట్టేను.ఆ తరవాత కలిసింది బహు తక్కువ కాలం.ఏమైనా అది తిరిగిరాని వసంతం.తెనుగు వారి జ్ఞాపకాలలో చిరంజీవి.
బాగా వ్రాశారు శర్మ గారు. 🙏
ReplyDeleteసంగీత సాహిత్య సమలంకృతే గీతం రచయిత సినారె గారు.
బుచికి గారు,
Deleteనాకూ సినిమాకి సగమెరిక!
నా సినిమా పరిచయం 50 ఏళ్ళ కితం ఆగిపోయింది.
ఈ పాట కూడా మిత్రునిదే అనుకున్నా! పొరబడ్డాను మన్నించండి. ఈ పేరా తొలగిస్తున్నాను.
ఈ కింది పద్యం వాట్సాప్ లో తిరుగుతోంది
మేఘమాలలతోడ మేలమాడగ రమ్ము
యన కృష్ణ శాస్త్రిగా రడిగిరేమొ?
మా’నవ’లోకాన మనలేము మనమని
ఆత్రేయ ఆహ్వానమంపెనేమొ?
సమవర్తిపై పోరు సలుపగా రమ్మని
శ్రీశ్రీ రహస్యమ్ము చెప్పెనేమొ?
పంచెకట్టుకొన నేర్పించెద రమ్మని
సినారె చెవిలోన చెప్పెనేమొ?
సురభామ సొగసులు చూబింతు రమ్మని
వేవేగ వేటూరి పిలిచెనేమొ?
’పాడుతా తీయగా’ పాట రాయగరార
యని’బాలు’డె కబురంపెనేమొ?
ఏమి పని మీద దివిసీమ కేగినావొ?
అడిగినాగాని ఇపుడేమి నుడువలేవు!
వెడలిపోయెను మన ’సిరివెన్నెల’ంచు
చిన్నబోయెను గద! చిత్ర సీమ!