Saturday 16 January 2021

మా ఊళ్ళో సంక్రాంతి సంబరం

 


మా ఊరు గ్రామదేవత వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర.


పోరుకు తయారైన బరి



గంగలకుఱ్ఱు గ్రామంలో భారీ భోగి పిడకలదండ.

ప్రభల తీర్థం (విడియో పాతదే)


మరువని సంప్రదాయం

All videos courtesy:Whats app. 

పండగ గురించి తెలియని వారుండరు, మూడు ముక్కలతో ముగించేస్తా. . భోగి రోజు నలుగురితో పంచుకుని తినడం అనేదే భోగం, అదే ఆనందం. రెండవరోజు పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దల పేరు చెప్పి తిలతర్పణం, దానం. మూడవరోజు కనుమ పశువులపండగ.నాలగవరోజు బొమ్మల కొలువు, బొమ్మల నోము ప్రధానం అదే సావిత్రి గౌరి దేవి నోము,''ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం'' ఇందులోదే

 ఇప్పుడు పట్టేవారు లేరు, పదమూడు సంవత్సరాల నోము. మరచిపోయిన ఒక ఆచారం.

శలవు.

13 comments:

  1. సర్వే జనాః సుఖినో భవంతు

    ReplyDelete
  2. ఇవాళ (జనవరి 22) వ్యావహారికభాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి వర్ధంతి. ఈ నాడు మనం వాడుకభాషలో వ్రాస్తున్నాం అంటేనూ, పాఠ్యపుస్తకాల్లో కూడా వాడుకభాషే ఉపయోగిస్తున్నారంటేనూ దానికి ప్రధాన కారణం గిడుగు వారి ఉద్యమమే. మహానుభావుడు, చిరస్మరణీయుడు 🙏.

    గడుగు వెంకట రామమూర్తి పంతులు గారు

    ReplyDelete
    Replies
    1. VNR Sir,
      Unable to reply in Telugu. Please pardon me.
      Gidugu is person born for purpose. The

      Delete
    2. ఫరవాలేదు, శర్మ గారు.
      అవునండీ, గిడుగు లాంటి వారు కారణజన్ములు. మహానుభావులు 🙏.

      Delete
  3. ఊరూరు పరం జ్యోతీ !
    కోరిన కోరికలు తీర్చ కొలువగు తల్లీ !
    వీరుళ్ళమ్మా ! జోతలు ,
    ఆరయ పోలేరు తల్లి వమ్మా మాకున్ .

    ReplyDelete
  4. RAJA JEE
    Call her with any name, she will appear. SREE MATRENAMAH.
    Unable to type in Telugu. Sorry sir.

    ReplyDelete


  5. టెల్గూ వారై వుండి టెల్గూ లో రిప్లై చేయక ఎంగిలిపీస్ లో వ్రైటింగ్ ఏమిటండీ? దిజ్ ఈజ్ నాట్ ఏక్సప్టబుల్లు :)




    జిలేబి

    ReplyDelete
  6. ఆరోగ్యం బాగుందా ?
    సారూ! సారీలువద్దు, సరితూగను నే ,
    నారయ పెద్దలు తమ , ర
    వ్వారు జిలేబి నరసింహ వరులకు నమముల్ 🙏 .

    ReplyDelete
  7. ఒక లింపింగేమిటి , కద
    లిక లన్నియు తరిగె , రుజలు లేని జరా ? చా
    లిక , జీవనసంధ్యామా
    లిక , యెపుడా 'యమ్మయొడి' లభించునొ యనఘా !

    ReplyDelete
    Replies


    1. అమ్మ ఒడిలేని దెప్పుడు ?
      నమ్మక మేముఖ్యమౌ సునాయాసముగా
      నెమ్మది నొందగ రాజా
      వమ్మావిడ చేయదెపుడు భక్తుల గాచున్


      జిలేబి

      Delete
  8. గుండెల నిండా అమ్మే ,
    దండిగ కొలువుండె , నైన , తనయొడి చేరే
    పండుగ ఆనందంబిక ,
    దండుగ ఈ ముదిమి జీవితమ్ము మహాత్మా !

    ReplyDelete