Thursday 13 August 2020

పెళ్ళిపాట.

 పెళ్ళిపాట.
============

ఏ దేశాన్నించొచ్చేరయ్యా మా దేశానికి

మేడలు మిద్దెలు కలవారనీ మీవారు చెబితిరి
ఇంత అద్దె ఇళ్ళల్లో వున్నారని ఎరక్కపోతిమి  IIఏ దేశాన్నించిII

ఇశాపట్నం కలకటేరని పిల్లనిస్తిమి
ఇంత కన్నం వేసేవాడని ఎరక్కపోతిమి.             IIఏ దేశాన్నించిII

చెన్నపట్నం జమీన్దార్లని పిల్లనిస్తిమి
ఇంత చెప్పులు మోసేవాళ్ళని ఎరక్కపోతిమి         IIఏ దేశాన్నించిII     

కంటెలు కాసులు పెడతారని మీవారు చెప్పిరి
ఇంత,ఇంత, ఒక్క పుస్తెముక్క కడతాడని ఎరక్కపోతిమి    IIఏ దేశాన్నించిII       
జానపదం

26 comments:



  1. తాతగారీ నడుమ వరసబెట్టి పెళ్లి గలాటాలలో పడినారు-

    ఏమన్నా విశేషమా :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలెబి,
      ఆరు నెలలనుంచి తిని కూచుంటే, వ్యాయామం కూడా లేక బి.పి, సుగర్ డబల్ అదే విశేషం. డాకటర్ల ప్రదక్షిణ విశేషం :)

      Delete
  2. ఆమా.. ఆమా.. విశేషం ఎల్లారుకు.. అవనకు తెరియాద్.. ఈవనకు తెరియాద్.. అదేల్లామే కళ్యాణం జానపద పాటు దా.. మట్రుమ్.. ఇసుకపటం, అన్కాబెల్లం, రాజమందొర, బెంజ్వాడ, ఓరుగల్, సెకండ్రాబాదు సిరిపి కడల్ నన్డ్రి..! బిజిలే అమ్మణ్..!

    ReplyDelete
    Replies
    1. (విశాఖపట్నం లో సంద్రపు ఇసుక స్పెషల్, అనకాపల్లి లో బెల్లం స్పెషల్, రాజమహేంద్రవరం కాటన్ దొర హెవ్లాక్ స్పెషల్, విజయవాడ లో బెంజ్ సర్కిల్ స్పెషల్, వరంగల్ ఆలయాల్లో రాతి శిల్పాలు స్పెషల్, హైదరాబాద్-సికిందరాబాద్ లలో జంట నగరాలుగా పురాతనమైన హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ స్పెషల్)

      Delete
    2. శ్రీధర్ జీ,

      గోజీలు పూతరేకులు, పులసలు,బొంగులో చికెన్ స్పెషల్ చెప్పబోతే శానా ఉన్నాయి. :)
      గుంటూరు గోంగూర, కొరివి కారం స్పెషల్, హైదరాబాద్ దమ్ చాయ్,బిరియాని స్పెషల్

      Delete
    3. శర్మ సర్.. నేను ఊరి పేరు ఆ ఊరి విశిష్టత తెలియ వచ్చేలా వాటినలా వ్రాశాను.. పోర్ట్ మాంటేయు లా.. జిహ్వాకో రుచి పుఱ్ఱెకో బుద్ధి అంటారు కదా.. ఏదేమైనా.. హైదరాబాది దమ్ బిరియాని,సంధ్య థియేటర్ కూడలిలో బావర్చి లో మెహ్ఫిల్ లో చికెన్ బిరియాని, బీచ్ రోడ్ పాండురంగపురం లో తందూరివాలా లో పనీర్ బిరియాని, సామలకోట-రాజమహేంద్రవరం బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకులు, మామిడి తాండ్రి, చార్మినార్ దరి ఇరాని ఛాయి, గుంటూరు ఘాటు మిరప బజ్జి.. హ్మ్.. పెళ్ళి పాట టపాలో విందు భోజన ప్రస్తావన.. :)

      ~శ్రీత ధరణి అనబడే శ్రీధర్ భూక్యా

      Delete

    4. చీ చీ చీ నాన్‌వెజ్జు నో నో నో :)

      Delete
    5. బామ్మా!
      అందరూ తినకపోవచ్చు.
      ఎక్కడో ఆస్ట్రేలియా దగ్గరనుంచి బయలుదేరి మా దగ్గరకొచ్చి న విలస, తీపి నీరు తాగి పులస అవుతుంది. పుస్తెలు తాకట్టు పెట్టైనా పులస తినాలని నానుడి. అసలైన పులస ఒక్కొక్కటి వేల ఖరీదు. పులస వండడం అందరికి చేతనైన పని కాదు. వండి కుమ్ముటామదం పోసి నిలవ ఉంచి రెండు రోజులు, మగ్గిన తరవాత నేమాను పంపడం గోజిల ప్రత్యేకత,స్పెషల్. అదే చాలా గొప్ప.

      Delete


    6. పులసా :). యాక్

      ఒకే మత్స్యగంధి వాసన


      :)


      జిలేబి

      Delete
    7. పులస వండు పద్ధతి / నిలవ చేయు విధానం మీకెలా తెలుసు, శర్మ గారో ?

      Delete
    8. విన్నకోటవారు,
      అదో కతండి :)
      ఒక రాజకీయ మిత్రుడు. పులస వండించి ఎవరికో పంపడానికి పూనుకున్నాడు. ఆ సందర్భంగా ఒక వంట మనిషిని పిలిపించి ఒక బంగ్లా ఏర్పాటు చేసి పులస వండించాడు. ఆ సందర్భంగా కొంచం సూపర్వైజ్ చేయాల్సి వచ్చింది. చేపల కూరకి ఇంత హడావుడా అనుకున్నా. వంట మనిషిని ఇంటర్వ్యూ చేస్తే చాలా చెప్పుకొచ్చింది. ఆమదం పోస్తారంటే ఆశ్చర్యపోయా. ఇంకా చెప్పింది ఆ ఆముదం కూడా కుమ్ముటామదం అని. జీవితానుభవాలు :)తినకపోయినా తెలుసుకోడం తప్పు కాదు కదండీ :)

      Delete
    9. ఎంత మాత్రమూ తప్పు కాదు 🙂. కానీ ఆ పని మెళుకువల అనుభవం లేకుండా ఎదుటి వారి పనిని సూపర్వైజ్ ఎలా చేస్తారండీ సారూ? ఎదుటి వాళ్ళు మనల్ని ఆడించెయ్యరూ? ఆఁ, ఉత్త కఱ్ర పెత్తనమైతే అది వేరే సంగతి లెండి 🙂.

      Delete


    10. తాతగారా మజాకాయా "పెత్తనముతో "బీయెస్సెన్నెల్ నే గడగడ లాగించగాలేనిది పులస వండే వారో లెక్కా :)



      జిలేబి

      Delete
    11. విన్నకోటవారు,
      జిలేబి,

      కర్రపెత్తనమే లెండి :)

      Delete
  3. శ్రీ జిలేబిసారు ఛీఛిఛీ యనిరంటె
    రుచికిపడిరనేగ! రోజురోజు
    పులస దొరుకునేమి ? జలపుష్పములటన్న
    వెజ్జెగాని, నానువెజ్జుగాదు.

    ReplyDelete
    Replies
    1. రాజావారు,

      జిలేబికి అన్నీ ఇష్టమే అనుకుంటా :)

      Delete


    2. అన్నీ యిష్టంబేమో
      పన్నీరును చల్లి భళి లబక్కున ఓ రా
      జన్నా మ్రింగు జిలేబీ
      మిన్నగ గలదంచు స్వీటుమీటనుచు సుమీ :)

      Delete
    3. ఛీ, పాడు జిలేబు లసలు ,
      చేపల్లో ' కొఱ్ఱమీను ' చేపిష్టంబౌ ,
      మాపక్క పులస దొరకదు,
      వేపుళ్ళకు చందవ కడు ప్రియమగు హితుడా !


      Delete
    4. రాజావారు,
      మావాళ్ళూ కొఱ్ఱమీను,చందువా ఇష్టంగానే తింటారుగాని పులస స్పెషల్ కదా! పుస్తెలు తాకట్టు పెట్టైనా పులస తినాలంటారు మావాళ్ళు :) సంవత్సరానికి ఒకసారే దొరుకుతుంది. అదికూడా మాకే, మరెవరికి దొరకదు.

      Delete
    5. పులస కంటే పొట్టేలు రుచిగా ఉంటుందేమో ట్రై చెయ్యకూడదూ? వెల్లుల్లి వేసి ఒక వెర్షనూ వేయకుండా ఒక వెర్షనూ అయితే డబుల్ టేస్ట్!!☺️

      Delete
    6. వియ్యాల వారు ఇలాంటి పాటలు పాడుకుంటే వియ్యం కాస్తా కయ్యం అవుతుందీరోజుల్లో!☺️

      Delete
    7. సూర్య గారు,

      పాత కాలంవి కదండీ :) ఇప్పుడు కయ్యాలేగా ఉన్నవీ :)

      వెల్లుల్లి/నాన్ వెల్లుల్లి వెర్షన్ పొట్టేలు తలకాయి బాగుంటుందంటారండి :)

      Delete
    8. et tu, Sarma garu? మీరు కూడానా 😳😒😱 ?
      అసలు బ్లాగుల్లో ఆదివారం నాడు మాత్రమే మాంసం దుకాణం, చేపల బజారు తెరవడానికి అనుమతి అని రూల్ పెట్టాలి .... ఎక్కడా, భరద్వాజుడెక్కడా ?

      Delete
    9. బ్లాగరుల తలలు పాఠక
      వాగరుల మెదళ్ళు తినుచు పచరించు మహా
      భాగులకొకలెక్కగునా
      తాగరుల తలలు తినంగ దడయురు రేలో ?

      Delete
    10. జిలేబి మెత్తళ్ళ దుఖానం
      ఆధిభారము మాత్రమే తెర్వా బడు
      థెనుగు వారికి హమ్మ భడునా

      Delete
  4. రాజావారు,
    లెస్సబలికితిరే

    ReplyDelete