Sunday, 19 July 2020

కంకణ గ్రామం


24 comments:

  1. కడియం గ్రామానికి “కంకణ గ్రామం” అని బలే పేరు పెట్టారే,

    ReplyDelete
    Replies
    1. అవునండీ శర్మ గారు బలే పేరు పెట్టారు. కడియంగ్రామం అనటంలో ఒక చిక్కుంది. కడియం తెలుగు మాటా, గ్రామం అనేది తెలుగు మాటా కావటం వలన కడియంగ్రామం అన్నది దుష్టసమాసం అవుతుంది. కాబట్టి కడియాన్ని సంస్కృతీకరించవలసి వచ్చిందన్న మాటం.

      ఈ కంకణం‌ అనేది హస్తాభరణం. దీనికి పర్యాయపదం‌ కటకం. నిజానికి కటకం‌ అన్న సంస్కృతపదానికి వికృతియే‌ కడియం. కాబట్టి కంకణగ్రామం‌ అనటం‌ కన్నా కటకగ్రామం అన్నది కడియం అనే ఊరి పేరుకు సరియైన సంస్కృతీకరణ అని నా అభిప్రాయం.

      Delete
    2. కటకం అంటే లెన్స్ అని ఇంగ్లీషులో చెప్పారు?

      Delete
    3. చిరు గారు, కటకం అన్న సంస్కృతశబ్దానికి చాలా అర్ధాలే ఉన్నాయి. కుంభాకారకటకం, పుటాకారకటకం అని హైస్కూల్లో భౌతికశాస్త్రంలో చదువుకొని ఉంటారు. అక్కడ కటకం అంటే lens అన్న అర్థం. కటక్ (ధాన్యకటకం) అన్న ఊరిపేరులో కటకం‌ అంటే పట్టణం. ఇంకా ఈకటకాని హస్తాభరణం అన్న అర్ధం ఉంది. మరొక అర్ధం కొండచరియ. అటజని కాంచె భూమిసురుడు అంటూ మనుచరిత్రం కావ్యంలో ఒక పద్యం ఉంది అందులో చివర్న కటకచరత్కరేణుకరకంపితసాలము అన్న సమాసం వస్తుంది. అక్కడ కటకం అంటే కొండచరియ. ఇలా సందర్భం ప్రకారం ఏశబ్దం ఏఅర్ధంలో వాడినదీ తెలుసుకోవాలి.

      Delete
    4. విన్నకోటవారు, శ్యామలీయం వారు.

      కంకణ గ్రామమనే ప్రయోగం నాది కాదండీ :) చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ప్రయోగం అనుకుంటా. వారే కడియం గ్రామం అనే ప్రయోగమూ చేశారండి. వారిదీ ఊరే. మరో మాట ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ గారిదీ ఈ ఊరే! ఊళ్ళో హైస్కూల్ కి వేంకట శాస్త్రి గారి పేరు పెట్టేరు. చాలా కాలం తరవాత ఈ మధ్య బస్ స్టేషన్ కట్టి దానికి సుబ్బమ్మగారి పేరు పెట్టేరు. అది చూసి ఒక క్లిక్ చేశా. అదండి సంగతి. జిలేబమ్మకి దువ్వూరి సుబ్బమ్మ గారు నచ్చలేదేమో :)

      Delete


    5. పొద్దుటి ‌నుండీ చూస్తున్నా ఏదో కంగాళీ భాషలో కామింట్లు పోతున్నాయి నా కెందుకు లే అని నిమ్మళం గా వుంటే తాతగారు ఉబుసుపోక నన్నెందుకు "దువ్వు" చుండ్రి :)



      జిలేబి

      Delete
    6. జిలేబి బీబీ
      దువ్వూరి సుబ్బమ్మగారు తెలుసేమోనని.....ఆనాటి వీర ఫెమినిస్ట్. ఇల్లాలు సుబ్బమ్మగారికి ప్రియ శిష్యురాలు. మిమ్మల్ని ’దువ్వ’ డమా? నెవర్ :)

      Delete


    7. కడియం శ్రీహరి గారిని ఒపీనియన్ అడుగుదామంటారా ? :)



      జిలేబి

      Delete
    8. జిలేబి
      ఆయన ఇంటి పేరు మాత్రమే కడియం :)

      మీరు ఉత్తి భద్రయ్యలే వీరభద్రయ్యలాటివారు కాదనమాట :)

      Delete

    9. ఏముందీ పూర్వకాలంలో కడియం‌నుండి వెళ్లిన వారై వుంటారు జీనియస్సులందరూ గోదారి తీరం వాళ్లే కదుటండీ ఎంత తెలగాణం లో వున్నానూ. ఎట్లాగూ జై గారున్నారు వారికిన్నూ కాస్త పని బెట్టి నెట్టినట్టుంటుంది :)



      జిలేబి

      Delete
  2. అయితే శ్యామలరావు గారు, ఒడిషా రాష్ట్రం లోని “కటక్” ఊరి పేరు ఈ రకంగానే వచ్చుండచ్చేమో కదా??

    ReplyDelete
    Replies
    1. ఈ కటకం అనే సంస్కృతనామవాచక పదానికి ' రాజధాని ' అనే ప్రసిధ్ధార్థం ఉందండి .

      Delete
  3. Replies
    1. మిత్రులు రాజారావు గారు మన్నించాలి. కటకం అన్నది సంస్కృతశబ్దమే, గ్రామం అన్నదీ సంస్కృతశబ్దమే. కాబట్టి కటకగ్రామం అన్నది సిధ్ధసమాసమే నండీ. ముందటివ్యాఖ్యల్లో ఎక్కడా కటకం అన్నది తెలుగు అనలేదండీ. కటకగ్రామం అన్నది బాగుంటుందని ముందే వాక్రుచ్చాను కదండి.

      Delete
    2. సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబుత్రి విధంబు అందు సంస్కృతంబు సిద్ధంబనిసాధ్యంబని ద్వివిధంబు - కేవల సంస్కృతశబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు రాజాఙ్ఞ తటాకోదకము - లక్ష్మీవల్ల భుఁడు || సంస్కృత సమంబు సమాసంబు సాధ్యంబునాఁబడు - రాజునాజ్ఞ, తటాకంబునుదకము - లక్ష్మివల్లభుఁదు : తక్కిన తెనుఁగు సమాసం బాచ్చి కంబనంబడు || ఱేనియానతి - చెఱువునీరు - సిరి చెలువుఁడు||ఉభయంబులు గూడినది మిశ్రంబనంబడు - రాజుముదల - చెఱువునుదకము - సిరివల్లభుడు

      ..... ఏతావత్ కడియం తెలుగైనా , గ్రామం సంస్కృతమైనా మిశ్రసమాసంగా కలిసి కడియంగ్రామం ఔతుంది .దుష్టం కాదని మనవి
      ఇదీ , నేను చెప్పదలచుకున్నది .

      Delete
  4. Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      పలకడానికి సుళువుగా,వినడానికి సొంపుగా, కర్ణపేయంగా ఉన్నది ఎదైనా ఆమోదయోగ్యమే కదా :)

      Delete
    2. వ్యాకరణం కోసం ఊరి పేరు మార్చడం అవసరం కాదేమో. అంతగా ఇబ్బంది ఉంటే "కడియం పల్లె" అంటే సరిపోతుంది కదా.

      Delete
    3. Jai గారు,

      వ్యాకరణం కోసం ఊరిపేరు మార్చక్కరలేదండి. కాని కంకణ గ్రామ ప్రయోగం చెళ్ళపిళ్ళవారిదే అది గుర్తొచ్చిందంతే :) ఇలాగే మరో చోట దంతిరాణృపా అన్నారు, ఒక రాజుగారి పేరు గజపతిరాజు, దానిని అలా సంస్కృతంలో తర్జుమాచేశారు. కవయః నిరంకుశః అన్నారు కదండీ, అదీ సంగతి.

      Delete
    4. జై గారు, ఊరిపేరును సంస్కృతతీకరించటం ఏదైనా వృత్తఛ్ఛందస్సులోనో‌ దీర్ఘసంస్కృత సమాసంలోనో అవసరమైనప్పుడే సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. వచనంలో అవసరం కాదు.

      Delete
    5. మిత్రులు శర్మగారు,
      కంకణగ్రామం అని చెళ్ళపిళ్ళవారు అన్నారా?‌కావచ్చును. ఆ ప్రయోగం కూడదని నే ననలేదండీ. కటకగ్రామం అన్నది మరింతసొగసుగా ఉంటుందనే అభిప్రాయం చెప్పానన్నమాట. ఏరూపం వారు వాడినా బహుశః అక్కడి ఛందోసానుకూల్యతను బట్టి చేసి ఉంటా రనుకుంటున్నాను.

      Delete
    6. శ్యామలీయంవారు,
      వారు అవుసరం బట్టి అలా చేసి ఉంటారు. నాకు నచ్చిందండి. కటక గ్రామం అన్నది వినడానికి కొంచం కటువుగా ఉందేమో నని అనుమానమండి.

      Delete