Saturday 17 November 2018

శర్మ కాలక్షేపంకబుర్లు-eBooks

eBooks

నా బ్లాగులో టపాలను ఈ బుక్ చేయమన్నవారు,చేస్తామన్నవారు, అబ్బే ప్రింట్ పుస్తకాలే వేయమన్నవారు, ప్రింట్ పుస్తాకాలేస్తామన్నవారు, అలా ప్రింట్ పుస్తకమేస్తే నాకు ఇరవై కాపీలు కావాలన్నవారు, అబ్బో చిటికెల పందిళ్ళు చాలా వేసేశారు, చాలా మంది. ఎందుకు జరగలేదూ? విత్తం కొద్దీ వైభోగం.....నాకా ఓపిక లేకపోయింది.మాటలు కోటలు దాటేయి తప్పించి కాళ్ళు గడపలు దాట లేదు.
కాలం గడచింది, ఇప్పుడు నా బ్లాగు టపాలను ఈ బుక్స్ గా వెయ్యాలని నాకే అనిపించింది. మొదలు పెట్టాను. చాలా వేగంగానే పని అవుతున్నది. వారంలో ఐదు పుస్తకాలు తయారయ్యాయి. వీటిని ముందు మాట కోసం కొంతమంది మిత్రులకు పంపించాను. జిలేబి దగ్గరనుంచి ఒక జాబొచ్చింది," ముందు మాట రాయడానికి నాకు అర్హతలేదేమోగాని, మీ టపాల మీద అభిప్రాయం అంటూ ఒక లేఖ రాశారు. అదే ముందుమాటగా ప్రచురిస్తున్నాని చెప్పేను. మిగిలిన నలుగురునుంచీ జవాబు రావాలి. ఆ తరవాత ఐదు పుస్తకాలు ఒక సారి విడుదల చేస్తాను. 

బ్లాగులో చాలా టపాలున్నాయి,వీటిని ఇలా విడ దీస్తున్నాను.

1.కథలు,సామెతల కథలు,రామాయణ,భారత,భాగవతాలనుంచి నేటి కాలానికి అన్వయించేవి,న్యాయాలు....
2.గురువు, చదువు, సుభాషితాలు,స్నేహితులు,స్నేహం.....
3.పెళ్ళి,వంట,వార్పు,వడ్డింపులు,భోజనాలు.......
4.ఆత్మ,పరమాత్మ....
5. మామూలు టపాలు తో మిగిలిన పుస్తకాలు.
బ్లాగు మొత్తాన్ని చేస్తే పది పుస్తకాలు పైన అయేలా ఉన్నాయి. ఫోటోల తో ఈ బుక్ చేయడం కొంత కష్టమైనా అలాగే చేస్తున్నాను.
మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

3 comments:

  1. జిలేబీ తో ముందుమాట వ్రాయించారా. ద్యావుడా. విందుభోజనం ముందుగా ఇనప గుగ్గిళ్ళు కంకర పకోడీలు ఇసుకరవ్వ ఉప్మా పెట్టిస్తారా. దారుణం.

    ReplyDelete
  2. అభినందనలు శర్మ గారూ 👏. మంచికార్యం చేపట్టారు 👌. మీ ప్రయత్నం తప్పక సఫలీకృతమవుతుంది. All the best 👍.

    ReplyDelete
  3. గురువుగారూ!అద్భుతః🙏🙏🙏

    ReplyDelete