Sunday 26 March 2017

లక్ష్మణ ఫలం



https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3_%E0%B0%AB%E0%B0%B2%E0%B0%82

8 comments:

  1. ఇదెప్పుడూ చూడనేలేదు.

    ReplyDelete
    Replies
    1. లలితమ్మాయ్!
      ఇది లక్ష్మణఫలం. నా మరో బ్లాగులో రామాఫలం ఫోటో పెట్టేను.దాని మీదొక కామెంట్లో లక్ష్మణ ఫలమూ ఉంది,దీన్ని హనుమఫలమనీ అంటారన్నా! మిత్రులు రాజారావుగారు ఈ ఫలాన్ని గురించి తెలియదు,ఫోటో పెట్టగలరా అంటే ఇలా.
      రామాఫలం,లక్ష్మణ ఫలం రెండూ కేన్సర్ కారగాలని నిరోధిస్తాయట, కేన్సర్ తగ్గిస్తాయట. గోజిలలో ఈ పండు పండదు, అందుకే మనకు తెలియదు. ఈ పండు విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో బాగా దొరుకుతుందట.
      ధన్యవాదాలు.

      Delete
    2. మథుర మురుతర ఫలము రామాఫలమ్ము
      తగ మనోఙ్ఞము రుచికి సీతాఫలమ్ము
      మరి , రుచి తెలియదయ్య ! లక్ష్మణ ఫలమ్ము
      చక్కగా ఫుటో బెడితిరి శర్మ గారు !

      Delete
  2. మిత్రులు రాజారావుగారు,
    ఈ పండు దొరుకుతుందేమో చూడండి. ఇది కొద్దిగా తీయగా,కొద్ది పుల్లగా ఉంటుందట. తినడానికి బాగుంటుందంటారు. నేను తినలేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. సీతాఫలం తప్ప రెండు తెలియనివి చెప్పారు. మీకు వందనం

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు,
      మా దగ్గర రామాఫలం,సీతాఫలం బాగానే దొరుకుతాయండి. లక్ష్మణఫలం కూడా మా దగ్గరలోనే ఉన్నట్టు తెలిసిందండి,వీలునుబట్టి చూడాలి, ఇదే కాసేకాలం
      ధన్యవాదాలు.

      Delete
  4. " హనుమాన్ ఫలం లేదా లక్ష్మణ ఫలం "
    హనుమంతుని చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం 'ఆనోనా మ్యూరికాటా' (Anona Muricata). ఆంగ్లంలో సవర్ సోప్ (Soursop) లేదా గ్రావియోలా (Graviola) అందురు. వీటి ఆకులు సీతాఫలం చెట్టు ఆకులవలె కాకుండా నున్నగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా మెక్సికో, క్యూబా, మధ్య అమెరికా, కరేబియన్, ఉత్తర దక్షిణ అమెరికా, కొలంబియా, బ్రెజిల్, పేరూ, వెనిజులా, భారత్ వంటి దేశాల్లో కనిపిస్తాయి. హనుమంతుని చెట్లు గాలిలో తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి. బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు. సీతాఫలం, రామఫలం వలె కాకుండా హనుమంతుని ఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కనుక హనుమంతుని ఫలాన్ని ]నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని సేవించడం మేలు.
    ఔషధ గుణాలు
    +++++++++
    హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. . తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ హనుమంతుని ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు . కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.
    కేన్సర్ కు వాడే విధానం
    ++++++++++++++
    కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి .
    పోషక విలువలు
    ++++++++++
    100 గ్రాముల హనుమంతుని ఫలంలో తేమ 82.8 గ్రా, ప్రోటీన్ 1.0 గ్రా, ప్యాట్ 0.97 గ్రా, కార్బో హైడ్రేట్ 14.63 గ్రా, ఫైబర్ 0.79 గ్రా, యాష్ 60 గ్రా, కేల్షియం 10.3 మి.గ్రా, ఫాస్పరస్ 27.7 మి.గ్రా, ఐరన్ 0.64 మి.గ్రా, విటమిన్ ఎ 0, థయామిన్ 0.11 మి.గ్రా, రైబోఫ్లోవిన్ 0.05 మి.గ్రా, నియాసిన్ 1.28 మి.గ్రా, ఆస్కార్బిక్ యాసిడ్ 29.6 మి.గ్రా, ట్రిప్టోపాన్ 11 మి.గ్రా, మెథియోనైన్ 7 మి.గ్రా, లైసిన్ 60 గ్రా ఉంటాయి
    ఇతర పేర్లు
    +++++++
    హనుమంతుని ఫలానికి వివిధ పేర్లు ఉన్నాయి. హిందీలో హనుమాన్ ఫల్, సంస్కృతంలో లక్ష్మణ్ ఫల, తమిళంలో ముళ్ళు సీత లేదా పుల్లిప్పల, మళయాలం లో ఆతిచక్క లేదా ముల్లన్ చక్క లేదా విలాయతి నున లేదా లక్ష్మణ ఫజం, కన్నడంలో ముళ్ళరామాఫల, మరాఠిలో మంఫల్, బెంగాలీలో జంగ్లీ అట, బ్రెజిలియన్ లో పప, స్పానిష్ లో గ్వానబాన, పోర్చుగీస్ లో గ్రావియోల అని వివిధ పేర్లతో పిలుస్తారు.
    మార్కెట్ వివరాలు
    ++++++++++++
    పరిశోధలనల తరువాత హనుమంతుని ఫలానికి ఇటీవల బాగా గిరాకీ పెరిగింది. హైదరాబాద్ వంటి నగరాల్లో కిలో కాయలు 1400 రూపాయల చొప్పున అమ్మబడుతున్నాయి. హోల్ సేల్ లో కిలో కాయలు 500 రూపాయల చొప్పున అమ్మబడుతున్నాయి.

    ReplyDelete
  5. nagababu gopaగారు,

    ఇంత పాత టపాని చూసి సవివర వ్యాఖ్య పెట్టినందుకు, అది కూడా పది మందికి ముపయోగపడేది చెప్పినందుకు ధన్యవాదాలు.

    మా దగ్గర్లో ఒక చెట్టుందని విన్నా! దాని నుంచి మరికొన్నిటిని పెంచాలని నా ఆలోచన

    నెనరుంచండి.

    ReplyDelete