చాలా కాలం కితం మాట. మిత్రులు బోనగిరిగారు గూన ఫోటో పెట్టండీ అన్నారు, అవత బ్లాగులో. గూన దొరకలేదు ఫోటో తీద్దామంటే. మొన్న దారిన పోతుంటే ఒకరెవరో ఇల్లు మారుస్తూ గూనని ఇలా రిక్షా మీద ఎక్కిస్తుంటే చూసి వారినడిగితే ఫోటో తీసుకోమన్నారు, అదే ఇది :)
bonagiriగారు, ఆ ముసలాళ్ళిద్దరూ ఆ గూనని రిక్షా మీద ఎక్కించడానికి అవస్థ పడుతున్న సమయం. ఆఫోటోలో ఉన్న అబ్బాయి రిక్షా ముందు నిలబడి, తేలిపోకుండా నొక్కి పెడుతున్న సమయం, నేనూ ఇల్లాలూ బండి మీదపోతూ చూశాం. ఇల్లాలు ముసలాళ్ళు తంటాలు పడుతున్నారంటే, బండి దిగి చెయ్యేసేను, అప్పుడు గుర్తొచ్చింది, మీకిచ్చిన మాట. ఇల్లాలు కూడా ఫోటో తీయండీ అంది, ఫోటో తీసుకుంటానంటే సరే అని అలా నిలబడ్డారు. అదీ ఈ ఫోటో వెనక కత ధన్యవాదాలు.
అదేవిటో ఏ ఫొటోలోనూ మీరుండరేం! ☹️. ఫొటో తీసేది నేనే కదా మరి అనకండి. నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి లాగా మీ ఫొటో చూపించడం ఇష్టం లేదా :) 🙂
ఏమనుకోకండి గానీ మనకి పౌరుషం లేదు (దీన్నే మనకి ఓర్పు ఎక్కువ అని చెప్పుకుని కొందరు ఆనందిస్తుంటారు) అని నిరూపించడానికి మరో నిదర్శనం మీ ఫొటోలో వెనకాల కనిపిస్తున్న భేల్‌పూరి షాప్. ఆంధ్రదేశపు నడిబొడ్డునున్న (దాదాపు) అనపర్తికి బతుకుతెరువు కోసం వచ్చి తన షాప్ బోర్డ్ హిందీలో రాసిపెడతాడా? పోనీ దానితో పాటు తెలుగులో కూడా రాయించినట్లు ఫొటోలో కనబడడంలేదు. "మనవాళ్ళొట్టి వెధవాయలోయ్" అని అలనాడే ఊరికే అనలేదు.
విన్నకోట నరసింహా రావుగారు, మీరన్నమాట నిజం. కెమెరా వెనకున్నాగా? అందుకు కనపడనన్నమాట. పెద్ద వారితో పోల్చారు, నా పేరు చెప్పుకోడానికి సిగ్గు లేదు, ఫోటో పెట్టుకోడానికి సిగ్గు,భయమూ లేదు, కాని ఓ చిన్న చిక్కుంది. నా ఫోటో తీసే ధైర్యం ఎవరికి ఉన్నట్టులేదు. మా చిన్న మనవరాలో ఫోటో తీసింది, అది బ్లాగులో పెట్టేను. బ్లాగులో ఫోటో లు పెట్టేసుకోవాలనే ’కుతి’ లేదండి. :) సెల్ఫీ లు తీసుకునే కెమేరా ఉన్న సెల్ లేదు. ఉన్నదానితో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేశాగాని, ఫోటో తీసిన తరవాత చూసుకుంటే ఫోటో నాదేనా అని భయమేసి తీసేసేను :) నేను అందంగా లేకపోతే కెమెరాదా తప్పు చెప్పండి :)
ఫోటోలో కనపడుతున్నదో ఛాట్ బండి. అతను మా వూరొచ్చి చాలా కాలమే అయింది, రాజస్థాన్ నుంచి. మంచి తెలుగు మాటాడతాడు, విన్నాను కూడా, అతని దగ్గరెప్పుడూ ఛాట్ తినలేదు, అలవాటూ లేదు. బండి మీద మూడు భాషల్లో రాయించాడు, ముందు పొడుగు వైపు తెనుగులో, పక్కల ఒక పక్క జాతీయభాషలో, రెండో పక్క రాజస్థానీలో on top in English... నా ఫోటో కి జాతీయ భాష దొరికిందండి, అదీ సంగతి.... ధన్యవాదాలు.
అయితే ఓకే (ఏదో సినిమాలో డైలాగ్) 🙂. ఛాట్‌బండతన్ని మెచ్చుకోవాలి 👏. (మన గడ్డ మీద బతుకుతూ ఎన్నేళ్ళయినా మన భాష నేర్చుకోని వాళ్ళని చూశానులెండి. అందువల్ల నా మొదటి కామెంట్)
ఈ సారి మీ పద్యం అర్ధమయిందండోయ్ జిలేబీ గారూ. తెలుగువారికి పరాయివన్నీ మోజు అంటున్నారు పద్యరూపంలో (కరక్టేనా?), బాగుంది. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్‌లో మాకు తెలుగు బోధించిన లెక్చరర్ గారు శ్రీ నాగళ్ళ గురుప్రసాద రావు గారిని తలుచుకోవాలి. వారు తరచూ - మన తెలుగువారిది ఇంటర్నేషనల్ అవుట్‌లుక్ రా, అంటే పెద్ద కంత అన్నమాట, ఆ కంతలో తల దూర్చి చూస్తూ అందరినీ పలకరిస్తుంటాం - అంటుండేవారు. ఎంత కరక్ట్‌గా అంచనా వేసి చెప్పారో మహానుభావుడు అనిపిస్తుంది. అయితే శర్మ గారి ఊళ్ళో భేల్‌పురి బండి రాజస్ధానీ మనిషి exceptionలా ఉన్నాడు, తెలుగు బాగానే నేర్చుకున్నాడట. సంతోషం కదా. చూశారా అందుకే శర్మ గారి స్పందన వచ్చిన తర్వాత మీ భేల్‌పురి పద్యానికి జవాబిద్దామని ఆగాను. 🙂
అవునండీ అవును చాలా "పరిణితి" (🙂) కావాలి - మీ పద్యాలు అర్ధం చేసుకోవడానికి. For a change భేల్‌పురి పద్యం మా బోంట్లకి కూడా అర్ధమయ్యేట్లు కాస్త సరళంగా వ్రాసారు అంటూ మీకు కితాబిద్దామనుకున్నాను. అక్కర్లేదా? అయితే ఓకే 🙂.
జాన గాని బాన గాని లోన నున్న గూన గాని దానిని ఒడిసి పట్టి గునగున మని బరికించి , వేణి మీద బడుచు బాది బాది మిన్న యైన ఆటలాడి, కూని రాగమంచు కులుకు జాణరో జిలేబి రాణి !
ఈ గూన బాన కి స"హోదరి" లా వుందండీ :)
ReplyDeleteలలితజీ!
Deleteగూన బానకి సహోదరే!! బానకి పెద్దపొట్ట ఉంటుంది, మూతి వెడల్పుగా ఉంటుంది,పొట్టిగా ఉంటుంది. చాకలి బాన అంటారు చూడండి అలా అనమాట. గూన, ఇది ఊరగాయలు వగైరా పెట్టుకునే గూన కొంచం పొడుగ్గా మూతి కొంచం చిన్నగా, బానకంటే, ఉంటుంది.
బాన పొట్ట పెద్దది, గూనపొట్ట చిన్నది.
నెనరుంచండి.
GOOD PICTURE
ReplyDeleteచాలా కాలం కితం మాట. మిత్రులు బోనగిరిగారు గూన ఫోటో పెట్టండీ అన్నారు, అవత బ్లాగులో. గూన దొరకలేదు ఫోటో తీద్దామంటే. మొన్న దారిన పోతుంటే ఒకరెవరో ఇల్లు మారుస్తూ గూనని ఇలా రిక్షా మీద ఎక్కిస్తుంటే చూసి వారినడిగితే ఫోటో తీసుకోమన్నారు, అదే ఇది :)
ReplyDelete
ReplyDeleteగూనల బానల ఫోటో
మా నవయుగ భాస్కరుండు మాచన జేర్చెన్
ఆనక జిలేబి వచ్చెను
చానా బాగు యనెనోయి చక్కెర కేళీ :)
Zilebiగారు,
Deleteపద్యం బాగుంది.
ధన్యవాదాలు.
చానా బాగు యనెనోయి
Deleteచక్కెర కేళీ :). ...... ?
అడిగానని నేనే మర్చిపోయాను. గుర్తుంచుకుని పెట్టినందుకు ధన్యవాదాలు.
ReplyDeletebonagiriగారు,
ReplyDeleteఆ ముసలాళ్ళిద్దరూ ఆ గూనని రిక్షా మీద ఎక్కించడానికి అవస్థ పడుతున్న సమయం. ఆఫోటోలో ఉన్న అబ్బాయి రిక్షా ముందు నిలబడి, తేలిపోకుండా నొక్కి పెడుతున్న సమయం, నేనూ ఇల్లాలూ బండి మీదపోతూ చూశాం. ఇల్లాలు ముసలాళ్ళు తంటాలు పడుతున్నారంటే, బండి దిగి చెయ్యేసేను, అప్పుడు గుర్తొచ్చింది, మీకిచ్చిన మాట. ఇల్లాలు కూడా ఫోటో తీయండీ అంది, ఫోటో తీసుకుంటానంటే సరే అని అలా నిలబడ్డారు. అదీ ఈ ఫోటో వెనక కత
ధన్యవాదాలు.
అదేవిటో ఏ ఫొటోలోనూ మీరుండరేం! ☹️. ఫొటో తీసేది నేనే కదా మరి అనకండి. నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి లాగా మీ ఫొటో చూపించడం ఇష్టం లేదా :) 🙂
ReplyDeleteఏమనుకోకండి గానీ మనకి పౌరుషం లేదు (దీన్నే మనకి ఓర్పు ఎక్కువ అని చెప్పుకుని కొందరు ఆనందిస్తుంటారు) అని నిరూపించడానికి మరో నిదర్శనం మీ ఫొటోలో వెనకాల కనిపిస్తున్న భేల్‌పూరి షాప్. ఆంధ్రదేశపు నడిబొడ్డునున్న (దాదాపు) అనపర్తికి బతుకుతెరువు కోసం వచ్చి తన షాప్ బోర్డ్ హిందీలో రాసిపెడతాడా? పోనీ దానితో పాటు తెలుగులో కూడా రాయించినట్లు ఫొటోలో కనబడడంలేదు. "మనవాళ్ళొట్టి వెధవాయలోయ్" అని అలనాడే ఊరికే అనలేదు.
విన్నకోట నరసింహా రావుగారు,
Deleteమీరన్నమాట నిజం. కెమెరా వెనకున్నాగా? అందుకు కనపడనన్నమాట. పెద్ద వారితో పోల్చారు, నా పేరు చెప్పుకోడానికి సిగ్గు లేదు, ఫోటో పెట్టుకోడానికి సిగ్గు,భయమూ లేదు, కాని ఓ చిన్న చిక్కుంది. నా ఫోటో తీసే ధైర్యం ఎవరికి ఉన్నట్టులేదు. మా చిన్న మనవరాలో ఫోటో తీసింది, అది బ్లాగులో పెట్టేను. బ్లాగులో ఫోటో లు పెట్టేసుకోవాలనే ’కుతి’ లేదండి. :) సెల్ఫీ లు తీసుకునే కెమేరా ఉన్న సెల్ లేదు. ఉన్నదానితో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేశాగాని, ఫోటో తీసిన తరవాత చూసుకుంటే ఫోటో నాదేనా అని భయమేసి తీసేసేను :) నేను అందంగా లేకపోతే కెమెరాదా తప్పు చెప్పండి :)
ఫోటోలో కనపడుతున్నదో ఛాట్ బండి. అతను మా వూరొచ్చి చాలా కాలమే అయింది, రాజస్థాన్ నుంచి. మంచి తెలుగు మాటాడతాడు, విన్నాను కూడా, అతని దగ్గరెప్పుడూ ఛాట్ తినలేదు, అలవాటూ లేదు. బండి మీద మూడు భాషల్లో రాయించాడు, ముందు పొడుగు వైపు తెనుగులో, పక్కల ఒక పక్క జాతీయభాషలో, రెండో పక్క రాజస్థానీలో on top in English... నా ఫోటో కి జాతీయ భాష దొరికిందండి, అదీ సంగతి....
ధన్యవాదాలు.
అయితే ఓకే (ఏదో సినిమాలో డైలాగ్) 🙂. ఛాట్‌బండతన్ని మెచ్చుకోవాలి 👏.
Delete(మన గడ్డ మీద బతుకుతూ ఎన్నేళ్ళయినా మన భాష నేర్చుకోని వాళ్ళని చూశానులెండి. అందువల్ల నా మొదటి కామెంట్)
భేల్పూరీ మాదే ! యిల
ReplyDeleteవేల్పుగ నయ్యప్పసామి వేడి జిలేబీ !
ఆల్పయిను చాకొలెట్టూ !
కోల్పోయామాంధ్ర తిండి కొబ్బరి చట్నీ :)
ఈ సారి మీ పద్యం అర్ధమయిందండోయ్ జిలేబీ గారూ. తెలుగువారికి పరాయివన్నీ మోజు అంటున్నారు పద్యరూపంలో (కరక్టేనా?), బాగుంది. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్‌లో మాకు తెలుగు బోధించిన లెక్చరర్ గారు శ్రీ నాగళ్ళ గురుప్రసాద రావు గారిని తలుచుకోవాలి. వారు తరచూ - మన తెలుగువారిది ఇంటర్నేషనల్ అవుట్‌లుక్ రా, అంటే పెద్ద కంత అన్నమాట, ఆ కంతలో తల దూర్చి చూస్తూ అందరినీ పలకరిస్తుంటాం - అంటుండేవారు. ఎంత కరక్ట్‌గా అంచనా వేసి చెప్పారో మహానుభావుడు అనిపిస్తుంది.
Deleteఅయితే శర్మ గారి ఊళ్ళో భేల్‌పురి బండి రాజస్ధానీ మనిషి exceptionలా ఉన్నాడు, తెలుగు బాగానే నేర్చుకున్నాడట. సంతోషం కదా. చూశారా అందుకే శర్మ గారి స్పందన వచ్చిన తర్వాత మీ భేల్‌పురి పద్యానికి జవాబిద్దామని ఆగాను. 🙂
Deleteపద్యా లర్థము కావే !
విద్యగ నేర్చెడి జిలేబి విన్నపములివీ !
గద్యము వోలెన్ సులభము
పద్యము గాదు నరసింహ ! పరిణితి వలయున్ :)
జిలేబి
Deleteఈ విన్నకోట నరసిం
హా వారిత్తురు కమింట్ల హారతి మాత్రం :)
రావుకు బ్లాగు యెచట గల
దో వివరము లివ్వవలయు దోపిడి జేయన్ :)
జిలేబి
అవునండీ అవును చాలా "పరిణితి" (🙂) కావాలి - మీ పద్యాలు అర్ధం చేసుకోవడానికి. For a change భేల్‌పురి పద్యం మా బోంట్లకి కూడా అర్ధమయ్యేట్లు కాస్త సరళంగా వ్రాసారు అంటూ మీకు కితాబిద్దామనుకున్నాను. అక్కర్లేదా? అయితే ఓకే 🙂.
Deleteఈ మధ్యనే ఓ బ్లాగులో "అర్హతా పరీక్ష" అంటూ కామెంట్ కనిపించింది. అలాగ బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడానికి ఓ బ్లాగరయ్యుండడం "అర్హతా" ?
Delete
Deleteభంశు :
అర్థమయ్యే లా పద్యాల్రాయడానికి పరిణితి వలయున్ :)
జిలేబి
ఫోటో లో వారుండరు !
ReplyDeleteషాటుల తీస్తా రు వారు షాపుల జూడన్ :)
ఆటగ టపాలు బ్లాగుల
బాటన నిలబెట్టెనోయి భాస్కర శర్మా !
సెల్ఫీల గురించి వినే ఉంటారుగా జిలేబీ గారు 🙂. టెక్నాలజీ అండీ టెక్నాలజీ 🙂.
DeleteZilebiగారు,
Deleteకెమెరా వెనకున్నాగదండీ
ధన్యవాదాలు.
ఫోటోన వారున్ననేమి లేకనేమి గ్రహ
Deleteపాటుకు దగ్గరె గద తమరి తోడ
పూటుగ పద్యాలనల్లి సంబరాన
వాటంగా కొసరి విసర అడ్డెవరమ్మా !!!
జాన గాని బాన గాని లోననున్న గూన గాని
కాణాచిగ ఒడిసిపట్టి గునగున మని బరికి బరికి
మీన బడుచు బాది బాది పద్యమంచు ఆటలాడి
కూని రాగమొకటి కులక, జాణరో జిలేబీ భల్ ఖిలాడి
:::)))
Deleteబండెనక బండి గట్టిగ
గుండెలదరగన్ జిలేబి గుడి గట్టె గదా !
పిండెను కందము రావుకు
అండగ నిచటన్ కిలాడి అడ్డెవరమ్మా !
జిలేబి
Deleteస్వల్ప అడ్జస్ట్ మాడి :)
మీక్కూడా రగడ యోగం బాగున్నట్టుంది జిలేబి లాగా :) ప్రయత్నిస్తే కష్టే ఫలే :)
జాన గాని బాన గాని లోన నున్న గూన గాని
దానిని ఒడిసి పట్టి గునగున మని బరికించి , వేణి
మీద బడుచు బాది బాది మిన్న యైన ఆటలాడి,
కూని రాగమంచు కులుకు జాణరో జిలేబి రాణి !
తురగవల్గన రగడ !
చీర్స్
జిలేబి
ReplyDeleteమీ ఫోటో చూసి తరించాలన్న 'అతి' లేదు,ఇప్పటికే మోడీ సెల్ఫీలు చూడలేక ..
ఓరి నీ యేషాలో....