29, మే 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ

పిలుపులు-పేరంటాలూ
దక్షుడు నిరీశ్వర యాగం మొదలుపేట్టేరు, తనకి శివుడు గౌరవం ఇవ్వలేదని. దేవతలంతా ఆ యాగానికి వెళుతున్నారు. అమ్మకి ఒళ్ళు మండిపోతోంది, నిరీశ్వర యాగం జరగడం అమ్మకి ఇష్టం లేదు, అలా జరిపించేవారిని శిక్షించాలి, ఎవరు చేయగలరా పని? ఈశ్వరుడే చేయాలి, కాని ఆయన శివునిలా కూచున్నాడే, ఆయనని రుద్రుణ్ణి చేస్తేగాని ఆ యాగం ఆగదు, అందుకు అమ్మ,...................continue at కష్టేఫలే

24, మే 2015, ఆదివారం

శర్మ కాలక్షేపంకబుర్లు-చేతకానివాళ్ళు

చేతకానివాళ్ళు.
చెల్లాయ్! కాఫీ అమ్మా అంటూ ప్రతిపక్షంలా అరిచాడు మా సత్తిబాబు వస్తూనే,.................continue at కష్టేఫలే

22, మే 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ముమ్మారు.

మూడు అంటే త్రీ టండి, మూడ్ కాదు. త్రి అన్నది కూడా సంస్కృతం నుంచి పుట్టిన మాటే.మూడు కి మన సంస్కృతిలో చాలా విశేషమే ఉంది...................continue at కష్టేఫలే

21, మే 2015, గురువారం

15, మే 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మినపసున్ని.

ఎండలు మండుతున్నాయి, భాస్కరుడి పేరుకి సరిపోయినట్టుగా అన్నీ చప్పరించడమే సరిపోతోంది, పళ్ళింకా కట్టించుకోలేదు, ఏంతినాలన్నా కష్టంగానే ఉంది, ఇది ఆలోచించి ఇల్లాలు మినపసున్ని చేసినట్టుంది, మొన్ననోక రోజు మధ్యాహ్నం పెట్టింది, ఆహా ఏమి రుచి, ఏమి రుచి మళ్ళీ చిన్న తనం లోకి వెళిపోయా...................continue at కష్టేఫలే

13, మే 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-కంద పెసరట్టు

కంద ఎరగనివారుండరని నా నమ్మకం. కందలో రెండు రకాలు. పాటి కంద, తియ్యకంద. ఈ పాటికంద అంటే దేశవాళీ కంద, ఇది దురద పుట్టిస్తుంది, ఉడికినా కూడా, ఇక తియ్య కంద మనకి మార్కెట్ లో దొరికేదే! ...................continue at కష్టేఫలే

11, మే 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-భోజనం దేహి రాజేంద్రా


దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవానెదురొచ్చిందనీ, దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళపరిగే పడిందనీ,అదృష్టం లేకపోతే అంట వలసినది అంటదు, ముట్టవలసినదీ ముట్టదు అని , అదృష్టం లేకపోతే ఆముదం రాసుకుదొల్లినా బూడిద కూడా అంటుకోదనీ సామెతలున్నాయి. వీటి విశేషం చూదాం , ఒక చిన్న కథ చెప్పుకుందాం...................continue at కష్టేఫలే

7, మే 2015, గురువారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు చూసిన తరం

సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో కొన్ని మార్పులు రావడం సహజం కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో ఉన్న తరం మాత్రం ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది. ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు......................continue at కష్టేఫలే

5, మే 2015, మంగళవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-సెలగ


 నాచిన్నప్పటి రోజులలోఆహారధాన్యాలన్నీ కొలవడమే అలవాటు. ఇన్ని కుంచాలు అనడం అలవాటు. అలాగే ఇరవైనాలుగు కుంచాలంటే ఒక కాటా బస్తా అని లెక్క, ఇప్పటి వంద కేజీలు. ................continue at కష్టేఫలే

4, మే 2015, సోమవారం

Raolport


Post courtesy

Ralph Roberts

Shared publicly  -  7:01 PM
Strange Airport #5: Gisborne Airport - Runway With a Railway Crossing ... "isborne Airport is a small regional airport that is located on the western outskirts of Gisborne, the East Coast of the North Island of New Zealand. The airport is one of the very few airports in the world that has a railway line intersecting the runway. The Gisborne airport which covers a land of 160 hectares has three grass runways and one main runway that is intersected by the Palmerston North - Gisborne Railway Line. The Wynyard Airport, on Tasmania's north-western coast, also had a railway crossing on the runway but declining rail traffic forced the closure of rail traffic in early 2005, and thus the Wynyard airport rail crossing is no more operational. ..."

MORE: http://www.amusingplanet.com/2013/08/gisborne-airport-runway-with-railway.html


29, ఏప్రిల్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-అదే! ''పదివేలు''.


అదే!''పదివేలు'' అనే ప్రయోగం చాలా సార్లే వింటుంటాం, కాని ఇలా ఎందుకంటారో, ఎలా వాడుకలోకి వచ్చిందో మాత్రం ఆలోచించలేదుకదా!. అదే!''పదివేలు'', అంటే మహా ప్రసాదం, అదేచాలు సంతృప్తి,సెలగో సెలగ, (ఇదేంటంటారా? వీలుంటే తరవాత చూదాం) . ఇలా చాలా అర్ధాలలో ఈ నానుడిని ప్రయోగిస్తారు.................continue at కష్టేఫలే

22, ఏప్రిల్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రాప్తం

ప్రాప్తం ఉంటేగాని అంటేది అంటదు, ముట్టేది ముట్టదు అంటారు. నిజంగా ఇది ఎప్పుడూ నాకు అనుభవంలోకి రాలేదుగాని, గురువారం ఉదయం ఇది బలే అనుభవమే అయింది.................continue at కష్టేఫలే

20, ఏప్రిల్ 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-పాపం! అహల్య.

”అహల్య” టపా రాయాలని చాలా కాలంగా అనుకున్నదే కాని ఇదుగో, అదుగో అంటూ జరుపుకొచ్చేసేను.
అహల్య గురించి మూడు రకాల అభిప్రాయలున్నాయి. ఇవి నేటివేకాదు, సనాతనంగా వస్తున్నవే. ఇక అహల్య గురించి సినిమావారి పైత్యానికి అంతే లేదు. నా టపాకి స్పందించినవారికి ధన్యవాదాలు. మూడు రకాల వారెవరు?................continue at కష్టేఫలే

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-అహల్య.

అహల్య బ్రహ్మ మానస పుత్రిక. ఆమెను బ్రహ్మ సభలో చూసిన దేవతలంతా ఆమెను చేపట్టాలనుకున్నారు, ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధులయి. బ్రహ్మగారీ విషయం గమనించి అక్కడే ఉన్న గౌతముని పిలిచి, అహల్యను అప్పగిస్తూ, ”ఈమె కొంతకాలం, సపర్య చేస్తూ నీ ఆశ్రమం లో ఉంటుంద”ని చెప్పేరు. గౌతముడు ఆమెతో ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈ అతిలోక సుందరి దగ్గర ఉన్నా గౌతముడు చలించలేదు, అహల్యా చలించలేదు, ఇద్దరూ వయసులో ఉన్నా. వీళ్ళని గమనించిన బ్రహ్మగారు వీరికి వివాహం చేశారు. ఇది గాక మరో కథ చెబుతారు అదెలాగంటే,...............continue at కష్టేఫలే

15, ఏప్రిల్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-''నేను'' ఎవరు?

భారతీయులందరిలోనూ ఎంతో కొంత పరతత్వ వివేచన ఉంటుంది,చదువుకోకపోయినా. నాలాటి సామాన్యుని కి ”నేనెవరు?” అన్న ప్రశ్నకి సమాధాన ప్రయత్నమే ఇది.................continue at కష్టేఫలే

13, ఏప్రిల్ 2015, సోమవారం

శర్మ కాలక్షేపం కబుర్లు-గోరుచుట్టుపై రోకటిపోటు

"గోరుచుట్టుపై రోకటిపోటు", "కునికే/మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు", "పుండుకి పుల్ల మొగుడు" అని అన్నీ సమానార్ధకాలుగా వాడతారు. "గోరుచుట్టేంటీ, రోకలిపోటేంటీ?" అడిగాడు మా సత్తిబాబు...............continue at కష్టేఫలే

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపం కబుర్లు-జీవిత పాఠం.


అన్నిదానములను అన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ వినుర వేమ.
వేమన తాత, అన్నిదానాలకంటే అన్నదానం గొప్పదనీ, తల్లికంటే ఘనమైనదేదీ లేదనీ, గురువుకంటే మరెవరూ గొప్పవారు కాదనీ అంటారు...........continue at కష్టేఫలే

7, ఏప్రిల్ 2015, మంగళవారం

India borders


 Pakistan


Nepal

China

Bangladesh

Bhutan

Myanmar

Tibet

Afghanistan
Courtesy:http://twostupidamericans.com. Dave Lindberg

6, ఏప్రిల్ 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-వేరు కుంపటి

శూరులజన్మంబు,సురల జన్మంబు, ఏరులజన్మంబు..తెలుసుకోకూడదు, వారిని ఉపయోగించుకోవాలే తప్పించీ అన్నారు, మా దుర్యోధన సార్వ భౌములు. ఎక్కడో పుట్టినా, మన దేశంలో, మన వంటింటిల్లు తన పుట్టిల్లుగా చేసుకున్నదే ..........continue at కష్టేఫలే

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-కర్తరి?-కార్మిక సంక్షేమం.


వేసవి వచ్చేసింది.కర్తరి, కత్తిరి అంటారు, ఏవో పనులూ చెయ్యద్దు,అన్నారుష అంతా ఛాదస్తం .......................continue at కష్టేఫలే

1, ఏప్రిల్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-గుమ్మడి గింజలతో......


గుమ్మడి లో రెండు రకాలు, ఒకటి సూరేగుమ్మడి లేదా కూర గుమ్మడి, రెండవది బూడిద గుమ్మడి.ఇప్పుడు సూరే గుమ్మడి గురించి చూదాం..................continue at కష్టేఫలే

30, మార్చి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి

https://www.youtube.com/watch?v=OcRX4o71xUI

Courtesy: you tube

ఏఱువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా.................continue at కష్టేఫలే

27, మార్చి 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకం సత్

ఏకం సత్ విప్రా బహుధా వదంతి. భగవంతుడొక్కడే కాని బుధులు వివిధరకాలుగా చెబుతారు. ఎందుకు? భగవంతుని దర్శించడానికి ఒక్కొకరికి ఒకో మార్గం ఇష్టం కావచ్చు, అందుకు. అందరకి ఒకే మార్గం ఉండాలనడం ఇచ్చగించదగినదా?................continue at కష్టేఫలే

26, మార్చి 2015, గురువారం

25, మార్చి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసo

ఉభయ భ్రష్టత్వం ఉప్పరి సన్యాసం, అంటారు గాని, అసలు మాట ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసమే. ఒక చిన్న కథ చెప్పుకుందాం, దీని గురించి......................................continue at కష్టేఫలే

23, మార్చి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు- తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి

''రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు హామీలే అమలు జరగనటువంటి రోజులు, నోటి మాటలకి కట్టుబడేవారెవరు? గట్టిగా మాటాడితే ”తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టమని” అనచ్చు. ఈ ”ఉభయ భ్రష్ఠత్వం ఉపరి సన్యాసం” ఏంటీ? ”తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడమేంటని” మాత్రం అడగద్దు, టపా రాస్తానని హామీ మాత్రం ఇవ్వను. :)'' అన్నాను, మొన్ననొక టపాలో దానికి మోహన్జీ ఇలా అన్నారు,
''తూర్పుకే ఎందుకు తిరగాలి? ఎందెందు వెతికి జూచిన అందందే కలడు కదా? మీరు దీని గురించి వ్రాయాలిసిందే!''............ మరి టపా రాయక తప్పలేదు..................................continue at కష్టేఫలే

21, మార్చి 2015, శనివారం

20, మార్చి 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-సిరిగలవానికి జెల్లును

సిరిగలవానికి జెల్లును
తరుణుల బదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.

భావం:- డబ్బున్నవాడు పదహారువేలమందిని పెళ్ళాడినా బాధుండదు కాని ముష్టి ఎత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా! పరమేశ్వరా! గంగను వదిలెయ్యి, పార్వతి ఒకతే చాలులే. ...............continue at కష్టేఫలే

19, మార్చి 2015, గురువారం

శర్మ కాలక్షేపంకబుర్లు-హామీ....

హామీ, ఇది తెనుగు పదం కాదుట,హిందీ నుంచి దిగుమతి అయి తెనుగులో తిష్ట వేసుకు కూచున్నది. దీనికి అర్ధం పూచీ, జామీను,బాధ్యత అన్నారు నిఘంటుకారులు...................continue at కష్టేఫలే

18, మార్చి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-పారుబాకీ వసూలు(అప్పులమ్ముకోడం)


చెప్పులమ్ముకోడం విన్నాం, కాని అప్పులమ్ముకోడం వినలేదన్నారా! ఆగండి!! గుర్రాన్ని కట్టెయ్యండి.... ఇదేం కొత్తకాదుగాని విశేషం అవధరించండి...............continue at కష్టేఫలే

17, మార్చి 2015, మంగళవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-Get well soon.

జిలేబిగారు ఆరోగ్యమే భాగ్యం అంటారు మూర్ఖులని అన్నారు. శ్రీ కంది శంకరయ్య మాస్టారు అనారోగ్యంగా ఉందనీ అన్నారు. తెనుగు మాస్టారికి ఇంగ్లీషు పదాల్లో తొందరగా ఆరోగ్యం పొందమని చెబితే ఎలా ఉంటుందన్నదీ, జిలేబీగారిని ఆరోగ్యం పొందమనీ చెప్పడమేఈ ప్రయత్నం, 

నాకింగ్లీషురాదు
నా మనసటుపోదు 

Every day you are at the dawn
Like a crow awakening the man
It's time to live for the other man
Get well soon

Time is slipping like sand
Use it like a magic wand
Every thing is in your hand
Get well soon

Age is half past noon
Time is slipping soon
Let's not wait for the moon
Get well soon.

Gersoppa waterfall-1860


Courtesy Old Indian photos

16, మార్చి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-విల్లు అనే మరణ శాసనం.

విల్లు అనే మరణ శాసనం.
విల్ అనేది ఇంగ్లీషు మాట. ఇది అపభ్రంశం చెంది తెనుగులో విల్లు, వీలునామాగా రూపాంతరం చెందింది. కాని అసలు తెనుగు మాట మాత్రం మరణ శాసనం................continue at కష్టేఫలే

14, మార్చి 2015, శనివారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మామిడి కాయ పప్పు.-ఒక జ్ఞాపకం

వేసంకాలం వచ్చేస్తోంది కదూ! పెరటిలో కొత్తపల్లి కొబ్బరి మామిడి పూచింది, కాసింది కూడా. పిందె రాలిపోతోంది.వగరు పిందెలతో మెంతి బద్దలు వేసుకుంటే పప్పులో నంజుకు తింటే నా రాజా ఆ మజాయే వేరూ. పళ్ళులేవుగా అందుకు మన్నా అయిపోయింది. కాయ పెరిగింది జీడి పిందె టెంక పట్టనిది, పప్పులోకి బహు పసందుగా ఉంటుంది,..............continue at కష్టేఫలే

12, మార్చి 2015, గురువారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు.


పుట్టిన ప్రతి జీవికి తల ఉంటుంది. తల ఉన్న ప్రతి జీవికి మెదడుంటుంది. మెదడున్న ప్రతిజీవికి మనసుంటుంది. ఆహారము, నిద్ర,భయము, మైధునము ఈ నాలుగు సర్వ జీవులకు సమానం. ఇవి గాక మరో రెండు కూడా అన్ని జీవులూ ప్రదర్శిస్తాయి, అవే ప్రేమ, కోపం................continue at కష్టేఫలే

11, మార్చి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-శోకో నాశయతే ధైర్యం.......

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతంః
శోకో నాశయతే సర్వం నాస్తి శోకో సమో రిపుః...రామా..అయో.కాం...సర్గ..63..15
శోకం దైర్యాన్ని నాశనం చేస్తుంది, వివేకాన్ని పోగొడుతుంది, శోకం సర్వాన్నీ పోగొడుతుంది. శోకాన్ని మించిన శత్రువులేడు...........continue at కష్టేఫలే

9, మార్చి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-.......చింతాసక్తః

వృద్ధస్తావత్ చింతాసక్తః అన్నారు శంకరులు. వయసు మీదపడితే మిగిలేదిచింతే, ఇదే శోకం. దీనినుంచి తప్పించుకోవాలంటే... వయసు అరవై పైబడుతోంటే....…..continue at కష్టేఫలే

6, మార్చి 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మరణమే…….

మరణమే......

అంజలి తనూజగారు ఒక వ్యాఖ్య రాస్తూ అరవై ఏళ్ళొచ్చినతరవాత చనిపోవాలి లేదా ఆత్మ హత్య చేసుకోవాలి అని ఒకరు పిల్లల అనాదరణ పొందినవారు బాధ పడుతూ అన్నారు, ఈ విషయం మీద రాయమంటే….. దీనిని రెండు భాగాలు చేసేను..తరవాయి భాగం త్వరలో…..continue at కష్టేఫలే

4, మార్చి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు- న+ద్వైతం=అద్వైతం

"శర్మ గారూ !
మీ కష్టేఫలి బ్లాగ్ postings నచ్చి నా భావాలను మీతో పంచుకోవాలనిపించి....​"
అన్నారు శ్రీభావరాజు శ్రీనివాసుగారు. చదువు సంధ్య లేనివాడి సొల్లు కబుర్లకి ఇంత విలువిచ్చి శ్రీ భావరాజు శ్రీనివాసుగారు నా బ్లాగును ఓపికగా చదివి ఇచ్చిన ఈ వ్యాఖ్యకు వినమ్రతతో తలవంచుతున్నా. వారు చిన్నవారు కనక శుభాశ్శీస్సులు తెలుపుతున్నా! "దీర్ఘాయుష్మాన్భవ"..........continue at కష్టేఫలే

2, మార్చి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉన్నఊరువాడికి కాటిభయం......

ఉన్నఊరువాడికి కాటిభయం......

ఉన్న ఊరువాడికి కాటిభయం పొరుగూరు వానికి నీటి భయం అని నానుడి. ఉన్నవూరువాడికి ఆ ఊళ్ళో ఉన్న వల్లకాడంటే భయం, పొరుగూరివాడికి ఎక్కుడున్నదయినా చెరువు, నదులలో దిగడమంటే భయం. దీనికి కారణాలు విశ్లేషిద్దాం.........continue at కష్టేఫలే


27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీ స్వావలంబన

స్త్రీ స్వావలంబన
ఉమన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో నాకైతే అర్ధం కాలేదు మొన్నటిదాకా. కాని మొన్ననే జ్ఞానోదయమైనట్లు అది అర్ధమయింది...continue at కష్టేఫలే

25, ఫిబ్రవరి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-సెలవా?

సెలవా?

55 ఏళ్ళ కితం మాట. ఉద్యోగంలో చేరినప్పుడు సంవత్సరానికి 12 casual leaves  లు,  11 పని చేసిన రోజులకో Earned leave అలాగే 22 పని చేసిన రోజులకి ఒక రోజు Half pay leave ఇచ్చేవారు. ఆ తరవాత కాలంలోcasual leaves 15 చేసేరు. Optional holidays అని జాబితా ఇచ్చేరు, ఆరు ఎన్నుకోవాలి, శలవివ్వచ్చు, లేదా డ్యూటీ వెయ్యచ్చు, ప్రభువుల చిత్తమే, వారి అవసరమే.మాది 365 రోజుల ఉద్యోగం, అందునా రోజుకి 24 గంటలలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం చెయ్యాలి, ఖాళీ ఉంది కదా అని చెప్పకుండా ఊరొదిలిపోకూడదు, చెప్పకుండా పోతే నేరం.continue at కష్టేఫలే

23, ఫిబ్రవరి 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-అప్పులున్న వాడితోనూ.....

అప్పులున్న వాడితోనూ.....
"అప్పులున్న వాడితోనూ చెప్పులున్నవాడితోనూ వెళ్ళకూడదు," ఇదొక నానుడి, జన సామాన్యంలో ఉంది.  దీనికి అర్ధం చెప్పల్సినంతదేం లేదుగాని అసలు వీళ్ళతో వెళితే ఏమవుతుందబ్బా అన్నదే ఆలోచన......continue at కష్టేఫలే

21, ఫిబ్రవరి 2015, శనివారం

స్వామి సేవకై


అదేంటో తెలుసా! భగవంతుని సేవలకై మంగళ వాద్యాలబదులు ఉపయోగించే యంత్రం. ఒకప్పుడు గుడిలో మంగళవాద్యాలు మనుషులే వాయించేవారు, అందుకుగాను వారికి కొంత భూమి సర్వీస్ ఈనాంగానూ దేవుడు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ సర్వీస్ ఈనాం లు అమ్మేసుకున్నారు, సర్వీసూ లేదు. మరో చిత్రం... ఈ యంత్రం పని చెయ్యాలంటే కరంట్ కావాలి అదెక్కడా పల్లెలలో..... దేవుడా...

19, ఫిబ్రవరి 2015, గురువారం

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.

అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.
కేశములు, దంతములు, నఖములు, నరులు స్థానభ్రంశం చెందితే రాణించరు అన్నారు చిన్నయసూరి. నిజమే కాని మరొక అర్ధమూ చెప్పుకోవచ్చనిపించింది నాకు, అదెటులంటే....continue at కష్టేఫలే

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-మహా శివరాత్రి.


https://www.youtube.com/watch?v=1_UjqNOJxxU
మహా శివరాత్రి.
ఈ రోజు మహా శివరాత్రి, ప్రతినెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశిరోజు మాస శివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి మాత్రమే మహా శివరాత్రి, అందుచేత ఈ రోజును మహా శివరాత్రి అనాలి కాని శివరాత్రి అనకూడదు. . మహాశివరాత్రిరోజు నడిరాత్రి శివుడు లింగంగా ఉద్భవించాడంటారు, పెద్దలు.శివరాత్రి గురించి, శివుని గురించి తెలియనివారెవరు? ఏమిరాయాలో తోచలేదు, చివరకు, చిన్నప్పుడు చదువుకున్న కథ….పొరబడితే సరిదిద్దండి….. continue at కష్టేఫలే

https://kastephale.wordpress.com/2015/02/17/