తీర్థానికి వెళ్ళొచ్చా!
తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట.
మళ్ళీ సంవత్సరమేమో మనమేమో అని ఒకసారి తీర్థం చూసిరావాలనుకున్నా
ఈ ఊరువచ్చింది మొదలు తీర్ధం చూస్తూనే ఉన్నా. భోగినాడు ఉదయమే అమ్మను దర్శించడం ఆనవాయితీ,కాని తీర్ధానికి వెళ్ళాలంటే దీపాలు పెట్టేకానే వెళ్ళాలి,అందుకు సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళడానికి ముందుగా కోడలమ్మాయికి చెప్పేను. అబ్బాయికి చెప్పినట్టుంది, ఎప్పుడు వెళదాం తీర్థానికని అడిగాడు. సంక్రాంతిరోజు రాత్రి 6 దాటాకా అనడంతో నా తీర్థానికి ప్రయాణం నిశ్చయమయింది. నా చిన్నకొడుకు ఇప్పుడు నువ్వు తీర్థానికి వెళ్ళకపోతే నష్టమేం లేదు,జనంలో నడవలేవని విసుక్కోలేదు. బండి మీద తీసుకెళ్ళి తీసుకొస్తా,భయము లేదని చెప్పి ఒప్పించాడు.
ఎక్కడికి ఒకడినే వెళ్ళే సాహసం చెయ్యడం మానేసి చాలాకాలమయింది,పిల్లలతోడు అవసరమూ అయింది. బయలుదేరాలంటే ముందు కోడలమ్మాయి స్వెట్టరు తొడికి మంకీ కేప్ పెట్టి కర్ర చేతికిచ్చి తయారుచేసి బండెక్కించింది. బండి ఎక్కడ పెట్టాలో వగైరా చెప్పబోతుంటే నేను చెబుతారండి అనేసేడు. నాకేమో, వాడు చిన్నపిల్లాడిలా కనపడతాడు. వాడేమో ఏభైదాటి లోకం చూస్తున్నవాడు. అన్నీ తెలుసని వాడనుకుంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియనివాడని నేననుకుంటా ఇక్కడొస్తుంది తేడా కాలం మారిందన్న విషయం మరచిపోతుంటా,పిల్లల దగ్గర.
అలా తీర్ధాని చేరి దూరంగా భద్రంగా ఉండే చోట బండి పెట్టేకా నా కర్రతో నా నడక తీర్థంలోకి మొదలయింది. జనం,ఒకటే జనం. అదేమో 100 అడుగులరోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి-కాకినాడ కాలగట్టు రోడ్డు దాకా ఒక కిలో మీటర్ పొడుగు, దానిలో ఈ తీర్థం. ఎల్.ఇ.డి దీపాలతో తీర్థం వెలిగిపోతోంది. లోపలికి అడుగెట్టగానే గుండెలవిసేలా డి.జె సౌండు, గుండెలు పట్టేసినట్టయింది. గబగబా ఆ ప్రదేశం నుంచి కదలిపోయా,ముందుకు.,జనంలో.
అమ్మగారబ్బాయి.
గ్రామ దేవత వీరుళ్ళమ్మ
కత్తి చేతితో దొరికిందట,మ్మఅందుకు వీరులమ్మ
( వీరుల తల్లి) అని నామకరణం చేసేరు. ఆ తరవాత అదికాస్తా వీరుళ్ళమ్మ ఐపోయింది. ఇది ఒకప్పటి ఫోటో,నేడు గుడి చాలా అభివృద్ధి చేసేరు. అమ్మను మొన్న భోగిరోజు ఉదయమే దర్శించి వచ్చా..
మా (స్లోగన్)నినాదం అందరూ బాగుండాలి,అందులో మనముండాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.
ఈ సారి గాజు సామాను కొట్లు,పింగాణీ సామాను కొట్లు ఎక్కువ వచ్చాయి.
తీర్థంలో అడుగెట్టగానే ఛాట్ మసాలా వాసన గుప్పున కొట్టింది. తీర్థంలో పానీ పూరి,ఇతర తినుబండారాల కొట్లే ఎక్కువ కనపడ్డాయి. అక్కడే జనం ఉన్నారు.
జైశ్రీరాం జండాలు బాగానే అమ్ముడుపోతున్నాయి.ఒకటి కొన్నా!
బతికి ఉన్న త్రాచునే మెడలో వేయించుకుందో అమ్మాయి. ఫోటో తీసేలోపు తీసేసింది. నీ ధైర్యానికి మెచ్చే, అని చెప్పేను. భర్త అనుకుంటా ఆ తరవాత ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి పామును మెడలో వేయించుకున్నాడు,తాను భయపదటం లేదని. నేను ఆ అమ్మాయిని ప్రశంస చేస్తుంటే జనం మూగేసేరు,చుట్టూ. ఈ సందర్భంగా ఒక శ్లోకం గుర్తొచ్చింది.
స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.
పచ్చబొట్టు వేసేవాళ్ళు ఇద్దరు కనపడ్డారుగాని,వేయించుకునేవాళ్ళే కనపడలేదు. కిందటి సారి ఇల్లాలితో వచ్చినపుడు జరిగిన సంభాషణ గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టయింది
వాచీల కొట్టు. ఇంకా వాచీ పెట్టుకునేవాళ్ళు ఉన్నారా అనుకున్నా ఏదైనా 150, కొంటున్నారు. రెండు కొట్లు కనపడ్డాయి.
కాలవగట్టు రోడ్డు,మైన్రోడ్డు కలిసేదగ్గర వెలసిన రాజరాజేశ్వరీ దేవి. వీరుళ్ళమ్మ,రాజరాజేశ్వరీ దేవిల ఆలయాల మధ్య ఈ తీర్థం. ఇద్దరమ్మల కాపు.
మెత్తటి రాయి (సోప్ స్టోన్) తో తయారు చేసిన పిల్లల ఆటవస్తువులు,రుబురోళ్ళు,వగైరా
జీళ్ళు,ఖర్జూరం కొట్లు తక్కువగానే ఉన్నాయి,రెండో మూడో కనపడ్డాయి.
జనంలో నడవడమే కష్టమయింది. ఎక్కువ ఫోటో లు తీయలేకపోయా.మొత్తానికి స్త్రీల అలంకరణ సామాను,పిల్లల ఆటబొమ్మల కొట్లు ఎక్కువ. జయింట్ వీల్ ఉన్నవైపు పోలేదు. ఇక్కడికే నీరసమొచ్చింది. దేవి సెంటర్ లో గుడి పక్క క్రీనీడలో నిలిచాడొక ఎస్.ఐ గారు,నీరసం మొహాన కొట్టినట్టు కనపడుతూనే ఉంది. భోజనం చేసేరా? అడిగా, లేదు, అన్నాడు. అయ్యో! అని, కేరేజి తెప్పించుకోవచ్చుగా ఇంటినుంచి అన్నా! భోజనం చేయడం కుదరదండి, ఈ మూడు రోజులూ ఇంతే,టిఫిన్ తోనే కాలం గడపాలన్నాడు. దగ్గరేం లేకపోయింది,తినడానికి ఇవ్వడానికి. పాపం! పోలీస్ జీవితం ఇంతేనా అనిపించింది.









ఒకప్పుడు తీర్థంలో మాత్రమే కనిపించే కొన్ని రకాల బొమ్మలు, వస్తువులు, ఆటలు, ఇప్పుడు ప్రతీ షాప్ లోనూ కనపడడంతో తీర్థాలకి ఆదరణ తగ్గుతుందేమో అని నా అనుమానం... ఏది ఏమైనా తీర్థం చూడాలన్న మీ కోరిక తీరడం వెనుక మీ కోడలమ్మాయి సహకారం తప్పక ఉంది.
ReplyDeleteశ్రీనివాస్ జీ
Deleteగ్రామదేవతలను కొలిచే రూపంగా కూడా సంక్రాంతి తెనుగునాట ప్రసిద్ధి, అందులో భాగమే తీర్థం,తిరునాళ వగైరా,ఏ పేరుతో పిలిచినా. నేటి కాలంలో, ఆన్ లైన్ లో మనుషులతో సహా అన్నీ దొరుకుతున్నాయి. తీర్థంలో కొనుక్కోవడమో సరదా! .
పెద్దలపండగ పెద్ద పండగ,అల్లుల్లు కూతుళ్ళ పండగ,ఇది మన సంస్కృతి.నేటిది కాదు. ఇందులో భాగమే కోళ్ళపందేలు కూడా,ఇవన్నీ మీకు తెలియవని చెప్పడం కాదు,చాదస్తం.🙏 .
నేడు పట్నం పల్లెబాట పడుతోంది,చాలాకాలంగా. ఏముంది పల్లెలో! అదొక ఆకర్షణ.తీర్థాలకి జనం బాగా ఉంటున్నారు. కొత్తకొత్త చోట్ల తీర్థాలు వెలుస్తున్నాయి.ఉదాహరణ "బరి" దగ్గర.
"కోస"కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. గెలుపు ఒక కిక్,అంతే. దీనికోసం సంవత్సరం పొడుగునా పుంజుల్ని పెంచుతున్నారు.
ఇక నా తీర్థప్రయాణంలోకొస్తాను. తీర్థంలో ఒకకొడుకు, ముసలి తండ్రిని తీసుకొచ్చి చూపుతున్నాడు. 👍నేనే కాదు నాలా మరికికొందరూ ఉన్నారని సంబరపడ్డా! ఇక కోడలమ్మాయి (అమ్మ) సహకారం లేక రోజు నడవదు,ఆ సహకారమే నా జీవన రహస్యం, ఇక చిన్నచిన్న కోరికలు చెల్లించేందుకు బలమైన కారణం ఉంది, "ఈ పెద్దాయనకి వయసు పెరిగింది,ఆరోగ్యమూ అంతంత మాత్రమే, ఏదోరోజు చెప్పాపెట్టక దాటిపోతాడు,ఆ తరవాత తీర్థం చూడాలన్న చిన్న కోరిక నెరవేర్చలేకపోయానే అనే వ్యధ జీవితాంతం మిగిలిపోతుందని" భయం.
जिलेबी दुकाणं लेदा ?
ReplyDeleteమీఠీ కి దూకాన్ హై,స్వీటీ కి దూకాన్ నజర్ నహీ ఆయా!, ❤ప్యార్ కి దూకాన్ గాయబ్😜,జిలేబీ కి దూకాన్ నహీ ఆయా🤣. మిర్చిబజ్జీ కి దూకాన్ బహుత్ హై👍.
ReplyDelete-
Deleteమీఠీ కీ దూకాన్ హై
స్వీటీకి దుకానుహై సువిత్తు జిలేబీ
మాటేలె! మిర్చి బజ్జీ
హాటు దుకాణాల్ బహుత్! ప్రహారి ఘృతాచీ
జిలేబి,
Deleteజిలేబి దూకాన్ కి పర్మిషన్ ఇచ్చి ఉండరు. ఒక సారి సంతలో జిలేబి దూకాన్ వేసేడు,చాలా కాలం కితం, ఆ తరవాతడిగితే చెప్పేడు,దూకాన్ కి పర్మిషన్ ఇవ్వలేదని.
జిలేబి వేడి,వేడిగానే తినాలి. దేశీ జిలేబి,మినప్పిండి,బియ్యం పిండి కలిపి చేస్తారు.చాలా బాగుంటుంది. నీలాటి విదేశీ జిలేబి మైదాతో అతయారవుతుంది,యాక్కులారీ!!!జిలేబి దూకాన్ కి పర్మిషన్ ఇవ్వరు.
శార్దూలం నువ్వు రాసిందేనా? పట్టుకొచ్చినదా?కొట్టుకొచ్చినదా? అర్ధం కాలేదుగాని, కంజాతపత్రేక్షణా అనగానేమి?
కర్మ కర్మ తెలుగు వాళ్లకి తెలుగు నేర్పించాల్సిన కర్మ వచ్చేను :)
Deleteటెల్గూ మేష్టారు గారొచ్చి వివరించాలె :)
ణిసిధాత్వర్థము గన , నవి
Deleteఅసమశరాసను ' జిలేబు ' లండీ ! సారూ !
విసయము స్వీట్సుది గాదుట ,
పసగల తమరేల నింత బ్రమలో పడగన్ .
జిలేబి,
Delete"మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు"అన్న నానుడి చందంగా ఉందే!🤣
రాజావారు,
Deleteకుసుమశరానను జిలేబులంటారా?👍
-
Deleteగుసగుసలాడిరి తాతల్
కుసుమశరాసను తలంచి క్రొవ్విదపు ఖుషీ
మిసిమి తిరిగిరాన్ పడుచు వ
యసుమళ్లీ పిలువగా ప్రయాసల నడుమన్
నారదా!
జిలేబి
తీర్థమెళ్ళి తిరుగు ధీరత గలదన్న
ReplyDeleteఘనులు మీరు విబుధ ! గట్టివారె 👍
మిమ్ము జూ(కాచు)చు కొనెడు ' అమ్మ 'కు నమము, ల
దృష్ట మన్న మీదె , యనఘ ! నతులు .
రాజా వారు,
Deleteపుష్కరం కితం ఇల్లాలు నేను చేయ్యి చెయ్యి పట్టుకుని తీర్థం తిరిగాం. ఆ తరవాత తీర్థానికి వెళ్ళిన గుర్తు లేదు. ధైర్యం తెచ్చుకున్నా సారూ! నన్ను కాచే అమ్మ ఉందన్నదే ధైర్యం. నన్ను నిత్యం కనిపెట్టుకుని చూచే (కోడలమ్మాయిని) ఎంచుకుని తెచ్చుకున్నాం,ఇల్లాలు,నేను. మేనకోడలా?(మేనమామ కూతురా?) అని అడిగేవారంతా, ఇల్లాలిని. ఇల్లాలు దాటిపోయింది అమ్మ చేతులమీదుగా,నేను మిగిలిపోయాను. అలా అదృష్టవంతులమే.
ధన్యవాదాలు.
చిన్నమాట మీ బ్లాగులో వీడియో పనిచేయటం లేదు,చూడగలరు.
ఇప్పుడు ;Zilebi అని సెర్చ్ చేస్తే శొధిని వ్యాఖ్యల పేజీలో ఐదే పదో కాదు, అక్షరాలా 85 చోట్ల కనిపించింది!
ReplyDeleteబ్లాగుల్లో ఇంత రొద మనకు అవసరమా? దీనిని భరించటానికి బ్లాగులలోనికి ఎవరైన ప్రవేశించటం అవసరమా?
ఈ నిరంతర కాలుష్యకారి(ణి)తో చర్చలు చేస్తూ, సమాధానాలు చెప్తూ ఎందుకు ఇతోధికంగా అవకాశాలు కల్పిస్తున్నారు? దయచేసి సంయమనం పాటించండి.
తమాషా ఏమిటంటే ఈ జిలేబీకి వీరాభిమానులు కూడా మహాత్ములు కొందరున్నట్లున్నారు.
మిత్రులు శ్యామలీయం వారు,
Deleteనమస్కారం.
జిలేబి గురించి వెతికేటంత ఓపిక లేదు.
నేను ఎవరిని పట్టుకోలేదు,ఎవరిని వదిలి పెట్టలేదు. నేనెవరిని అభిమానించినది లేదు. ఎవరేనా నా అభిమానులన్న మాట గతం.
ఎవరిని ప్రొత్సహించినది లేదు. ఎవరిని తెగడను,పొగడను. నాపని నేను చేసుకుంటున్నా!
ఎవరికర్మకి వారే బాధ్యులు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా!. జిలేబి కర్మకి నేను బాధ్యుడిని కాదు. బ్లాగుల్లో ఇంత రొదకి నాది బాధ్యతకాదు.
గతం గురించి ఆలోచించను,వ్యర్ధం. కానున్నది కాకమానదు,ఆతృత లేదు. ఒకరిగురించి ఆలోచించేటంత ఓపికలేదు,మన్నించాలి. పరమాత్మ గురించి కొంత కాలం వెతికేను,కనపడలేదు,వెతకడం మానేసాను.పరమాత్మను పట్టుకోలేదు,వదిలెయ్య లేదు. పరమాత్మను బయట వెతకడం వెర్రితనమని తెలుసుకున్నా! ఈ నేను అన్నదెవరు? ఈ శరీరం నేను కాదని చెబుతున్నా! కాని శరీరబాధలు నావి కావనుకోలేకపోతున్నా! ఈ శరీరబాధలు నావి కావనే స్థితికోసం, ఈ శరీరం నేను కాదనే స్థితి కోసం తపిస్తున్నా!
ఎక్కువ చెబితే మన్నించి మరిచిపోండి.
మహాత్ములు కొందరున్నట్లున్నారు.....
Deleteతాడిగడప గారని ఒక మహాత్ములు వున్నారు వారి గురించేనాండి మీరన్నది ?
లేకుంటే మా రాజా రావు మేష్టారు గారి గురించాండి ?
జిలేబి,
Deleteనేనెవరిని ఏమీ అనలేదు,అనను కూడా!ఎవరినీ ద్వేషించను.
నన్ను నాకులాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి,నాపై విషం చిమ్మి,పిచ్చెక్కి, బ్లాగు వీధులవెంట నాలిక భుజాన వేసుకుని తిరిగినవాళ్ళని, నన్ను నాకులాన్ని ద్వేషించినవాళ్ళను, ద్వేషించలేదు.
నేను చావలేదని ఏడ్చినవాళ్ళను ద్వేషించలేదు.
నా భార్య చనిపోతే చంకలుగుద్దుకుని పండగ చేసుకున్నవాళ్ళను ద్వేషించలేదు.
నాపై విషం,ద్వేషం చిమ్మినవారిని చెప్పినమాట చెప్పకుండా పొగిడి ప్రోత్సహించిన మహానుభావుల్ని ద్వేషించలేదు.
ఇందరు మహానుభావులు తమ సారధ్యంలో, తమ బ్లాగు ముఖంగా ద్వేష విషం నాపై చిమ్మితే ఎవరినీ ప్రతిగా ద్వేషించలేదు. తమరెంత మహాత్ములో కదా!
ఎవరి కర్మ వారే అనుభవిచక తప్పదు.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనకయుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ
అన్నది ఆలస్యంగా గుర్తించాను.
ద్వేషం నీ కాతాలో మాట,నీ అంగడి సరుకు.
చేసిన(ధర్మము)కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.కర్మఫలం చెడనిది,ధర్మఫలం ఎలా వెంటవస్తుందో కర్మఫలం వెంట వస్తుంది. ఫలితం ఇచ్చి తీరుతుంది, నేడు చాలామందికి ఇది ఎదురుగా కనపడుతున్నా ఎందుకోలే అనుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ. ఎవరి కర్మ వారిదే,దాని ఫలాలూ వారివే. ఎవరి బతుకువారిదే, ఎవరిచావూ వారిదే. ఆరు ఊర్ములున్నాయి,అవి ఆకలి,దప్పిక;జర,మరణం;మోహం,శోకం. ఇవి ఎవరివి వారే అనుభవింపక తప్పదు. ఔట్ సోర్సింగ్ కుదరదు. అనుభవించు.
ఏల ఈ కారణములేని ఆశీస్సులు ?
Deleteనేనెవరని చింతవలదు
ReplyDeleteతానై వెలిగిన అనంత తత్త్వమొకటె వుం
డేనయ్యా తాతా మీ
లో నాలోను మనలో పలువిధములగుచున్
చిలకపలుకుల మెట్టవేదాంతం నీకంటే బాగా చెప్పగలనేమో! ఆ అనంత తత్త్వం నేను ఒకటే అనేది అనుభవంలోకి రావడం అంత తేలికేం కాదని నా అనుభవం.
Delete-
Deleteచిలుకపలుకుల తెలుపగల
నలవోకగ శుష్కనైగమమ్ముల నే నీ
వలె యుపయోగము గలదా
జిలేబి, పరమాత్మ యునికి జీవికి గలుగున్ ?
నే నేమీ మాహాత్ముడ
ReplyDeleteగానండీ , విబుధ ! అతి సగటు మనిషిని , నా
మానాన న్నే నుండగ ,
దీనన్ నన్నేల లాగ ? ధీమతు లకటా !
ఔనా ? అయితే మొదటి పేరు వారే అయ్యుంటారనుకుంటా :)
Deleteపరమాత్మతోడ నడచుట
ReplyDeleteవరపురుషులకే సుసాధ్యపడు నేమొ బుధా !
అరయగ నతని హితోక్తుల
నిరవొందగ నాచరించ హిత మొనరు గదా !
కరుణారసార్ద్ర హృదయా !
ReplyDeleteవరదా ! రఘువీర ! భక్తవత్సల రామా !
సుర బృంద ముకుళిత కర ! య
సుర విదళన భయదచాప ! సూర్య కులాబ్ధీ !
Jokes apart thaatha gaaru
ReplyDeleteTake it or leave it
So long as we think we are away from Him we are so. Give a try of thought sankalpa and meditate overb "I am in antaryaamin then all will be well no more question of who am I as there is no I different to that of Him.
Amen!
May the lord bestow wisdom to all
పరలోకములోని తండ్రీ :)....
జిలేబి