Wednesday, 30 July 2025

లా వొక్కింతయు/ లావొక్కింతయు



లా వొక్కింతయు/ లావొక్కింతయు


 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 

ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!


”లా” వొక్కింతయు లేదు’  అని వాపోయారు పోతన నాటి కాలంలోనే! ఆయన రాసిన భాగవతాన్ని అంకితమివ్వలేదని రాజు దండించబూనడం వగైరా చెబుతారు, ఆ తరవాత ఇమ్మనుజేశ్వరాధముల...కంటూ భాగవతంలోనే రాసెయ్యడంతో మన దాకా వచ్చేసింది. 

మరి నేటి కాలానికొస్తే లా లేదోయ్ మా దేశంలో అని ఎలుగెత్తి చాటుతున్నారో పక్క, మరో పక్క సుప్రీం కోర్ట్ అర్ధరాత్రి తలుపులుదీసి మరీ న్యాయం చెబుతోంది. అంతే కాదు సమయం దాటిన తరవాత కూడా బెంచీలు అప్పటికప్పుడు కూర్చి, కుదరకపోతే మార్చి న్యాయం చెప్పేస్తున్నారు.నేనే చంపేను,ఇదీ కారణం,ఇదిగో వీడియో అని చెప్పి సోషల్ మీడియాలో వీడియో పెట్టినవారిని తగు సాక్షాలు చూపడంలో పోలీస్ విఫలం, అంజెప్పి కేసులు కొట్టేసెతే, పీక తీసినవాడు జల్సాగా బోరవిరుచుకు తిరుగుతున్నాడు, న్యాయం, ఉన్నట్టా? లేనట్టా? న్యాయం ఉన్నట్టా? లేనట్టా? మాన్యులకేగాని సామాన్యులకు కాదనేవారూ ఉన్నారు. ఏమో ఇది విష్ణుమాయా?

దీనికేంగాని ఎంతజెప్పుకున్నా తరిగేదీ కాదు... పోతనగారి లావొక్కింతయు లేదు దగ్గరకుపోదాం.
లావొక్కింతయు లేదు అని వాపోయినవాడు గజేంద్రుడు, ఎక్కడా? మడుగులో! ఎప్పుడూ? మొసలి పట్టినపుడు, పోరాడి,పోరాడి ఇక లాభం లేదనుకుని సంపూర్ణ శరణాగతి చేసిన సమయంలో . అసలీ మొసలేంటి మడుగేంటి అనుమానం రాలేదేం!!! మనమే ఈ గజేంద్రుడు, మడుగే ఈ సంసారం, మొసలే కోరికలు. 

గజేంద్రుడు కరిణీ సంఘంతో బయలుదేరేడు. కొంతదూరంపోయేటప్పటికి ఒక మడుగు కనపడింది, అది చాలా ఆకర్షణీయంగా ఉంది. దాంతో జలకాలాటలకి దిగేడు పత్నులతో ఇంకేంటి మడుగు కలచేసి దున్నేసేరు, అంతా కలిసి. ఇప్పుడు అందులో ఉన్న మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది, దాంతో పోరాటం మొదలెట్టేడు. కరిణీ సంఘం గట్టెక్కేసి చూస్తూ నిలబడింది. గజేంద్రుడు పోరాడి పోరాడి అలసిపోయి, తన బలం పూర్తిగా నశించిందని గుర్తించి, ఇది దైవ కృపతో జరిగేదని తలచి,లావొక్కింతయు లేదు అన్నాడు .... 

ఈ గజేంద్రుడు మనమే! అమ్మా బాబూ, కడుపు కట్టుకుని చదివిస్తే చదివేసుకున్నాం! ఆ తరవాత జేరబడింది సిరితల్లి,ఇల్లాలు. ఇంకేం కోరికలు మొలుచుకొచ్చేయి. కోరికలు తీర్చడానికి పడ్డ పుర్రాకులకి కొదవే లేదు. సంపాదనే ధ్యేయంగా సాగిపోయింది, ఇక మనకి ఎదురు లేదు అనుకుని కాలం గడుపుతున్న కాలంలో మొసలిలాటి బలవత్తరమైన కోరికేదో పట్టింది,దానికోసం ప్రయత్నంలో పోరాటం తప్పలేదు. కాలం చెల్లిందిగాని కోరిక తీరలేదు,మొసలి వదల లేదు.వయసూ మీద పడింది.  కాని ఒంట్లో రోగం మాత్రం ప్రవేసించింది. అది పెరిగి పెద్దదయింది. కదలలేని రోజొస్తే ఆసుపత్రిలో పారేసేరు. ఐ.సి.యు బయట ఇల్లాలు,కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు అల్లుళ్ళు ఎదురు చూస్తున్నారు, డాక్టర్ చెప్పే కబురు కోసం.  ఎవరి గోల వారిదే! డాక్టరు ఇంకా వీళ్ళ దగ్గర ఎంత గుంజచ్చు అంచనా వేస్తున్నాడు. పెళ్ళాం ఏదో సంపాదించాడు,విల్లు రాసేనన్నాడు ,నాకూ చెప్పలేదు. ఏమి రాసేడో! నాకేమైనా ఇచ్చాడా ? ఇక కొడుకులు ఇక్కడ కొంప,గోడు అంటాడు, అమ్మేసి వచ్చెయ్యంటే వినడు. విల్లులో ఏం రాసేడో!!! ఇక కూతుళ్ళు అల్లుళ్ళు, మనకి ఎందుకీ జాగరం? విల్లులో ఏంరాసేడో! కొడుకులకే ఇచ్చుకుని ఉంటాడు, మీకేం ఉండదు, అని అల్లుళ్ళ సతాయింపు కూతుళ్ళని సన్నగా! ఇలా బయట గుంపుచింపులు పడుతుండగా లోపల బెడ్ మీద మానవునికి గడచిన జీవితం రీలు తిరిగి, అయ్యో! ఈ పెళ్ళము పిల్లల కోసమా నేను ఇన్ని నాళ్ళూ తిప్పలు పడినది? నా ఆరోగ్యం కూడా చెడగొట్టుకుని సంపాదించినది? గజేంద్రుడి భార్యలు గట్టెక్కి చూస్తూ నిలబడినట్టు, నేడూ నావాళ్ళన్నవాళ్ళంతా బయట నా చావుకోసం ఎదురు చూస్తున్నారు. పరమాత్మా జీవితంలో తప్పు చేసాను, ఇక వ్యాధులతో పోరాడ లేను, త్వరగా తీసుకుపో అని ప్రార్ధిస్తున్నాడు.
అదే
లా ఒక్కింతయు లేదు..... 

Tuesday, 29 July 2025

భయం

భయం


 *ఇది హాస్యం కాదు…🙏*

*దయచేసి చదవండి, మీకు నచ్చితే ఇతరులతో కూడా పంచుకోండి!*


### *!!! అల్ట్రా-మాడరన్ మెడికల్ సైన్స్ !!!*


*డా. అనన్యా సర్కార్ రచన*


మీకు రెండు లేదా మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది. మందులు తీసుకోకపోయినా, మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా  కోలుకుంటుంది..

కానీ మీరు డాక్టర్‌ను సంప్రదించారు.

డాక్టర్ మొదటినుంచే పలు టెస్టులు రాసేశారు.


పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం కనపడలేదు.

కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ పెరిగినట్టు చూపించాయి — ఇవి చాలా మందిలో సాధారణంగా ఉండే విషయాలే.


జ్వరం తగ్గిపోయింది.

కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు.

డాక్టర్ మీకు చెప్పారు:


> "మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రీ-డయబెటిక్. మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసే మందులు వాడటం మొదలుపెట్టాలి."


దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి.

మీరు ఆహార నియమాలను కచ్చితంగా పాటించకపోయినా — మందులు తీసుకోవడం మాత్రం మరిచిపోలేదు.


మూడు నెలలు గడిచాయి. టెస్టులు మళ్లీ జరిగాయి.

కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది.

కానీ ఇప్పుడు మీ *బీపీ* కొంచెం పెరిగిపోయింది.

ఇంకో మందు వచ్చేసింది.

ఇప్పుడు మీరు *మూడు మందులు* వాడుతున్నారు.


ఇవన్నీ విని మీకు *ఆందోళన* పెరిగింది.


> “ఇంకా ఏమి జరుగుతుంది?”

> ఈ టెన్షన్ వల్ల మీరు *నిద్రలేమి*తో బాధపడడం మొదలుపెట్టారు.

> డాక్టర్ *నిద్ర మాత్రలు* రాసేశారు — ఇప్పుడు మందుల సంఖ్య *నాలుకైంది*.


ఈ మందుల వలన మీకు *అమ్లత (acidity)* మరియు *జ్వాల (heartburn)* మొదలయ్యాయి.

డాక్టర్ చెప్పారు:


> “ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ టాబ్లెట్ తీసుకోండి.”

> ఇప్పుడు మీ మందుల సంఖ్య *ఐదు*.


ఆరు నెలల తర్వాత ఒకరోజు మీకు *ఛాతీలో నొప్పి* వచ్చి ఎమర్జెన్సీకి వెళ్లారు.

పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:


> “మీరు సమయానికి వచ్చారు, లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది.”


మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి.

వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:


> “ప్రస్తుతం ఉన్న మందులు కొనసాగించండి. కానీ గుండె కోసం ఇంకో రెండు మందులు వేసుకోవాలి. అలాగే ఎండోక్రినాలజిస్ట్‌ను కలవండి.”

> ఇప్పుడు మీరు *ఏడు మందులు* వాడుతున్నారు.


కార్డియాలజిస్ట్ సలహాతో, మీరు ఎండోక్రినాలజిస్ట్‌ను కలిశారు.

ఆయన ఇంకో *షుగర్ మందు* మరియు *థైరాయిడ్ టాబ్లెట్* చేర్చారు — ఎందుకంటే థైరాయిడ్ లెవల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.


ఇప్పుడు మొత్తం *తొమ్మిది మందులు*.


ఇలా మీరు నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మడం ప్రారంభించారు:


* గుండె రోగి

* డయాబెటిక్

* నిద్రలేమి బాధితుడు

* గ్యాస్ సమస్యలు

* థైరాయిడ్

* కిడ్నీ సమస్యలు

  ... ఇంకా చాలానే


ఎవ్వరూ మీకు చెప్పలేదు — మీరు మెరుగైన *మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో* ఆరోగ్యంగా ఉండవచ్చని.

అదే బదులుగా, మీకు పదే పదే చెప్పబడింది — మీరు తీవ్రమైన రోగి, బలహీనుడు, విఫలమైన వ్యక్తి అని.


ఆరు నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వలన మీకు *మూత్ర సంబంధిత సమస్యలు* మొదలయ్యాయి.

అదనంగా టెస్టులు చేశారు — *కిడ్నీ సమస్యలు* ఉన్నట్టు అనుమానం వ్యక్తమైంది.


డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పారు:


> “క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరిగాయి. కానీ ఆందోళన అవసరం లేదు — మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది.”

> ఇప్పుడు ఇంకో *రెండు మందులు* చేర్చారు.


ఇప్పుడు మీరు *పదకొండు మందులు* తీసుకుంటున్నారు.


మీరు ఇప్పుడు ఆహారంకంటే *ఎక్కువ మందులు* తీసుకుంటున్నారు, మరియు ఆ మందుల దుష్ప్రభావాల వలన మీరు *మెల్లగా మరణం వైపు* నడుస్తున్నారు.


ప్రారంభంలో, మీరు జ్వరంతో డాక్టర్‌ను కలిసినప్పుడు, ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది?


> "ఎటువంటి భయం అవసరం లేదు. ఇది తేలికపాటి జ్వరమే. మందుల అవసరం లేదు. విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా నీళ్లు తాగండి, తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి, ఉదయం వాకింగ్‌కి వెళ్లండి — అంతే. మందులేమీ అవసరం లేదు."


*కానీ అలా అయితే… డాక్టర్లకు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?*


---


### ముఖ్యమైన ప్రశ్న:


*డాక్టర్లు హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు?*

*ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు?*


ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం:


* *1979లో, డయాబెటిస్ గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవల్ **200 mg/dl*.

  అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం *3.5%* మాత్రమే టైప్-2 డయాబెటిక్‌గా గుర్తించబడ్డారు.


* *1997లో, ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో, ఈ పరిమితి **126 mg/dl*కి తగ్గించబడింది.

  దీంతో డయాబెటిక్ జనాభా \\*3.5% నుండి 8%\\కి పెరిగింది — అంటే **4.5% మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు*.

  *1999లో*, WHO దీనిని అధికారికంగా ఆమోదించింది.


ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి.


* *2003లో, **అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA)* ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్‌ను *100 mg/dl*గా పేర్కొంది — దీన్ని ప్రీ-డయాబెటిక్‌గా తీసుకున్నారు.

  దాంతో *27% జనాభా డయాబెటిక్‌గా మారిపోయారు* — ఎటువంటి అసలు కారణం లేకుండానే.


* ప్రస్తుతం ADA ప్రకారం, *భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 140 mg/dl* అయినా డయాబెటిస్ గా పరిగణిస్తున్నారు.

  దీని వల్ల ప్రపంచ జనాభాలో *సుమారు 50% మంది* డయాబెటిక్ లు అయిపోయారు — కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే.


భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి — అంటే *HbA1c 5.5%* అని స్టాండర్డ్ పెట్టాలని చూస్తున్నారు, తద్వారా మరింత మందిని రోగులుగా మలచి మందుల అమ్మకాలు పెంచడం.


చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం *HbA1c 11% వరకు* కూడా డయాబెటిస్‌గా పరిగణించాల్సిన అవసరం *లేదంటారు*.


---


### మరో ఉదాహరణ:


*2012లో, ఒక పెద్ద ఫార్మా కంపెనీకి *\$3 బిలియన్** జరిమానా వేసింది *US సుప్రీం కోర్టు*.

2007–2012 మధ్యకాలంలో వారి డయాబెటిస్ మందు *గుండెపోటు వచ్చే అవకాశాన్ని 43% పెంచింది* అనే ఆరోపణ.


ఆ కంపెనీ ఇది ముందుగానే *తెలుసుకుని కూడా దాచేసింది* — లాభాల కోసమే.

ఆ సమయంలో వారు *\$300 బిలియన్* లాభం పొందారు.


---


*ఇదే ఈరోజు “అధునాతన వైద్య విధానం”!*


*ఆలోచించండి… ఆలోచించడం మొదలుపెట్టండి…*


---


✅ ఇది తప్పక భద్రపరచదగిన విషయం.

🧏‍♂️🧏‍♀️

*అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి — ఇదే నా మనస్ఫూర్తి కోరిక.


Courtesy:Whatsapp.

భయం మన శరీరంలోకి నరనరానా కొద్దికొద్దిగా ఎక్కించబడింది. మనదైన వైద్యాన్ని పోగొట్టుకున్నాం, చేతులారా నాశనం చేసుకున్నాం!  

Monday, 21 July 2025

జిలేబి-సమోసా

Courtesy:Whats app

 ఈ రోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ట.
*****

జిలేబి-సమోసా

జిలేబి-సమోసా గురించి ఏ ప్రభుత్వానికి కోపమొచ్చిందో. మనకా రెండు తెనుగు ప్రభుత్వాలున్నాయి, ఒకటి జాతీయ ప్రభుత్వం. ఈ హెచ్చరిక ఎవరిదబ్బా!
 ఈ హెచ్చరిక ఎవరు చేసినా తిట్టచ్చు,మనకి ( మంకీ అనచ్చునంట)  వాక్కు,స్వాతంత్ర్యం ఉన్నాయి గనక. పొరబాటుగా కూడా ట్రంప్ గురించిగాని, అమెరికా ప్రభుత్వం గురించిగాని మాటాడేరా!  మీ వీసా కట్టు,వీసా ఇస్తే కూడా గుడ్ బిహేవియర్ టాక్స్ కట్టాలట అదెంత? 250 డాలర్లు,మీరు అమెరికాలో అడుగెట్ట లేరు. అమెరికాలో అడుగెట్టక తప్పదుగదా మీకు, నోరు కుట్టేసుకోండి. మోడీ ని తిడితే కావలసినంత పబ్లిసిటీ,యోగీని తిట్టినా అంతే. ఇక మా రాహుల్ బాబాని తిట్టుకుంటారా! మీదే కర్మ. మరి తెనుగు రాజుల్ని తిట్టుకుంటారా? మీ చిత్తం అభిమానులు కర్రుచ్చుకుంటే నా బాధ్యత లేదు. ఔరా జిలేబీ! ఎంతకి తగుదువు, ఎక్కడ జూసినా తగువులే .🤣 

Saturday, 19 July 2025

పేకాట పేకాటే పెద్దన్నయ్య....

 పేకాట పేకాటే పెద్దన్నయ్య....

పేకాట పేకాటే, పెద్దన్నయ్య పెద్దన్నాయే. ఈ నానుడిని తెనుగునాట విరివిగానే చెబుతారు.దీన్నే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనీ చెబుతారు. పేకాటలో కూచున్నాకా ఓడిపోతే ఓకులు లెక్కపెట్టి డబ్బులివ్వను, నేను అన్ననురా/తమ్ముణ్ణి అనడానికి లేదు. ఇచ్చి తీరవలసిందే. అదేదో పేకాటలో కూచునే ముందే తేల్చుకోవాలి. దీన్నే మరో ముతక సామెతగా చెబుతారు మా పల్లెటూరివాళ్ళు 'మంచం ఎక్కేదాకానే వరస, మంచం ఎక్కేకా వరసేంటి?' అంచేత పేకాటకి బంధుత్వానికి లింక్ పెట్టద్దు.


 ఇదీ భారతం నుంచి వచ్చిందే! జూదానికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళి జూదం లో కూచున్నాకా అన్నీ ఓడిపోయాడు. జరగవలసినవన్నీ జరిగిపోయాకా, గుడ్డి రాజుగారు ఇదంతా తూచ్! అనేసి వరాలిచ్చేసి పంపించేసేడు. మళ్ళీ జూదంలోనూ ఓడిపోయిన పాండవులు అడవులకు పోయారు. రాజ్య భాగం గురించిన మాట షరతుల్లో లేదు. వనవాసం తరవాత రాజ్య భాగమడిగితే సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు,దుర్యోధనుడు. 'రాజ్యం వీర భోజ్యం' కనక యుద్ధం జరిగింది. గెలిచినవాళ్ళు రాజ్యం చేసుకున్నారు. ఇదిప్పటికిన్నీ జరుగుతున్నదే!  

నేటికాలానికి ఈ నానుడిని వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అని చెబుతుంటారు. రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళకి పన్నులు పెంచేస్తామని అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. ఇదేంటి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు,మమ్మలిని వద్దనడం,కాదని చేసిన వాళ్ళకి పన్నులు పెంచుతాం. ఇదేం వ్యాపారం? ఇది వ్యాపారం కాదు, వ్యవహారానికి లింకు. రష్యాని యూక్రెయిన్ తో యుద్ధం మానుకోమని చెప్పండి మేమూ చెబుతాం. కాదు మేము రష్యాతో వ్యాపారం చేసినవాళ్ళకి పన్నులు పెంచుతామని బెదిరించి రుబాబులు చేసి రోజులు గడుపుకునే కాలం చెల్లింది. రుబాబులు చెయ్యకండి వ్యాపారం వ్యాపారం లా చేయండి,వ్యవహారం వ్యవహారం లా చేయండి, రెండిటిని కలిపి ఆధిపత్యం వెలగబెట్టె రోజులు చెల్లేయని గుర్తించండని  భారత్ యూరోపియన్ యూనియన్ కి తెగేసి చెప్పింది. వార్నీ!  మన పేకాట సామెత అంతర్జ్యాతీయంగా వెలిగిపోతోంది.    

Wednesday, 9 July 2025

*విశ్వనాథ వారి వ్యక్తిత్వం గురించి వారి శిష్యులు పేరాల భరత శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాలు*


----------------------/--------------------


ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లో పోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తే గాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా! అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా ! ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడ నుండి ఊడి పడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ!? నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు! ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది! అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి, యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం.. కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది! లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడి నంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత...సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలా మంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె." ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా! 


‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి’’


‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’

అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.


(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది!)🙏🙏

=====================

Courtesy:Whats app.

Sharing courtesy:Narasimha Rao. Vinnakota.

Monday, 7 July 2025

శవాలంకారం.

 శవాలంకారం.

ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు. ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమనే అర్ధం కదా! మరి ఈ శవానికి అలంకారం చేస్తారు. బతికుండగా అలంకారం చేస్తే ఆ శరీరంలో ఉన్నవారు ఆనందించనైనా ఆనందించేవారు. చనిపోయి శవమైన తరవాత అలంకారం ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనమని తెలిసీ అలంకారం చేయడమే చిత్రం. మానవులు బహు చిత్రాతి చిత్రమైనవారు సుమా!  

Friday, 4 July 2025

1920 లో ప్రభుత్వ తెనుగు ఉత్తరువు

 1920 లో ప్రభుత్వ తెనుగు ఉత్తరువు


1920 లో నా దత్తత తండ్రిగాని జనాభా లెక్కల న్యూమరేటర్ గా తెనుగు ఉత్తరువు

Thursday, 3 July 2025

మగాడు

 మగాడు

తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.

ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.   


ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా. 


ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.

-------------

కట్ చేస్తే 

పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.

సూతోవాచా ! 

పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు. 

మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.

దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి  ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా  చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.

Wednesday, 2 July 2025

ఆరు నూరైనా

  ఆరు నూరైనా

ఆరు నూరైనా,నూరు ఆరైనా! ఆ సూర్యుడిటు పొడిచినా, ఈ సూర్యుడటు పొడిచినా ...

ఇదొక వ్యవహారికం. 

ఆరేమిటి,నూరేమిటి? అర్ధం కాలేదు. ఆరు రుచులు (షడ్రుచులు), ఇవి ఎప్పటీ నూరు కావు. నూరు రుచులు లేవు. కనక ఇవి కాదు.

 ఆరు గుణాలు (షడ్గుణాలు). అవి కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు. ఇవి వెర్రితలలేస్తే నూరు పైనే కావచ్చు. కాని నూరు ఐన ఆగుణాలు ఆరు మాత్రం కావు,ఎన్నటికిన్నీ! అందుచేత ఇవీ కావు. 

షడంగాలు, ఇవి చాలా రకాలున్నాయి, అందు చేత అవీ కావు.


ఆరు రూపాయలు నూరు రూపాయలూ అవుతాయి,నూరు రూపాయలు ఆరు రూపాయలూ అవుతాయి. నేటి కాలంలో ఇవే చెప్పుకోవాలి. ఆరు నూరెలా అవుతాయి? కష్టపడి పని చేస్తే ఆరు నూరవుతాయి.తిని కూచుంటే నూరు ఆరు కావడం పెద్ద కష్టం కాదు. ఆరు నూరైనా,నూరు ఆరైనా; ఆసూర్యుడిటు పొడిచినా,ఈ సూర్యుడటు పొడిచినా పని కావాల్సిందే! అంటే సవ్యమైన పద్ధతులలోగాని అపసవ్య పద్ధతులలో గాని పని కావలసిందేనని భావం.  

Tuesday, 1 July 2025

ఏది శాశ్వతం?

 ఏది శాశ్వతం?

(రవీంద్రనాథ్ ఠాగూర్  అద్భుతమైన కవిత)



"నేనిక లేనని తెలిశాక  

విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  మిత్రమా! అదంతా నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం ఎలా చూడగలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంపరాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు 

నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేయలేవా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!


సానుభూతి తెలపడానికి 

నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. 

నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,

బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను

హాయిగా నీతో మెలుగుతాను!"

------------------------------------------------

- ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*

                   

ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి 

మళ్ళీ కలుస్తాడో లేదో? 

మాట్లాడతాడో లేదో?    

  

ఏది శాశ్వతం?

ఎవరు నిశ్చలం?🌹🌹🙏...శ్రీ 🦋

----------------------------------------------------------

Coutesy:Whats app

విశ్వకవికి శతాధిక వందనాలు.

  జీవిత సత్యం తెలుపుతూ టాగూర్ రాసిన ఇంత అద్భుతమైన కవిత ఉన్నదని నాకు నేటివరకు తెలియదు.

 దీనిని వాట్సాప్ లో పంచుకున్న విన్నకోటవారికి 

 వందనాలు.


కావలసినవారో పైవారో అందరిని పలకరించండి,తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి. అంతర్ముఖులు కాకండి.

ఒక వయసొస్తేగాని ఈ కవితలో అందం ఒంటబట్టదేమో 🤣