మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
ఏ దేశానికైనా విదేశాంగ విధానం ఒకటే! అదే స్వార్ధం. తమ దేశపు అవసరాలు ముందు,ఇదే అన్ని దేశాలకి వర్తిస్తుంది.
అంతర్జాతీయ రాజకీయం చాలా వేగంగా మారిపోతోంది, మరో సారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి. రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఒకటి యూక్రైన్ రష్యా మధ్య,మరొకటి హమాస్ ఇస్రయెల్ మధ్య. మొన్న శుక్రవారం అమెరికా ఓవల్ ఆఫీసులో జరిగిన రగడ, అదిన్నీ పాత్రికేయుల ఎదురుగా, ఒక పెద్ద చరిత్ర . జలనిస్కీ ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వేడి పుట్టించింది. అమెరికా అధ్యక్షుని నోట జలనిస్కీ మూడవ ప్రపంచయుద్ధంకి తెర తీస్తున్నాడన్న మాట వినపడింది. జలనిస్కీ సంధికి ఇష్టపడటం లేదన్న సంగతీ తెలుస్తూనే ఉంది, ఇది మిత్ర దేశాలలో వేడి పుట్టించింది. ఈ సమావేశానికి ముందే ఫ్రాన్స్,బ్రిటన్, జర్మనీలు ట్రంప్ ను కలిసాయి. రాజకీయాల్లో బ్రిటన్ అమెరికా ఎప్పుడు విభేదించవు, కాని కొంత విరుగు చూపి, Britan యూక్రైన్ కి పెద్ద లోన్ ఇవ్వడానికి ఒప్పందం చేసేసుకుంది, దీని తరవాతే . బ్రిటన్ సైన్యం ఒంటరిగా రష్యాను ఎదుర్కోగలదని ట్రంప్ ఎగతాలిగా మాటాడినది కూడా బయట పడింది. ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోతున్నట్టుంది. ఏదో రకంగా ఆయుధాలు అమ్ముకోడమే ధ్యేయంగా ఉండే అమెరికా శాంతి అంటోంది, ఇదే ఒక చిత్రం. మొన్న జరిగిన మీటింగ్ లో ట్రంప్, నీకు సంధి కావాల న్నపుడే వద్దువులే అని కూడా అనేసేరు,జలనిస్కీతో. జలనిస్కీ, నీ చాపకిందికి నీళ్ళొస్తున్నాయి చూసుకోమనీ ట్రంప్ కి చెప్పేసేరు. ఇంతదాకా మీ కోసం సరఫరా చేసిన ఆయుధాల ఖరీదుకుగాను నీ దేశంలోని రేర్ మెటల్స్ గురించి ఒప్పందం మీద సంతకం చేయమంటే జలనిస్కీ చేసినదీ తిరుగుబాటు. పల్లెటూరి రచ్చబండ రాజకీయంలా వ్యవహారం సాగిపోయింది. బ్రటన్ లోన్ ఇవ్వడం ఆయుధాలు అమ్ముకోడానికే! ఇతర నాటో దేశాలన్నీ చిన్నవి జర్మనీ, ఫ్రాన్స్ తప్పించి. అమెరికా ఇక ముందు ఆయుధాలు ఇవ్వననీ,యుద్ధం కాదు ఇప్పుడు నీకు సంధి మాత్రమే అవసరం అని చెప్పినా జలనిస్కీ వినలేదు. బ్రటన్ ఆయుధాలతో యూక్రైన్ పోరాటం దేశ వినాశనమే అవుతుందని సోషల్ మీడియా ఉవాచ, ఆయుధాలున్నా పోరాట యోధులు లేని చందమైపోయింది యూక్రైన్ కి. నాటో దేశాలు ఉమ్మడిగా యూక్రైన్ తరఫున రష్యాను ఎదుర్కొంటాయా! తెల్లారి లెస్తే పొయ్యిలో పిల్లి వెలగాలంటే నాటో దేశాలన్నీ రష్యా ఇచ్చే గేస్ మీద ఆధారపడక తప్పదు. ఒక గేస్ పైప్ లైన్ యూక్రైన్ ద్వారా వెళ్ళేదానిని పాడు చేసేరు. ఎవరిగోల వారిదే,ఎవరి అవసరమూ వారిదే.యూరప్ మంటల్లో ఉంది.
ఇదిలా ఉండగా ట్రంప్ ఆఫ్గనిస్తాన్ లో వదిలేసిన ఆయుధాలు,అప్పుడు యుద్ధంలో మీకిచ్చిన ఆయుధాల ఖరీదు చెల్లించమని ఆఫ్గనిస్తాన్ పీకమీద కూచునేలా ఉంది.ఎందుకిప్పుడు ఇది గుర్తొచ్చింది? ఆఫ్గాన్ లో ఉన్న కొన్ని మెటల్స్ ని స్వంతం చేసుకోవాలని చైనా చూస్తోంది. వాటిని చైనాకి దక్కకుండా చేయాలని అమెరికా ప్రయత్నం. ఇక మధ్య ప్రాశ్చంలో ఇస్రయెల్ అమెరికా మాటకి బుర్ర ఊపుతోంది,యుద్ధం కొనసాగుతోంది.
మరోపక్క చైనా ఆఫ్గాన్ మీద కన్నేసి ఉంచింది. అమెరికా దిగితే తానూ దిగేందుకు సిద్ధoగానే ఉంది. ఆస్త్రేలియా,జపాన్ లు అమెరికా పాటపాడుతున్నాయి. ఇండియా తటస్తంగా ఉంది.
భారత్ కి అంతర్గత శత్రువులే! బయటి శత్రువులు తెలిసినవారే!! అంతర్గత శత్రువులు స్వయంప్రకటిత మేధావులు,అర్బన్ నక్సల్స్,ఆందోళన జీవులు. వీరికి జనం సుఖంగా బతకడం ఇష్టముండదు. వీరు అధికవిద్యావంతులు,శేషప్పకవి చెప్పినట్టు ఈ అధిక విద్యావంతులు అప్రజోజకులే అవుతున్నారు, ఎంగిలి మెతుకులకోసం దేశాన్ని తాకట్టు పెట్టెయడానికి కూడా వీరు వెనుకాడరు. డీప్ స్టేట్ వారి ఎంగిలి నీళ్ళు,మెతుకులకి ఆశపడే జీవులు. వీర్నేదైనా అంటే భోరున ఏడుస్తారు, మమ్మల్ని అనేసేరు,చూశావా దేశంలో వాక్కు స్వాత్రత్ర్యం లేదు వగైరా వగైరా వాగుతారు, ఇది వీరి జన్మహక్కు. పట్టించుకుంటే రెచ్చిపోతారు. ఎదో చెయ్యాలి ఊరుకే వదిలేస్తే లాభం లేదు.
ఇంతకీ అమెరికా యూక్రైన్లో శాంతి వచనాలు పలకడానికి కారణం చూస్తే,ఇంతవరకు జరిగిన యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో యూక్రైన్ దేశపు రేర్ మెటల్స్ లో 60 శాతం ఉన్నాయి. రష్యాని అక్కడినుంచి తొలగించి,ఆమెటల్స్ ని స్వంతం చేసుకోవాలని అమెరికా ఆరాటం. ఇక బ్రిటన్ అవసరం? మిగిలిన 40 శాతం రేర్ మెటల్స్ ప్రాంతం చిన్న దేశాలకి మిత్ర దేశాలకి చేరువగా ఉంది. దాన్నికైవసం చేసుకోవాలని బ్రిటన్ ఎత్తుగడ. రష్యా మాట ఒకటే. నాటో కూటమిలో యూక్రైన్ చేరకూడదు,ఒప్పందం ప్రకారం. క్రిమియాను వదులు కోవాలి. ఇలా యూక్రైన్ కుక్కలు చింపిన విస్తరి కాబోతోందేమో!
చివరగా ఇస్రయెల్ హమాస్ లది బతుకుపోరాటం. కలసిబతుకుదామనుకుంటె సమస్య లేదు. ఒకరినొకరు లేకుండా చేసుకోవాలని చూస్తే చివరికి మిగిలేది బూడిద.
తాతగారి పొలిటికల్ కామెంట్రీ బావుంది.
ReplyDeleteచూస్తూంటే "తాతగారు" తలరాత రాస్తున్నట్టున్నారు మూప్రయు నకు :)
Zilebi3 March 2025 at 10:45
Deleteముళ్ళకంపమీద బట్ట పడితే కంగారుగా లాగేసుకుంటే చిరిగిపోతుంది. జాగ్రత్తగా ముళ్ళు తొలిగించుకుని బట్టని తీసుకోవాలి. అలాగే యుద్ధం లో చిక్కుకున్న యూక్రైన్ స్వతంత్రం పోగొట్టుకోకుండా తన ప్రజలు చావకుండా ఉండేదుకుగాను సంధి చేసుకోవడమే నేటి అవసరం. అది మరచి జలనిస్కీ ఉడుకు జుర్రుకుంటే నష్టపోయేది యూక్రైన్ మాత్రమే. కూడా నేడు ఉన్నామంటున్నవారు ఎవరి అవసరానికి వారు జారుకుంటారు. చెప్పాలంటే చాలా ఉంది ఒక టపాలో అయేది కాదు.
'తాతగారు' మూ.ప్ర.యు ని తలరాత రాస్తే తప్పించగలవారెవరు?
ట్యాగు లైను - పొగ వూదుతున్న తాతగారు :)
ReplyDeleteZilebi3 March 2025 at 10:47
Deleteతాతగారు పొగ ఊదడు. ఏవరి అవస్రాన్ని బట్టి వారు మంట ఎగసన తోస్తూ ఉంటారు,అంతే.
సునిశిత విశ్లేషణ సర్. పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం ఉన్న ఈ గందరగోళ పరిస్థితులు భారత దేశం ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతాయి అనిపిస్తుంది.
ReplyDelete
Deleteబుచికి3 March 2025 at 10:59
మొన్న మొన్న యూరోపియన్ యూనియన్ వారు భారత్ తో వ్యాపారం నింత్తం మాటలకొచ్చి వెళ్ళిన సంగతి. యూరప్ మంటలు ఎగదోస్తోంది. ఎవరిని తప్పు పట్టడంకాదు. ఉద్రేకాలు మరికొంత రంగాన్ని పాడు చేస్తున్నాయి. ఒకప్పుడు బుల్లి తెర హాస్యనటుడైన ఈ జలనిస్కీని గద్దె ఎక్కించినది డీప్ స్టేట్ కదా. మనదేశం మీద కొంత ప్రభావం చూపే సావకాశం ఉంది. మనదేశ విదేశాంగ విధానం ప్రకారం అలీనంగానే ఉంటాం. తప్పదు కూడా. మరో కుంపటి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నేడు బంగ్లా సైనికులకాల్పులు మరోరంగాన్ని సిద్ధం చేస్తున్నాయా! ఇందులో ఎవరి హస్తం ఉందో!
ఒకప్పుడు రాజరికంలో రాజులకు రాజ్యకాంక్ష ఉందనుకోవచ్చు.
ReplyDeleteఇప్పుడు సమస్యలకు కారణం, ప్రజాస్వామ్యంలో దేశాధినేతలను వెనకుండి నడిపిస్తున్న కేపిటలిష్టుల దురాశ అని నా అనుమానం.