Saturday, 21 December 2024

పేరులోనేముంది?-లింకులు.

 పేరులోనేముంది?-లింకులు.


తెనుగునాట అందరికి ఇంటిపేరు, పేరు,చివర తోకపేరు ఉంటాయి. ఇప్పటిదాకా ఈపేరుని విరిచి ముందు వెనకలు చేసిరాసినా  చెల్లిపోయింది. ఇకముందలా చెల్లేలా లేదు. పేరుతో బేంకు,ఆధారు, పాన్ కార్డు అన్నిటిలో ఒకేలా లేకపోతే మామూలుగా జరిగిపోవచ్చుగాని సంస్థలకి చెల్లింపులు,రావలసినవి ఇబ్బందులు పడేలా ఉంది,వ్యవహారం. ఇక బేంకుల్లో పోస్టాఫీస్ లో జాయింటు కాతాలున్నవాళ్ళలో ఒకరు జారిపోతే ఆ జాయింటు పేరు తీసెయ్యడానికి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఒప్పుకోడంలేదు. ఎన్నేళ్ళైనా ఇది అలాగే ఉండిపోతోంది. ఉన్నా ఇబ్బంది లేదుగాని ఈ కాతా నెంబరు ఏ సంస్థకిచ్చినా ఒప్పుకోడం లేదు, చెల్లింపులు,రావలసినవి జరగటం లేదు.  ఇటువంటి చిక్కులో పడి కొట్టుకున్నా. ఒక్కో సంస్థ  ఒక్కోలా  అదే పేరుని తిప్పి తిప్పి రాసుకున్నాయి. ఐతే లింకంతా పాన్ కార్డులో ఉన్నట్టు పేరు లేకపోతే చికాకులే. నా సౌభాగ్యానికి ఒక పేరు కాదు రెండు పేర్లు. ఈపేర్లతో చిన్నప్పటినుంచి చిక్కుబడుతూనే ఉన్నా. 

ఎంకన్నబాబూ ఎప్పటికయ్యా ఈ గోల తప్పేది నాకంటే ఆయన నవ్వుతూ నిలబడతాడంతే. 

సీతారాం,సీతారాం,సీతారాం జయ సీతారాం.  

18 comments:

  1. అలాంటి డిఫరెంటు పేర్లతో కావలసినన్ని పాను కార్డులు తీసేసుకుంటే సరిపోలా?/ఎందుకీ పాటి చిన్ని విషయానికి మా ఏడుకొండలాసామిని లాగుతున్నారు అసలే ఆయన లడ్డూస్ విషయంలో తలమునకలై వున్నాడు కదా ?

    ReplyDelete
    Replies
    1. జైలుకెళ్ళే మార్గాలు చూపిస్తారేమిటండీ మీరు ?

      Delete
    2. You must be joking Mr Feynmann :)

      Delete

    3. Zilebi21 December 2024 at 10:22
      తొందరలో నీకూ ఇదేగతి పడద్ది 😂 . చిప్పకూడు తినే రోజులు దగ్గరపడ్డ సమయం కదా!😍

      Delete
    4. విన్నకోట నరసింహా రావు21 December 2024 at 10:56
      చిప్పకూడు తినాలని ఉబలాట పడిపోతున్నాడు కదు సార్!😎

      Delete
    5. మెయిన్ కూటికే ఢోకాలు ఇక చిప్పకూటికి‌ ఆశలు లేవండీ తాతాశ్రీ :)

      Delete
    6. Zilebi21 December 2024 at 16:06
      నోరు ఇలా వాడుకున్నంత కాలంలోనూ మైన్ కూటికే ఢోకా తప్పదు. పేరు తిరగేసి మరగేసి నాలుగు పాన్ కార్డులు తీసుకో శ్రీకృష్ణ జన్మస్థానంలో గంట కొట్టి చిప్పకూడు తినిపిస్తారు. ఆరోగ్యమూ బాగుపడిపోతుంది. కొంత కాలం కూటి ఢోకా బాధ తప్పిపోతుంది.🤣

      Delete
    7. అబ్బే ప్యాను విషయంలో మాకేమీ ఇబ్బందిలే! ఎటు తిప్పినా జిలేబి‌ గుండుసున్నే :)

      ఏదో పాపం మీకు హెల్ప్ ఫుల్ గా వుంటుందని సలహా అంతే :)



      Delete
    8. Zilebi22 December 2024 at 09:53
      నాకు పాన్ తో ఇబ్బంది లేదు, బేంకు తోనే నీలాటి బుర్రతక్కువవళ్ళకి అలా అనిపిస్తుంది.

      Delete
  2. శర్మ గారు,
    ఇది మన ఖర్మ కొద్దీ మనకు తగులుకున్న విదేశీపైత్యం.
    హాయిగా మన ఇంటి పేరు మన పేరుకి ముందు వ్రాసుకోవడం మన ఆనవాయితీ.
    అసలు పేరు తరువాత ఇంటి పేరు వ్రాసుకోవడం విదేశీయుల అలవాటు (surname అంటారు, family name అంటారు, last name అంటారు, నా మొహం అంటారు). పోనీ దాదాపు మూడు వందలేళ్ళు మన మీద స్వారీ చేసిన ఆ బ్రిటిషోడు ఆ పద్ధతిని ప్రవేశపెట్టాడా అంటే … లేదు. పైగా ఇంటి పేరుని కూడా పూర్తిగా వ్రాయకుండా ఓ పొట్టి అక్షరంతో సరిపెట్టాడు. SSLC Register, degree certificate, ఉద్యోగ సంబంధిత పత్రాలు - అన్నీ అలాగే అఘోరించాడు ఆ తెల్ల మేధావి.

    ఊరందరిదీ ఓ దారి, ఉలిపికట్టెది ఓ దారి అన్నట్లు ఆ అమెరికా వాడి ధోరణి వాడిది. ప్రపంచీకరణ పేరుతో వాడిని దేశంలోకి తలుపులు తెరిచి ఆహ్వానించాం. వాడి పద్ధతులన్నీ మన నెత్తి మీద రుద్దుతున్నాడు.

    ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు PAN లో ఉన్నట్లే ఉండాలని కొత్త నస. వాళ్ళ database లో మన పేరు ఎలా store చేసాడో తెలియదు. First Name, Middle Name, Last Name … అబ్బబ్బ. PAN Card ఉన్నది చూపించినా కొన్ని సంస్థలతో / శాఖలతో ఇబ్బందులొస్తున్నాయి. నా పేరు విన్నకోట నరసింహారావు అని కార్డ్ మీద, విన్నకోట రావు నరసింహ అని database లో ఉందిట.

    చాలా చికాకుగా ఉంది వీటితో. ఎంకన్న బాబు చిద్విలాసుడు కదా, ఏం చేస్తాడే తెలియదు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు21 December 2024 at 11:27
      తెల్లోడు పోయిన పదేళ్ళ తరవాత కూడా మా S.S.L.C రిజిస్టర్ లో ముత్యాల కోవలా పేరు రాసారు. అప్పటి డిగ్రీ సర్టిఫికట్లలో పేరు బహు అందంగా రాయబడి ఉండేది. డిగ్రీ సర్టిఫికట్లు ఫోటో ఫ్రేం కట్టించుకునేవారు. ఆ తరవాత కాలం లో నల్లదొరల కాలం లో మొదలైన పైత్యం. అమెరికా వాడి అలవాటేమో తెలీదుగాని మాకు పాన్ కార్డ్ లిచ్చినపుడు తోకపేరు ముందు,ఆ తరవాత పేరు, చివరగా ఇంటిపేరుతో పాన్ కార్డ్ ఇచ్చేరు. అప్పటికే బేంక్ కాతాలు పాత కాలపు పద్ధతుల్లో ఉండిపోయాయి. పాన్ కార్డ్ లో ఉన్నట్టు పేరు రాసుకోకపోతే కొంప కొల్లేరే! డాటా బేస్ లో పేరుకు కేటాయించిన స్పేసులు పదో పన్నెండో,దానికి ఒక పరిమితి ఏర్పాటు చేసేసేరు. దాంతో ఈ తిప్పలొచ్చాయి. పూర్తి పేరు కావాలంటారు,ఇస్తే వచ్చే తిరకాసిది.
      మొన్న బేంక్ లో పాన్ కార్డ్ లో పేరు మార్చుకోమని సలాహా ఇచ్చాడా ఆఫీసర్. నా కూడా వచ్చిన వారు సరేనని బుర్ర ఊపేడు. పాన్ లో పేరు మార్చుకుంటే కొంపకొల్లేరని ఆ కుర్రాడికి తెలీదు పాపం. నాకు చిరాకొచ్చి కేకలేసేను. చీఫ్ మేనేజర్ దగ్గరకెళ్ళి కూచుని ఆయనమీదా కేకలేసేను. మేమేజరు కుర్రాడే,చెప్పినదంతా నవ్వుతూ విన్నాడు, కోప్పడకండన్నాడు. నేను కవిని అందుకు గట్టిగా మాటాడటం అలవాయిందని, ఇది కోపం కాదు బాధని చెప్పుకుంటే, విని తను పరిష్కరిస్తానని చెయ్యి ఊపి. పై ఆఫీసులో టెకీ కి చెప్పేరు. ఆ టెకీ ఇప్పుడు కాతాలో ఉన్న పేరెలా ఉందో తెలుసుకుని పాన్ కార్డ్ లో ఎలా ఉందో తెలుసుకుని పరిష్కారం చెప్పేడు, ఏక క్రియా ద్వర్థికరీ అన్నట్టు. పాన్ లో ఉన్నట్టు కాతాలో పేరు మార్చండి,జాయింట్ లింక్ తెగుతుంది. కాతా సింగిల్ అవుతుంది. అంతే కాదు ఈయన పేరు పాన్ లో ఉన్నట్టు ఉంటుంది కనక సమస్యలు రావని. అలా చేసేరు నా దగ్గరనుంచి అంగీకారపత్రం తీసుకుని. సరిపోయినట్టు ఉంది .ఎంకన్నబాబు చిద్విలాసుడు కదా, ఏమైనా చేసి ఈ కష్టాలనుంచి ఈ ఘటాన్ని విడిపిస్తాడని ఆశండి. కాని ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడంతే😎

      Delete
  3. ఎన్ని PAN సమస్యలో,
    ఇంత లేటు వయసులో.....

    ReplyDelete
    Replies
    1. ఏ వయదుకా ముచ్చట :)

      Delete
    2. bonagiri22 December 2024 at 10:52
      పాన్ లో పేరున్నట్టుగా మిగతావాటిలోనూ ఉండాలని బేంకులు వగైరా ఆర్ధిక సంస్థలన్నీ పట్టుబడుతున్నట్టుంది. అది ప్రత్యేకంగా చెప్పటం లేదంతే! ఏ వయసైనా సమస్యలు తప్పవు కదు సార్! తలనున్నంత వరకు తలనొప్పి తప్పదు.

      Delete

    3. Zilebi22 December 2024 at 13:29
      ఏవయసైనా ముచ్చట తప్పదులే! మరో సంగతి కూడా తెలుసుకో! నువ్వు పోయాకా కూడా నీ పేరు మీద వచ్చే ఆదాయానికి పన్ను కట్టాలి.

      Delete
    4. తాతాశ్రీ గారికి అందరినీ దుయ్యబట్టడమూ, బెదిరించడమే పని లా గుంది :)


      Delete
    5. Zilebi22 December 2024 at 15:55
      అది నీ తెగులు.

      Delete