Tuesday, 17 December 2024

అంతా నటులే

 అంతా నటులే

ప్రపంచ రంగస్థలం మీద అంతా నటులే! ఎవరిపాత్ర వారు నటించి తప్పుకుంటుంటారు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది తెలీదు. పాత్ర ఎంటో తెలీదు. ఎంతకాలమో తెలీదు. ఏం తెలుసు? ఏమీ తెలీదని కూడా తెలీదు. కాని ఉన్నదేమి? అహంకారం నేను,నేను అనేది, ఆ తరవాత హాహాకారం. అంతా తమ చెప్పు,చేతలలోనే ఉందనుకుంటారు.దానికి తోడు మరో మాయ డబ్బు. చిన్నమ్మ ముందు నడుస్తుంటే కళ్ళెలా కనపడతాయి? కొంతమంది జీవితంలో నటిస్తారు,మరికొందరు నటనలో జీవిస్తున్నామంటారు. అంతా చిరంజీవులమనుకుంటారు, అదే చిత్రం.

ఒక్కొక్కరిది ఒక్కొకపాత్ర కొంతమంది ద్విపాత్రాభినయమూ చేస్తుంటారు. చూసేవాళ్ళుంటే త్రిపాత్రాభినయం చేస్తారు. చివరికంతా వచ్చిన చోటికే చేరతారు. అక్కడే సమానత్వం. ఇదింతే మాయ విష్ణుమాయ. 

2 comments:

  1. అరి భయంకర కోదండ ధర ! రఘువర !
    శాంత గంభీర ! వర కరుణాంతరంగ !
    శ్రీ విభవ మణి ఘృణిత కిరీట ధారి !
    రక్ష మాం రామ ! రోగ జరా విరామ !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల18 December 2024 at 12:56
      రక్ష,రక్ష

      Delete