Saturday, 14 December 2024

బెల్లం-చీమలు-గుకేష్ 🤣

బెల్లం-చీమలు-గుకేష్  🤣


బెల్లం ముక్క కోసం చీమలు ఎగేసుకొచ్చేసేయి, అందులో ఓ చీమ చచ్చిపోయింది తొక్కిసలాటలో దీనికి పెద్ద పంచాయతీయా? ఇది వార్తేటీ?

ఓరి పిచ్చినాయాలా బెల్లం ముక్కని అరస్టు చేస్తే పండగ,ఎవరికనంటావా? నీది మట్టి బుర్రరా సన్నాసి. ఇను. 

బెల్లమ్ముక్కకి ఉచిత ప్రచారం, మీడియాకి పండగ,పోలీసులకి పండగ,లాయర్లకి కోర్టులకి పండగ, పిపీలకాలకి దెబ్బలు తినే పండగ. ఇది రాయి....వార్త వైరల్.. 

+++++++++++++++++++++++++

గుకేష్

ఎవడీడు? సెలిబ్రిటీయా? వరస హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలా చెప్పినోడా? చదనం దుంగలు దేశం దాటించే ప్లాన్ చెప్పినోడా? లేదూ దేశాన్ని ఎలా అమ్మేయాలో చెప్పినోడా? ఈడిదేం కాదే!

ఈడు వరసబెట్టి హత్యలు చేసినోడు,పద్దెనిమిదేళ్ళ లోపు కుర్రోడు, మనదేశపోడే. ఇంటర్నేషనల్ పేరు తెచ్చేసుకున్నోడు.మన దేశానికీ పేరు తెచ్చినోడు.  

చెప్పు,చెప్పు. ఇదిరా వార్తంటే! ఎవడేసే! ఇంతమొగోడు? అంత చిన్న వయసులో. వార్నీయవ్వ!!!!

ఇను ఈ కుర్రోడు చదరంగపు ఆటలో   మొదలెట్టి ఎదుటివాని బంట్లు,ఏనుగులు,గుర్రాలను వరసగా హత్య చేసి, నల్ల పావులతో ఆడి  ప్రత్యర్ధిని చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ అయ్యేడు. 

గుకేష్ కి అభినందనలు.

ఇలా చెబితే అది హాట్ కేక్ లా వార్త వైరల్ గా పోతదిరా!

11 comments:

  1. కుర్రోడేమన్నా సినీ హీరోనా ఆహా ఓహో‌ అనడానికి ఆఫ్ట్రాల్ షత్రంగ్ కే ఖిలాడీ ఆ పాటి దానికి ఇంత బిల్డప్పా ?

    సినీ హీరో ల కతలే కావాలె జనాలకు తాతాశ్రీ

    ReplyDelete
    Replies
    1. Zilebi14 December 2024 at 09:13
      నేను చెప్పిందీ అదే! కొ.దె శ్రీ 🤣

      Delete
    2. పేరు ' కొదెశ్రీ ' ఆహా !
      ఊరు పిశాచపురమా ! అహో ! హోరెత్తెన్ ,
      నేరుగ కపాలములె ఆ
      హారములుగ పీక్కు తినెడు , నౌనా ? సారూ !

      Delete
    3. ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఎందుకు జిలేబి?
      X కి వచ్చేయండి.

      Delete
    4. వెంకట రాజారావు . లక్కాకుల14 December 2024 at 12:33
      మీ మాటకి తిరుగే లేదు సార్!

      Delete
    5. Bonagiri14 December 2024 at 15:15
      కొ.దె ఎంతమందిని తరిమేసిందిగాదు బ్లాగులనుంచి. వెళ్ళు,వెళ్ళు ఎక్కడైనా కొ.దె కి సన్మానం బాగానే చేస్తారు.

      తీసుకెళ్ళిపోండి సార్!

      Delete
    6. ఎక్సు లో లేద‌ని ఎవరన్నారండీ ?

      ఇన్నేసి మాటలు పడుతు
      మన్నన లేని తలమున సమయమేల వృధా!
      యెన్నాళ్లు వెట్టి చాకిరి!
      కన్నాంబా! యెక్సు లోన కాలిడవమ్మా



      Delete
  2. అవును, వాడు ఒక చందనం దుంగ,
    జనాలు చెద పురుగులు.

    ReplyDelete
    Replies

    1. bonagiri14 December 2024 at 09:25
      లెస్సుగా లెస్సబలికితిరి సారూ!😁

      Delete
  3. అభిమానులు అనే వెర్రిజనాలు, సెక్యూరిటీ అనే మొరటుగాళ్ళు ఉన్నంతకాలం సామాన్య ప్రజలు సోదిలోకి కూడా రారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు14 December 2024 at 10:57
      మనుషుల్లో మార్పు రానంత కాలం,ఇదో అంతులేని కత. ఇంతే సార్! ఏదో జరిగిన ప్రతి సారి బాధ పడుతుండటం....

      Delete