Thursday, 12 December 2024

బొంగరం

బొంగరం

for video click on

https://sarmabc.blogspot.com/2019/04/blog-post_89.html

 

 courtesy; google

బొంగరం తిరిగినంత సేపే ముద్దు, అలాగే మానవుడు సంపాదిమచినంతసేపే కుటుంబం పట్టించుకుంటుంది.....

యావద్విత్తోపార్జన సక్తః 
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే 
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||

భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు. 


courtesy:
https://ckiranbabu.blogspot.com/2010/01/bhajagovindam-lyrics-in-telugu.html#google_vignette

10 comments:

  1. ఇంత నిరాశలో ఉన్నారదేలా?


    ReplyDelete
    Replies

    1. Zilebi12 December 2024 at 10:35
      దీనికి ప్రతిగా నీ భ్లాగులో రాసుకున్న పద్యమేదో కొంచం అర్ధమతున్నట్టుంది.🤣

      కొన్ని చూచి నేర్చుకుంటాం. కొన్ని చదివి నేర్చుకుంటాం. కొన్ని అనుభవించి నేర్చుకుంటాం.
      కొన్ని ఏం చేసినా,చెప్పినా అర్ధం కావు. ఇదే జీవితం. మాయ,విష్ణుమాయ 😁

      Delete
  2. జర - రుజలతొ బతుకీడ్చుట
    పరమాత్ముని కెరుక , నరుల పాట్లు మహాత్మా !
    భరియించు వాడి భాదలు
    పరు లెరుగరు , మాట తూలి భాదింతురు , హా !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల12 December 2024 at 19:42
      ఎద్దుపుండు కాకికి నొప్పా? అనీ ఎద్దుపుండు కాకికి రుచి అనీ సామెతలే ఉన్నాయి కదు సార్!
      జర,రుజలకు విడదీయలేని బంధం, అనుబంధం కూడా. ఎవరి బాధ వారే అనుభవించక తప్పదు. ఆయ్యో! అనే మాట ఒక ఓదార్పు,బాధను పోగొట్టేది కాదు, మనసుకు కొంచం ఊరటనిచ్చేది,అంతే! అది కూడా అనలేని కొరవిదెయ్యాలను ఏమనీ ఉపయోగం లేదండి. ఈ నోళ్ళింతే.

      Delete
  3. “ఇంతేరా ఈ జీవితం” 😒.
    అన్నట్లు బొంగరం విడియో అందుబాటులోకి రావడం లేదు శర్మ గారు 🤔 .

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు12 December 2024 at 20:01
      ఇది నేను తీసిన వీడియోనేనండి, ఈకింద ఇచ్చిన నా మరో బ్లాగ్ లో ఉన్నది. అక్కడ బాగానే ప్లే అవుతున్నది. ఇక్కడికి తేవడంలో ఏదో తేడా జరిగింది. తేడా కనిపెట్టలేక వదిలేసానండి. అందుకే గూగులమ్మనుంచి బొంగరం ఎరువు తెచ్చుకున్నా! 😒
      https://sarmabc.blogspot.com/2019/04/blog-post_89.html

      Delete
    2. మీ మరో బ్లాగు లింకులో ఇప్పుడే బొంగరాలాట విడియో చూసానండి.
      Thanks శర్మ గారు 🙏. సంపాదించడాన్ని బొంగరం తిరగడంతో పోల్చడం సరిగా సరిపోయింది. జీవితం కూడా అంతే కదండి.
      ————-
      ఏమిటో, బొంగరం విసరడం విద్య నాకేనాడూ సరిగా పట్టుబడలేదు శర్మ గారు 😒. గోళీలు, గోటింబిళ్ళలతో సరిపెట్టుకునే వాడిని (ఇవి కూడా పెద్దవాళ్ళ కంటబడితే జరిగే “సన్మానం” ఆ టైములో గుర్తుకొచ్చేది కాదు 😏).

      Delete
    3. విన్నకోట నరసింహా రావు13 December 2024 at 20:56
      బొంగరం ఈ బ్లాగులోనూ తిరుగుతోందండి.బొంగరం లా తిరిగి సంపాదించినంత కాలమే కుటుంబం పట్టించుకుంటుంది. బొంగరం తిరిగినంత కాలమే జనం చూస్తారు
      =======
      నాకు గూటీ బిళ్ళా లేదు,గోళీలు లేవండి, గోదాట్లో పడి ఈదడమే! అంతే.బడి,గుడి,గోదారి, ఇల్లు, టెక్టు పుస్తకాల కోసం మిత్రులను ఆశ్రయించడం తో సరిపోయేది.

      Delete
  4. అంతా తిప్పే వాడి చేతుల్లో ఉంది.

    ReplyDelete
    Replies

    1. Bonagiri12 December 2024 at 21:56
      మీరన్నమాటే పైలింక్ లో ఇచ్చిన టపాలో రాసినది,ఐదేళ్ళ కితం. కాలం తో ఆలోచన మారింది. ఇది నేటి మాట.బొంగరం అదే,ఆటా అదే!!!! 😁

      Delete