Friday 18 October 2024

😊ఊహల ఊయలలో 😊

😊 ఊహల ఊయలలో 😊



ఆడామగా తేడాలేదు,పిన్నా,పెద్దా భేదంలేదు,ముసలి ముతక మాటేకాదు. అంతా ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నట్టుంది. నిజ ప్రపంచాన్నెదురుకోలేక జనాలు ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నారా?  ఇల్లు,ఒళ్ళు తెలియటం లేదు. ఆనందం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు,పక్కవారిని పట్టించుకునేదే లేదు, అసలు తమ ఒంటి మీద తమకే స్పృహ ఉంటున్నట్టు లేదు. పల్లె,పట్నం తేడా లేదు, పేద,సాదా మాటే కాదు. సెల్ ఫోన్ లో ములిగి పోయారు. అంతా ఇలా ఐపోయారు,  సమాజానికేమయింది?

14 comments:

  1. ఊ హా లోకమ్ము గురించి విచారించుటకు
    తాతగారు ఊ హా లోకమ్ములోకి పెందరాళే కాలెట్టేసారు :)


    ReplyDelete
    Replies
    1. Zilebi18 October 2024 at 05:22
      నా దినచర్య చాలా నియమబద్ధంగా ఉంటుంది. నా టపా ఉదయం తొమ్మిది ప్రాంతంలో వస్తుందని తెలిసిన తమరికి ఉదయం నాలుగున్నరకే టపా వచ్చిందేమనే ఆలోచనే రాలేదు. హేతువు లేనిది తీతువు కూయదని పెద్దల మాట. కారణం లేని కార్యం లేదు.

      Delete
  2. ఫోనుకు బానిసలై , మా
    మానానన్ మేము బతుక , మము వీధుల్లో
    కీ నాయన ఈడుస్తుం
    డే ! నారాయణ ! యిది సబ బేనా ? తగునా ?

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల18 October 2024 at 07:15
      ఆయానెవరో వీధిన పడేసాడు సార్! నేను కాదు.😊

      Delete
  3. మానవాళిని పట్టుకున్న ఆధునిక మహమ్మారి స్మార్ట్ ఫోన్. ఇల్లు దోచుకుపోతున్నా కూడా గమనించినంత మైకంలో ముంచెత్తిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు18 October 2024 at 11:09
      హద్దే ముద్దు కదండీ. సెల్ ఫోన్ ను తిట్టుకోడమేల?
      ఒకప్పుడు సినిమా వచ్చి ప్రజల్ని పాడు చేసిందన్నారు. ఆపై బెడ్ రూంలోకి నడిచొచ్చిన వినోదం సినిమాను చంపేసింది. చేతిలోకొచ్చిన ప్రపంచం టి.వి.ని చంపేసింది. దీన్ని మించినదేదో వస్తుంది. అంతదాకా దీనిదే రాజ్యం

      Delete
  4. అవునూ శర్మ గారు, “మెకాలే మానసపుత్రులు” అని ఎవరిని అంటున్నారు ఈ మధ్య వాడకం బాగా ఎక్కువైన ఈ మాటతో? అది పొగడ్తా, తెగడ్తా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు19 October 2024 at 13:17
      బాబింగ్టన్ మెకాలే అన్న ఆంగ్లేయుడు భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేవేశపెట్టినవారు. ఆంగ్లేయ పద్ధతులను అమలు పరచి ఆచరించాలన్నవాడు. నాటి నుండి ఆంగ్లం ఆపద్ధతులు మనదేశంలో పాతుకుపోయాయి. ఆంగ్లంలో ఆలోచించి తెనుగులో మాటడే వారిని ఆంగ్లపద్ధతులే గొప్పవని చెప్పేవారిని,విదేశాలను మాత్రమే పొగుడుతూ స్వదేశాన్ని కించపరచే మహానుభావుల్నీ మెకాలే మానస పుత్రులు అంటారనుకుంటున్నానండి.

      Delete
    2. // “ ఆంగ్లపద్ధతులే గొప్పవని చెప్పేవారిని, ….. “//

      అంతవరకు ఓకే గానీ పూర్తిగా మెకాలేని తప్పు పట్టడం సబబు కాదని నా అభిప్రాయం. ఆనాటి దేశకాలమాన పరిస్ధితులను కూడా చూడాలిగా. అప్పుడు ఆంగ్లేయులు మన పాలకులు. తమకు, తమ పరిపాలనకు అనుకూలంగా ఉండే పద్ధతులను ప్రవేశపెట్టడం ఏ పాలకుడైనా చేసే పనే (తురకలు అరబ్బీ, పారశీకం తీసుకొచ్చినట్లు). అదే రకంగా మెకాలే గారి సిఫార్సులను చూడాలి అని నేననుకుంటాను. మన వేదవిద్య మాత్రమే నేర్చుకున్న వారి వలన వారి దైనందిన పరిపాలనకు ఏం ఉపయోగం? పైగా వాళ్ళు తమ సిబ్బందితో మాట్లాడాలంటే తమ సిబ్బందికి ఆంగ్లం నేర్పించాలి కదా. అదే చేసారు.

      ఇక గుమాస్తాలను తయారు చేసే చదువు అని కూడా కొందరి పడికట్టు మాట. మరి అదే చదువుతోటే భారతీయులు గుమాస్తాలే కాదు, ICS officers, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా తయారయ్యారుగా.

      కొత్త పద్ధతులు, చదువు, భాష నేర్చుకోవడంతో ప్రపంచంలో మరిన్ని కోణాలు, సంస్కృతుల గురించిన అవగాహన పెరుగుతుంది. వాటిల్లో కొన్ని కొన్ని అంశాలు కొంత మందికి నచ్చే అవకాశం లేక పోలేదు కదా. అదే జరిగుండవచ్చు. అది మెకాలే గారి తప్పు అవుతుందని నేననుకోను.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు19 October 2024 at 21:41
      పిడివాదులకి,మూర్ఖులకు చెప్పలేమండి, వారితో వాదం,సంవాదం,ప్రతివాదం కూడనివేనండి..ప్రతి మార్పులోనూ మంచి చెడ్డ ఉంటాయి,మంచిని తీసుకోవడం విచక్షణ కదండీ!

      Delete
  5. వేదాలు , ఉపనిషత్తులు
    గాదెల కొద్దీ పురాణ గాధలు గల వి
    ద్యా ధనములు మన కుండగ
    బోధన కాంగ్లేయ భాష మోదమ ? ముదమే .

    ఆలోచించుడు , ఆంగ్లం
    బే లేని చదువుల నిపుడు , ఇది సాధ్యంబా ?
    కాలానుకూల వృధ్ధికి ,
    వాలాయం బాంగ్లభాష వలయును ప్రజకున్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల20 October 2024 at 11:24
      నాకు ఇద్దరు తల్లులు జన్మ నిచ్చిన తల్లి కని,పెంచింది, బుద్ధులూ నేర్పింది,పెంచినతల్లి తనకి వీలైనంత చదువు చెప్పించింది, లోకం చూపించింది, లోకంలో బతకడమెలాగో చెప్పి జీవితమిచ్చింది. ఇక మూడవతల్లి నేటికాలానికి ముదిలో రోజు గడుపుతూ ఉంది. ఈ ముగ్గురు తల్లులలో ఎవరు గొప్పవారనే వాదమే ఒక వ్యర్ధం. అందరూ నా జీవితం సుసంపన్నం చేసినవారే. ఈ పోలిక చాలాండీ? మూర్కులకు చెప్పలేం, అది తమరికి తెలియనిదీ కాదు కదండీ!

      Delete
  6. భగవతి దుర్గమ్మ చలువ ,
    యగణితముగ ముగ్గురమ్మ లండ దొరికె , మీ
    రు గడుసరులు , ఘనులు గదే !
    ముగురమ్మల గన్నతల్లి మొదటిది , నమముల్ .

    ReplyDelete

  7. వెంకట రాజారావు . లక్కాకుల20 October 2024 at 16:17
    అమ్మలగన్నయమ్మ చలవ సార్! నా తెలివేంకాదు.ముగురమ్మల అభిమానం సంపాదించుకోగలిగిన నాది అదృష్టం అనుకుంటా సార్.

    ReplyDelete