Tuesday 1 October 2024

ఎవరు వృద్ధులు?

 ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 


దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే  పావురాల రాజు, ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి పావురాల రాజు,  ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.   పావురాల రాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా పావురాల రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

33 comments:

  1. -
    చిన్నదె కథ! మరి విషయము
    లెన్నెన్ని! తెలుసు కొనండి! లెస్సపలికి నా
    రెన్నెన్నో బ్లాగ్లోన్! పే
    రెన్నిక గన్నట్టి తాత రింఛోళినిలోన్!

    ReplyDelete
    Replies
    1. Zilebi1 October 2024 at 17:21
      రింఛోళి మంచి పదం వెలికితీసారు.
      ధన్యవాదాలు.

      Delete
    2. పెద్దగా తెలియని / వ్యావహారికం గాని పదాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మన ముందు ప్రదర్శించడం “జిలేబి” గారికి వెన్నతో పెట్టిన విద్య కదా 👏🙂🙂.

      Delete
    3. -

      పెద్దగా తెలియని భేషైన పదముల
      పట్టుకొచ్చి మనకు పరిచయమ్ము
      చేయు జాణ గా జిలేబిగారు ! తమకు
      తెలిసినదెకదాండి తీట తీరు :)

      Delete
    4. తమ రింఛోళులు దెలియక
      చిమ చిమ లాడితిమిగాని , చెమ్మా చెక్కా
      రమణీయ మహాంబుధిలో
      దుమికి డుబుంగుమన దెచ్చితో ! పదము లహో !

      Delete
    5. చిమచిమ లాడితి తెలియక
      తమ పదగుంఫనపు తీరు తరుణి జిలేబీ
      కమలాఫలముల తీయద
      నము మీపరిచయము మాకు నళినాక్షి! నమో

      Delete
    6. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 15:00
      మాస్టారూ!
      బు,డు లు స్థానభ్రంశం చెందాయేమోననుకుంటున్నానండి.

      Delete
    7. Zilebi2 October 2024 at 15:16
      కొత్తగా నేర్చుకుంటున్న వినయం?

      Delete
    8. విన్నకోట నరసింహా రావు2 October 2024 at 13:23
      జన్మకో శివరాత్రని సామెత సారూ!

      Delete
    9. Zilebi2 October 2024 at 14:23
      అసలు స్వరూపం ఇదే కదూ!

      Delete
    10. పనస తొనల పైన పట్టు తేనియ జల్లి
      చెఱుకు రసము లోన చెలువు జల్లి
      తియ్యమావి పైన తీపులు కలజల్లి
      తిన్న విథము మీదు తీరు విహిత !

      Delete

    11. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 15:41
      మాస్టారు,
      తెనుగులో కూడా చాలా చాలా చిన్నవాణ్ణి, నన్ను పెద్ద చేయడం తమ అభిమానానికి ప్రతీక సుమండీ

      Delete
    12. చాల చాల చిన్ని శర్మను పిలకాయ
      నండి రావు గారు నన్ను పెద్ద
      చేయడమ్ము తగదు కేల్మోడ్తు రాజన్న!
      తమరు పెద్ద సారు తరవకొరవ :(



      Delete
    13. Zilebi3 October 2024 at 06:55
      అర్ధం మాటెలా ఉన్నా తరవకొరవ అన్నది ఒకమాటని తెలియదు మంచిపదం.
      ధన్యవాదాలు.

      Delete

    14. వెంకట రాజారావు . లక్కాకుల4 October 2024 at 11:51
      తరవ అనే శబ్దం లేదు. కొరవ శబ్దం వాడుకలో ఉన్నదే! కొరవ,కొదవ శబ్దాలకు తక్కువ,లోటు,అని అర్ధాలు చెప్పుకోవచ్చు.

      పాలమీగడలు జున్నుపాలకు ఏమి కొరతరా మన ఇంట పాలను దొంగిల పరుల చేతిలో దెబ్బలు తినకుర కన్నయ్యా! ఈ తల్లి హృదయమూ ఓర్వలేదయా!
      తరవకొరవ అనే పదానికి పదకోశంలో ఎక్కువ తక్కువ అని చెబుతోంది. వాడుకలోకి తెచ్చుకోవలసిన పదం అని నా మాట.

      తరవకొరవpermalink
      తరవకొరవ : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report error(s) గ్రంథసంకేత వివరణ పట్టిక
      అవ్య.
      ఎక్కువ తక్కువ.

      Delete
  2. తెలియదు రింఛోళి యనగ
    తెలిసినచో భాస్కరన్న ! తెలుపరె , కాస్తా ,
    తెలుపరు తికమక బెట్టక ,
    తెలిసిన ఆ సుబ్బరాయ ధీమతి , సరిగాన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 09:06
      రింఛోళిpermalink
      రింఛోళి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report error(s) గ్రంథసంకేతాది వివేచన పట్టిక
      సం. వి. ఈ. స్త్రీ.
      సమూహము.
      రింఛోళి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report error(s)
      rinchhōḷi
      [Skt.] n.
      A multitude, crowd, mob. సమూహము.
      "మూరురాయర గండ పెండేరమణిమరీచిరింఛోళిగలయనావృతము లగుచు." Swa.Preface 15. (టీ. రింఛోళి = గుంపు.)
      రింఛోళి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report error(s)
      n.
      a multitude.
      సమూహము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)
      అంకిని, అంచె, అంట, అట్ట, అట్టియ, అత్తము, అనీకము, ఆకరము, ఆకలనము, ఆమ్నాయము, ఆళి, ఆవ(ళి)(లి), ఉచ్చయము, ఉత్కరము, ఉరువిడి, ఓఘము, కట్టు, కదంబకము, కదంబము, కలాపము, కలిలము, కాండము, కాయము, కులము, కూటువ, కూటువు, కృత్సము, కోటి, గంతు, గడ, గడనము, గణము, గమి, గుంపు, గుచ్ఛము, గుమి, గొత్తు, గ్రామము, ఘట, చక్రము, చక్రవాళము, చట్ట, చయము, ఛట, జంజా, జంపు, జట్టు, జత్తు, జాతము, జాలము, జీబు, ఝాటము, తండము, తండా, తంపర, తతి, తుటుము, తు(ట్టె)(ట్టియ), తెట్ట, తెట్టు, తెట్టువ, తెట్టువు, తె(ట్టె)(ట్టియ), తెరలిక, తెవ, తెగ, తొట్టు, తొట్టువ, త్రు(ట్టె)(ట్టియ), దండము, దండు, దడము, దళము, దాటు, దాఢ, ధట్ట, దృఘువు, నికరము, నికాయము, నికురంబము, నిచయము, నివహము, నుగ్గు, పటలము, పటలి, పదు(పు)(వు), పర్వము, పఱ, పిండు, పిండురము, పిచ్చ, పుంగము, పుట్ట, పెక్కువ, పెల్లు, పేటము, పైకము, పొట్టెము, పొట్లము, పొదుక, పోట్టలి, ప్రకరము, ప్రచయము, ప్రాచుర్యము, ప్రోక, ప్రో(గు)(వు), బలగము, బిందము, బృందము, బొంద, మండలము, మండలి, మంద, మూక, మొగ్గరము, మొత్తము, మొహరము, యూధము, రింఛోళి, రొక్కము, వగ, వరండకము, వర్గము, వారము, వితతి, వితానము, విసరము, వీడు, వేలము, వ్రజము, వ్రాతము, శ్రేణి, షండము, సంగడి, సంఘము, సంఘాతము, సంచయము, సంతతి, సంతు, సందడి, సందోహము, సంభారము, సంవర్తము, సంసృష్టి, సంస్త్యాయము, సంస్థానము, సంహతి, సంహననము, సంహారము, సంహృతి, సన్నయము, సన్నివాయము, సన్నివేశము, సమవాయము, సమాజము, సమామ్నాయము, సమాయోగము,సమాసము, సమాహారము,సమితి, సము(ద)(దా)యము, సమున్నయము, సమూహి, స్తిభి, స్తిభిని, స్కంధము, స్తోమము.
      రింఛోళి : వావిళ్ల నిఘంటువు 1949 Report error(s)
      సం.వి.ఈ.స్త్రీ.
      సమూహము.
      రిఞ్ఛోళి : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report error(s)
      స్త్రీ.
      సమూహము.

      Delete
  3. వాయసరాజ ని వ్రాసిరి
    ధీయుత ! పావురపు రేడ ? తికమక యయ్యెన్
    ఈ యర్థము కూడ గలద
    వాయస మను పదము నకు , వివరణము కాస్తా 🙏

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 09:33
      చేసినతప్పు చెప్పుకోవలసిందే!
      ఈ టపా చాలాకాలం కితం రాసినదే!ఆ సమయంలో మంచి మూడ్ లో రాసాను. ఆ వేగంలో తప్పు దొర్లిపోయింది. అప్పుడు తప్పు కనపడలేదు,విషయం మీద దృష్టితో. ఈ టపా చాలామంది చదివేరు, కాని ఎవరూ ఈ తప్పు చెప్పలేదు.దానితో తప్పు అలానే ఉండిపోయింది. ఆ తరవాతెప్పుడో టపా తీరుబడిగా చదివినపుడీ తప్పు గమనించా! సరి చేదామనుకుంటూనే మరచిపోయానండి.
      వాయసమన కాకి కదా, తప్పు సరిజేస్తున్నా!
      క్షమస్వ త్వం.
      నమస్కారం.
      ధన్యవాదాలు.

      Delete
  4. చిన్న పొరపాటు దొర్లడ మన్నగారు !
    ఎన్న నది తప్పుగాదు , వియన్నదీ త
    టాకమున , మరాళములలో , తదేక వీక్ష
    ణమున , నెక్కడో , నొక ఈక కమిలి యుండ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 11:14
      పొరబాటు పొరబాటే సార్!
      తప్పు దిద్దినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  5. తెలుగు మాస్టారా, మజాకానా ! 🙂

    ReplyDelete
  6. తెలుగున మాష్టరు జదివితి ,
    నొలయంగా సంస్కృతాంగ్ల మొప్పారె ధిషన్ ,
    విలువ లెరిగి , యొజ్జదనపు
    సుళువున , హెడ్మాష్టరునయి శోభలు గంటిన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 14:08
      తెనుగు మాస్టారు హెడ్ మాస్టారయ్యారంటే చిత్రమే సుమా! చాలా గొప్ప విషయం
      నమస్కారం

      Delete
    2. కత్తికి రెండు వైపులా పదును బెట్టేను సార్ ,
      ఒకవైపు విద్వాన్ , పండిత శిక్షణ .....
      మరోవైపు MA , Bed ....వగైరా .....

      Delete
    3. -
      నారదా :(

      కత్తికిరువైపులా పదు
      నొత్తగ నొకవైపు తెలుగు లోపండితుడన్
      వత్తాసెమ్మే బియ్యెడు
      బెత్తము తోడాయె యింక చెప్పవలయునా !



      Delete
  7. అంతేగాదయ నారద !
    పంతుళ్ళకు బెత్తములకు బహుదూరమయా ,
    జంతువు లేమయ పిల్లలు ?
    చెంతకు బిలిపించి ప్రేమచే జదివింతున్ .

    ReplyDelete
  8. ప్రేమ మార్గమున చదువు, పిల్లలకు క
    లేజ, నేర్పించు మాస్టార్ని! లేదెపుడు సు
    మా కరమ్మున బెత్తెము! మంచితనము
    నాకు మిక్కిలి నచ్చిన నవ్యతయగు!

    ReplyDelete
  9. తడయక ' అమ్మ ' సరాసరి
    చెడుపై 'దుర్గాభవాని' చేసిన యుధ్ధమ్ ,
    కడుకొని కత్తికి , రక్కసి
    యొడలులను బలిచ్చి , రక్తమోడ్చిన దినముల్ .

    ReplyDelete


  10. రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
    కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
    కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
    నెత్తుటి ధారలు నెగడు చుండ
    డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
    రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
    ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
    కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ

    దుర్నిరీక్ష్య , తేజోమూర్తి , దురితదూర ,
    దుర్గయై ,కాళికయయి ప్రాదుర్భవించి
    చెడును తెగగోసి బిడ్డల క్షేమ మరసి
    మనల కాపాడు చున్న దీ మాతృ మూర్తి .

    ReplyDelete
    Replies
    1. ఏల యీ భయంకర రూపము ?

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకుల3 October 2024 at 09:53
      భండపుత్ర వధ వర్ణన యా మాస్టారూ.

      Delete