Sunday 29 September 2024

సమస్య

 సమస్య


సమస్య లేని మనిషి లేడు,ఉండడు.

ఎవరి సమస్య వారే  పరిష్కరించుకోవాలి. కొన్నిటికి ఇతరుల సాయం అవసరం.


కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు, కాలమే సమాధానం చెప్పాలి.


కొన్ని సమస్యలతో రాజీ పడకతప్పదు.జీవితాంతం రాజీ పడి బతకాల్సిందే!


ఉపేక్ష చేయలేని సమస్య ఆరోగ్యం. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఏం చేయాలన్నా శరీరం, అందునా ఆరోగ్యకరమైన శరీరం అత్యవసరం.రాజీ పడలేని,పడకూడని సమస్య ఆరోగ్యం.


పెద్ద సమస్య కాలం. జరిగిపోయిన కాలం తిరిగిరాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే! 

4 comments:

  1. ముదిమిన్ పలు రోగమ్ములు
    చెద పురుగుల వోలె తనువు చేరి చరింపన్
    అదె పెద్ద సమస్యగు , ఆ
    పద కాయంగ పరమాత్మ పట్టుక పోడే !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల29 September 2024 at 19:57
      చెదపురుగులు శరీరాన్ని తినేస్తూ చెయ్యి కాలు కదుపుకునే స్థితిలో తీసుకుపో నారాయణా అని మొక్కు.ఇది సమస్య కదా! మన చేతిలో లేనిది. తెగులొస్తే బిళ్ళేస్కుంటాం,రోగమొస్తే ఆస్పత్రిలో చేరిస్తే బతికేస్తాం అనేవారికి పెద్ద నమస్కారం సార్!

      Delete
  2. బిళ్ళేస్కుంటే తగ్గే
    వొళ్ళా యిది , వయసుడిగెను , వోపిక తగ్గెన్
    వెళ్ళిన దవాఖానకు
    కుళ్ళబొడుతు , రంతకంటె ఘోరము కలదే ?

    ReplyDelete
  3. వెంకట రాజారావు . లక్కాకుల30 September 2024 at 15:14

    కుళ్ళబొడవక అది దవాఖానా ఎట్టైతది సార్! కార్పొరేట్ దవాఖానైతే శవానికి కూడా వైద్యం చెయ్యకపోతే అది కార్పొరేట్ ఎట్టవుతది సార్!

    ReplyDelete