Tuesday 24 September 2024

బ్లాగు పుట్టినరోజు

బ్లాగు పుట్టినరోజు 

(పదునాల్గవ బ్లాగ్ పుట్టినరోజు)

పుట్టినరోజుకు

 శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి,పార్టీలు జోరందుకుంటాయి, మందు,విందు,పొందు..... నిజంగా ఇది పండగ చేసుకునేరోజేనా?


మానవుని ఆయుస్సు స్థిరం,అందులోంచి ఒక సంవత్సరం తరిగిందని చెప్పేరోజే పుట్టినరోజు.... మరి పండగెందుకు?

అదే విచిత్రం

ఇదే 

విష్ణుమాయ.


30 comments:

  1. బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు, శర్మ గారు. పదునాలుగు సంవత్సరాల పాటు అప్రతిహతంగా బ్లాగ్ ని కొనసాగించినందుకు మీకు అభినందనలు 💐.

    ReplyDelete
    Replies
    1. అప్రతిహతమెక్కడా ?
      జూలై తరువాయి రెండు నెలలు పైబడి‌చిలుకు గ్యాపు :)

      పోనిద్దురూ అందామంటారా ?
      అయితే సరే శుభాకాంక్షల్స్ :)


      Delete
    2. విన్నకోట నరసింహా రావు22 September 2024 at 09:55

      ధన్యవాదాలండి! పదమూడు సంవత్సరాలు పూర్తయ్యాయని వర్డ్ ప్రెస్స్ వారూ శుభాకాంక్షలు పంపారు. ఆలోచిస్తే సమయం ఇలా వ్యర్ధంగా గడిపేసేనా? అని అనిపిస్తూ ఉంటుందండి. విప్రాః పశ్చిమ బుద్ధయాః నిజమనిపిస్తుందండీ.

      Delete
    3. Zilebi22 September 2024 at 15:50


      జిలేబి
      ధన్యవాదమ్స్
      డొక్క ఎండిపోయిందిగా, తలపండులో నీకుగుజ్జూ ఎండిపోయి బహుకాలమే అయిందిగా

      Delete
  2. మీ బ్లాగుకి "జన్మ దిన శుభాకాంక్షలు".. శర్మా జీ !

    కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం!!

    ReplyDelete
    Replies
    1. srinivasrjy22 September 2024 at 10:38


      శ్రీనివాస్ జీ
      ధన్యవాదాలండి!

      కృషితో నాస్తి దుర్భిక్షం
      జపతో నాస్తి పాతకం
      మౌనేన కలహోనాస్తి
      నాస్తి జాగర్తో భయం
      ఈ ఆర్యోక్తి నాపట్ల నిజంకాదనిపిస్తుందండీ

      Delete
  3. ఎన్నెన్నో సంగతులను
    బన్నించి , వివేక మొప్ప , బహు చక్కగ , ఓ
    రన్నా ! శర్మాజి ! తమరు
    కన్నుల గట్టిరి , నమోస్తు 🙏 , కష్టేఫలియై .

    ReplyDelete
    Replies

    1. వెంకట రాజారావు . లక్కాకుల23 September 2024 at 09:32

      రాజావారు
      ధన్యవాదాలండి!
      కష్టమే గాని ఫలితం లేదండీ

      Delete
  4. శాస్త్రి గారి లాంటి సంవిబుధుదులకు
    గాదు , నన్ను బోలు గ్రాహకులకు
    ఙ్ఞాన దీప్తి మీరు , ఘనఫల మిదికదా !
    కష్ట మందు రేల ? ఘనత లుండ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల23 September 2024 at 16:05
      తమరన్న శాస్త్రి గారెవరో నాకు తెలీదుగాని తమరు నన్ను ములగచెట్టు ఎక్కించెయ్యకండి.
      నమస్కారం

      Delete
    2. ఏమండీ లక్కాకులవారు

      శర్మ గారికి శాస్త్రి గారు తెలీదంటున్నారు
      ఇదేమన్నా నమ్మశక్యమేనంటారాండీ ?

      Delete
  5. జన్మదిన శుభాకాంక్షలు అనపర్తి పంతులుగారు🙏🙏

    ReplyDelete
    Replies
    1. USHA23 September 2024 at 22:20

      ఉషగారు,
      నాపుట్టినరోజు కాదమ్మా! బ్లాగు పుట్టినరోజు
      ధన్యవాదాలు.

      Delete
  6. చెలగి , వేయి పున్నములు దర్శించి , మించి ,
    ఆయురారోగ్య భాగ్యముల్ , ' అమ్మ ' దయలు ,
    సకల శుభములు గల్గ మీ ' జన్మ దినము '
    వెలుగు లిడుగాత ! భాస్కరా ! వే విథముల .

    ReplyDelete
    Replies

    1. వెంకట రాజారావు . లక్కాకుల24 September 2024 at 07:27

      రాజావారు
      నాపుట్టినరోజు కాదండీ! బ్లాగు పుట్టినరోజు
      ధన్యవాదాలు.

      Delete
    2. మతి మంతుల ప్రతిదినమూ
      అతులితమే , నూతనమ్మె , ఆర్యా ! ఇందున్
      ప్రతికూలత లేమి కలవు ,
      నతులు 🙏 , తమ వివేకములకు నవ్యత కలిమిన్ .

      Delete
    3. వెంకట రాజారావు . లక్కాకుల24 September 2024 at 12:43
      నమస్కారం

      Delete
  7. శర్మ గారు,
    పలువురు మీ పుట్టినరోజు అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది 🙂. మీ బ్లాగ్ పుట్టినరోజు అని మీరు చివర్లో చిన్న అక్షరాలతో చెప్పినది “హతః కుంజరః” అయిపోయినట్లుంది 😁।

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు24 September 2024 at 08:29

      విన్నకోటవారు
      నాపుట్టినరోజు కాదు బ్లాగు పుట్టినరోజని ఎఱ్ఱ అక్షాలతో రాసానండి. వాటిని చివరగా ఇవ్వడం పొరబాటేమో పైన పెడతానండి.
      ధన్యవాదాలు.

      Delete

    2. విన్నకోట నరసింహా రావు24 September 2024 at 10:01
      విప్రాః పశ్చిమ బుద్ధయాః అని పెద్దలమాట. ఈ రోజు నేను చేసినది నిన్ననే చేసుంటే బాగుండేది కదండీ!
      ధన్యవాదాలు.

      Delete
    3. “ ప్రమాదో ధీమతా మపి” అని కూడా అన్నారు కదండీ పెద్దలు. కాబట్టి ఏమీ ఫరవాలేదు, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది 🙏.

      Delete
    4. విన్నకోట నరసింహా రావు24 September 2024 at 12:18
      ప్రమాదం (సంస్కృతం), నిత్యమై (తెనుగు) ప్రమాదంగా మారిపోతోంది సార్!

      Delete
    5. వినరా వారికి ఉండ్రాళ్ల గురించి అస్సలేమీ తెలియదని అక్కడెవరో ఉవాచ
      ఏమైంది ?

      Delete
  8. నరస రాయల మేథ ఉండ్రాళ్ళ వరకె
    పరిమితము సేతురా యేమి ? వారు సంస్కృ
    తాంధ్రములు నాంగ్లభాషా గతాంత విషయ
    సకల సంపద్వివేచన చతుర మతులు .

    ReplyDelete
    Replies
    1. ఆహా ! ఎంత ఊరట ఎంత ఊరట
      మీరన్నారంటే నిజంగానే "ఉండ" వచ్చు సుమండీ

      Delete
    2. రాజారావు గారు (24 Sept at 17:16),
      ధన్యవాదాలు మాస్టారు, కానీ “ తమరు నన్ను ములగచెట్టు ఎక్కించెయ్యకండి”.

      Delete
  9. శాస్త్రిగారి లాంటి చతుర మతినిగాను
    ఉన్న ఘనత లెన్ని సన్నుతింతు
    లేని ములగ చెట్టు లేడ యెక్కింతును
    పెద్దలన్న నాకు పేర్మి గలదు .

    ReplyDelete
  10. కృష్ణ పరమాత్మ , మూర్తిమత్ కీర్తి గాన

    మొనరిచి , మహాత్ము లెందరో పుణ్యు లైరి ,

    మనసు సుశ్లోకమై , స్వఛ్ఛతను గను , హరి

    కొలువు దీరిన , డెందముల్ చెలువు మీరు .

    ReplyDelete
  11. భక్తి రసము మించి , పరవశత్వము లేదు

    హరిని మించి , ఆసరా కలుగదు

    పరబ్రహ్మ కలడన్న భద్రత కంటెను ,

    లోకమందు కడు భరోస లేదు .

    ReplyDelete