Thursday 4 July 2024

ఉద్యమేన హిః సిద్ధ్యంతి

ఉద్యమేన హిః సిద్ధ్యంతి 


ఉద్యమేన హిః సిద్ధ్యంతి 

కార్యాణి న మనోరథైహిః 

న హి సుప్తస్య సింహస్య

ప్రవిశంతి ముఖే మృగాః 


తలుచుకున్నంతలో పనులు పూర్తైపోవు,ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి.నిద్రపోతున్న సింహం నోట్లో జంతువులు చొరబడవు.


మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటిలో కొన్నిటినైనా నెరవేర్చుకోవాలంటే, ప్రయత్నం చేయాలి. సింహం నోరు తెరుచుకుని నిద్రపోతున్నంతలో మృగాలు నోట్లో చొరబడతాయా? అంటే, వేటాడక నిద్రపోతున్న సింహం నోట జంతువులు ఎలా పడవో, అలాగే పనులు కూడా సిద్ధించవు,ప్రయత్నం లేక.ప్రయత్నించు, ప్రతి ఓటమి గెలుపుకు మార్గం. 

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ


పై కవిగారు చెప్పినదాన్ని తాత మరికొంచం వివరించారు. సంగీతం పాడేవారు నిత్యమూ అభ్యాసం చేస్తూనే ఉంటారు. దానిని నేటికిన్నీ మా పల్లెలలో అనడం అనే అంటారు. ఇలా రోజూ అంటూ వుంటే రోజు రోజుకి రాగం పాడే విధం మెరుగుపడుతూ ఉంటుంది.ఇది అభ్యాసంతోనే సాధ్యం. అభ్యాసము కూసువిద్య గువ్వలచెన్నా! అన్నారు మరో కవి.అలాగే వేముని నేలవేము అంటారు. ఇది చాలాచిన్నమొక్క. బహుచేదు. ఆయుర్వేద వైద్యంలో వాడతారు. దీనిని నిత్యం సేవిస్తే కొంత కాలానికి నిజంగానే తియ్యగా ఉంటుంది. రాచ ఉసిరి కాయను కొరికితే పుల్లగా వగరుగా ఉంటుంది, కాని ఆ తరవాత నోరంతా తియ్యగా ఐపోతుంది. సాధన తోనే పనులవుతాయి, కూచుంటే పనులు కావని తాత మాట. మరొకరు
కృషితో నాస్తి దుర్భిక్షం 
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా!!!!.

7 comments:

  1. చెప్పడానికి బావుంది
    కాని
    అభ్యాసము కూసు విద్య అని ఓ జిలేబి కందాలల్లేస్తూ వుంటే తిట్టొచ్చిన తాతలు విదురులే కాని ప్రోత్సాహిద్దామని ఎవరన్నా ఒకరైనా సై అన్నారా అంట ?

    ఓ పెద్దాయనా చెప్పుండ్రీ :)


    బ్రేవ్

    నారదా
    53k బ్రేక్ అవుటవుతుందా :)


    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. జిలేబీకి చెప్పి ఉపయోగం ఉండదని తెలిసినా పాఠకులకు కారణం తెలియగలందులకు ఒకటి రెండు ముక్కలు చెప్పకతప్పదు.

      కం. గుణమగునా యక్షరముల
      గణములలో గ్రుక్కి క్రుక్కి కందం బనినన్
      గణుతించరు కవులెవ్వరు
      గుణమగు నొక ధారలేని కుంటి గిలుకులన్

      కం. అందము చందము లేనివి
      కందములని పిలువబడవు కనుక జిలేబీ
      వందలువందలు వ్రాసిన
      నెందుకు మిచ్చెదరు విబుధు లేనాడైనన్

      జిలేబీకి అర్ధం ఐతే అవుతుంది. లేకపోతే లేదు. చెప్పవలసింది చెప్పాను.

      Delete
    3. Zilebi4 July 2024 at 18:54
      నీకు మంచి చెప్పబోవడం, చెవిటివాని ముందు శంఖం ఊదిన చందమని తెలుసు. తెలిసి,తెలిసి మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తుండడం అలవాటైపోయింది. నీకు ఏదీ గుర్తుండవనీ తెలుసు కమే (AI) లాగా :)

      నాకు చందస్సు రాదు, నేర్చుకోడానికి ప్రయత్నమూ చేయను. చేస్తే నీలాగా ఇటుకల కట్టుబడే మిగులుతుంది,అర్ధం పరమార్ధం లేక అని మానేసేనని చాలా సార్లు చెప్పేను గుర్తుందా?

      ఒకప్పుడు పద్యాలు రాయమని ప్రోత్సహిస్తూ చంధో గ్రంధం పంపినది గుర్తుందా?

      నీవు నా బ్లాగులో రాసిన పిడకపద్యాలకి తిట్లు,మంచి పద్యాలకి (చందస్సు సంగతొదిలేసి అర్ధవంతమైన పద్యాలని) మెప్పు ఇచ్చినది గుర్తుందా?

      నీ పిడక పద్యాలు కూడా ఇతరులను ఎగతాళీ చేయడానికే వాడుకుంటున్నావన్న సంగతీ నీకు గుర్తుందా?

      లేదు,లేదు,లేదు. నీకేదీ గుర్తుండదు. నువ్వు మారవు,పుర్రెతో పుట్టిన బుద్ధికదా! పుడకలతోనే పోయేది.
      అస్తు!

      Delete
  2. శ్యామలీయం4 July 2024 at 22:14

    తెలిసి తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే అన్నారో కవి మరొకరు చేరి మూర్ఖుల మన్సు రంజింప రాదు. అన్నారు కాని తెలిసి చేస్తున్న తప్పు దిద్దుకోవాలి.దీనికి ఒకటే,నాకు తెలిసిన ఉపాయం. ఉపేక్షించండి!

    ReplyDelete
    Replies
    1. జిలేబీ సంగతి ఆటుంచి పాఠకులకు తెలియగలందుకే ముఖ్యంగా వ్రాయటం జరిగిందండి. జిలేబీని ఉపేక్షచేస్తున్నానండీ.

      Delete
  3. ఉపేక్షా లంకారము బావున్నది :)

    ReplyDelete