Thursday 11 July 2024

ఎందరో మహానుభావులు

 ఎందరో మహానుభావులు


ఉన్నారున్నారున్నారీలోకంలో

నరు

లున్నారున్నారున్నరున్నారీలోకంలో


తరతరాలుగా రకరకాలుగా

తమదారీ తీరే వేరుగా

నరులున్నారున్నారున్నారీ లోకంలో!


ఎప్పటిదో మాటైతే ఇప్పుడెందుకు చెప్పుకోడం?

రూపాయి పెంటమీద కనపడినా నాలికతో అద్దుకు తీసుకునే జనులున్నకాలంలో కనకే చెప్పుకోవడం.


ప్రపంచపోటీలో భారత్ క్రికెట్ టీం T-20 మేచ్ కప్ గెల్చుకున్నది, రోహిత్ శర్మ సారధ్యంలో, వరల్డ్ కప్ గెల్చుకున్న సందర్భంగా 125 కోట్ల సొమ్ము దక్కింది. బి.సి.సి.ఐ ఈ సొమ్మును ఆటగాళ్ళకి కోచ్ లకి జట్టు కప్ గెల్చుకోడానికి సాయపడిన అందరికి పంచింది, వారివారి అర్హతల ప్రకారం. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 5 కోట్లు ఇచ్చింది. ఇందులో 2.5 కోట్లు బోనస్ గా ఇచ్చింది. ఇచ్చినదానికి సంతోషం వెలిబుచ్చుతూనే ద్రవిడ్ తానుకూడా కోచ్ లందరిలాగా 2.5 కోట్లు తీసుకుంటానని ప్రకటించారు.


నాకు తెలిసి 

నాటికాలంలో, భరతుడు తల్లి అయాచితంగా సంపాదించి పెట్టిన రాజ్యం, నాకొద్దని రాముడే రాజని ప్రకటించి, రాజ్యాన్ని తిరస్కరించిన గొప్పవాడు.అంతటి మహానుభావులు పుట్టిన దేశంలో ఎందరో మహానుభావులు, అందులో నేటి కాలానికి రాహుల్ ద్రవిడ్ ఒకరు.


అయాచితంగానైనా తనదగ్గరకొచ్చిన ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్ కి జేజే లు

9 comments:

  1. దక్కినంత వరకు జేబులో వేసుకుందామనుకునే జనాలే తప్ప ఇలా మోకాలడ్డేవారు కూడా ఉన్నారన్నమాట 👏.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు11 July 2024 at 10:26
      ఉన్నారండి, అక్కడక్కడ. ద్రవిడ్ వ్యక్తిగత జీవితంలో కూడా గొప్పవాడే! ప్రశంసించవలసినవాడే!గొప్ప వ్యక్తి.

      Delete
  2. క్రికెట్ క్రీడాకారులకు అతిగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 125 కోట్లు బోనస్ గా ఇవ్వడం సరికాదు. ఇతర దేశాలలో ఈ ధోరణి లేదు.

    ఐ పి ఎల్ ద్వారా కోట్లు అర్జిస్తున్న వారికి ప్రజాధనం నుంచి ప్రభుత్వం వారు ఇల్లు స్థలం, ఉద్యోగం ఇవ్వడం ఏమిటి. క్రికెటర్లకు ప్రతి మ్యాచ్ ఆడడం ద్వారా ఇచ్చే ఫీజు తక్కువేమీ కాదు. 365 రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటారు

    రాహుల్ ద్రావిడ్ అదనం గా బోనస్ తీసుకొనేందుకు నిరాకరించడం మంచిదే.



    ReplyDelete
    Replies
    1. బుచికి11 July 2024 at 11:30
      ముఖ్యంగా క్రికెట్ వాళ్ళకి అత్యధికంగా ప్రాముఖ్యం ఇస్తున్నారు,మిగతా వాళ్ళ మాటే తెలియదు. మీడియా ప్రచారం కూడా క్రికెట్ కే ఉంది. బెల్లమున్నచోటుకే చీమలు చేరతాయి. సొమ్మున్నదగ్గరకే జనాలూ చేరతారు.

      ఐ.సి.సి నుంచి ప్రైజ్ మనీగా వచ్చిన సొమ్ము ౧౨౫ కోట్లు. అది బి.సి.సి.ఐ కి వస్తుంది. దాన్ని బి.సి.సి.ఐ క్రీడాకారులకి,కోచ్ లకి,ఔట్ ఫీల్డ్ స్టాఫ్ కి అర్హతలను బట్టి పంచుతుంది. కోచ్ లకు ఒక్కొక్కరికి ౨.౫ కోట్లిస్తే ఛీఫ్ కోచ్ కి ౨.౫+౨.౫బోనస్ ఇచ్చింది. బోనస్నే ద్రవిడ్ తిరస్కరించి అందరితో సమానంగా తీసుకున్నాడు. ప్రతిసారి పంచడానికేం ఉండదు, వరల్డ్ కప్ కనక ప్రైజ్ మనీ వచ్చింది. ఇంత క్రేజ్ విదేశాల్లో లేదు, మన దేశం ప్రత్యేకం కదా! మేరా భారత్ మహాన్!

      క్రికెట్ లో ఉన్నవాళ్ళకి కోటి అంటే రెండక్షరాలు, మనకి ఎక్కువగాని, ఇది అందరికి కాదు, అక్కడా దీనులున్నారు.

      దేశప్రతిష్ట పెంచే పని చేసినవారికి కొంత సొమ్ము ఇవ్వడం తప్పుకాదుగాని,ప్రభుత్వం లో ఉన్నవారికి ఓట్లు సంపాదనకి మార్గం.
      ద్రవిడ్ కి జేజే లు.

      Delete
  3. ఎంత డబ్బు ఎంత డబ్బు !
    అబ్బా ఎవరీ తల తిక్కల సన్నాసి మోకాలడ్డి వద్దన్న బుద్ధుడు‌?/ డబ్బులు తీసుకుని‌ బీదా‌బిక్కికి పంచి వుంటే ఎంత బావుండేది

    దేశంలో బీదలకి తలా ౮ వేలా ౫ వందలు పంచి వుండొచ్చు ప్చ్ ప్చ్ రాహుల్ అని పేరెట్టేసుకుంటే సరి పోతుందా ? దాతృత్వం అందరికీ వస్తుందా ?



    ReplyDelete
    Replies
    1. Zilebi12 July 2024 at 02:18
      ఎంతో కాదు 2.5 కోట్లే. అది మనకి పెద్దమొత్తం, క్రికెట్ వాళ్ళకి కాదు.

      దేశం లో బీదలకి పంచి ఉండచ్చు అలా పంచితే ఒక్కొక్కరికి పైస రాదు. :) ఒకపేరెట్టుకున్నవాళ్ళంతా ఒకలా ఉంటారా? అవును దాతృత్వం అందరికీ ఒకలా ఉండదు.
      దాతృతం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతాః
      అభ్యాసేన న లభతే చత్వారా సహజా గుణాః
      అర్ధమయిందనుకుంటా!
      ఎదుటివారి సొమ్ము పంచడానికి అందరూ పెద్ద కొడుకులే

      Delete
    2. "అర్థమయ్యిందనుకుంటా " ...


      ఏమో ఎవరికెరుక అదేమి‌ భాషయో అందులో మీరేమంటున్నారో మాకెట్లా అర్థమవుతాది ?


      Delete
    3. Zilebi12 July 2024 at 12:20
      అవును నీకేం గుర్తుండవు ’కమే’లాగా :) చెబుతా!

      దానగుణం,ప్రియంగా మాటాడడం,ధైర్యగుణం,సమయోచితంగా మాటాడటం అన్నవి నేర్చుకుంటే రావు, సజగుణాలై ఉండాలి అన్నారు ఆచార్య చణకులు.

      అటువంటి వాడే నాయకుడు. ద్రవిడ్ తనబోనస్ వదలుకున్నాడు. అది చూసి రోహిత్ తన బోనస్ వదలుకుంటూ ఔట్ ఫీల్డ్ స్టాఫ్ కూడా సమానంగా ఇవ్వాలన్నాడు. ఇలా తను ఆచరిస్తూ చెప్పినవాడిని నమ్ముతారు ఇతరులు అనుసరిస్తారు తప్పించి. ’నువ్వు పప్పు పట్రా నేను పొట్టు తెస్తా! రెండూ కలిపి గుళ్ళో కూచుని ఇద్దరమూ పంచుకుని ఊదుకుని తిందాం’ అన్న నానుడి ప్రకారం నడుచుకునే వాడు నాయకుడవుతాడా? ఎంతకాలానికి కాడు! కాలేడని భావం.
      ఇంత చెప్పినా అర్ధమయిందా?

      Delete
    4. హేవిటో జనాలు మరీ వెర్రోళ్లు
      కలికాలంలో సత్తెకాలపు టోళ్ళు
      ఎలా బతుకుతారో రాబోవు కాలాల్లో

      ప్చ్ ప్చ్ ప్చ్

      Delete