Saturday 8 June 2024

సామాన్యుడి సణుగుడు

సామాన్యుడి సణుగుడు 

ఎన్నికల్లో చిత్రాలు.


  ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా,  పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి.  ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.


మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!

ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు   కోలేదు,ఫలితాల తరవాత.

కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన  తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.


ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.


మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో  రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో? 


భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న  సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది.  ఒక్కొకటే చూదాం!


నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట. 


ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!


బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ   తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!

బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు.   బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు  లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు.  కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.    


 ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక. 

 

తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.


ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా?    కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు.    ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.  


ఎక్కడైనా కాలు పెట్టేరేమోగాని తమిల్ నాడులోకి బి.జె.పి ని రానివ్వకుండా చేసిన ఘనత స్టాలిన్ మరియు పుత్ర రత్నానిదే!  అదే మరి ప్రజాస్వామ్యమంటే! కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే! చివరికి భూమిమీద పేరైనా ఉందా? లేదే! ఇటువంటివారు కాలగతిలో ఎందరు చేరిపోలేదు? హిందూ సంస్కృతి డెంగూ, వగైరా అంటూ నేడు పేలుతున్నవారికి రోజు రావాలి! వస్తుంది!! అప్పటిదాకా ఇంతే!! దోస్తులకి ఇది వినపడుతోందా? 

  ఎ.ఐ.డి.ఎమ్.కె కనపడకుండా పోయింది, బి.ఆర్.ఎస్ లాగా!

చిట్ట చివరికి కేరళాలో సురేష్ గోపి, చిత్ర నటుడు రూపంలో బి.జె.పి కాలు పెట్టింది. ఇదొక రికార్డే! సామాన్యుని చిత్రం. కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లిచ్చి గెలిపించారు.సి.పి.ఎమ్ కి ఒక్క సీటిచ్చారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకి పెద్ద చురక. దేశం మొత్తం మీద ఒకే ఒక కమ్యూనిస్ట్ ఎమ్.పి అనుకుంటా! సామాన్యుడు వేసిన పెద్ద చురక.

   M.Pలో వృద్ధ కాంగ్రెస్ వాదులందరిని తుడిచి పెట్టేసి, మొత్తం సీట్లు బి.జె.పి కే ఇచ్చేసేరు. రాహుల్, ఈ వృద్ధ కాంగ్రెస్ వాదుల్ని వదిలించుకో లేకపోయాడు. ఆ పని బి.జె.పి చేసి పెట్టింది. కాంగ్రెస్ కి పెద్ద లాభం  

కర్ణాటకా లో ఉచితాలు ఉచితాలే, కేంద్ర ఎన్నికలు ఎన్నికలే అని తొమ్మిదే సీట్లిచ్చారు కాంగ్రెస్ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా!  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా BJP కి  17 సీట్లిచ్చారు  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా ! సామాన్యుడు వేసిన పెద్ద చురక,కాంగ్రెస్ కి!


BJP:-మీరు దేశ భద్రత,రక్షణ,విదేశీ వ్యవహారాల్లో చూపిన నిపుణతకి జే జేలు చెప్పేం! ఐతే దేశపు అంతర్గత వ్యవహారాలలో కొంత పట్టు విడుపు అవసరం,దాన్ని విస్మరించి, ఒంటెత్తు పోకడ పోయినందుకు, మిమ్మల్నిప్రతిపక్షంలో   కూచోబెట్టలేదుగాని మీకుగా స్వతంత్రంగా 272 సీట్లు ఇవ్వటం లేదు, మరో నలుగుర్ని తోడిస్తున్నాం! వారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి! అని చెప్పి నాలుగు పార్టీలతో కలిపి 293 సీట్లిచ్చినది పెద్ద హెచ్చరిక!  BJP కి,  మీతో ఇప్పుడు. తీసుకున్న నిర్ణయం కచ్చితoగా అమలు చేసే మోడీ అంటే చాలామందికి కడుపుమంట, దేశంలోనూ విదేశాల్లోనూ కూడా!   BJP పార్టీకి పెద్ద హెచ్చరిక!ఇది సామాన్యుని హెచ్చరిక

Congress:- పార్టీని మా తాత,తండ్రులు నిర్మించుకున్నది, నేటికి ఒక కుటుంబానికి చెందిపోయింది. మీ నుంచి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, అందులో ఒక్కటి మచ్చుకి. మీ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం వివరాలు దేశానికి చెప్పేరా? ఏమిటవి? ఇప్పుడు మీకిచ్చిన 99 సీట్లు మీ ప్రతిభకి మెచ్చి ఇచ్చినవి కావు. బి.జె.పికి,  ఒక చిన్న చురక అంటించడానికి చేసిన కసరత్తు.పదేళ్ళు పరిపాలన చేసినవాళ్ళని ప్రతిపక్షంలో కూచోబెడ్తారు,ఆ పని చెయ్యలేదు. ఈ 99 సీట్లు,  మీప్రతిభే అనుకుంటే పొరబాటు, మరోమాట కూడా! ప్రభుత్వాన్ని పడకొట్టేస్తాం! రంకెలేస్తున్నారు, అస్తు! మరచిపోకండి! ఆ తరవాత మీరు నిర్మించే ప్రభుత్వం ను, మీరు ఆరు నెలలు నిర్వహించలేరు. ఇప్పుడే మీ దోస్తు మమత నిన్నటిదాకా మీ పల్లకీ మోసిన బోయీ అధీర్ రంజన్ చౌదరిని నానాగడ్డీ కరిపించేస్తోంది. నేడు మీతో ఉన్నవాళ్ళెవరూ మీ మిత్రులు కారు, ఇంతటి గొప్ప దోస్తుతో మీ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉండబోతోంది? మీ యోధుడినే రక్షించలేని మీరు దేశాన్నేం రక్షిస్తారు? దేశo కుక్కలు చింపిన విస్తరైపోయి, మళ్ళీ మోడీకే ఈ సారి 400  సీట్లిచ్చి  పట్టం కడతారు. ఆ తరవాత మీ అడ్రసులు గల్లంతు, జాగ్రత్త! చూసుకుని అడుగేయండి. పశ్చిమ దేశాలన్నీ తమ స్వార్ధం చూసుకుంటాయి. అంతేకాదు భారత్ ఎప్పుడూ వాటికి అణిగిమణిగి ఉండాలనీ,వాటిమీద ఆధారపడి బతకాలనీ అనుకుంటాయి. అది తెలుసుకు మసలండి. మీ స్వంతంగా 272 స్థానాలూ వచ్చేదాకా ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రయత్నాలు చేస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక,చురక, సామాన్యుడి నుంచి.


11 comments:

  1. వామ్మో ఎన్ని హెచ్చరికలో :)

    మోడీ గారికి మీ హెచ్చరికలేవీ లేవాండీ ?


    ReplyDelete
    Replies
    1. Zilebi8 June 2024 at 09:23

      సామాన్యుడి లచ్చనమే అది :)
      చూసేకళ్ళు ఆలోచించే మనసు ఉంటే...... లేకపోతే ఏం కనపడతాయి? తెలుస్తాయి?

      Delete
  2. శర్మగారూ: నాలాంటి వాళ్ళకోసం ఎన్నికల ఫలితాల సారాంశం చక్కగా చెప్పారు . థాంక్స్

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju10 June 2024 at 10:22
      నమస్కారం.
      ధన్యవాదాలండి.

      Delete
  3. చాలా చక్కగా విశదీకరించారు గురువు గారూ. కానీ మీరాశిస్తున్న
    మార్పు నాయకుల్లో ఎప్పటికీ రాదు. ఇది మాత్రం సత్యం. ఆంధ్రా
    ఓటర్లు ప్రదర్శించిన ఈ పరిణతి మాత్రం అనూహ్యం, అపూర్వం.
    సైలెంట్ కిల్లింగ్ అన్న పదం ఇక్కడ చక్కగా అతుకుతుందేమో !?
    మీ పోస్ట్ చదివాక ఒక్క ఆంధ్రా వాళ్ళేం, ఎంచక్కా దేశమంతా అదే
    తీరుగా, ఒక్కలానే ఆలోచించారనిపిస్తోంది. మీరన్నట్లు తమిళ నాడొక్కటే పంటికింద రాయి. ఆ తేడా వాళ్ళ స్వంతమేమో ?

    ReplyDelete
    Replies
    1. nmrao bandi10 June 2024 at 18:17
      ధన్యవాదాలు.
      మార్పు వస్తుందని కాదుగాని, చెప్పగా చెప్పగా....
      ఆశావాదిని, నిరాశలో కూడా ఆస ఉందనుకునేటంత. :)
      పదాల గురించి మీకు చెప్పడమా :) ఫలితాలు చూసి జగనే ఆశ్చర్య పోయేటంత :)
      భారతీయ ఆత్మ ఎప్పుడూ ఒకటే సార్! ఇదంతా ఇ.వి.ఎం ల మాయ అనగల ఉలిపికట్టెలూ ఉంటాయి కదండీ! దిష్టి చుక్కలా అక్కడక్కడ ఉంటారు :)

      Delete
  4. nmrao bandi garu,
    మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే గతజల సేతుబంధనం అనిపించినా కూడా మీరన్న ఆ “పరిణితి” ఆంధ్రా ఓటర్లు 2019 లో కూడా చూపించినట్లయితే ….. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆ చీకటి అధ్యాయం చోటు చేసుకునేది కాదేమో? ఎలా ఉందంటే ఇల్లు కట్టుకోవడానికి అనుభవజ్ఞుడైన తెలిసిన మేస్త్రీకి పని అప్పగించి, అతను కొంత మేర కట్టిన తరువాత మార్చేసి ఏ మాత్రమూ అనుభవం లేని వాడికి అప్పగించడం ….. “పరిణితి” అనిపించుకోదు. కానివ్వండి గతం గతః, ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇకనైనా పరిస్ధితి చక్కబడుతుందని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. బుచికి గారన్నది సత్యం. ఎప్పటికప్పుడప్పుడున్న పరిస్థితులు, మనఃస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారెవరైనా. అప్పటి పరిస్థితుల్ని బట్టి, నేననుకున్నవిధానాన్ని బట్టి అప్పటికదే తగిన ప్రజా నిర్ణయాయమేమోనన్నది కూడా అప్పటి నా నమ్మకం. నమ్మకం వమ్మయ్యింది అనుకున్నపుడెవరైనా మారక తప్పదు.
      అదొక్కటే కాదు ఆరోజుల్లో చంద్రబాబు గారి ధోరణి, వ్యవహారశైలి కూడా ఇప్పుడున్నంత సౌమ్యంగా ఏం లేదు, అది అధికార దర్పం పలికించిన పలుకుల ప్రభావం. అప్పటి అధికార ప్రతినిధుల వ్యవహార శైలి కూడా అంత చెప్పుకో తగిందేం కాదు కూడా. అప్పుడే గనుక ఆయన తగిన విధంగా జాగ్రత్త పడి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కాదు.
      కాలం మారుతుంది, మనుషులు మారుతారు. దాన్లో ఎవ్వరికీ ఏ విధమైన మినహాయింపు లేదు, రాదు. మనమందరం ఆ చక్రం లోని ఊచలమే. చంద్రబాబు గారికి గతంలో అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టిన మోడీ గారి hum tum ek kamre mein bandh hai గమనించండి. వైరివర్గాలుగా విడిపోయి కాట్లాడుకున్న పవన్ చంద్రబాబు గార్ల yaadon ki baaraat ఆలకించండి.
      ఒక్కటే నిజం మనం నమ్మిందే సిద్ధాంతం కాదన్నది రాద్ధాంతం. zindagi ka yahi reet hai ...
      అన్నీ తెలిసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములంతటి వారు మీరు మీకు చెప్పేంతటి వాడినా, అన్నన్నా 🙏🙏🙏

      Delete
  5. 2014 లో అయినా 2019 లో అయినా 2024 లో అయినా ఓటర్లు పరిణితి చూపించారు. ఆరోజు ఉన్న పరిస్థితికి వారు తీసుకున్న నిర్ణయం సరైనదే. తమకు నచ్చిన వాళ్ళను ఎన్నుకున్నప్పుడు మాత్రమే పరిణితి ఉన్నట్టు అనుకుంటే అది పొరపాటు. ఓటర్లను అవమానించడం అవుతుంది.

    ReplyDelete