Thursday 4 April 2024

రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం


ఓం యం!! ఈశానసర్వవిద్యానా మీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదా శివోమ్.


వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్త్వాత్మకం

తస్మాదుత్తమ తత్త్వమక్షరమిదం ధ్యేయం సదాయోగిభిః

ఓం కారాది సమస్త మన్త్రజనకం సూక్ష్మాతిసూక్షం పరం

శాంతం పంచమ మీశ్వరస్యవదనం ఖంవ్యాపి తేజోమయమ్.


ఓం నమోభగవతే రుద్రాయ. యం ఓం ఊర్ధ్వముఖాయనమః

-------------------------------------------------------

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అను రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు,  శాంతమునును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

-------------------------------------------------------------------------

పూర్వే పశుపతిఃపాతు దక్షిణేపాతు శంకరః

పశ్చిమేపాతు విశ్వేశో నీలంకంఠస్తదోత్తరే.


ఐశాన్యం పాతుమేశర్వో హాగ్నేయాం పార్వతీ పతిః

నైరృత్యాం పాతుమే రుద్రో వాయువ్యాం నీలలోహితః


ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః

ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతుశంకరః

---------------------------------------------------------------------

ఊర్ధ్వముఖ దర్శనం ముక్తిదాయకం.

22 comments:

  1. ఆసక్తికరమైన విషయాలు చెప్పారు, శర్మ గారు 🙏.

    అవునండి, నేనేదో చదవగలిగాను కానీ సంస్కృత శ్లోకాల్లో అంతంత భయంకరమైన సంయుక్తాక్షరాలు ఉంటాయేమిటండీ 😳? కాస్త విడమరిస్తే పలకడానికి తేలికగా ఉంటుంది కదా. విడివిడిగా వ్రాస్తే ఉచ్చారణ, ఆ ఊపు సరిగ్గా రాదంటారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు4 April 2024 at 22:30
      భయంకరం కాదండి కలిపిచదవాల్సిందే. వర్ణక్రమం తెలుసుకోవాలి. ఇందులో కష్టమైనది,
      షట్త్రింశ తత్వాత్మకం ( షట్+త్రి+అంశ=షట్త్రింశ) ముఫై ఆరు అంశలు తత్వాత్మకం( తత్వ+ఆత్మకం) ఇలా ఉంటాయి కొన్ని, మరోమాట
      భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాలావళీ లోచనం.( భస్మాభ్యక్త+అనంగ+దేహ+దహన+జ్వాలావళీ+లోచనం)
      ఇప్పుడు మీరేచెప్పండి, కలిపిచదవాలా విడిగా చదవాలా?
      నేను భాషా పండితుణ్ణికాదుగాని తోచినదేదో చెప్పేసేనండి :)

      Delete
    2. విన్నకోట నరసింహా రావు4 April 2024 at 22:30
      భయంకరం కాదండి కలిపిచదవాల్సిందే. వర్ణక్రమం తెలుసుకోవాలి. ఇందులో కష్టమైనది,
      షట్త్రింశ తత్త్వాత్మకం ( షట్+త్రి+అంశ=షట్త్రింశ) ముఫై ఆరు అంశలు తత్త్వాత్మకం( తత్త్వ +ఆత్మకం) ఇలా ఉంటాయి కొన్ని, మరోమాట
      భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాలావళీ లోచనం.( భస్మాభ్యక్త+అనంగ+దేహ+దహన+జ్వాలావళీ+లోచనం)
      ఇప్పుడు మీరేచెప్పండి, కలిపిచదవాలా విడిగా చదవాలా?
      నేను భాషా పండితుణ్ణికాదుగాని తోచినదేదో చెప్పేసేనండి :)
      corrected comment reply.

      Delete
    3. // “కలిపి చదవాల్సిందే” //

      అవునండి, మరో మార్గం లేదు 🙂. అది అర్థం అయిందిలెండి.

      ఈ సందర్భంగా నా ఫ్రెండొకతను గుర్తొచ్చాడు (అతనిప్పుడు కీ.శే). ఉచ్చారణ గురించి మాటొస్తే అతను తెలుగులో చచ్చినట్లు పలకాల్సిందే, గజపతి నగరం అనే పేరుందనుకోండి మొత్తం పలకాల్సిందే, మరో గతి లేదంతే అన్నాడు (అతను విజయ నగరం వాడు లెండి, అందుకని తన జిల్లాలో పొడుగు పేరున్న ఊరి పేరుని ఉదహరించాడు) 🙂🙂.

      Delete
    4. విన్నకోట నరసింహా రావు7 April 2024 at 11:12
      తెనుగంతేనండి! రాసేది పలకాలి! తప్పదు మరి!!నోరు తిరగనివాళ్ళకి తెనుగెలా వస్తుంది చెప్పండీ?

      Delete
    5. విన్న కోట వారికి తెలుగు రాదన్న ఉద్దేశమాండీ ?

      Delete
    6. “జిలేబి” గారు,
      ఇంట్లో అగ్గిపెట్టె ఖాళీ, షాపుకు వెళ్ళి కొనుక్కు రండి అంటూ ఇందాకనే ఇల్లాలు అన్నది. కంగారేమీ లేదు, కాసేపటిలో అగ్గిపెట్టె వచ్చేస్తుంది చూడు అంటున్నాను ఈలోగా మీరు రానే వచ్చారు 🔥.

      Delete
  2. బమ్మెర పోతన కృతమైన శ్రీమద్భాగవతము మొత్తం తిరగేశాను.రాసలీల ఉంది గానీ అక్కడ రాధ లేదు.రాసలీల అంటే నాట్యం మాత్రమే.అయితే, నాట్యం అయ్యాక కృష్ణుడికీ గోపికలకీ మధ్య శృంగారం నడుస్తుంది.అయితే, శ్రీకృష్ణుడు సామాన్య బాలుడు కాడనీ అద్వితీయుడని గోపికలకి తెలిసి భగవద్రతి,సాయుజ్యవాంచ అనే సంకేతార్ధం అక్కడ ఉన్నది కాబట్టి దోషం కాదు.

    15వ శతాబ్దం నాటి పోతనకి తెలియని రాధని బహుశః,బ్రిటిషు వాళ్ళ ఏజెంట్లయిన ఇస్కాన్ బుస్కాన్ పిచ్చి భక్తి సిధ్ధాంతులు కల్పించి మన కధల్లో దూర్చేశారు కాబోలు!

    ఎన్ని కల్పిత పాత్రల్ని దూర్చి ఎంత మేర చరిత్రని కంపు చేశారురా నాయనా - ఈ చెత్తనుంచి అసలైన చరిత్రని జల్లెడ పట్టటానికే కనీసం వెయ్యేళ్ళు పట్టేలా ఉంది,వామ్మో!

    ReplyDelete
    Replies
    1. hari.S.babu5 April 2024 at 07:50
      జరిగినదానికి వగచి ఉపయోగం లేదు. మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోవాలి. నిద్ర లేవండి :) మారోజులెళ్ళిపోయాయి. ఇప్పుడు కాలం మీదే!! జాగో :)

      Delete
  3. జయదేవుడి కాలం పన్నెండవ శతాబ్దం. ఆయన గీతగోవింద కావ్యనాయకి రాధ. కాని రాధ పాత్ర భాగవతాంతర్గతం కాదన్నది నిజం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం6 April 2024 at 07:26
      నవవిధ భక్తి మార్గాలలో ఇది కూడా ఒకటానుకుంటాను. ఊహజానితులు కొందరైతే మీరాబాయి లాటివారు నేటికాలానికి చెందినవారేకదా!

      Delete
    2. నిజమే కాబోలు!

      ఒకటి జరిగుండచ్చు.12వ శతాబ్దం నాటి జయదేవుడికి బోబదేవుదనే అన్నగారు ఉన్నట్టు తెలుస్తున్నది.ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం ఈ బోబదేవుడు వ్రాశాడు.తనే హిమాద్రి అనే కావ్యానికి అవతారిక వ్రాస్తూ "హిమాద్రే సచివస్యార్ధం" అని శ్లోకాన్ని మొదలుపెట్టి అంతకుముందరే భాగవతాన్ని వ్రాశానని అర్ధం వచ్చేటట్టు "శ్రీ కృష్ణ చరితామృతం మయే రితం!" అని చెప్పుకున్న సాక్ష్యం ఉంది.

      అన్నగారు వ్రాసిన భాగవతం లోని రాసలీలని తీసుకుని అక్కడ రాధని ప్రధాన సఖిని చేశాడు జయదేవుడు.15వ శతాబ్దపు పోతన మహాకవి రాధ లేని రాసలీల ఉన్న బోబదేవుడి భాగవతాన్ని అనువదించాడు.చరిత్రకీ కల్పనకీ అన్వయం సరిపోతున్నది.మరి శ్యామలీయం మాస్టరు ఏమంటారో,జిలేబీ మధ్యలో దూరి కొత్త తగాదాలు పెడుతుందో అదీ ఇదీ కలిసిన హరిమాయను మించిన జగన్మాయ ఆ దేవుడికీ ఈ తెలుగోళ్ళకే తెలియాలి.

      జై శ్రీ రామ్!

      Delete
    3. hari.S.babu7 April 2024 at 14:55
      బోపదేవుడు రాసింది వ్యాసభాగవతం కాదంటారా? తంపులు పెట్టేవాళ్ళని తలుచుకోవడమే తప్పనుకుంటా మిత్రమా!

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. అవును,ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం బోబదేవుడు వ్రాశాడు.వ్యాసుల వారు అసలు భాగవతం వ్రాయలేదు.అప్పట్లో పుస్తకాలు అమ్ముడు పోవటం కోసం తమ రచనలని ప్రఖ్యాతుల పేరున ప్రచారంలోకి తెచ్చేవారు. అయితే, హర్ష చక్రవర్తి దీనిమీద నిషేధం పెట్టి శిక్షలు వేస్తానని ఆజ్ఞలు జారీ చేశాడు.

      ఆ హడావిడిలో బోబదేవుడు మొదట తన రచనని వ్యాసప్రోక్తం కింద ప్రచారం చేసి హేమాద్రి రచనా కాలానికి తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.అయితే, అప్పటికే భాగవతం వ్యాసప్రోక్తం అని అన్ని చోట్లకీ పాకిపోయింది కాబట్టి స్వయాన రచయిత చెప్పుకున్న వాక్యం ప్రజల్లోకి వెళ్ళలేదు.

      దయానంద సరస్వతి తన సత్యార్ధ ప్రకాశికలో ఈ విషయాన్ని ససాక్ష్యం వివరించారు.

      Delete
    6. hari.S.babu8 April 2024 at 10:54
      భారతమైనా వ్యాసుడు రాసినట్టేనా? లేదా ఏ బుచ్చిదేవుడో రాసేసి వ్యాసుడి పేరెట్టేసేడా పుస్తకాలమ్ముకోడానికి.

      Delete
    7. వ్యాసుల వారూ ఆయన శిష్యులూ కలిసి వ్రాసిన మూలప్రతి 10,000 శ్లోకాలు మాత్రమే.ఇప్పటి లక్ష శ్లోక విస్తారం అయిన వెర్షన్ ఇతర్ల అదనపు చేరికల తర్వాతనే ఏర్పడింది.కాకపోతే, ఆ విస్తరణ వ్యాసుల వారి మీద భక్తితోనే వ్యాఖ్యాన పూర్వకమైన వ్యవహారం కాబట్టి మోసం,ద్రోహం,ఘోరం అని మనం అనకూడదు.

      Delete
    8. hari.S.babu10 April 2024 at 15:03
      భేషూ!!!!!!

      భారతమూ వ్యాసుడే రాసిందికాదు,శిష్యులతో కలిసిరాసాడంటారు. చిత్రం!! మరి అష్టాదశ పురాణాలు, వేదాలని విడదీయడం అంతా ఏమంటారు?

      Delete
    9. ఆర్యా,

      వేద విభజన వ్యాసుల వారే చేశారు.అయితే, పురాణ కధల ప్రకారమే చాలామంది వ్యాసులు ఉన్నారు.ఒక విధాన వేద సంకలనం కోసం ఒక పీఠం ఏర్పరచి ఆ పీఠానికి వ్యాసపీఠం అని పేరు పెట్టారు.అలా అనేక మంది కలిసి వేదవిభజన చేశారని అనుకోవచ్చు.వీరిలో ఒకరు జయేతిహాస కర్త అనుకుంటే అన్వయం సరిపోతుంది.వేదాలని విభజించాలంటే,మొదటి కష్టం ప్రతి సూక్తాన్నీ అర్ధం చేసుకుని విషయ సారూప్యతలని బట్టి సూక్తాలని ఒకచోట చేర్చడం - ఒక మనిషి జీవిత కాలంలో అయ్యే పనేనా?

      అలా తార్కికమైన విశ్లేషణ చేసుకుని చూస్తే తన తరంలో వ్యాసపీఠం మీద కూర్చుని వేదవిభజన చేస్తూ తనవల్ల పుట్టిన మనుమల తరపు కధని గ్రంధస్థం చేసిన వ్యాసమునీంద్రులు ఒకరే అవుతారు.

      అష్టాదశ పురాణ రచన సైతం ఒకే వ్యాస మునీంద్రుడు చేసి ఉండక పోవచ్చు.ఇతరులు వ్రాసి వ్యాసుల వారి పేరున ప్రచారంలోకి తేవడం కూడా జరిగే ఉంటుంది.వ్యాసదర్శనానికి విరుధ్ధమైనవి కాదు గాబట్టి పూర్వుల లాగే మనమూ సర్దుకు పోవాలి.గీతలో చెప్పినట్టు వరదలో మునిగాక ఆ బావి నీరూ ఈ బావి నీరూ అని తేడా ఉండదు కద.ధర్మ శాస్త్రాలకి సంబంధించి సత్యం తెలుసుకోవడమే ప్రధానం.అర్ధం తెలుసుకుని అనుష్ఠించడం ముఖ్యం కానీ కర్తృత్వం గొడవ అనవసరం.

      జై శ్రీ రామ్!

      Delete
    10. హరిబాబు గారి వివరణ అద్భుతంగా వున్నది‌. ఇంతటి అరుదైన ఏకీకృతమైన భావప్రకటన, తార్కిక చింతన, సమన్వయము మెచ్చుకోలునకు తగ్గది.

      Delete
    11. కొంతకాలంగా ట,ట లు కొందరంటుండగా వింటున్నదే!!!

      Delete
  4. హరిబాబు గారి వివరణ అద్భుతం

    ReplyDelete