Tuesday 5 September 2023

ముల్లును ముల్లుతోనే తీయాలి

 

https://kasthephali.blogspot.com/2023/09/blog-post.html

మోసం 

తరవాయి భాగం


ముల్లును ముల్లుతోనే తీయాలి


రత్నంతో సంభాషణ తరవాత,

 ముత్యం మాటాడక ఇంటికి చేరిన రాత్రి, భార్యతో,రత్నంతో 

  సంభాషణలో జరిగినది చెప్పేడు. విన్నామె, ”కంపమీద   

బట్ట పడింది, నెమ్మదిగా  లాక్కోవాలి, 

 బర్రున లాగేస్తే చేతులారా చింపుకున్నట్టవుతుంద'’ంది. ఈ మాట ముత్యానికి నచ్చింది, తాను ఉద్రేకపడక, మాటాడక వచ్చేసినదానికి భార్య వత్తాసు పలికినట్టయింది. 


ముత్యం మాటాడక వెళ్ళినా, రత్నం మనసులో గుబులు పోలేదు. మరునాడు భార్యతో కలిసి ముత్యం ఇంటికి వెళ్ళి, ముత్యాన్ని భార్యా పిల్లలని కుశల ప్రశ్నలు వేసి, కొన్ని బహుమతులిచ్చి, చివరగా వారందరిని తమ ఇంటికి విందుకు రావలసినదిగా ఆహ్వానించారు. ముత్యం ఇంటి దగ్గర గడపినంత సేపులోనూ, ముత్యంగాని, భార్యగాని తాము మోసపోయినట్టుగాని, నష్టపోయినట్టుగాని, బాధ పడుతున్నట్టుగాని అనిపించలేదు,రత్నానికి అతని భార్యకు. ఇది రత్నానికి మరింత బాధ కలిగించింది. అనుకున్నట్టుగానే ముత్యం భార్య పిల్లలతో కలసి విందుకొచ్చాడు,రత్నం ఇంటికి.


రత్నం ఇంటికొచ్చిన ముత్యం దంపతులు, రత్నం దంపతులకు బహుమతులిచ్చి,  విందు స్వీకరించి,కులాసాకబుర్లతో, ఆటపాటలతో గడిపేసారు. ఆరేళ్ళ రత్నం ఏకైక కుమారుడు, ముత్యానికి, అతని భార్యకు బాగా చేరికయ్యాడు, ఆ ఒక్క రోజులోనే. ఇంటికి బయలుదేరుతూ ముత్యం దంపతులు రత్నం కుమారుడిని తమతో తీసుకెళతామని కొద్ది రోజులుంచుకుని పంపుతామని అనడంతో రత్నం దంపతులు అంగీకరించారు. 

రత్నం ఆరేళ్ళ కొడుకు ముత్యం పిల్లలతో కలసి ఆటపాటల్లో మునిగిపోయాడు, ఇంటి ధ్యాసే మరచాడు.   ఒక  రోజు, ముత్యం భార్య పెరటితోటలో తిరుగుతుండగా ముల్లు గుచ్చుకుని కూలబడింది. కూడా ఉన్న పరిచారిక ముల్లును బయటికి తీసిందిగాని, కాలిలో ముల్లు విరగడంతో, లోపల ములుకు ఉండిపోయింది. పరిచారిక అదిగమనించి సన్నటి సూదిని తీసుకుని, నెమ్మది ములుకు చుట్టూ కుట్టి ములుకును బయటికితీస్తూ. 'ముల్లును ముల్లుతోనే తీయాలమ్మా కంగారుపడితే ఉపయోగంలేదు' అన్నది. ఈ మాట ముత్యం భార్యకి ''మోసాన్ని మోసంతోనే జయించాలనే'' మాట స్ఫురింపజేసింది, ఉత్సాహపడింది. ఆ రాత్రి ముత్యంతో మాటల్లో జరిగినది చెప్పి 'మోసాన్ని మోసంతోనే జయించాలి,వజ్రం వజ్రేన భిద్యతె' అనే మాట గుర్తు చేసింది. ఆలోచనలు రాపాడాయి, రూపు దిద్దుకున్నాయి,అపాయంలేని ఉపాయంతట్టింది.


మర్నాడు సాయంత్రం ముత్యం అవుడు గుడుచుకుంటూ రత్నం దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. రత్నం ఏమయిందని కంగారూ పెట్టేడు. ముత్యం తమాయించుకుని, ''మిత్రమా! నీకొడుకూ నేనూ సంతలోకెళ్ళేం. అక్కడ తినుబండారం   కొనుక్కున్నాడు. 

 తిరిగి వస్తుండగా ఒక పెద్దగద్ద వచ్చి కుర్రవాడిని ఎత్తుకుపోయిందని'' బావురుమన్నాడు. విన్న రత్నం కూలబడి కోపంతో ''నువ్వే నాకొడుకును ఏదో చేసేవు,లోకంలో గద్ద మనుషుల పిల్లలని ఎత్తుకుపోవడం విన్నామా?'' అంటు రంకెలేసి, గబగబా రాజుగారి దగ్గరికి పరిగెట్టేడు. 


రాజుగారి  తో,

 ”ముత్యమనే అతను నా స్నేహితుడు ఐదేళ్ళకితం వ్యాపారం కోసం విదేశం వెళ్ళేడు. కొద్దిరోజుల కితం తిరిగొచ్చేడు. ఆ సందర్భంగా విందు ఇచ్చాను. విందు తరవాత నా కొడుకును తమ దగ్గర కొన్ని రోజులుంచుకుని పంపుతామని ముత్యం దంపతులు చెబితే వారితో పంపించాను. ఇదిగో ఇప్పుడు ముత్యం, నా కొడుకును గద్ద ఎత్తుకుపోయిందంటున్నాడు. తమరే విచారణ చేసి న్యాయం చేతాలని కోరుతున్నా” అన్నాడు

 ''లోకంలో గద్దలు కోడిపిల్లల్ని ఎత్తుకుపోడం విన్నాంగాని ఆరేళ్ళ పిల్లాణ్ణి ఎత్తుకుపోడం వినలేదు మహరాజా!  ముత్యమే నాకొడుకుని ఎదో చేసేడని'' బావురుమన్నాడు. విన్న రాజు ముత్యం కోసం కబురంపేడు. ఈలోగా అక్కడే ఉన్న మంత్రి గూఢచారితో జరిందేమో రహస్య విచారణ చేసుకురమ్మన్నాడు. ఈలోగా ముత్యం చేతులుకట్టుకుని రాజు ఎదుట నిలిచేడు. కుర్రాణ్ణి ఏంచేసేవో చెప్పమని ముత్యాన్ని నిలదీశాడు రాజు. దానికి ముత్యం, 'నేను కుర్రాణ్ణి ఎమీ చేయలేదు, నిజంగానే గద్ద పిల్లాణ్ణి ఎత్తుకుపోయింది మహరాజా' అని లబలబలాడేడు.దానికి రాజు 'గద్ద ఆరేళ్ళ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిందంటే నమ్మమంటావా?' అడిగాడు రాజు. దానికి ముత్యం ''రెండు వందలబారువుల ఇనుమును ఎలుకలు  తిన్నాయని మిత్రుడంటే నమ్మేను

 ఆరేళ్ళ కుర్రాణ్ణి గద్ద ఎత్తుకుపోడం విచిత్రమా మహరాజా!'' అని వాపోయాడు. 


  విషయం  విన్నరాజు, జరిగింది నిజం

  చెప్పమన్నాడు. దానికి ముత్యం జరిగినదంతా వివరించాడు. తగువు వ్యాపారానికి సంబంధించినది, ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించినరాజు,విచారణ మర్నాటికి వాయిదా వేసేడు. మర్నాటికి వేగుల దగ్గరనుంచి వార్తా వచ్చింది.  ఇనుము ఎలుకలు తినేసేయని నీవన్నావని నీ మిత్రుడు అంటున్నాడు. దీనికి నీ సంజాయిషీ ఏమంటే, రత్నం, ''నిజంగానే ఎలుకలు ఇనుమును తినేసేయి మహరాజా'' అన్నాడు. అప్పుడు రాజు ''రెండు వందల బారువుల ఇనుమును ఎలుకలు తిన్నాయంటే  ముత్యం నమ్మేడు, నువ్వూ అదే చెబుతున్నావు,   నేనూ నమ్మేను, ఆరేళ్ళ కుర్రవాడిని గద్ద ఎత్తుకుపోయిందంటే నమ్మలేనా? గద్ద ఎత్తుకుపోతే ముత్యం ఏం చేయగలడో చెప్పు'' అన్నాడు.  దానికి రత్నం  నిజం చెప్పుతున్నా మహరాజా!    

ముత్యం విదేశం వెళ్ళే ముందు నా గొదాములో 200 బారువుల ఇనుము నిలవచేసిన మాట నిజం. సంవత్సరంలో వస్తాను, వచ్చాకా అమ్ముకుంటానన్నది నిజం..ముత్యం అనుకున్నట్టుగానే సంవత్సరానికి ధర రెట్టింపైయ్యింది,ముత్యం రాలేదు, ఆపై మూడేళ్ళు అగాను, నాలుగురెట్లయింది, ధర. మిత్రుని జాడలేదు. ఆగలేక అమ్మేసాను. కొంతకాలం సొమ్ము వేరుగా ఉంచాను, ఆ తరవాత నా సొమ్ములో కలిపేసాను. మిత్రుడు వచ్చి ఇనుము అమ్ముతాననడంతో స్వార్థం మనసులో అప్పటికప్పుడు పుట్టి కట్టుకత కల్పించి, ఎలుకలు ఇనుమును తినేసాయని చెప్పేను. తప్పుచేసాను.  ''మొత్తం సొమ్ము వడ్డితో సహా ఇచ్చుకుంటాను. తమరు వేసే శిక్షకు కూడా అర్హుణ్ణి మహరాజా!  నన్ను క్షమించమని వేడుకుంటున్నాను'' అని లబలబ లాడేడు.  విన్న,రాజు రత్నం చెప్పినట్టు సొమ్ము ముత్యానికిచ్చేటట్టు, మోసం చేయాలని ప్రయత్నించినందుకు మరొక లక్ష రూపాయలు ముత్యానికి అదనంగా చెల్లించేటట్టు,ఖజానాకు కొంత పరిహారం చెల్లించేటట్టు, ముత్యం రత్నం కొడుకును అతనికి అప్పచెప్పేటట్టు తీర్పు చెప్పేడు. దానికి, ముత్యం రాజుకు ధన్యవాదాలు చెబుతూ, ''ఇతను నా మిత్రుడు, బలహీన క్షణంలో దురాశకు లోబడిపోయాడు. ఇతన్ని క్షమించండి. నాకు నా ఇనుము అమ్మిన సొమ్ముమిస్తే చాలు, వడ్డి కూడా వద్దు. అతని గొదాముకు ఇవ్వవలసిన అద్దె నా కివ్వవలసిన సొమ్మునుంచి మినహాయించుకోవచ్చును. రత్నం కొడుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు'' తమ ఆజ్ఞతో హాజరు పెడతాననడంతో, రత్నం కొడుకును ప్రవేశపెట్టి రత్నానికి 

   ప్పజెప్పడం జరిగింది. జరిగినదానికి సిగ్గుపడ్డ రత్నం ముత్యం కాళ్ళకి మొక్కేడు, అంతట ముత్యం మిత్రుణ్ణి లేవదీసి గుచ్చి కౌగలించి, నీవు చిరకాల నామిత్రుడివి, బలహీన క్షణంలో తప్పు చేసినంతలో నిన్ను వదులు కోగలనా? నీ కొడుకు నా ప్రాణం కదూ! అటువంటివానికి హాని చేస్తానని ఎలా అనుకున్నావని అడిగాడు. 

రత్నం మరో సారి చేసినదానికి సిగ్గుపడ్డాడు 

చిన్నప్పుడు చదువుకున్న కత. నేను కొంత మార్పు చేసేనేమో కూడా, పూర్తిగా గుర్తులేక. స్వార్ధం ఎంతపని చేయిస్తుందన్నది, కతలో ముఖ్యభాగం, అలాగే మిత్రుడు క్షణిక బలహీనతకు లోనైనా సరిదిద్దుకోవాలిగాని శత్రుత్వం వహించడం కాదని నీతి చెప్పే కత.


28 comments:

  1. బావుందండీ

    ఇంతకీ ఈ కత ఇప్పుడెందుకు టపీ మని గుర్తుకొచ్చి మీరు వ్రాసి నట్లు ?


    ReplyDelete
    Replies
    1. Zilebi4 September 2023 at 09:33
      ధన్యవాదాలు.
      చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోగలిగితే మేధావులే

      Delete
    2. ఆ పాటి మేధావులమైతే మీ టపాలెందుకు చదువుతామండి తాతగారు ?

      Delete
    3. నిజం ఒప్పుకున్నారు, సంతసం.బుర్రలో గుంజు ఎండిపోయి ఎన్నేళ్ళయింది?ఆలోచింపజేసే టపారాసి ఎన్నేళ్ళయింది?సమాధానం చెప్పగలరా? లొల్లాయి కబుర్లు చెప్పే నేను మేధావినని ఎప్పుడూ చెప్పుకోలేదు. నన్నెవరూ మేధావీ అనలేదు. అనరు కూడా! ఆలోచించుకోండి!! మళ్ళీ నాకీ సావకాశం రాకపోవచ్చు.

      Delete
    4. ఆఖరి టపా చూస్తే ఎన్నేళ్లయిందో తెలిసిపోతూందండి కానీ బద్దకము దానికిన్నీ :)

      ఏదో టపాల్స్ చదువుకుంటూ కాలక్షేపం అంతే :)

      Delete
  2. Replies
    1. విన్నకోట నరసింహా రావు4 September 2023 at 11:17
      కుక్క కాటుకు చెప్పుదెబ్బ సామెత. ముత్యం అలా చేయలేదు. మిత్రుడిని మార్చుకున్నాడు, తప్పుదోవనుంచి రక్షించాడు. తాను నష్టపోలేదు, మిత్రుణ్ణీ నష్టపెట్టలేదు.

      Delete
    2. టపాల్స్ చదువుకుంటూ కాదు - వెర్రి మొర్రి గిద్యాలు రాయడం తలా తోక లేని కామెంట్లు పెట్టడం అదీ తమ కాలక్షేపం బి లేజీ.

      Delete
    3. బడుద్దాయ్ ఎవరు వాయ్ నువ్వు మధ్యలో ?

      Delete
    4. పేరు చెప్పి శరణు కోరుమా ఢింభకా

      Delete
    5. ముందు నీ ఫేక్ ఐడెంటిటీ ముసుగు తీసివేయి పిడక గిద్యాల బి లేజీ.

      Delete
    6. ఓ యబ్బో మాటకి మాటంటే ఏమి కోపము పుట్టుకొచ్చేస్తోందో బడుద్దాయికి

      Delete
    7. Anonymous4 September 2023 at 17:31
      Anonymous4 September 2023 at 22:12
      Zilebi4 September 2023 at 18:37
      Zilebi5 September 2023 at 05:41
      శాబాసూ! ఇద్దరూ కీబోర్డ్ వారియర్లే!! బాహాబాహీ, ముసుగులు తీసి కలబడలేనివాళ్ళే!!! పిరికివాళ్ళే, పేరుకూడా చెప్పుకోలేనివాళ్ళు.
      భారత యుద్ధంలో రాత్రి కూడా కాగలతో యుద్ధంచేసి నరుక్కు చచ్చారు. అప్పుడు ప్రవర చెప్పుకునే పొడుకున్నారు. ముసుగులేసుకుని కాదు. దమ్ముంటే ఇద్దరూ చోటు చెప్పండి, పేర్లు చెప్పుకోండి, వాగ్యుద్ధమో, మరోటో తేల్చుకోండి, నేనూ వస్తా!

      మరోమాటా! చంద్రునిమీద ఎకరం పదిహేను లచ్చలుట. రెండెకరాలు కొంటున్నా! ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా! ఏర్పాట్లు చేసుకున్నా! మీకిద్దరికి అక్కడ ప్లాట్లు, నాపక్క జిలేబికి అనామకానికి ఎదురుగా ఇస్తా! గజకఛ్ఛపాల్లా అక్కడా పోట్లాడుకోవచ్చు! ఏమంటారు?

      Delete
    8. సై అంటే సై కొనేయండి :)

      వేడి పలుచగా పుట్టి నట్టుంది :)

      Delete
    9. Zilebi5 September 2023 at 09:57
      జిలేబీ!!
      ఇల్లాలు దీర్ఘనిద్రలోకి జారుకుని నేటికి సరిగా ఐదేళ్ళు. నిన్న రాత్రి కనపడింది.
      ఎక్కడునావు అడిగా.
      చంద్రలోకంలో!
      వచ్చెయ్యండి, ఇంకా అక్కడుండి ఏ చేస్తున్నారూ? ప్రశ్నించింది.
      ఆ ప్రయత్నంలోనే ఉన్నా. కారణం లేనిది ఘటం కదలదుగా! కాలు విరిగింది, కదలికలేదు. సుగర్ పెరిగింది. కట్టేసేరు, కాలికి. రాపిడికి కాలుమీద పుండు పడింది. పుండు తగ్గాలాంటే సుగర్ తగ్గాలి, సుగర్ తగ్గాలంటే కాలు కదలాలి, కాలు కదలాలంటే.....
      ఇంక చెప్పద్దు. అన్నీ మీతో ఆలీసెమే! గొలుసు తెంచుకోండి, తొందరగా వచ్చెయ్యండి.ఇక్కడ మీ రూపాయిలు చెల్లవు తెలుసా! మా అన్నయ్యలంతా ఇక్కడే ఉన్నారు, సిరివెన్నెల,బాలు.....
      నేనిక్కడ మేయర్, మీతో కబుర్లాడుతూ కూచుంటే కుదరదు, చంద్ర మహారజ్ తో ఈ వేళ డెవలప్మెంట్ మీటింగూ, అర్జంటు వెళుతున్నా, తొందరగా వచ్చెయ్యండని వెళ్ళిపోయింది.
      నేను కదిలే పనిలో ఉన్నా!, మీకింకా బయలుదేరే సమయం ఉన్నట్టుంది. మీరొచ్చేదాకా, మీకు నాపక్క ప్లాటు రిజర్వులో ఉంచుతాను. దెబ్బలాటకి కూడా సమ ఉజ్జీ కావాలి :)

      Delete
    10. జిలేబీ!
      రెండు రోజులుగా కనపళ్ళేదు. ఎలా ఉన్నావు? చదువుకున్నావుకదా! ఇంత బాధపడచ్చా? అన్నీ సహజంకదా!

      సుఖస్యానంతరం దుఃఖం
      దుఖస్యానంతరం సుఖం
      న నిత్యం లభతె దుఃఖం
      న నిత్యం లభతె సుఖం.

      ఏదీ స్థిరంగా ఉండిపోదని తెలుసుగా! మరిదేల?

      నచ్చలేదు!నచ్చలేదు!!నచ్చలేదూ!!! మరొకరిని బాధపెట్టడమేగాని మనకి బాధపడడం తెలియనిది కదా! మరిదేంటీ? :)
      వచ్చెయ్యి! దుఃఖం నుంచి బయటకు రా!!!

      Delete
    11. “జిలేబి” గారేదో బాధలోనో దుఃఖంలోనో ఉన్నారని మీకెందుకనిపించింది, శర్మ గారు?

      Delete

    12. విన్నకోట నరసింహా రావు7 September 2023 at 17:53

      చంద్రుని మీద రెండెకరాలు కొంటున్నానంటే హుషారు చేసిన మనిషి, మర్నాడు నా ఇల్లాలు చంద్రలోకంలో ఉంది, నేనక్కడికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నా! చెప్పలేదనకపొయ్యేరు, అనచ్చని చెప్పేను. దానికి కొంత బాధపడినట్టనుకున్నా! కనపడకపోడంతో. కాదనే వారే ఎక్కువుంటారండి! జిలేబి మనసు రాయి అంటారంతా!!! జిలేబి మనసు తంగం కాని మాట పెళుసు. నోరు అంబాలపండు, చెయ్యి బలుసు ముల్లు సామెతలాగ, అనుకుంటున్నానండి..ఎంతైనా పదమూడేళ్ళ సావాసంకదా! అదండి సంగతి.

      Delete
    13. నాదీ అదే తరహా, శర్మ గారు (పెళుసు … వెన్న) 😌. కానీ పైకి కనిపించేది మాటే గానీ మనసు కాదు గదా 😒.

      “వాగ్భూషణం ….” అని భర్తృహరి అన్నాడు అనుకోండి కానీ అందరూ ఒకే మూసలో పోసినట్లుండరు కదా.

      Delete
    14. విన్నకోట నరసింహా రావు8 September 2023 at 11:34

      పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
      జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును
      ఈ నల్లని రాలలో..... అన్నారో సినీ కవి.
      లోకం పైన చూస్తుందెప్పుడు, అది దాని తప్పూ కాదు, కాలమహిమ, ఇది కలికాలం కనక.
      అందుకే ఆచార్య చణకుడు

      ధీతృత్వం ప్రియ వక్తృత్వం
      ధీరత్వ ముచితజ్ఞతా
      అభ్యాసేన న లభతె
      చత్వార సహజా గుణాః

      మీలా రసజ్ఞతతో మాటాడగలిగేవారు అరుదు, ఇది పొగడ్తకాదు, నిజం.
      జిలేబికి ఇది చేతకాలేదు.పైకి కఠిన లోన తంగం...మెత్తన...ఇది అర్ధం చేసుకునే వాళ్ళెంతమంది? అదీ కొచ్చను :) ఇదీ నిజమే సుమా!

      Delete
  3. కోపం కాదు నీ పైత్యం పట్ల జుగుప్స బి లేజీ రాలుగాయి. జాబిల్లి పై కూడా బిలేజీ కాలుష్యం అవసరమా.

    ReplyDelete
    Replies
    1. జుగు పస అయితే ఫర్లేదు బడుద్దాయ్ కోపం లే కదా అదే పదివేలు :)

      ఎన్ జాయ్

      Delete
    2. ఐతే ఒకే బిలేజీ వెధవాయ్
      నీ పైత్యపు రాతలంటే జుగుప్స
      లేదు ఈ జబ్బుకు చికిత్స.

      Delete

  4. Anonymous5 September 2023 at 11:07
    Zilebi5 September 2023 at 11:41
    Anonymous5 September 2023 at 12:11
    మీ కలహానికి నా బ్లాగు వేదిక కాదు. మరో చోట మీ కలహం కొనసాగించుకోవచ్చు. సున్నితంగా చెబితే మీకిద్దరికి అర్ధమవుతున్నట్టు లేదు. ఇక ముందు మీ కామెంట్లు తీసివేయబడతాయి.ఇద్దరూ చదువుకున్నవాళ్ళలాగే ఉన్నారు. మీ విజ్ఞత ఏమైనట్టు?

    కోపము నుబ్బును గర్వము,
    నాపోవక యునికియును, దురభిమానము ని
    ర్వ్యాపారత్వము ననునివి,
    కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా. భారతం.
    ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…౩౨.
    ఈర్ష్యాళువు,జుగుప్సావంతుడు,క్రోధనుడు,నిస్సంతోషి, నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి అనువారారుగురు దుఃఖభాగులు. ఇందులో మీరెవరో తేల్చుకోండి.

    ReplyDelete
  5. ఒక సంవత్సరంలో వస్తానని చెప్పి 5 ఏళ్ళ వరకు రాకపోడం ముత్యం తప్పు. దానికి శిక్ష/జరీమానా ఏమీ ఉండదా? పైగా 5 ఏళ్ళ వరకు గోదాములో తన ఇనుము దాచుకున్నందుకు కిరాయి కూదా తన స్నేహితుడికి చెల్లించాలి. ఎంత స్నేహితుడైనా గోదాము 5 ఏళ్ళ పాటు ఉచితంగా ఇవ్వలేడు కదా. న్యాయం ఇద్దరికీ సమంగా ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. కాంత్5 September 2023 at 22:37
      ముత్యం సంవత్సరంలో వస్తానన్నవాడు ఐదేళ్ళ దాకా రాకపోవడం నేరంకాదు, రత్నానికి కబురుపెట్టకపోవడం, తప్పేమోగాని నేరంకాదు. రత్నానికి ఇనుము అమ్మకం లాభనష్టాలతో సంబంధంలేదు. ధరపెరిగినా తగ్గినా పట్టించుకోనవసరంలేదు. కాని మిత్ర ధర్మం నెరవేర్చాడు. లాభ నష్టలతో నీకు సంబంధం లేదు, ఎందుకమ్మేవని ముత్యం తగువు పెట్టలేదు.
      కిరాయిలు, రుసుములు, కొట్టద్దెలు. నిర్వహణ ఖర్చులు వ్యాపారవర్గాలు వేరుగా చెప్పుకోవు. అవి సహజంగా ఉండేవి, జరిగిపోయేవి. ఐనా ముత్యం వాటన్నిటిని తనకివ్వవలసిన సొమ్మునుంచి మినహాయించుకోమనే చెప్పేడు. రాజు మిత్రద్రోహానికి జరిమానా వేశాడు, ముత్యానికివ్వడానికి. దానిని కూడా ముత్యం వద్దన్నాడు. మరిదంతా ఎందుకు చేసాడు. మిత్రుడు బలహీన క్షణంలో దురాశలో పడిపోయాడని బాధపడి, అతనికో పాఠం చెప్పించి,మళ్ళీ దారికి తెచ్చుకోవాలనుకున్నాడు తప్పించి శత్రుత్వం వహించాలనుకోలేదు.
      రత్నం తప్పు చేయలేదు. మిత్రునికి లాభం చేకూర్చడానికే అమ్మేసేడు. నాకేం అనుకోలేదు. బలహీన క్షణంలో దురాశకు లోబడిపోయాడంతే!

      చాలా చెప్పించేసారు.ధన్యవాదాలు.

      Delete
  6. ఎంత ధైర్యం వాళ్లకి?
    మనని "మీరు మతోన్మాదులు, దోపిడీదార్లు, అగ్రకులంగాళ్ళు,నిమ్నకుల హంతకులు, బొందుగాళ్ళు, సనాతనంగాళ్ళు,విషక్రిములు" అని చావు తిట్లు తిడుతూ మళ్ళీ మనని తమకి ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు.
    చిన్న పిల్లలు కూడా మనం కొనిచ్చిన మొబైల్ లాక్కున్న చిన్న నేరానికి ముఖం మీద గుద్దినట్టు నిలదీస్తున్నారు - "ఎందుకు కొన్నావు? ఎందుకు ఇచ్చావు? ఎందుకు లాకుంటున్నావు?" అని లాజిక్కులు లాగి మనం సిగ్గుపడేలా చేస్తున్నారు.
    మనకి ఆపాటి తెలివి కూడా లేదా!మనల్ని బూతులు తిట్టి మనం పాటించే ధర్మాన్ని అవమానించిన వాళ్లకి మనం ఓటు వెయ్యాలా, వేస్తామా?
    ఛీ, ఏం బతుకు ఇది !

    ReplyDelete
    Replies
    1. hari.S.babu8 September 2023 at 15:38

      జయత్యతిబలో రామ
      లక్ష్మణస్య మహా బల
      రాజా జయతి సుగ్రీవో
      రాఘవేణాభి పాలితః

      జయహో భారత్!
      ముల్లును ముల్లుతోనే తీయాలి.

      Delete