Monday 1 May 2023

అని, అనిపించుకోడం....

 అని, అనిపించుకోడం అత్తగారూ నీకలవాటు.


ఇదొక నానుడి,తెనుగునాట బాగా చెప్పుకునీదిన్నూ!! అత్తగారంటే సాధించేదనీ,వేధించేదనీ,బాధించేదనీ..... 


కొడుక్కి పెళ్ళిచేస్తే కోడలొస్తుంది,అప్పుడే అత్తరికమూ వస్తుంది. అత్తయ్యేటప్పటికి వయసూ మళ్ళుతూ ఉంటుంది, కోడలివి వచ్చేరోజులు అత్తవి పోయే రోజులూన్నూ. పాతరోజుల్లోలా అత్త అథారిటీ చెలాయిస్తానంటే కుదురుతుందా!!!! కుదరకపోవచ్చు. మరేం చేయ్యాలి? అదిగదా కొచ్చను? గౌరవం నిలబడాలంటే అత్త తగ్గి ఉండటం మంచిది కదా!!!!!  కాదు పాతరోజుల్లో లా అథారిటీ చెలాయిస్తానంటే ఎలా? ఇప్పటిరోజుల్లో మాటంటే కోడలూరుకుంటుందా? ఒకమాటంటే తనూ మరోమాటంటుంది, అంతే! తమలపాకుతో నీ వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా, అని చేతలకి కూడా దిగచ్చు.


తెనుగింటి అత్త అంటే ఎలావుంటుందంటే ”సూరేకాంతా”న్నే చెప్పుకోవాలి.అత్తపాత్రలో అంతగా ఇమిడిపోయి నటనలో జీవించిన నటి మరొకరు నేటికిన్నీ లేరు,లేరు,లేరు.ఇంతటి దుష్టపాత్రల్ని పోషించినామె మనసువెన్ననీ, షూటింగ్ సమయంలో అందరికి తాను ఇంటి దగ్గర స్వయంగా చేసి తెచ్చిన తినుబండారాలు పంచిపెట్టేదని నేటికిన్నీ చెప్పుకుంటూ ఉంటారు.    అత్తని తలుచుకుంటే సూరేకాంతాన్ని తలుచుకోకపోవడం పాపం.అత్తరికం వెలగబోయడం  వ్యక్తులకే కాదు దేశాలకీ వర్తిస్తుందిష.


పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః

తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః


 ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మాదే గొప్ప దేశమని డబ్బా కొట్టుకునే అమెరికా ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, ఏమనీ? మీ దేశంలో గుజరాత్ కోర్ట్ రాహుల్ గాంధీ పై ఇచ్చిన తీర్పును గమనిస్తున్నామూ, అని. ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూ ఇతరదేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడమేమీ? అడిగేరు కొందరు. ప్రజాస్వామ్యదేశాలలో జరిగేవాటిని గమనిస్తుంటాం! అంతేగాని అది ఆ దేశపు విషయాలలో జోక్యం కాదూ, అని సెలవిచ్చేరు. సరి! ఇలాటివి ఆ దేశానికి కొత్తకాదు, మొదటిసారికాదు.  తెచ్చిపెట్టుకున్న అత్తరికం వెళ్ళబోయడం ఈ దేశపు అలవాటూ! ఇది కొత్తాకాదు. ఇలా జరుగుతున్నందుకు ఆ దేశాలూ గట్టిగా సమాధానాలూ చెప్పటంలేదు, కారణాలు తెలిసినవే! కోడలికి కూడా రోజొస్తుందికదా! అలాగే భారతదేశానికీ రోజొచ్చింది. మీదేశంలో మాజీ ప్రెసిడెంటును కోర్టులో అరెస్టు చేసిన విషయం గమనిస్తున్నామని చెప్పి బదులు తీర్చేసేరు. అంచేత అని అనిపించుకోవడం అత్తగారి లక్షణమనుకోవాలా?  



18 comments:

  1. ఏవోయ్
    మా అమెరికాని ఏదో అంటున్నావ్ ?
    జాగర్త పేటెంటు ఏక్ట్ కింద బొక్కలో తోసి డాలర్లు వసూల్ చేసేస్తాం ఖబడ్దార్ .


    ReplyDelete
    Replies
    1. Anonymous2 May 2023 at 05:06
      ”ఉన్నమాటంటే ఉలుకెక్కువని”, ఇదీ ఓ సామెతే అత్తా!!!! :)

      Delete
  2. Anonymous గారు,
    కేసు వేస్తారా? కేసు వెయ్యాలంటే మీరు మా దేశానికి వచ్చి శర్మ గారి ప్రాంతంలోని సంబంధిత కోర్టులో వెయ్యాలి. ముందుగా ఇక్కడి లాయరు గారినొకర్ని నియమించుకోవాలి. కేసు వేసిన తరువాత ఓ ఇల్లు అద్దెకు తీసుకునో లేదా మీ “డాలర్లు” ఖర్చు పెట్టి హోటల్ లో గది అద్దెకు తీసుకునో కేసు విచారణలకు, వాయిదాలకు హాజరవుతూ ఉండాలి. ఎంత కాలమైనా పట్టచ్చు.
    All the best.
    😏

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు2 May 2023 at 09:25

      టపాలోనే చెప్పినట్టు
      పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః
      తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః
      ఎదుటివారికి చెప్పేటపుడంతా పండితులే, ఆచరించేటపుడు కాదు.

      ''ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి'' సినీకవిమాటకదా!
      వాక్స్వాతంత్ర్యం, వ్యక్తి స్వాతంత్ర్యం, చెప్పేవే! చిన్నపాటి నిజాన్ని కూడా సహించలేరు కదా!!!!

      Delete
  3. శర్మ గారు,
    మీ బ్లాగు(ల)కు All disputes subject to …… (ఊరి పేరు) jurisdiction అని కూడా తగిలించండి 🙂🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు2 May 2023 at 10:55
      అంతేనండి

      Delete
  4. అమెరికా కు అత్తగారితో పోలిక సరికాదు. పెద్దన్న పాత్ర పోషిస్తుంది.

    ReplyDelete
    Replies

    1. Anonymous2 May 2023 at 15:32
      నసపెట్టడం,సాధించడం అత్తగారి పాత్రపోషించడమేగాదుటండీ

      Delete
  5. జిలేబీ కంద లకు మధ్యాక్కర లకు పోటీ. ఇక బ్లాగులలో పిడకలు. పీడకలలు.

    ReplyDelete
    Replies
    1. కొత్తగా ఠాట్ కీతలు కూడా చేరేయి

      Delete
    2. సలహాల్రాయుడూ, కలహాల్రాణీ జట్టుగా జల్లికట్టాడి మధ్యాక్కర మతులను గతి తప్పించి తరిమెయ్యకుంటారంటారా అజ్ఞాతల వారూ?

      Delete
    3. Anonymous3 May 2023 at 07:54
      జల్లికట్టే ఆడతారో ఉల్లికుట్టే చేస్తారోగాని బాబయ్యా! కొంపకొల్లేరవుతున్నట్టుంది.

      Delete
    4. Anonymous3 May 2023 at 00:12
      తెలిసేలా చెప్పండి మరి

      Delete

    5. Anonymous3 May 2023 at 00:12
      పిడకలూ తప్పవు పీడకలలూ తప్పవులెండి

      Delete
  6. సలహాల్రాయుడూ, కలహాల్రాణీ - 🤔🙃

    ReplyDelete
    Replies
    1. Anonymous3 May 2023 at 15:40
      అనామకస్య వందనస్య వందనం
      కుత్ర? కుత్ర? వీరతాడస్య :)

      Delete