Monday 13 February 2023

పన్ను పైపన్ను!

 


Photo Courtesy: linlin Smith

పన్ను పై పన్ను!

ప్రకృతి వింతలెన్నో! చూసేకన్నూ, మనసూ ఉండాలి.

మానవులకి పళ్ళు పుట్టకతో ఉండవు. ఆరునెలమొదలు దశలవారీగా వస్తాయి. ఇవి పాలపళ్ళు.ఆరేళ్ళ మొదలు ఊడిపోయి వాటిస్థానంలో పళ్ళొస్తాయి. ఆ తరవాత పాతిక ముఫై వయసులో జ్ఞానదంతాలొస్తాయి. పళ్ళు దశలవారీగా ఊడిపోతాయి వయసుతో. ఎనభై దాటాకా మళ్ళీ పళ్ళొస్తాయంటారు, నిజమెంతో!


బోసినోటి పాప చిరునవ్వే అందం! అందులోనే ఉంది అమ్మ వైభవం!!


ఇలా పాలపళ్ళు ఊడిపోతున్న సమయంలో,ఊడిపోయినపంటి దగ్గర దురదతో గొలుక్కునేవాడిని నాలుకతో. ఇది చూసిన పెద్దలు, ఒరే అలా గొలుక్కోకు, కక్కిరాల అచ్చమ్మ పళ్ళలా ఎత్తుపళ్ళొస్తాయనేవారు. ఈ అచ్చమ్మ అనబడే ఆమె మా పక్కవీధిలో ఉండేది. అందరూ ఆమె ఎత్తుపళ్ళకి పరిహాసం చేసేవారు. మా వాళ్ళు ఇలా అటుండంతో, ఆమెను దీక్షగా గమనించా! ఆమెను చూసిన వెంఠనే అందవికారంగా ఉన్నటనిపించేది. నేను పరిశీలించి చూసి, ఆమె ఎత్తుపళ్ళు,ఆమె మొహంలో దరహాసాన్ని చూపిస్తున్నట్టు గమనించా! నాకేమీ తెలియని వయసుకూడా! కాని ఆమెకు చేతులు జోడించి నమస్కరించా! తల్లి ఆశ్చర్యపోయింది. అది మొదలు ఆమె కనపడితే నమస్కారం చేసేవాడిని. నేను ఆ తరవాత కాలంలో యాచన చేసి చదువుకున్నా! ఆ తల్లి నా నేటి స్థితికి కొంత కారణభూతురాలు కూడా!


ఆ తరవాత కాలంలో నా పెద్దకూతురికి పైపళ్ళలో పక్క పన్ను, పన్ను పై పన్నుండేది. అమ్మకి నా పెంచినతల్లిపేరే పెట్టుకున్నా! అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే!  నాకూతురు కూడా చిరునవ్వు నవ్వుతున్నట్టే ఉండేది.


చాలాకాలం తరవాత  మందస్మిత వదనారవిందయైన తల్లిని చూసా!!(పన్నుపైపన్ను ఉన్న అమ్మను చూసా)! ఇది, ప్రకృతి చిత్రం, అమ్మ వైభవం, అసంకల్పితంగానే చేతులు జోడించి నమస్కరించా!. పన్నుపైపన్నొస్తే అదృష్టం అంటారు,ఎందుకు?  వీరి మొహంలో ఎప్పుడూ చిరునవ్వు కనపడుతుంది.  పైపళ్ళలో పక్కపన్ను దొంతరపన్ను కావడంతో పైపెదవి కొంచెం పైకి లేస్తుంది. అది చిరుదరహాసానికి నాంది. ఆ పైపెదవి లేవడంతో కన్ను అరమూత పడుతుంది. అదీ పూర్తిగా దరహాసానికి పరాకాష్ట. ప్రతి స్త్రీలోనూ అమ్మవైభవం ఉంటుంది కాని వీరిలో అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉంటుంది. అదికదా అదృష్టం! ఆపై ఈ తల్లి మాట మరింత అమ్మవైభవాన్ని తెలియజేస్తుంది. మాట మనుషుల్ని దగ్గర చేస్తుంది, మాటే మనుషుల్ని దూరం చేస్తుంది.  మరి అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉన్న తల్లికి  చేతులెత్తి నమస్కారం!


''హత్తిన ప్రేమ జూపుటకు అమ్మయు, నాన్నయు నాకు కల్గగా

నెత్తఱి నెంచి చూచినను నెక్కువ నేనని గౌరి పల్క; ”నా

కత్తయు మామగారు కల”రంచును నవ్విన శూలి నేర్పుకున్ 

బిత్తరి చూపులన్ నిలిచి ”నేర్పరులే” యను గౌరి కొల్చెదన్


అల్పజీవి-అర్ధనారి. 

(శతకం నుండి, నా మిత్రులు)

రచన:- శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి


”నాకు అమ్మా నాన్నా ఉన్నరోచ్” ఎలా చూసినా నేనే గొప్ప, అన్నది అమ్మ గౌరి, దాని శంకరులు ”నాకు అత్తా, మామా ఉన్నారోచ్” అనగా అమ్మగౌరి ”నేర్పరులే” అని బిత్తరి చూపులతో నిలబడిన తల్లి గౌరి నన్ను రక్షించు గాక.


( స్వయంభువువు,పుట్టుక లేనివాడు, తల్లితండ్రులు లేనివాడు శంకరుడు, అందుకు నాకు అత్తా, మామా ఉన్నారని చమత్కరించాడు)


మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా! 

మందస్మిత ముఖారవిందయైన తల్లి లలితాదేవి నన్ను రక్షించుగాక!


10 comments:

  1. 👌👌🙏🙏

    ReplyDelete
    Replies
    1. Anonymous13 February 2023 at 12:41
      ధన్యవాదాలు.

      Delete
  2. // “ ఎనభై దాటాకా మళ్ళీ పళ్ళొస్తాయంటారు,” //
    ఎంత అదృష్టం! మీకు ఎనభై దాటింది కదా శర్మ గారూ. మరి మళ్ళీ పళ్ళొచ్చాయా ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు13 February 2023 at 18:06
      ఉన్నవి ఊడేయి, కొత్తవి రాలేదు. ఎనభై ఐదు దాటితే వస్తాయంటారు,ఆశాజీవులం

      Delete
    2. 🙂🙂 అంతేగా అంతేగా 🙂🙂.
      అయితే ఈ సందర్భంగా తరచు ఎదురయ్యే అనుభవం గుర్తుకొస్తోంది👇.

      కొన్ని పెద్ద పెద్ద బట్టల షాపులకు వెళ్ళి నాలుగైదువేల బట్టలు ఓ అరడజను కొంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో అన్నీ కుక్కేసి చేతిలో పెడతాడు. ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి కదా ఇంకా కవర్లు కావాలి అంటే మెయిన్ డోర్ దగ్గర ఇస్తారండి అంటాడు కౌంటర్లో. మెయిన్ డోర్ దగ్గర వాడేమో ఓ రెండు కవర్లు చేతిలో పెడతాడు. అదేమిటయ్యా ఇవి నాలుగు వేల రూపాయల బిల్లు అంటే అయిదు వేలకు కొంటే ఎక్కువ కవర్లు ఇస్తామండి అంటాడు. మనం అయిదు అంటే అతను ఆరు అంటాడు. వాళ్ళకేమీ పోలసీ లేదనిపిస్తుంది. కౌంటర్ వాడు, డోర్ దగ్గర వాడు ఆ క్షణానికి నోటికి ఏం సాకు దొరికితే అది చెప్పడం.

      సరే, ఇవి నీతి లేని వ్యాపారాలు అనుకుందాం. కానీ సైంటిఫిక్ గా చెప్పవలసిన దానికి కూడా ఎనభై అని, కాదు ఎనభై అయిదు అనీ అంటే ఎలా? అఫ్కోర్స్ ఇటువంటివి ఏదో కొలిచినట్లు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు లెండి, కాస్త అటూ ఇటూ. అంతే అనుకుందాం.

      మీకు ఎనభై అయిదు నిండినప్పుడు మళ్ళీ అడుగుతాను (నా విషయంలో if god willing). నా స్వార్థం కూడా ఉంది లెండి. ప్రతి సారీ RCT (Root Canal Treatment) చేయించుకోలేక యాతనగా ఉంది 😔.

      Delete
    3. అవునండీ. రూట్ కెనాల్ వైద్యం యాతనే. ఖరీదైనదే. నేను రామ్ దేవ్ రావ్ హాస్పిటల్ వారి దగ్గర రెండుపళ్ళకు ఈమధ్యనే చేయించుకున్నాను. బాగాచేసారు. పైగా ఆట్టే ఖర్చు లేకుండా చేసారు. వైద్యం 2500 క్రౌన్ 6000 ఒకోపంటికీను.

      Delete

    4. విన్నకోట నరసింహా రావు14 February 2023 at 12:01
      శ్యామలీయం14 February 2023 at 12:53
      వ్యాపారస్థుల గురించే చెప్పారా? ఎంతచెప్పుకున్నా తక్కువే!
      ఎనభై ఆ పైనా అంటుంటారు, అన్నవారు, విన్నవారు ఉన్నారుగాని చూసినట్టున్నవారు లేరండి :)
      ఒకవేళొచ్చినా అన్నీ ఒక్కసారొచ్చెయ్యవు, ఉపయోగం లేదు :) ఆసపడద్దు. రూట్ కెనాలు వగైరా తెలీవుగానండి, ఆరేళ్ళ పైబడి అనుకుంటా, పళ్ళు కట్టించుకున్నా! తీసి బయట పెడతా నీళ్ళలో, అవసరం తీరేకా. చిగుళ్ళు జాగర్త్తగా చూసుకుంటున్నా! పెద్దగా ఇబ్బందులు రాలేదు, అప్పుడపుడు చిగుళ్ళు వాచినపుడు బాధ, మందురాసుకుంటే నాలుగురోజులు. అలా గడిపేస్తున్నానండి. ఆధునికుణ్ణి కాదు కదా! నాడు ముఫ్పయి వేల ఖర్చుతో సరిపోయింది, మొత్తం పళ్ళ సెట్టుకు.

      Delete

    5. విన్నకోట నరసింహా రావు14 February 2023 at 12:01
      శ్యామలీయం14 February 2023 at 12:53
      వ్యాపారస్థుల గురించే చెప్పారా? ఎంతచెప్పుకున్నా తక్కువే!
      ఎనభై ఆ పైనా అంటుంటారు, అన్నవారు, విన్నవారు ఉన్నారుగాని చూసినట్టున్నవారు లేరండి :)
      ఒకవేళొచ్చినా అన్నీ ఒక్కసారొచ్చెయ్యవు, ఉపయోగం లేదు :) ఆసపడద్దు. రూట్ కెనాలు వగైరా తెలీవుగానండి, ఆరేళ్ళ పైబడి అనుకుంటా, పళ్ళు కట్టించుకున్నా! తీసి బయట పెడతా నీళ్ళలో, అవసరం తీరేకా. చిగుళ్ళు జాగర్త్తగా చూసుకుంటున్నా! పెద్దగా ఇబ్బందులు రాలేదు, అప్పుడపుడు చిగుళ్ళు వాచినపుడు బాధ, మందురాసుకుంటే నాలుగురోజులు. అలా గడిపేస్తున్నానండి. ఆధునికుణ్ణి కాదు కదా! నాడు ముఫ్పయి వేల ఖర్చుతో సరిపోయింది, మొత్తం పళ్ళ సెట్టుకు.

      Delete
  3. ఎత్తుపళ్ళ వ్యాసం బాగుంది. అదటుంచి గౌరీశంకరుల సరసవచనాల పద్యం మనోహరంగా ఉంది.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం13 February 2023 at 19:23
      పద్యం మా మిత్రుడు కీర్తి శేషులు శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తిగారి అల్పజీవి-అర్ధనారి శతకం నుంచండి.
      ధన్యవాదాలు.

      Delete