Wednesday 25 August 2021

కరోనా పొరలు

కరోనా పొరలు


కరోనా ప్రవేసించి సంవత్సరం దాటింది. మొదటి పొరలో జాగ్రత్తలే ఇప్పటికి పాటించమంటున్నారు. ప్రజలు మాస్కులు వేసుకుంటున్నారు గాని దూరం పాటించటం లేదు, ఎక్కడా! 


రెండు పొరలు పూర్తయ్యాయంటున్నారు. దేశం అంతలోనూ కరోనా వెనకబడుతున్నా, కరోనా పుట్టింటివారి బంధువుల ఇంట కథాకళీ చేస్తూనే ఉందిట. చదువుకున్నవారు మేధావులు ఎక్కువగా ఉన్నచోట ఇలా ఎందుకు జరుగుతోందో మరి. స్థానికంగా కూడా విదేశాలతో రాకపోకలు ఎక్కువగా ఉన్న మండలాలలోనే కరోనా ఉన్నట్టు వార్తలు.


రెండొ పొర నడిచింది మూడో పొర తథ్యం అని చెబుతున్నారు, మేధావులు. చిన్నపిల్లలకే ప్రాణాంతకం ఈ పొర అని కూడా చెబుతున్నారు,కాని అన్ని చోట్ల బడులు తీసేస్తున్నారు. ఈ రోజునుంచి పిల్లలు బడికి వెడుతున్నారు. మనవరాలు చెప్పిన ప్రకారం క్లాసులో అరవై మంది ఉంటే మూడో వంతు బడికి హాజరైనట్లు తెలుస్తోంది.


మొదటి పొరలో వ్యాప్తికి పద్నాలుగురోజుల వ్యవధి తీసుకునే  కరోనా, తరవాత పొరకి వ్యాప్తి సమయం తగ్గింది అన్నారు. కాని రాబోయే మూడో పొరలో వ్యాప్తి సమయం అన్నది లేదు, లక్షణాలేం కనపడవు, వస్తే ఇంతే సంగతులని మేధావులు ఊదరకొడుతున్నారు, ఏమో ఏం జరుగునో తెలీదు.ఇక వేక్సీన్ యుద్ధ ప్రతిపదికన వేస్తున్నారు. వాక్సిన్ వేసినవారికి కరోనా వస్తోందంటున్నారు. కరోనా వాక్సీన్ ప్రభావం మూడు నెలలే అని మరొక వార్త. ఇలా రకరకాల వార్తలు ప్రజల్ని ఊదరకొడుతూనే ఉన్నాయి.కరోనా సమయంలో ఎవరికి ఓపికను బట్టి వారు దండుకున్నారు, ప్రజలనుంచి.ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరిటా వ్యాపారం జోరుగా నడుస్తోంది.


రెండొ పొరలో హాస్పిటళ్ళలో బెడ్లు లేవు,ఆక్సిజన్ లేదనే మాటలు బలంగానే వినపడ్డాయి, కారణం నువ్వంటే నువ్వనుకునేదీ జరిగిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలలో రెండవపొర నడుస్తోంది. అక్కడ కూడా హాస్పిటల్ సౌకర్యాలు అంతంతగానే ఉన్నట్టు వార్తలు. ఏ దేశమైనా దేశప్రజలందరికి హాస్పటల్ లో బెడ్లు కేటాయించలేదేమో.ఒకవేళ బెడ్లూ ఉన్నా అప్పటికప్పుడు నర్సులు డాక్టర్లు పుట్టుకురావడం సాధ్యమా? ఏమో ఏమి జరగనుందో భగవంతునికే ఎరుక.

5 comments:

  1. అవునట, సర్. కరోనా చాలా పద్ధతి గలదట (systematic). అందుకనే మొదటి దశలో వయసులో పెద్ద వారి మీద ఎక్కువగా పడింది. రెండో దశలో మధ్య వయస్కుల మీద పడిందన్నారు. ఇప్పుడు మూడో దశలో చిన్న పిల్లలను పట్టుకుంటుందట. చూశారా ఎంత planned గా వయసు వారీగా సోకుతోందో? గ్రేట్ అండీ, నిజంగా గ్రేట్, కదా! 😞

    ReplyDelete
  2. గీ పొరలు మస్తు టయానికి పరేశాని జేస్తయి.. గవే లచ్చణాల్.. గవే మాస్కుల్, గంతే దూరం, మడిసి మడిసి నడుమ దూరం తొమిదడుగుల్.. కోవిషీల్డ్, కోవాక్సిన్ రొండేసి డోజులేపించుకున్న తాత ఒఖర్ మాక్ దెల్సి మల్ల వెంటిలేటర్ దాఁక బోయిండు.. లచ్చణాల్ తగ్గేదేలే.. కాని లచ్చల్ కరుగుతానాయిటా.. ఆ తాత కి ఎనభై ఎండ్లు.. గిక్కడ కొందర్ ఏహే గంత భయమేటిది గట్లనే జెబుతరు.. ఒల్లకుంతరు.. గీ కోవిడ్ లచ్చణాల్ తెలుసుకున్యాం ఆనందయ్య మందేసుకున్యం.. ఈ తూరి మూడో అల వత్తా ఉండాదని భయపడాక్ అంటుండ్రు.. గిప్పడ్ సంది దాఁక భూగోళం మీదుట ఈ పొద్దు దాఁక ౨౧౪,౦౦౮,౭౩౩ కేసులొచ్చినయి మల్ల.. ఏమైతదో ఏమో ఆచార్య.. సీయార్కే వజీర్-ఏ-ఆజమ్ ఔతే సెప్ ఒకట్.. గనజ్ హమో నేడ్రి ఔతే బడుల్ తెరవాలంటుండ్రు.. చిన్న పోరల్ పిల్లగాన్లు.. వారికేమైన ఐతే భావి భారతావని నుదుట పై బొప్పిలైతే గుండె గుల్లే కందా శర్మాచార్య, వియన్నాచార్య.. బెజాడ అమ్మోర్ దయా! తిర్పాతి ఎంకన్న ఆశిసుల్!!ఓర్గంటి రాంపా బ్లెసింగుల్!!

    ReplyDelete
    Replies
    1. అంతేగా అంతేగా. దాన్నే దైవాధీనం సర్వీసు అంటారు గానీ ప్రస్తుతం మాఫియా గుప్పిట్లో చిక్కుకుంది ప్రజారోగ్యం.
      అవునూ, “రాంపా” ఎవరు, శ్రీధరా?

      Delete
    2. అదే ఆచార్య.. బెజాడ అమ్మోరనగా కనక కవచ ధారిణి దుర్గ భవాని మల్లేశ్వర స్వామి.. తిర్పాతి ఎంకన్న అంటే తిరుమల మలయప్ప స్వామి.. అలానే ఓర్గంటి రాంపా అంటే వరంగల్ లో గల పాలంపేటలో ఇటివలి కాలంలో హెరిటేజ్ సైట్ గా మారినటువంటి రామప్ప దేవాలయం.. శంకర స్వామి.. ఏమో ఆచార్య.. పావుగంటకోమారు కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడ్డాయని వార్తల్లో అంటారో లేదు మరో పావు గంటలో కరోనా విజృంభిస్తున్న తీరు తో జనాలు బెంబేలంటు మరో వార్త.. వ్యాక్సీన్ కు కరోనా ముడుచుకు పోతుందని ఒకరు.. ముందు ఆ ఇంట్లో పోయింది.. నలుగురు ఆసుపత్రి చేరాకా అక్కడ నుండి ఆ పక్క వీధిలో పోయింది అంటు మరొకరు.. హాలంటు ఒకరు ఓటీటీ అంటు ఒకరు.. ఆన్‌లైన్ అంటు ఒకరు.. ఆఫ్‌లైన్ అంటు ఒకరు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకరికి.. ఆన్-సైట్ ఒకరికి.. ఇలా గడచిన సంవత్సరం ఐదు నెలలుగా ఇదే వరస.. టీకాలకూ లొంగని ఈ "యూయస్‌బీ" లాటి సిచువేషన్ కాస్త మీరన్నట్లుగానే దైవాధీనం సర్వీసు అనుకో వచ్చు.
      పైగా ఈ యూయస్‌బీ అంటే ఏమిటనే కదా అలా చూస్తున్నారు.. ఏమి లేదాచార్య.. యునివర్సల్ సీరియల్ బస్ పోర్ట్ యందు పెన్ డ్రైవ్ లేదా వేరే ఏదైనా కనెక్ట్ చేయగానే ౫ వోల్ట్ డీసీ సప్లై అందుకుని అందులో స్టోర్ చేసిన డేటాను యాక్టివేట్ అయ్యేలా చేసి డేటా ట్రాంస్‌ఫర్ చేయటము అదే ప్రామ్ లో రీడ్/వ్రైట్ (RW) ను ఎలా ఐతే మొదలెడుతుందో.. దానినా సిస్టమ్ నుండి అమాంతం పీకేస్తే ఎలా ఐతే ఇన్-వాలిడేట్ ఐపోతుందో అలానే ఈ వైరస్ కూడా.. మనిషి లివింగ్ సెల్స్ పై అటాక్ చేసి అందులో తన ఆరెన్నె ను పంపి తన వశ పరుచుకుని మ్యుటేషన్ల పై మ్యుటేషన్లతో మానవాళి మనుగడ పై ప్రభావం చూపెడుతుందో మీకు తెలియనిది కాదు..! అది విషయం..!

      Delete
  3. విన్నకోటవారు,శ్రీధరా!
    కరోనా మొదలైంది మొదలు చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి అవుతోంది.మేధావులు చెప్పే పనేలేదు. పిల్లలకి ఇబ్బందని చెబుతూ బడులు తీయడం అర్ధం కాలేదు.అంతేనండి. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయిగా

    ReplyDelete