Monday 15 March 2021

వేసవి-దాహం-చిట్కా.

 వేసవి-దాహం-చిట్కా.


వేసవి పరిగెత్తుకొస్తోంది, దాహం సహజం, ఎక్కడపడితే అక్కడ వాటర్ పేకట్లు అమ్ముతూనే ఉన్నారు, కూల్ డ్రింక్ ల సంగతి చెప్పేదే లేదు. వాటర్ పేకట్లు కూల్ డ్రింకులు తాగితే రోగం కొనుక్కు తెచ్చుకున్నట్టే.ఐతే దాహానికో చిట్కా, ఒక బళ్ళారి నీరుల్లిపాయని జేబులో పడేసుకోండి. దాహంగా ఉంది, ఉల్లిపాయ కొరికి నమిలి మింగండి, ఇంకా అనిపిస్తే మళ్ళీ తినండి. దాహం కడుతుంది, దగ్గరలో ఎవరింటికైనా వెళ్ళి కాసిని మంచినీళ్ళియ్య తల్లీ అని అడగండి. దొరకవా? అందుకే నీ మొహానికి నిప్పూ నీళ్ళూ కూడా పుట్టవని తిట్టేవారు, పెద్దాళ్ళు. 


 మరో చిన్న చిట్కా! ఉసిరి పప్పు అని అమ్ముతారు. అదేమంటే ఉసిరి కాయలోని లోపలిగింజల పై దళసరిగా ఉన్న పెంకు. దీనిని ఉప్పులో పోసి ఎండబెడతారు. ఎండిన తరవాత దానితో ఉండే ఉప్పు బహు కొద్ది కొన్ని మైక్రోగ్రాములు, ఈ పప్పు చిన్న ముక్కని నోట్లో వేసుకోండి, మింగెయ్యద్దు, మెత్తబడిపోతుంది,బుగ్గన పెట్టుకోండి, లాలాజలం ఊరుతూనే ఉంటుంది, దాహమే వెయ్యదు. 



ఈ సావకాశం కూడా లేదు, నోరు ఆర్చుకుపోతోంది, ఏం చెయ్యాలి? నోరు తెరవండి, నాలిక బయటికి చాపి రెండు పెదవుల మధ్యనా సున్నాలా చేయండి, ఆ సున్నాలా ఉన్న నాలుకలోంచి నోటితో గాలి పీల్చండి, గుండెల నిండా, నోరు మూయండి, ముక్కుతో గాలి వదలి పెట్టండి, ఇలా రెండు మూడు సార్లు చేయండి, నోటిలో లాలాజలం నూతిలో పడ్డ జలలా ఊరుతుంది, ఏంటి చూసుకున్నారా? వెంటనే దగ్గరలో మంచి నీరు తాగండి, మంచి నీటికి ప్రత్యామ్నాయం లేదు. ఇలా నాలుకను సున్నాలా చేసి గాలి పీల్చి ముక్కుతో వదలి పెట్టడాన్ని శీతలీ ప్రాణాయామం అంటారు. బయట వేడిగా ఉన్న గాలి సున్నాలా ఉన్న నాలుక గుండా పీల్చినపుడు చల్లబడుతుంది, ముక్కు ద్వారా వదలే గాలి వేడిగా ఉంటుంది. నోటితో పీల్చినగాలెందుకు చల్ల బడుతోంది? దీనిలో సైన్స్ ఉందా? చెప్పండి. అత్యవసరంలో తప్పించి ఇదిచెయ్యద్దూ! ఊపిరి తిత్తుల వ్యాధి ఉన్నప్పుడు, రొంపతో ఉన్నప్పుడు అసలు చెయ్యదు, జాగ్రత!

ఫ్రిజ్ లో నీళ్ళెన్ని తాగినా దాహం తీరదు, దానికి తోడు అనారోగ్యం కూడా! ఇలా చేసుకుని చల్లటి నీళ్ళు తాగండి.ఆ తరవాత మీ ఇష్టం. 


 https://kastephale.wordpress.com/2013/05/25/

శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

21 comments:



  1. నీళ్లు తాగేదాన్ని విడిచి యింత కష్టపడాలా ! మరీ చోద్యమే! ఓ వాటరు బాటిలు ఇంటి నుంచి తీసుకెళ్తే పోలే ?

    ఏమిటో !


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. జిలేబి,
      వేడెక్కిన ప్లాస్టిక్ బాటిల్లో వేణ్ణీళ్ళు తాగచ్చు. :)

      Delete

    2. :)

      అక్కడ భండారు వారి బ్లాగులో కాపీ " రైటు " గురించి చర్చ జరుగుతోంది :) కొంత మీరున్ను అజ్యం‌ పోయకూడదటోండి ? :)



      జిలేబి

      Delete
    3. జిలేబి,
      ''కొంత మీరున్ను అజ్యం‌ పోయకూడదటోండి ? :)''

      చూశాను. జరిందేదో చెప్పేరుగా. జరిగేదేదో చూదాం. :)

      Delete

    4. -వేడెక్కిన ప్లాస్టిక్ బాటిల్లో

      చీ చీ మే ఫ్రిజ్ హై కూల్ నీళ్లే సేవిస్తాం . ఆల్ కంట్రీ పీపుల్ ఓన్లీ డ్రింక్ హాట్ వాటరు


      Delete
    5. చిన్నప్పటి రోజులు, ప్లాస్టిక్ ప్రవేశించక ముందు రోజులు మరచిపోయారా?

      ప్రయాణాలకు మరచెంబులో నీళ్ళు తీసుకు వెళ్ళేవారు. కొంతసేపటికి ఆ మరచెంబులోని నీళ్ళు వేడెక్కిపోయేవి, అసలు ఆ మరచెంబే వేడెక్కిపోయేది.

      మరచెంబు గాక ఇంకో రకం నీళ్ళ కేన్ (can) చిన్నది ఉండేది. దాని పైన ఫెల్ట్ (felt) కవర్ ఉండేది. కేన్ లో నీళ్ళు నింపుకుని, ఆ ఫెల్ట్ కవర్ మీద బాగా నీళ్ళు జల్లి ప్రయాణం మొదలెట్టేవారు. ఆ ఫెల్ట్ కవర్ తడిగా ఉన్నంత సేపూ కేన్ లో నీళ్ళు వేడెక్కేవి కావు. ఆ ఫెల్ట్ తడి ఆరిపోయిన తరువాత లోపలి నీరు వేడెక్కిపోయేది, అది కూడా మరచెంబు నీరు లాగానే తయారయ్యేది.

      ఏవిటో అ రోజులు! కానీ ప్లాస్టిక్ కన్నా సురక్షితమే.

      Delete
    6. శంకరాభరణం లో ఆ ముసలమ్మ అన్నవరం దర్శనానికి వచ్చినపుడు తెచ్చుకున్న మరచెంబు వంటిది.. దానిని పది రూపాయలకోసమని కౌంటర్ దగ్గర "కాముడు" కామేశ్వరరావు వదిలేస్తాడు చూడండే.. శారదా కోసమని ముమ్మారు మెట్ల దారి గైండా బొక్క బొర్లించి అవాకు చివాకులతో గజిబిజి ఔతు ఉంటాడు ఆ మరచెంబు..!

      Delete
    7. విన్నకోటవారు,

      అంతకు కొంచం వెనక్కి వెళితే తాబేటి కాయల్లో నీళ్ళు పట్టుకుపోవడం ఎరిగినమాటే.

      Delete
  2. నేనైతే రోజుకు ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు తాగుతున్నానాచార్య. మల్టి మినిరల్ సోర్స్ కనుక

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా
      మంచినీళ్ళు దొరకని రోజుల్లో కొబ్బరినీళ్ళు అదృష్టం కదూ

      Delete
  3. కరతలామలకముగదే !, కథనవిథము
    నీరువట్టున , చిట్కాలు సారుబుర్ర
    లో , జిలేబుల కీ పట్ల మేజువాణి
    యింపుసొంపులు దెలియవు , తంపులొలుకు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ఉన్నమాటన్నారు

      Delete
  4. From whatsapp...

    *మజ్జిగ - మహాపానీయం*
    “మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా, కైలాసంలో ఉండే పరమశివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు.“
    "పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటుతిరిగీ దొరకదు కాబట్టే, ఆయన నల్లనివాడయ్యాడు".
    “స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకదు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు.“ “మజ్జిగతాగే అలవాటే గనక ఉంటే, చంద్రుడుకి క్షయవ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు”
    *యోగ రత్నాకరం* అనే వైద్యగ్రంధంలో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తుంది.
    మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వం”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగను భగవంతుడు సృష్ఠించాడట!
    వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినందువలన పాలలో వుండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండడంతో పాటు, అదనంగా “లాక్టో బాసిల్లై” అనే “మంచి బాక్టీరియా” మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకరమైన బాక్టీరియా ఉండదు. అందుకని, వయసుపెరుగుతున్న కొద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. *_ఫ్రిడ్జ్ లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది_*. అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన చల్లని మజ్జిగ తాగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
    చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అందుకని పెరుగుకన్నా, మజ్జిగ మంచిది.
    *వేసవి కోసం ప్రత్యేకంగా మజ్జిగతో చేసే “కూర్చిక" అనే పానియం :-*
    ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని *‘కూర్చిక’* అంటారు. ఇందులో “పంచదార” గానీ, “ఉప్పు” గానీ కలపకుండా కూడా తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొంఠి”* ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి, తగినంత “ఉప్పు” కూడా చేర్చి (ఉప్పు మన ఇష్టం), దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది.
    *వడదెబ్బ కొట్టని పానీయం “రసాల”:-*
    పెరుగుమీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంధంలో ఉంది. అరణ్యవాసం ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! *ఇది దప్పికని పోగొట్టి, వడదెబ్బ తగలకుండా చేస్తుంది* కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించడానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి, రాముని గౌరవార్థం ఇచ్చిన విందులో "రసాల" కూడా ఉంది. *భావ ప్రకాశ* వైద్య గ్రంధంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు:-
    *ఎండలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి:-*
    చక్కగా *“చిలికిన మజ్జిగ”* ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక *“నిమ్మకాయ రసం”*, తగినంత *“ఉప్పు”, “పంచదార”*, చిటికడంత *తినేసోడా, ఉప్పు* కలిపి, తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి. వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తరువాత, ఇంకోసారి త్రాగండి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంటతీసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు
      వాట్సాప్ లో నేనూ చూశానండి. మంచి విషయం పంచుకున్నారు.ధన్యవాదాలు. మజ్జిగను ఫ్రిజ్ లో పెట్టద్దంటే వినటం లేదు .

      Delete
  5. transmission started:
    Correct me, if I am wrong, Sharmacharya, Narsimhacharya, Bijile Amman..

    [19/03, 21:49] sridharanitha bukya: ధర్మాన్ని సత్యయుగమున స్థాపిస్తే అది నాలుగు పాదాలపై ఆ యుగాన వెలసిల్లింది.
    అనక
    త్రేత యుగమున ధర్మానికి మూడు పాదాలే, మరొకటి అధర్మం చేజిక్కించుకుంది
    [19/03, 21:51] sridharanitha bukya: ద్వాపర యుగమున ధర్మానికి అధర్మానికి సరాసరి చొప్పున రెండేసి పాదాలే
    ఇహ
    కలియుగమున ధర్మం ఒంటి పాదం పై వెలసిల్లుతోంది, అధర్మం మూడు పాదాలపై భాసిల్లింది
    [19/03, 21:56] sridharanitha bukya: అందుకే సత్య యుగాన సత్య హరిష్చంద్రుడు ధర్మ విచక్షణ కై భార్య పిల్లలను సైతం వదిలేశాడు
    త్రేత యుగమున చాకలి వాని అధర్మపు వాక్కు కై రాముడు సీత వియోగానికైన సిద్ధ పడ్డాడు
    ద్వాపర యుగమున పాండవుల ధర్మం, కౌరవుల అధర్మం సరిసమానం అందుకే కురుక్షేత్ర యుద్ధం జరిగింది
    కలియుగమున ధర్మాన్ని పాటించే వారు అతి కొద్ది మంది కనుకనే ఏవరి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తుంటారు.
    [19/03, 22:08] sridharanitha bukya: Kaliyuga Period: 43,200 years
    Dwaparayuga Period: 86,400 years
    Tretayuga Period: 1,29,600 years
    Satyayuga Period: 1,72,800 years

    over and out
    transmission terminated

    ReplyDelete
    Replies
    1. బాగానే ఉంది కానీ, శ్రీధరా, ఒక్కొక్క యుగం ఎన్ని సంవత్సరాలో పైన మీరు చెప్పిన లెక్కలో ఒక సున్నా మరిచిపోయారు.

      నాలుగు యుగాలు

      https://www.thehinduportal.com/2018/07/time-span-of-four-yugas-according-vedic.html


      Delete
    2. ಸರಿಪಡಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು, ನೃಸಿಂಹಾಚಾರ್ಯ. ಜೈ ವಿಠ್ಠಲ

      Delete
    3. ಯಾಕೆ ಸುಮ್ಮನೇ ಥ್ಯಾಂಕ್ಸು

      Delete
  6. వేసవి దాహం చిట్కా
    లాసించిన బుధులు, 'సుర'ను రాయమి సారూ !
    మోసముగా భావింతురు,
    వాసి గదే ! తాటికల్లు వర వేసవిలో .

    ReplyDelete
  7. తాటి దొన్నెలోన ద్రాగంగ దడిసిన
    గుబురు మీసములను గోర జమిరి
    కడు మనోఙ్ఞముగ మగుడ పయికెగద్రోయు
    దృశ్యరమను జూచి తీరవలయు .

    ReplyDelete
    Replies
    1. రాజవారు
      వేసవి దాహానికి తాటి కల్లును స్మరించకపోవడం పొరబాటే :)

      కల్లు పాకలో గొంతుకూచుని,సుందరవదన మట్టిలొట్టితో తాటికల్లు పోస్తుంటే తాటిఆకు దొన్నెలో కల్లు తాగుతూ మత్తు కళ్ళతో చిటికెన వేలు కొనగోట, కల్లుతో తడిసిన మీసాలు సవరించుకునే సుందర దృశ్యం ఊహించలేకపోతినే! ఆదృశ్యాన్ని ఆవిషరించినందులకు
      ధన్యవాదాలు.

      Delete