రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.
అసోం,ప.బంగాల్,తమిల్నాడు,పుదుచ్చేరి,కేరళం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి,ఫలితాలూ వచ్చాయి. ఒక్కో రాష్ట్రరాజకీయం ఒకోలా వుంది,చూదాం,స్థూలంగా.
అసోంలో ఎన్.డి.ఎ పరిపాలిస్తోంది,ఆ పార్టీయే మళ్ళీ 102/126 లో మెజరిటీలో ఉంది. ప్రతి పక్షంగా ఇండీ అలయెన్స్ కు 24/126 వచ్చాయి. కాంగ్రెస్ కలిసిన ప్రతిపక్షం,ఇక్కడ మరియు ప.బంగాల్ లో ఎన్నికలు దొంగిలించబడ్డాయంటోంది. తాను మెజారిటీ సాధించిన చోట దొంగిలింపబడలేదా? అంటున్నారు,నెట్ జనులు🤣. ఇక్కడే రాజకీయంలేదు.
ప.బంగాల్ లో స్వతంత్రం రాకముందూ రక్తపుటేరులు పారేయి.
https://rayssolassspace.quora.com/If-the-BJP-comes-into-power-in-Delhi-in-2025-will-Jawaharlal-Nehru-University-be-shut-down
https://india-and-the-world.quora.com/Revenge-of-Hindus-how-KOLKATA-was-saved-from-becoming-part-of-Pakistan-the-story-of-GOPAL-PATHA-Jinnah-chose-Kol
ఇప్పుడూ పారుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్.డి.ఎ 206/294 సాధించింది, అధికారంలో ఉన్న మమత దీదీ నేనే నెగ్గేను,ము.మంత్రి పదవికి రాజీనామా చెయ్యనంటోంది. ఆ తరవాయి గవర్నరు సభనే రద్దు చేసేరు,ఇక మమత రాజీనామా చేసిన మానినా ఒకటే! దీదీ పరిపాలనలో మాటాడటమే కాదు,వోటెయ్యడానికీ జనం భయ పడ్డారంటున్న వార్తలు మిక్కుటం. రక్తం పారింపుకు ఆదిగా సువేందు అధికారి పి.ఎ హత్య చేయుబడ్డాడు,ఎన్నికల తరవాత. ఇక కలకత్తాలో రక్తం పారిన సంఘటనలు కోకొల్లలు.
స్వతంత్రం తరవాత కాంగ్రెస్ పాలనలో మొదటగా బి.సి.రాయ్ లాటివారు ముఖ్యమంత్రయితే చివరికి సిద్ధార్థ శంకర్ రాయ్,(ఇందిరమ్మకి ఎమర్జన్సీ పెట్టమని సలహా ఇచ్చినవాడు) లాటివాడు CM.. ఆ కాలంలో ఆ రోజుల్లో పేపరు తీస్తే ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తల హత్యలే కనపడేవి అలా కమ్యూనిస్టులు భయం సృష్టించి ప.బంగాల్ ని వశపరచుకున్నారు. 34 సంవత్సరాల పరిపాలనలో భయమే నెలకొంది. ఆపై కాంగ్రెస్, బాజపాయి ల సహాకారంతో మమత ప.బంగాల్‌ను స్వాధీన పరచుకుని కమ్యూనిస్టులను తలెత్తుకోనీయక0డా వారిపంధాలోనే పరిపాలన చేసి 15ఏళ్ళ తరవాత ఓడిపోయింది. ఇంతకాలంలోనూ ప్రజల రక్తంపారింది,భయోత్పాతమే సృష్టంపబడింది. ఇక ముఖ్యమ0త్రిగా ఎన్నికైన సువేందు అధికారి ఎన్.డి.యే పాలనలో ఎలా ఉంటుందో చూడాలి.
పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరిగేయి,కనుకలిగినట్టుగా. అక్కడ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి సైకిల్ మీద తిరుగుతూ బడ్డీ కొట్టు దగ్గర టీ తాగి డబ్బులిచ్చి వెళ్ళే రకం. మళ్ళీ ఆయనే ఎన్నికయ్యాడు,మెజారిటీ వచ్చింది,మళ్ళీ ముఖ్యమంత్రీ అవుతాడు. ఈ రాష్ట్రమూ ఎన్.డి.ఎ కాతాలో ఉన్నదే!
తమిల్నాడులో ఎన్నికలు జరిగి డి.ఎం.కె ను మట్టికరిపించి మరో పార్టీని కూడా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ను కూడా అధికారానికి దూరంగా ఉంచారు. ఇక మూడో శక్తి టి.వి.కె నుకూడా అధికారానికి పూర్తిగా దగ్గరకు చేరనివ్వక మెజారిటీకి పదికి తక్కువగా సీట్లిచ్చి నిలబెట్టేరు. ఇక తమిల్ సినిమా కత మొదలయింది. ఎక్కువ సీట్లొచ్చాయి,మెజరిటీ లేకపోయినా నేనే ముఖ్యమంత్రి అంటాడు,ప్రమాణ స్వీకారం చేయించెయ్యండి, అన్నాడు. నిన్ను బలపరుస్తున్నవారి సంతకాలతో letters పట్టుకురావయ్యా అంటే మూడు సార్లు తిరిగాడు, పనికాలేదు. ఈలోగా గవర్నర్‌ను,బి.జె.పిని తిట్టుకున్నవారు కోకొల్లల్లు. చివరగా మద్దతు ఇచ్చిన MLAలు ఇద్దరున్న పార్టీ హిరణ్యాక్షవరాలతో మద్దతివ్వడంతో, నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది, 13వ తారీకు లోగా సభలో మెజారిటీ నిరూపించుకోవాలి,ఇది గవర్నర్ తాకీదు. ఏమి జరగనుందో,చూడాలిసిందే!
పెద్ద చిత్రం తమిల్నాట జరుగుతోంది. డి.ఎం.కె పనుపున CPI,CPM,IUML,CVK పార్టీలు అధికారకుర్చీ నాలుగుకోళ్ళులా మారాయి, విజయ్ పార్టీని, అధికార కుర్చీబలపరుస్తున్నాయి,ఇదెంతకాలం కొనసాగేనో! కాంగ్రెస్,CPI,సిపిఎం,సివికె పైకి కుస్తీ లోపల దోస్తీ రాజకీయం జరుగుతోందా? ఎవరి తరఫున? ఇది బయటపడుతుంది,నెమ్మదిగా!!!
ఇక చివరగా కేరళంలో ఎల్.డీ.ఎఫ్ ను దించి యు.డి.ఎఫ్ కు అధికారమిచ్చారు. ముఖ్యమంత్రెవరో దగ్గరగా పదిరోజులవుతున్నా అధికారానికొచ్చిన కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోందంటున్నారు.
ఇన్ని ఎన్నికలలోనూ జాతీయ పార్టీలకి జరిగిన లాభనష్టాలేమి? కొచ్చను.
జాతీయ పార్టీలు బి.జె.పి,కాంగ్రెస్,సి.పి.ఐ,సి.పి.ఎం. చివరై రెండు పార్టీలు జాతీయపార్టీలా అంతర్జాతీయ పార్టీలో తేల్చుకోలేకపోయాను. బి.జె.పి. అసోం,పుదుచ్చేరిలను తననుంచి వదులుకోలేదు, ఇక ప.బంగాలు లో అధికారం చేజిక్కించుకుంది. ఇక tamilnaadu లో,కేరళంలో అధికారానికొస్తానని అనుకుని ఉండదు.
కాంగ్రెస్ కు చెప్పుకోతగ్గ విజయం కేరళ. అసోంలో 24/126 ప్రతిపక్షం. ప.బంగాలులో-2,తమిల్నాట-5 సీట్లు గెల్చుకుంది.కాంగ్రెస్ కి లాభం కంటే నష్టమే ఎక్కువ,దేశవ్యాప్తంగా. తమిల్నాట అధికారకుర్చీ కోడుగా మారిపోవడమేకాదు,డి.ఎం.కె తనను మోసంచేసిందని తెగతెంపులు చేసుకుంది.DMK congress ను తమిల్నాట, ఇకముందు కరారావుడి చుట్టేసినట్టే! ఇక ఉత్తరాదిని ఎస్.పి ఆలోచనలో పడింది. ఇండీ అలయన్సును గుంటబెట్టి గంటవాయించినట్టే.
ఇక సిపిఎం,సిపీఇ పార్టీలు. సి.పి.ఎం ప.బంగాల్ లో-2 సాధించింది. తమిల్నాట-2 సాధించి తమిల్నాట అధికార కుర్చీకోడుగా మారిపోయింది,తమ సహచర సి.పి.ఐ-2 తో కలసి.
చిత్రం ఏమంటే ప.బంగాల్ లో పదిహేనేళ్ళుగా మమతపరిపాలనలో తృణమూల్ స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్,సి.పి.ఎం పార్టీలు తమ ప్రాంతీయ ఆఫీసులను, (బి.జె.పి అధికారంలో కొచ్చిన తరవాత) తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు వార్తలు.
కేరళంలో,నేటికి ముఖ్యమoత్రెవరో తేల్చుకోలేని స్థితి కొనసాగొతోంది. అధిష్టానం వేణుగోపాల్ కి మొగ్గుచూపుతోందా? సతీశన్ తానే ముఖ్యమత్రికాక తప్పదంటున్నారు. వీరిద్దరూ కాదు చెన్నితల ను ఎన్నికచేయమటున్నారు,కొందరు. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు అధికారం చేతికిచ్చి పరిపాలన చేయమంటే ఇలా గొడవలతో గడిపేస్తారా? ముఖ్యమత్రినే తేల్చుకోలేని మీరే చేయగలరయ్యా! అని ప్రజలనుకునే ప్రమాదం ఉందని నెట్ జనులనుకుంటున్నారు.
రిప్లయితొలగించండితమిల్నాట ప్రభుత్వం డిఎంకె కరుణాకటక్ష వీక్షణాలమీద అధారపడిఉంది,ఏరోజైనా కూలిపోవచ్చు. విజయ్ పెద్ద కబుర్లు ఒక రోజువే,ఏమీ చేయలేడని ఆరునెల తరవాత ప్రభుత్వం కూలిపోతుందని ఆపై నా ప్రభుత్వాన్ని కూల్చేసేరహో అని విజయ్ చెప్పుకోడానికి మంచి కారణం దొరుకుతుందని నెట్ జనుల మాట.
మన టపాకు మనమే రాసుకోవాలె పూసుకోవాలె :)
రిప్లయితొలగించండిZilebi12 మే, 2026 1:37 PMకి
తొలగించండినీ కామెంట్ దెబ్బకి కంప్యూటర్ డెస్క్ టాప్ పోయింది.🤔
నీలా నా టపాకి నేనే కాఎంట్ వేసుకోలేదు. కామెంట్ గా రాసినది రాయండమరచినది. దాన్ని మరోటపాలా రాయక,కామెంటులో వేసానంతే!😂 ఇది లేప్ టాప్ తో పడుతున్న చిక్కులు,కొత్తగా ఉంది,ఈ మధ్య వాడక🤣
బెంగాల్ లో బిజెపి ని గెలిపించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి వెంటనే ప్రభుత్వంలో పోస్టు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో ....
రిప్లయితొలగించండిఏది ఏమైనా బంగ్లాదేశ్, నేపాల్ తరహా జెన్ జీ ఉద్యమం భారత్ లో జరిగితే దానికి మూల కారకుడు మన మోడీ గారే అవుతారు...
శ్రీనివాస్ జీ,
తొలగించండిస్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని మమతమ్మ ప్రభుత్వమే నియమించుకుంది 2025 లో. SEO చేయగలదేం ఉండదు. అంతా రాష్ట్ర ప్రభుత్వం,ఎలక్షన్ కమిషన్ చేసేదే! ఒకటి రెండు నెలల్లో రిటయిర్ అయ్యే గుప్తా గారు మమతమ్మకి కావలసినవాడే సార్! ఇదీ జెన్-జీ లో భాగమేమో సార్!
జెన్-జి మనదేశంలో మొదలయిందనుకుంటున్నాను. జెన్-జి కి వీధుల్లో కొచ్చి అరవక్కరలేదేమో! నిన్న తమిల్నాట జరిగినదీ ఇందులో భాగమే అని నా ఊహ. అనిశ్చిత పరిస్థితులలో కాంగ్రెస్ ఒక ఎత్తువేసి విజయ్ ని బలపరస్తూ షరతు పెట్టింది,మతతత్వ పార్టీలతో చెయ్యికలపకూడదని. మతతత్వ పార్టీ తమకూడానే ఉందని కాంగ్రెస్ మరవిపోయింది కదు సార్! అంటే అన్నా డి.ఎం.కె తో కలవకూడదని. అలాగే అన్నాడు కదా! అంటే నీ ప్రభుత్వాన్ని మేము నడుపుతాం. నీ ప్రభుత్వం డి.ఎం.కె కరుణమీద బతుకుతుందని చెప్పక చెప్పేరు కదుసార్! ఆ తరవాత చేరినవారు పెట్టిన చిక్కులెన్ని? కోరిన హిరణ్యాక్షవరాలెన్ని? అన్నిటికి తలయూపి గద్దెనెక్కేడు. శత్రువును మెట్లుగా ఉపయోగించుకుని అధికారానికి రావడమంటే ఇదే కదు సార్! ఇప్పుడేం జరుగుతోంది? అన్నా డిఎంకె నుంచి 30 మంది వచ్చి చేరుతున్నారు. ఇదికదుసార్! జెన్-జి అంటే,ఎత్తు,పైఎత్తు. రాజకీయం అంతే కదుసార్! దీనికీ మోడీ గారినే బాధ్యులందామా? అస్తు! 😂 షాడో బాక్సింగ్ లో పంచ్ బేగ్ లాటివాడు కదా మోడిగారు.
-
రిప్లయితొలగించండిషాడో బాక్సింగ్ లో పంచ్ బేగ్ లాటివాడు కదా మోడిగారు.
అదురహో తాతగారు ఫుల్ ఫార్మ్‌లో కొచ్చేసేరు :)