15, ఏప్రిల్ 2026, బుధవారం

ఆబోతుల కుమ్ములాటలో......

                                  ఆబోతుల కుమ్ములాటలో...........  



1.కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.

2.కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు.

3. అంచుకు తొగరు లేనట్టు

4.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.

5.ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కినట్టు. 

6.ఉండలేక సిండ కాల్చుకున్నట్టు.

7.చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.

8.పెనం మించి పొయ్యిలో పడ్డట్లు.

9.అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.

10.వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు. 

11. కుండ వేరైతే గుణం వేరయినట్టు.

14 కామెంట్‌లు:

  1. బులోగుం తక్కువాయె :)

    కొట్టు కొచ్చేరా ?

    నానుడులకు సామెతలకు వ్యత్యాస మేమిటండి తాతగారూ ?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi15 ఏప్రిల్, 2026 10:29 AMకి
      నీ బుర్రలో గుంజు ఎండిపోయిందని😜 ఏనాడో చెప్పబడింది,నేడు కొత్తగా కాదు.
      నానుడికి సామెతకి తేడా తెలిసినవారికి చెప్పపనిలేదు. తెలియనివారికి చెప్పి ఉపయోగం లేదు.😍

      తొలగించండి
    2. ఓ అంటే తాతగారికే తెలియని విషయమన్నమాట ఇది :)

      పోనీలెండి వేరే ఎవరైనా తెలుపు తారేమో

      తాతగార్కి తెలియని విషయాలు లేవనుకున్నా:)


      తొలగించండి

    3. చతుర సంభాషణ కోసం గ్రామీణ జనాల నాల్కలమీద నానుతూ ఉండేది
      నానుడి . ఇందులో వ్యంగ్యం పాలెక్కువ ఉదా : తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట

      సామెతలంటే - ఆవిథంగా , అట్లు అని సందర్భోచితంగా ఉదహరించేవి . ఇవికూడా వ్యవహారంలోగానీ , రాతలోగానీ శ్రోతకూ పఠితకూ అవగాహనా సౌలభ్యం కోసం వాడడం జరుగుతుంది . ఉదా : వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు .
      * పండితులు మెరుగైన వ్యాఖ్య చేయగలరేమో ! చూద్దాం .

      తొలగించండి
    4. రాజావారు

      మీ ప్రకారము "పండి తుల్ " ఎవరు ?


      తొలగించండి
    5. పండితులన - నిరు కొమ్ముల
      మండితులయి , పద్యవిద్య మా సొత్తంచున్
      దండిగ పోరులు సల్పెడు
      చండామార్కులు , నహపు విషము తల నుండున్ .

      తొలగించండి
    6. Zilebi17 ఏప్రిల్, 2026 1:19 AMకి
      వెంకట రాజారావు . లక్కాకుల17 ఏప్రిల్, 2026 9:46 AMకి
      మరొకరితో, మీ కలహం కొనసాగించడానికి నా బ్లాగ్ వేదిక కాదు ఇది చాలా సార్లు చెప్పడం జరిగింది. 🙏

      తొలగించండి
    7. మీ ప్రకారము "పండి తుల్ " ఎవరు ?
      అని తమరడిగిన ప్రశ్నకు ' నాప్రకారం '
      పండితు లంటే సమాధానం - అది .
      అంతే గాని ఇందులో ఎవరితోనూ క
      లహం లేదు . కలహానికి కాలుదువ్వే
      తత్త్వమూ లేదు . తమరు పెద్దలు ,
      గమనించ ప్రార్థన . 🙏

      తొలగించండి
    8. వెంకట రాజారావు . లక్కాకుల17 ఏప్రిల్, 2026 10:46 AMకి
      మిమ్మల్ని ఉద్దేసించి జిలేబి మీకు వేసిన ప్రశ్న ఇది,నేను వేయలేదు, మీరు పొరబడ్డారా? ఆబోతులకుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కడం అంటే ఇదేననుకుంటా! శలవు.

      తొలగించండి
  2. కూసే గాడిద లొచ్చిరి ,
    మేసే గాడిదల గూడ మేయ నియక , తి
    ట్టే సే తీరులు గంటిమి ,
    ప్రాసలకై ' కూసుముండ ' వరవడి హెచ్చెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు . లక్కాకుల15 ఏప్రిల్, 2026 10:39 AMకి
      అంతా సజాతీయులే అంటారా?
      ప్రాసకోసం ఏడ్చేనే కూసుముండా అన్నారట ఒక కవివరులు. ఇదొక నానుడే, కవివరులకే చెందుతుందనుకుంటానండీ

      తొలగించండి
    2. అంతే , అంతే సారూ !
      పంతముతో పరుగిడి , యొరు పైబడి , తిట్టే
      వింత మనిషి గాడిదయే ,
      అంతా మన మంచి కనుచు నానందింతున్ .

      తొలగించండి
    3. వెంకట రాజారావు . లక్కాకుల16 ఏప్రిల్, 2026 7:33 AMకి
      పరోపదేశ సమయే సర్వే చ పండితః
      తదాచరణ సమయే సర్వే న పండితః 🙏

      ఇంతే కదుసార్! లోకం. మనం ఒక వేలు చూపుతుంటే నాలుగు మనవైపు చూపుతాయి. అంతే తేడా! ఇదో మాయా ప్రపంచం. 🙏

      తొలగించండి