పట్నాలలో, పల్లెలలో కూడా
తెల్లవారు ఝామున లేచే అలవాటు లేదు.
ఒంటిని నువ్వులనూనె రాసింది లేదు.
సున్నిపిండి లేదు.
నలుగు మొదలే లేదు.
మాగిళ్ళు వదిలింది లేదు.
కుంకుడు కాయ,షీకాయ తలంట్లు లేవు.
సాంబ్రాణి పొగ వేసే అలవాటు లేదు.
నిప్పుల కుంపటి లేదు.
నీళ్ళ పొయ్యి, బొగ్గులసలే లేవు.
టైలర్ కుట్టిన బట్టలు లేవు.
లంగా ఓణీ వేసిన ఆడపిల్లలేదు.
పంచగట్టిన, కోరమీసమున్న మగాడు లేడు.
తెనుగు రాయను చదవను వచ్చినవారు లేరు.
రెండు మాటలకు ఒక ఇంగ్లీషు పదం మాటాడని తెనుగువాడు లేడు.
పిజ్జాలు బర్గర్లు అల్పాహారం, ఆవిరికుడుములు వగైరాలు లేవు.
వంట చేసిన ఇల్లు లేదు.
దానం లేదు,ధర్మం మొదలే లేదు.
హస్తకళలు లేవు.
హరిదాసులు,కొమ్మదాసర్లు,గంగిరెద్దులు లేవు.
ముగ్గు వేసిన వాకిలి లేదు.
వరి కళ్ళాలు లేవు.
కంది చేలు కనపడటం లేదు.
పెరడున్న ఇల్లు లేదు.
మొక్కలు,చెట్లు ఉన్న ఇళ్ళు మొదలే లేవు.
కార్నివాల్స్ తప్పించి తీర్థాలు లేవు.
వేష భాషల్లో ఆడా,మగా తేడా లేదు.
ఉమ్మడి కుటుంబాలు లేవు.
బంధువులే లేరు.
వదిన,మరదళ్ళ సరసం లేదు.
బావా మరదళ్ళ హాస్యం లేదు.
దొంగ ముద్దులు లేవు.
పడుచు జంటలు లేవు.
పిల్లలు లేరు.
సెల్ ఫోన్ లేనివారు లేరు.
నెట్ లేనిఫోన్ లేదు.
మందుకు తప్ప, తిండికి డబ్బు లేదు.
కోడిపందాలు లేని ఊరు లేదు.
చిభాశర్మ
తెనుగు సంస్కృతి,సంప్రదాయం, అనే తెనుగు జ్వరం, మనకి సంవత్సరానికోసారి వస్తూ ఉంటుంది.🙏 అది మూడు రోజులుంటుంది,అదే భోగి,సంక్రాంతి,కనుమ👍. ఆతరవాత తగ్గిపోతుంది,మళ్ళీ మామూలే మనది 'అమ్మకి ఇల్లు కడదాం' అనే సామెత తంతు👌 😜
ReplyDelete