శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.
ప్రముఖ బ్లాగరు శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి సతీమణి శ్రీమతి శారద గారు నిన్న(5.10.2025) ఉదయం 7.43 నిమిషాలకు ఇహలోకయాత్ర
చాలించినట్లు
శ్రీ శ్యామలీయంవారి ద్వారా ఇప్పుడే తెలిసింది.
శ్రీమతి శారదగారు బహుకాలంగా డయాలిసిస్ తో ఉన్నట్టు తెలిసిన సంగతే. కొద్దికాలంగా హాస్పిటల్ లో ఉండి వెంటిలేటర్ కూడా పని చేయక, రెండురోజుల కోమా తరవాత ఇహలోకయాత్ర చాలించిన దుర్వార్త తెలిసి ఖిన్నుడనయ్యాను. మాటాడటానికి మాట పెగలలేదు.
సంతానం లేని శ్యామలీయంగారు,ఈ కష్ట సమయంలో మనసు కుదుట పరుచుకోవాలని కోరుతున్నా.
శ్రీమతి శారదగారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ, శలవు.