courtesy:Whats app
ఒంటికి నువ్వులనూనెరాసి మర్దించి,సున్నిపిండి నలుగుబెట్టి, కుంకుడు కాయతో తల ఒళ్ళు రుద్ది, తల తుడిచి, ముక్కులలో చెవులలో తిరిబెట్టి,సాంబ్రాణి పొగవేసి, తల్లి చేతికిస్తే, కడుపు నిండా పాలుతాగిన బిడ్డడు, ఆదమరచి ఉయ్యలలో నిదురించే రోజు రానుందా?
పిల్లలు ఆదమరిచి నిద్రపోతారు గానీ పైన విడియోలో చూపించిన కార్యక్రమం చేసే తల్లులు ఈకాలంలో ఉన్నారా అని నా సందేహం. అంతా షాంపూల రాజ్యమే కదా. అదీగాక ఈ రకంగా “లాల” పోసే విధానం తెలిసుండే అవకాశం కూడా తక్కువే. “తల్లులు” అని ఎందుకన్నాను అంటే ఇందుకే - ఈ విధానం తెలిసున్న వారు కావాలంటే ఆ బిడ్డ యొక్క బామ్మో, అమ్మమ్మో రావాలి. వాళ్ళని రానివ్వటం బాగా తగ్గిపోయింది కదా అందువల్ల “తల్లులు” అన్నాను. సరే ఇవాళ్టి తల్లులే రేపటి బామ్మలు, అమ్మమ్మలూనూ. ఏతావాతా ఈ రకంగా “లాల” పోసే పద్ధతి క్రమంగా కనుమరుగైపోతుంది. కాస్తో కూస్తో పల్లెల్లో ఇంకా ఏమైనా కనిపిస్తోందేమో గానీ పట్టణాలకు వలసలు ఎక్కువవుతున్మ కొద్దీ అది కూడా మాయమైపోతుంది.
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteఇంకా అక్కడక్కడ ఉన్నట్టే ఉన్నారండి
కాలొంకర చెయ్యొంకర
ReplyDeleteమ్రోలగ నీరీతి దీర్చి , మూతీ ముక్కూ
గీలెంచి లాలవోసిన ,
బాలుని కేలోటు లేక , భవిత కుదురగున్ .
రాజావారు,
Deleteనేడు ఫిజియో థెరపీ అంటున్నారంతే
ప్రయాణానికి, ప్రణయానికి, పరిణయానికి సమయం సందర్భం ఔచిత్యమే. లేకుంటే విఘాతాలే అడుగడుగున.
ReplyDelete"ఈ-తరం", "ఈ-కాలం" లో కుంకుడు కాయలును, షికాయ: అవేంటని అడిగే రోజులివి, శర్మాచార్య. అంతకు ముందు తరానికి, ఇపుడున్న తరానికి నడుమన మా తరం వారధి. (1980~85~1989 లో పుట్టిన తరం వారికి ల్యాండ్ లైన్ తెలుసు, వైమాక్స్ తెలుసు, సీయార్టీ పిక్చర్ ట్యూబ్ తెలుసు, అమోలెడ్ స్క్రీన్ క్యూహెచ్‌డీ తెలుసు, సిల్వర్ ఐయోడైడ్ ఫోటో ఫిల్మ్ రోల్ తెలుసు, మైక్రో ఎక్స్‌ట్రా హై డెన్సిటి హై కెపాసిటి సెక్యూర్ డిజిటల్ కార్డ్ తెలుసు,స్టీమ్ లోకో తెలుసు, హై స్పీడ్ ట్రాక్షన్ మెయిన్ లైన్ మల్టిపల్ ఓవర్ హెడ్ యునిట్ ట్రెయిన్ తెలుసు. టూరింగ్ టాకీసు తెలుసు సినిప్లెక్స్ మల్టిస్క్రీన్ డ్రైవ్ ఇన్ ఓపెన్ ఎయిర్ ప్రొజెక్షన్ తెలుసు. 70mm (Rectangular Frame)/35mm (Square Frame) Cinematographic Film తెలుసు, డిజిటల్ కీ సాటిలైట్ ప్రొజెక్షన్ తెలుసు, ఆడియో క్యాసెట్ టేప్ తెలుసు, గానా యాప్ తెలుసు.
Deleteఅన్నీ తెలుసు ఎక్సెప్ట్ తమ గురించి తప్ప :)
శ్రీధరా!
Deleteపాతకొత్త తరాల మధ్య వారథి మీరు, పాత తరం మంచి కొత్త తరాలకి అందించాలి
మనగూర్చి మనకుదెలిసిన
ReplyDeleteఘనులగుదుము మరియు నాత్మఙ్ఞానియునగుదుమ్
పనివడి తననున్ మరుగున
నునుచుఘనులు విశ్వవిజితనుతసన్నుతులౌ .
రాజావారు,
Deleteకందమ్మ.....ఖని :)
ఖని యందుర , యేమున్నవి ?
Deleteఇనుమా? బంగారమా? మరేమిటి? యనఘా!
మునుపటి చదురులుకూడా
కనుపింపవు, బోసివోయె, కళదప్పె గదే !
రాజావారు
Deleteమునుపటి చదురులుకూడా
కనుపింపవు, బోసివోయె, కళదప్పె గదే !
అంతేనంటారా?