Wednesday 10 January 2018

అందెను నేడే అందని జాబిల్లి

Courtesy: Nella panebiaco

41 comments:




  1. అందము గా జిగేలు మని యంబర మందున జాలు వారుచు
    న్నందెను గాద జాబిలియె నవ్యత గాంచి భళా జిలేబి! క
    న్విందుల గొల్పు చున్నిలన నిండుగ మెండుగ పండు గైయటన్
    సుందరి నీదు కేలు నట చుక్కల రాయడు వెల్గె గాదుటే !

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. Zilebiగారు,
      మీ మత్తకోకిల సూపర్ :)
      ధన్యవాదాలు.

      Delete

    2. :)
      :)
      :)

      జిలేబి.

      Delete
    3. అందముగా జిలేబి బుధు లల్లిన మాలిక మత్తకోకిలై
      కొందల మంది శర్మ బుధు కూరిమి చిత్తపు మెప్పుబొందె - నీ
      సుందర సన్నివేశమును జూచిన నాకు మనోజ్ఞమై చనెన్
      బంధుర మిట్టి స్నేహములు పావనమై భజింపగా దగున్ .

      Delete


    4. ఉత్పలము లయ్యె కోకిల
      మత్పర మాప్యుడు జిలేబి మత్తున అంభో
      భృత్పథ విహారి పొగడ
      న్వ్యుత్పన్నుడటన్ గబగబ యురుకగ బోవే :)

      జిలేబి

      Delete
    5. జిలేబిగారు,

      తెనుగు ప్రశ్నపత్రం.

      ఈ కింది పద్యానికి ప్రతిపదార్ధం, తాత్పర్యం వ్రాయండి. 10 మార్కులు
      ఉత్పలము లయ్యె కోకిల
      మత్పర మాప్యుడు జిలేబి మత్తున అంభో
      భృత్పథ విహారి పొగడ
      న్వ్యుత్పన్నుడటన్ గబగబ యురుకగ బోవే :)

      Delete
    6. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      అమ్మవారిది అనుగ్రహమో ఆగ్రహమో తెలీదు! ఎప్పుడేమి పెచ్చరిల్లుతాయో :)
      ధన్యవాదాలు

      Delete


    7. జిలేబి! యర్థములను చిక్కణమ్ముగన్
      తెలుంగునన్ తెలుపుడి! తేటతెల్లమై
      వెలుంగి పద్యములవి వీచికల్లవన్
      సలాము జేయజనులు సాహితీరమా !

      ஜிலேபி

      Delete
    8. పైపద్యంలో .....
      ' జిలేబి మత్తున ' అనే పదాలు తప్ప
      ఇంకేమీ అర్థమవ్వడం లేదండి . నావల్లకాదు ప్రతి పదార్థం రాయడం .
      ధన్యవాదాలు .

      Delete


    9. అదిఆగ్రహమో ! గురుడా!
      హదనుకు గల్గిన యనుగ్ర హమ్మో ! రాజా !
      మదిలో గుబులే గుబులౌ !
      సదనంబందున జిలేబి, సఖ! యేమనునో !

      జిలేబి

      Delete


    10. మత్పరమాప్తుడు - మా ఆప్తుడు
      అంభోబృత్పథ విహారి - భాస్కరుడు
      జిలేబి మత్తున ఉత్పలమాల వ్రాయగ
      మత్తకోకిల సూపర్ అని పొగుడగ
      వ్యుత్పన్నుఁడు - పండితుడు మా లక్కాకుల వాారు గబగబ వచ్చిరి గదా !


      జిలేబి
      వేసుకో వీరత్రాళ్ళు :)

      Delete
    11. మిత్రులు వెంకట రాజారావు . లక్కాకులగారు,
      అమ్మవారు ప్రతిపదార్ధాలు చెప్పిన శుభ సందర్భంలో మార్కుల ప్రదానానికి మన మిత్రకోటి శ్యామలీయంవారు,విన్నకోటవారు, బండివారు, కూడా ఉంటే బాగుంటుంది కదూ !
      రెండురోజులుగా విన్నకోటవారి దర్శనం లేదు. ఏన్నిమార్కులివ్వచ్చంటారు? పదికి పదేను చాలునా?

      Delete


    12. ఇదేదో పెద్ద పంచాయితీ అయిపోయేటట్టుందిస్మీ :)

      శ్యామలీయం వారొస్తే ఇంకేమన్నా వుందా !
      గొంగళి కి పనిబడదూ ? :)


      జిలేబి

      Delete
    13. మత్పరమాప్తుడులో పరమకు అర్థం చెప్పలేదండి .
      అంభోబృత్పథవిహారి ఎలా భాస్కరుడయ్యాడో వివరణ
      లేదండి .
      జిలేబి మత్తున - ఇది గమ్మత్తుగా ఉంది గాని - మత్తుకు కారణం కనిపించదండి .
      ఉత్పలమాల రాయగ - ఉత్పలమాల రాయడానికి
      మత్తులో ఉండడం తప్పనిసరి కాదేమోనండీ .
      మత్తకోకిల సూపర్ అని పొగడగ - ఇది పద్యంలో
      ఉట్టంకించ బడలేదండి .
      వ్యుతత్పన్నుడు తదుపరి ప్రస్తావన పద్యనలో లేదండి . ఏతావత్ మత్తులో ఉన్నది జిలేబీ వారా , భాస్కరుల వారా అనేది పద్యంలో సందేహాస్పదంగా
      ఉందండీ .
      మరి ప్రతి పదార్థానికి రెండు గుండు జిలేబులివ్వచ్చండి .
      ధన్యవాదములు .

      Delete


    14. రెండు గుండు జిలేబులరెరె! గురువులు
      కనుల పండువగన్ వేసి కరుణ జూపె
      రమ్మ రో!తెగులు తెలుగు రాణి కి సయి
      తేట గీత నొకటి జేర్చ తేగడమగు :)

      జిలేబి

      Delete


    15. అంబరమణి భాస్కరుడవన్
      అంభోబృత్పథ విహారి భాస్కరుడవడే :)


      జిలేబి

      Delete

    16. అంభోభృత్పథము - ఆకాశము
      ఆంధ్రభారతి ఉవాచ :)


      జిలేబి

      Delete

    17. Zilebi

      వీరతాళ్ళు స్వయంగా వేసుకుంటే బాగోదు :) ఎవరేనా మెచ్చి వెయ్యాలి,మేకతోలు కప్పాలి. :)

      ఇంకా దండాన్వయం,తాత్పర్యం మిగిలున్నాయిగా? చెప్పలేదే?

      Delete
  2. విజయా" వారి చందమామంత కాదు గానీ - jk ☺☺ - బాగుంది.

    చేతికందినట్లు చందమామ, ఆ అమ్మాయి మొహం మీద పడుతున్నట్లు చంద్రుడి కాంతి - చాలా చాకచక్యంగా తీసిన ఫొటో 👌 (ఇటువంటి ఫొటోలు ఎలా తీస్తారో YVR గారి లాంటి వారికి బాగా తెలిసుంటుంది). ఎక్కడ దొరికింది?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      నాకీ ఫోటో నేషనల్ జియోలో దొరికింది. చూడగానే అబ్బురపడ్డాను, అందుకే తెచ్చాను. నిశితంగా పరిశీలిస్తే, ఇదో ఫోటో షాప్ చేసిన ఫోటో. ఎలా?

      అమ్మాయి రెండు చేతులలో చందమామ కదా! ఎడమ చెయ్యి చంద్రుని కింద ఉంది. ఇక రెండవ చేయి చంద్రుని వెనక ఉంది,ఇదెలా సాధ్యం? కుదరదే!

      ఏం చేశాడు? అమ్మాయి చేతులు అలా వుండగా, మొహం మీద వెలుగుపడుతున్న ఒక ఫోటో తీశాడు, దానిని ఒక ఆరు బయట ఉన్న దృశ్యంలో కలిపాడు, ఇప్పుడు అమ్మాయి చేతులలో చందమామను కలుపుతూ కుడిచేతిని (అరచేయినుంచి వేళ్ళతో ) తొలగించాడు. ఇదీ ఫోటో షాప్ చేసిన క్రమం,మనమూ చెయ్యచ్చు.

      ఏమైనా ఫోటో అందంగా ఉంది.
      ధన్యవాదాలు.

      Delete
  3. ఈ జిలేబి యెవరొ ఈజీగ జాబిల్లి
    నంది పుచ్చు కొనెడు , నతివ జూడ
    రోహిణి యగు నేమొ , యూహ కందదు గాని
    చేత శశిని బట్టె చిత్రముగను .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      పద్యం బాగుందండి. చంద్రుణ్ణి అందుకోవాలనే రోహిణిలు చాలా మందే కనపడుతున్నారు,నేడు. :)
      ధన్యవాదాలు.

      Delete
  4. రెండు రోజులుగా ... చలి సర్ శర్మ గారూ ... చలి. మనబోంట్ల ప్రాణానికి ఎక్కువే.
    తగిన మార్కులు స్వయంగా ప్రధానోపాధ్యాయులవారే (రాజారావు మాస్టారు) ఇచ్చేసారుగా - రెండు గుండు జిలేబులు 😃.
    ఇక "మత్తు" సంగతి, కొంతమందికి మత్తులో ఉంటేనే "పద్యరత్నాలు" వస్తాయేమో,రాజారావు మాస్టారూ 😃.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      నాలుగురోజులనుంచి మాకు ఉక్కపోత, చలి లేదు!
      రాజారవుగారు అదేపోనేలే అని గుండు జిలేబీలిచ్చేరు :) ఇంకా దండాన్వయం చెప్పలి కదండి, మత్తు గురించి అందులో చెబుతారేమో చూదాం :)

      Delete
  5. అయితే గొంగళీ అని "జిలేబీ" గారే ఒప్పుకుంటున్నారన్నమాట ?👌

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      శ్యామలీయం వారు గొంగళీ తో తిప్పలెందుకనుకున్నట్టున్నారు :)

      Delete


  6. అనపర్తీశులటన్ గురు
    డిని కెల్కగను కనరాలె ఢీగొన లేదే?
    మన సారువారు యేలా
    కనరా లే భాగ్యనగర కార్ఖానానన్ ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,

      శ్యామలీయం వారు గొంగళీ తో తిప్పలెందుకనుకున్నట్టున్నారు.
      మాలికలోకి రావటం లేదన్నారు,నాలుగు రోజుల కితం మా యోగక్షేమాలు ఫోన్ లో విచారిస్తూ :)

      Delete


    2. మా శ్యామలీయం వారు మామంచి వారండి . మీలా తంటాలు పెట్టరండీ శర్మగారు ఆ!

      జిలేబి

      Delete
    3. శ్యామలీయం వారికి జిలేబి అంటే ఒఖ్ఖ రవ్వ అభిమానం ఎక్కువ. ఏందుకో తెలుసా! చచ్చు పద్యమో పుచ్చు పద్యమో పద్యం చెబుతారని. కందమ్మ కుందనమ్మ అనుకుంటారు :)

      Delete
    4. రవ్వేమి ? నూటయెనిమిది
      మవ్వపు పద్యాల శతక మంత , గలదయా !
      యవ్వార మెంత నడిచిన
      పువ్వులలో దారమట్లు పొసగు హితంబుల్ .

      Delete
    5. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      మరచితి(నే) మరితి
      ఉన్నమాటన్నారు :)

      Delete
  7. తే। సంకురాతిరి శుభవేళ సకలజనులు
    వంకలెంచక నందిరి పట్ల ప్రేమ
    పూర్వకంబగు మాటలు పొందుపరచి
    పరమశుభకామనలు చెప్పవలయు నెలమి

    కం। కావున నందరకును నే
    భావింతును శుభములెల్ల పండుగవేళన్
    కావలసిన వన్నియు మీ
    కీవలయు నటంచు రాము డెంచెడు గాతన్

    -శ్యామలరావు

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      సంక్రాంతి శుభకామనలు
      జ్ఞాన వృద్ధులకు నమస్సులు.

      పలుకా దారుణాఖండల శస్త్ర తుల్యము మనసా వెన్న.....

      పెద్దల మనస్పుడూ వెన్నపూస. :)

      Delete
  8. అనఘులు శర్మగార్కి , మహితాత్ములు శ్యామల రావుగార్కి , కం
    ద నుత జిలేబి గార్కి , విబుధాంబర వీథి విహారి విన్న కో
    టి నరసరాయ మిత్రులకు , డిగ్గున వచ్చి మనోజ్ఞ గీతముల్
    వినిచెడు బండిరావులకు , వేడుక గూర్చెడి వైవియారుకున్ .....

    మరియు తక్కిన బ్లాగు సంబంధ హితుల
    కందరకు - వినమ్ర తర ప్రగాఢ హార్ది
    క గతి - సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపెద ,
    ఆయురారోగ్యములు పొంది యలరు కొఱకు .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      నమో నమః
      మిత్రులందరికి
      సంక్రాంతి శుభకామనలు

      Delete
    2. అంతంత మాత్రపు వ్రాతలు వ్రాసే నాకు బ్లాగు మాధ్యమంగా మీ గురుతుల్యులందరి పరిచయ భాగ్యం కలగడం, అభిమానం దక్కడం, నా అదృష్టం. శ్రీ శర్మ గురువు గారికి, శ్రీ రాజారావు గురువు గార్కి, మరియు మిగిలిన గురువులకు నా వందనములు, మనఃపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. __/\__ ...

      Delete
    3. nmrao bandiగారు,

      ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
      ఇక్కడే కలిశాము
      బ్లాగులమ్మ చెట్టునీడలో
      దురద గుండ పక్క నీడలో :)
      మిత్రులందరికి పేరు పేరున శుభకామనలు
      ఎక్కడ మరుస్తామండి :)

      Delete
  9. రాజారావు మాస్టారి మిత్రుల లిస్ట్‌లో నా పేరు కూడా ఉందే!! సంతోషం.

    బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌻🌻🌻🌻🌻🌞

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      అందరి మనసుల్లోనూ అందరూ ఉన్నారండి! ఇదిగో ఇలా సమయమొస్తే బయట పడతారు, మనసు బయట పెడతారంతే
      మిత్రులందరికి పేరు పేరున శుభకామనలు
      ఎలా మరువగలం :) పైకూ లు చూడక ఒక రోజుండగలమా? అంతలా అలవాటైపోయాయి :)

      Delete