ఏమి సేతురా లింగా ఏమి చేతు
ఏమి సేతురా లింగా ఏమి చేతు
కరోనా కాలమాయె!
దారి కానదౌను లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు! మాహానుభావా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు!
చీనా పుట్టిల్లాయే !
ప్రపంచమంతపాకె లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు! మాలింగమూర్తీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
తగులుకుంటే వదలదాయె!
తేల్చునాయె చావొ రేవో లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! మాదేవ శంభో!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
మందేమో లేదాయె!
వేక్సిన్ రాదాయె లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! మాలింగ మూర్తీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
గోటి దనే దొకడాయె!
గొడ్డలనే దొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిశూల పాణీ !!
ఏమి చేతురా లింగా ఏమి చేతు !
గాల్లో నిలవదనే దొకడాయె!
కాదనుదొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! హాలాహలధరా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
కన్ను చాలానే దొకడాయె!
కాదు కాదనే దొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమిచేతు! మహా శివా!!
ఏమి చేతురా లింగా ఏమిచేతు!
ఏది నికరమొ తెలియదాయె!
తిరమాయె చావు లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిపురాంతక శివా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
భయమేమో లావాయె!
ఆకలి తప్పదాయె లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! అన్నపూర్ణాపతే!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!
చాకిరేమో తప్పదాయె!
మనుజులంటె భయమాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! గజచర్మధారీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు !
బాలమురళిగారికి అపరాధ శత పరిహార నమస్సులు అర్పిస్తూ