Wednesday, 23 May 2018

ప్రకృతి అందం

 Courtesy: From a friend on Whats app 
For a beautiful view down load and see on full screen

పచ్చరంగుతో ప్రవహిస్తున్ననది భాగీరథి గోధుమ రంగుతో కలుస్తున్నది అలకనంద. సంగమ స్థానం ''దేవప్రయాగ''

Friday, 18 May 2018

తిరు క్ష...వరమైపోయింది

https://youtu.be/-HOg9ykCdVw

సినిమా: కుల గోత్రాలు
సంవత్సరం: 1962
రచన:కొసరాజు
సంగీతం:సాలూరి
గాత్రం: మాధవపెద్ది సత్యం,పిఠాపురం నాగేశ్వర రావు

అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే

అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే

ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరు క్షవరమైపోయింది      I అయ్యయ్యో I

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయి

మరి నువు చెప్పలేదు భాయి

అదినా తప్పుకాదు భాయి

తెలివి తక్కువగ చీట్ల పేకలొ దెబ్బ తింటివోయి

బాబూ నిబ్బరించవోయి.              I అయ్యయ్యో I

నిలువుదోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా!
నిలువుదోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

చక్కెర పొంగలి చిక్కేది

ఎలక్షన్లలో ఖర్చుపెడితె ఎమ్.ఎల్.ఎ క్కేది

మనకు అంతటి లక్కేది?     I అయ్యయ్యో I


గెలూపూ ఓటమి దైవాధీనం

చెయ్యి తిరగవచ్చు

మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు?

ఇల్లు కుదవ బెట్టవచ్చు

ఊ..మ్
ఛాన్స్ తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు

పోతే!

అనుభవమ్ము వచ్చు

చివరకు జోలె కట్టవచ్చు    I అయ్యయ్యో I