Saturday, 30 September 2017

దిక్కులేనివారికి



విజయదశమి శుభకామనలు

దిక్కులేనివారికి దేవుడే దిక్కు
సంతోషము సగము బలము.
ఎంతచెట్టుకు అంత గాలి.
ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు

Wednesday, 27 September 2017

నాకాయుష్షు



నాకాయుష్షు, నాకారోగ్యం, నాకు ధనం, నీకు ఋణం..... లోక రీతి.


ఉన్నమాటంటే ఉలుకెక్కువని సామెత 

ఒగిచినట్టూ ఉంది వాతెట్టినట్టూ ఉంది. లోక రీతి.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నానుడి.

Monday, 25 September 2017

ప్రశంసనీయం.





రాగల 40 నిమిషాలలో  మీ గ్రామ పరిధిలో/ పరిసర ప్రాంతంలో పిడుగుపడే అవకాశం  ఉంది. సురక్షిత భవనాలలో ఆశ్రయంపొందండి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.


Any time within the next 40 minutes ,there is a chance of lightning strike in the vicinity of your village /habitation. Please take shelter in a safe building.

From:
BA-APSDMA
23/09/2017
06.08PM

మొన్న సాయంత్రం కొద్దిగా చినుకులొస్తున్నాయి, వాతావరణం మబ్బు,చినుకు,ఉరుము, మెరుపుగా ఉంది. పిల్లలు ఎక్కడికో బయలుదేరారు, బైక్ మీద. వెళ్ళేముందో సారి నాకు చెప్పి వెళ్ళడం ఇంటిలో వారందరికి అలవాటు. నా దగ్గర కొచ్చి వెళ్ళొస్తామని చెబుతుండగా ఈ మెసేజ్ వచ్చింది, అందరి సెల్ ఫోన్ లకి వచ్చింది. అంతా చూసుకున్నారు. బయలు దేరుతున్నామని చెప్పేవారికి 'వాతావరణం బాగోలేదు వెళ్ళద్దు' అని చెప్పడం ఎలా అని మథనపడుతున్న నాకు ఈ మెసేజ్ ఆనందం కలగ జేసింది. పిల్లలే ఈ మెసేజ్ చూసుకుని వెళ్ళడం మానేశారు. వాతావరణం మెరుగు పడలేదు.ఒక గంట తరవాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, అప్పటికి వాతావరణం మెరుగుపడలేదు. నిజంగానే ఎక్కడో పిడుగూ పడింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతేని ప్రశంసనీయం.

Thursday, 14 September 2017

తుమ్మి పూలు


తుమ్మి పూవులు తెచ్చి నీకు

 తుష్టుగా పూచ్చేదమంటే  

కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద 
                                                           ఎంగిలంటున్నాయి లింగా!