Sunday, 25 September 2016

అద్భుత సూర్యగ్రహణం

Visit  https://kastephali.wordpress.com/             కష్టేఫలే (పునః ప్రచురణ) 




Courtesy: Anand Sankar
Solar eclipse seen in Reunion Islands

Tuesday, 20 September 2016

గిరి జామాతను గిరిజామాతను



తలతును నే గిరి జామాతను గిరిజామాతను
తలతును గోవర్ధన గిరిధారిని తన దేవేరిని
తలతును సత్యలోక నివాసిని సరస్వతిని
తలతును నేవారిని యెల్లవేళల తాదాత్మ్యమునన్!
Courtesy:Anant

Thursday, 15 September 2016

అభ్యర్ధన(Request)// ఆహ్వానం (Invitation)

Visit  https://kastephali.wordpress.com/      కష్టేఫలే (పునః ప్రచురణ) A post everyday between 05.30..06.00AM IST

https://kastephale.wordpress.com/  Private blog కష్టేఫలే send your profile to mail address sarmabc@gmail.com you will get invitation for admission to the private blog. A post every alternate day.


Just wait and see a beautiful waterfall in action
Courtesy:Ali tanha


అభ్యర్ధన(Request)// ఆహ్వానం (Invitation)


మీరు బ్లాగులో అభ్యర్ధన చేయడం కంటే ఆహ్వానాన్ని పంపడానికే ఇష్టపడుతున్నట్టుంది, ఈ అభ్యర్ధనకి 
ఆహ్వానానికి తేడా ఏంటండీ అడిగారో మిత్రులు, మొన్ననో రోజు సుదీర్ఘ భేటీలో. వారికి తెలియక కాదు నేనేం చెబుతానో చూదామని అడిగుంటారు :)

కొంచం ఇబ్బంది పడ్డాను. చెబితే ఏమనుకుంటారోననే సంశయం పీడించింది. చెప్పకపోతే తప్పు,చెబితే ముప్పు అన్నట్టూ, ఎగదీస్తే బ్రహ్మ హత్య,దిగదీస్తే గోహత్య అన్న సామెతలు చెప్పినట్టయిపోయింది, నా పరిస్థితి, ఇరకాటం లో పడిపోయా. కొద్ది సేపు మౌనంగా ఉండిపోయా. శర్మగారు లైన్ లో ఉన్నారా ప్రశ్నించారు. నోరు విప్పక తప్పలేదు.

అభ్యర్ధన కీ ఆహ్వానానికీ తేడా ఉందండి, చిన్నగా చెప్పాలంటే ”మీ ఇంటికొస్తున్నాను, ఇది అభ్యర్ధన. మీరు మా ఇంటికి దయచేయండి, ఇది ఆహ్వానం” అన్నా. ”ఏంటో తికమక పెట్టేసేరు సుమా” అన్నారు నన్ను మరికాస్త ఇరకాటంలో పెడుతూ. ”తికమక కాదండి నిజానికి జరిగే చర్య వారు మా ఇంటికి రావడమే, కాని ఒక చిన్న తిరకాసేమంటే అభ్యర్ధన లో మాకిప్పుడు వీలుకాదు అనే సావకాశం ఉంది, ఆ మాట అనడమూ, అనిపించుకోడమూ ఇబ్బంది పడే సావకాశం.

 ఇక, ”మీరు మాఇంటికి దయచేయండి”, ఇది ఆహ్వానం, అంటే మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇది గౌరవం.

రండి! రండి!! రండి!!!దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ. అదండి సంగతీ అన్నా నవ్వుతూ.

ఓహో! అందుకేనా మీ బ్లాగులో అందరిని ప్రొఫైల్ పంపండి ఆహ్వానం అందుకోండి అంటున్నారు, ఇంత తేడానా :) అన్నారు. 

నేటి కాలంలో దయచేయండి మాటకి కూడా వ్యతిరేకార్ధమే చెబుతున్నారండీ. మీరిక దయచేయచ్చు అంటే మీరిక్కడినుంచి కదలచ్చు అని అర్ధం చెబుతున్నారండి!అర్ధ చంద్ర ప్రయోగమంటే తెలుసుగా!  అదీ! సంగతి.

ఇన్ని సార్లు ఇన్నిచోట్ల చెబుతున్నా ఇప్పటికీ ఒక అభ్యర్ధన పడేసి వెళిపోతున్నారు,మీరు పంపే అభ్యర్ధనలో మీ వివరాలేం ఉండవు :)   వివరాలు లేని అభ్యర్ధనలా ఉండిపోతున్నాయి.మీరు నా బ్లాగ్ చూడాలనుకుంటే వివరాలు మెయిల్ కి పంపి ఆహ్వానం అందుకోండి. బ్లాగర్ ప్రైవేట్ బ్లాగులో viewers పరిమితి 100 మంది. వర్డ్ప్రెస్ లో నిన్నటిదాకా 35 మందే, మనకోసమే  పరిమితి పెంచారు.

Wednesday, 14 September 2016

కాయలతో బొబ్బాసి చెట్టు

Visit  https://kastephali.wordpress.com/      కష్టేఫలే (పునః ప్రచురణ) A post everyday between 05.30..06.00AM IST

https://kastephale.wordpress.com/  Private blog కష్టేఫలే send your profile to mail address sarmabc@gmail.com you will get invitation for admission to the private blog


Saturday, 10 September 2016

శర్మ కాలక్షేపం కబుర్లు-శరీరమాద్యం…..


శరీరమాద్యం.....

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అన్నారు పెద్దలు. అంటే ధర్మసాధనకు శరీరం ముఖ్యం అనమాట. ధర్మం చతుర్విధ పురుషార్ధాలలో మొదటిది, అర్ధ,కామ,మోక్షాలు తరవాతవి. ధర్మాన్ని ఆచరించి పని చేస్తే వచ్చే సొమ్ము ధర్మార్జితం విత్తం. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనమనలేదు, నీ పని నువ్వు చెయ్యి,ధర్మమైనది, సొమ్ము అర్జించు, ఆ తరవాత ధర్మమైన కామం అంటే కోరికను తీర్చుకో అదే మోక్షానికి దారి అన్నారు. ఆ తరవాత ఆహార నిద్రా,భయ,మైధునాలు సర్వజీవులకూ సమానం అన్నారు, అంటే ఇవన్నీ శరీరాన్ని రక్షించుకోడానికి కల్పింపబడినవే! శరీరాన్ని రక్షించుకోడమే అనగా అత్మ రక్షణే ప్రథమ కర్తవ్యం. ఆ తరవాత ఆత్మవత్ సర్వభూతాని అన్నారు అంటే నీలాగే ఇతరజీవులూ, అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరజీవులనూ ప్రేమించమన్నారు, నీవాడైనవాడిని ప్రేమించు, కాని వాళ్ళని నరికెయ్యమని చెప్పలేదు సనాతన ధర్మం, ఆత్మవత్ సర్వభూతాని, అదీ మాట. నిన్ను నీవు రక్షించుకో, ఇతరులనూ ఆపదలనుండి రక్షించు ఇదీ మాట.

ఐదేళ్ళ కితం బ్లాగ్ మొదలెట్టి రాసుకుంటూ వచ్చాను, గత సంవత్సరంగా నా మీద దాడి జరుగుతోంది, నన్ను నా పనినుండి విరమింపజేయడానికే జరుగుతోంది, అన్ని రకాల ప్రయత్నాలూ చేసాను.  నన్ను నేను రక్షించుకోడానికిగాను ప్రైవేట్ బ్లాగ్ చేశాను. బ్లాగులోకి రావాలనుకున్నవారిని తమ పరిచయం మెయిల్ రూపంలో పంపమన్నాను, ఇది కూడా నన్ను నేను రక్షించుకోడానికేగాని మరొకందుకు కాదు. నా అభిమానులే కావచ్చు కొందరు కొన్ని అంకెలు, కొన్ని అక్షరాలతో మరికొందరు ఇలా ప్రైవేట్ బ్లాగులోకొస్తామంటున్నారు. వారికి సవినయంగా తెలియజెసేది, మీరు నా అభిమానులే కావచ్చు కాని మీరెవరో పేరు కూడా తెలియక ప్రవేశం కల్పించలేను, దయచేసి అర్ధం చేసుకోవలసినదిగా కోర్తాను. ఇప్పటికి నాదగ్గర ఇటువంటి అభ్యర్ధనలు ఆరున్నాయి, వారికిదే మనవి, మీ పరిచయం తెలియజేయండి, ఎదురు చూస్తున్నా మీ మెయిల్ కోసం.

పోస్!పోవోయ్ నీదో పెద్ద బ్లాగు! దానికింత బిల్డప్పూ! చిత్తం, తమరిష్టం, కాదని నేననలేదే! ఏ పని చేసినా ముందు కావలసినది ఆత్మరక్షణ కనక నేనీపని చేయాల్సివచ్చిందని మనవి.

పెద్దలమాట

కృషితోనాస్తి దుర్భిక్షం
జపతోనాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం

కృషి అనగా ప్రయత్నం,వ్యవసాయం చేస్తే కరువు లేదు. జపం చేస్తే పాపం లేదు, మౌనంగా ఉంటే కలహం లేదు, జాగరతతో ఉంటే భయం లేదు.
ఈ వయసులోఎందుకీ చాదస్తం? మానేయచ్చుగా రాయడం.
ఊ హు! కుదరదు అదంతే! 

ఓడిపోతే సిగ్గు పడను,ప్రయత్నం మానను, రాయడమూ మానను.


వీటన్నిటిలో మొదటి మూటినీ గత సంవత్సరంగా పాటిస్తున్నాను, చివరిదైన జాగరతే ఇప్పుడు కర్తవ్యం. 

Admission to the private blog is restricted to invitees or to those who requested to participate. Those who wish to parcipate in the private blog https://kaste phale.wordpress.com should send their request to sarmabc@gmail.com with a profile of introduction, the 1.Name,2.Sex. 3.Age. 4.Profession,5.Social status, 6. Place of normal living, village/town/city/ metropolis,state and country. 7.Any other information, wish to share. Please don’t approach with false profiles. The concept of a private blog itself in Telugu blogging word is new. 

To those who wanted to be viewer of the private blog

At the outset let me thank you for your wish to be viewer of my private blog https://kastephale.wordpress.com. (కష్టేఫలే)

I am not having your mail address, send me mail to my mail address with profile and I will send you the invitation. Please accept that invitation, that is done. you can log into the private blog.

This is the first time in Telugu blogging world to maintain a private blog :)

Some people are sending requests even without a name and such requests are not accepted and will not be accpted.Sofar I am having a strenth of 60 people wishing me sucess.

Friday, 9 September 2016

ప్రకృతి దరహాసం

Visit  https://kastephali.wordpress.com/             కష్టేఫలే (పునః ప్రచురణ) 
Send your profile to my mail address and enroll in  https://kastephale.wordpress.com/  Private blog కష్టేఫలే

Courtesy: Linlin Smith

Thursday, 8 September 2016

పదహారు ఫలాలనోము

Visit  https://kastephali.wordpress.com/             కష్టేఫలే (పునః ప్రచురణ) 
https://kastephale.wordpress.com/  Private blog కష్టేఫలే


గింజలతో జీడి మామిడిపళ్ళు. 


జామ పళ్ళు

Monday, 5 September 2016

స్వామికార్యం స్వకార్యం

Private blog  (New posts)
https://kastephale.wordpress.com/   (కష్టేఫలే)


Public working blogs added in aggrigators
https://kastephali.wordpress.com/ (Old posts published daily)       (కష్టేఫలి)   
http://kasthephali.blogspot.in/ (Photos etc)         (కష్టేఫలి)  

మా ఊరు చుట్టుపక్కల పదికిలోమీటర్ల దూరం పరిధిలో బైక్ పేచ్ పడి ఆగితే, అక్కడికే వెళ్ళి పేచ్ వేసే పని చేస్తాడొకతను. ఇతనొక పర్యావరణ ప్రేమికుడు కూడా. వినాయకచవితి సందర్భంగా ౩౦౦ మట్టి వినాయక ప్రతిమలూ, పత్రితో తన వ్యాపారం గురించి ముద్రించిన సంచిలో అందరికి పంచిపెట్టేడు, సంచి కూడా నూలు సంచి. స్వామి కార్యం స్వకారం అంటే ఇదే!!!పర్యావరణ ప్రేమికుడు పంచి పెట్టిన మట్టివినాయక విగ్రహం, పూజా సామగ్రి.